Guppedantha Manasu: రిషిని కొట్టమన్న వసు.. ఫణీంద్రకు డౌట్.. దేవయాని-శైలేంద్ర కొత్త ప్లాన్

వసుధారకు సేవలు చేసే విషయాన్ని తెగ గుర్తు చేసుకుంటాడు రిషి. ఎందుకు నాలో ఈ సంఘర్షణ. వద్దు వద్దు అనుకున్నా ఈ జ్ఞాపకాలు ఎందుకు వెంటాడుతున్నాయి. తను మళ్లీ కాలేజీలోకి, నా జీవితంలోకి రావడంతోనేనా ఇదంతా. అసలు నేను ఇక్కడున్నాను అని తెలిసి కూడా ఎందుకొచ్చింది. నేను ఇక్కడ ఉండటం వేస్ట్ అని కోపంగా లేచిన రిషి కారులో బయటకు వెళ్లిపోతాడు. మళ్లీ రోడ్డు పక్కన కారు ఆపి బయటకు ఆవేశంగా వస్తాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూలై 4 మంగళవారం నాటి ఎపిసోడ్‌ 806లో ఇంకా ఏం జరిగిందంటే?

పక్కన ఉంటే ఏంటీ:వసుధారకు ఇచ్చిన రింగ్, ఆస్పత్రిలో బ్రేస్ లెట్ వసు చేతికి చిక్కుకోవడం అన్నీ గుర్తు చేసుకుంటాడు రిషి. తప్పు చేసింది నువ్వు కాదు కదా. మరెందుకు పారిపోతున్నావ్. అసలు నీ మనసులో ఏముంది. తనపై కోపమా, ద్వేషమా ఏముంది. లేదా తన ప్రేమ నిన్ను మారుస్తుందని మళ్లీ రిషిధార బంధం నిలబడుతుందని భయపడుతున్నావా. వసుధారను చూస్తే కరిగిపోతావా. తనే కాదు మా డాడ్ వచ్చినా కూడా నా మనసు మారదు. వాళ్లు నీ జీవితంలో లేరు తనను చూసి ఎందుకు పారిపోతున్నావ్. నీ జీవితంలో వాళ్లు లేనప్పుడు దూరంగా ఉంటే ఏంటీ పక్కనే ఉంటే ఏంటీ. తను కొంతకాలం ఉండి వెళ్లిపోతుంది. తనకోసం నేనేందుకు వెళ్లిపోవాలి అని రిషి ఆవేశంగా తనలో తానే మాట్లాడుకుంటాడు.

Guppedantha Manasu Serial July 4 2023 Today Full Episode 806

కాల్ కట్:ఎవరికోసమో విశ్వనాథం, ఏంజెల్ ని బాధపెట్టకూడదు. నేను సాదా సీదా లెక్చరర్ ని మాత్రమే. నాకంటూ బంధాలు, గతం లేదు. వాటి గురించి ఆలోచించకూడదు అని తిరిగి కారులో ఇంటికి వెళ్లిపోతాడ రిషి. దిలో ఒంటరిగా కూర్చున్న వసుధార రిషి పరిచయం నుంచి అన్నీ గుర్తు చేసుకుంటుంది. మీ మేలు కోసం నేను అబద్ధం చెప్పాను సార్. కానీ ఆ అబద్ధం ఇంతటి అగాథంగా మారుతుందనుకోలేదు. దానికి ప్రతిఫలంగా బాధను అనుభవిస్తూనే ఉన్నాను. రిషి సార్ ను ఓసారి చూడాలి ఉంది అని అనుకున్న వసు లేచి మెల్లిగా రిషి గదిలోకి వెళ్తుంది. అక్కడ రిషి కనిపించకపోవడంతో ఈ సమయంలో ఎక్కడికి వెళ్లారు అనుకుని కాల్ చేస్తుంది. కానీ రిషి కట్ చేస్తాడు.

Guppedantha Manasu Serial July 4 2023 Today Full Episode 806

ఆన్సర్ దొరికింది:నువ్వెందుకు కాల్ చేశావో నాకు తెలుసు. నువ్వున్న చోట నేను ఉండలేనని భయపడుతున్నావ్. కానీ ఆ భయాలు ఎప్పటికీ నిజం కావు అనుకుంటాడు రిషి. ఇక హాల్లో రిషి కోసం ఎదురుచూస్తుంటారు ఏంజెల్, విశ్వనాథం, ఏంజెల్ కాల్ చేసి ఎక్కడున్నావ్ అని అడగడంతో నిద్ర పట్టక బయటకు వచ్చా, దారిలో ఉన్నా వస్తున్నాని చెబుతాడు రిషి. ఎక్కువగా ఏదో ఒకటి ఆలోచిస్తావ్ కాబట్టే నిద్ర పట్టడం లేదు. త్వరగా రమ్మని ఏంజెల్ కాల్ కట్ చేస్తుంది. ఇదంతా విన్న వసుధార మీరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ నా ప్రశ్నకు సమాధానం దొరికింది. అది చాలు అని వసు అనుకుంటుంది. ఏంజెల్ వెళ్లి పడుకుంటే విశ్వనాథం ఒక్కడే ఉంటాడు.

Guppedantha Manasu Serial July 4 2023 Today Full Episode 806

కావాల్సింది నమ్మకం:విశ్వనాథం దగ్గరికి వచ్చిన వసుధార.. నాకు కూడా ఎలాగు నిద్ర పట్టడం లేదు. రిషి సార్ వచ్చే వరకు ఉంటాను వెళ్లమని చెబుతుంది. దీంతో విశ్వనాథం వెళ్లగానే ఇటు రిషి వస్తాడు. నేను ఇక్కడ ఉండటం మీకు ఇబ్బంది కలిగిస్తుందా. నా వల్ల అసౌకర్యంగా ఉంటే నేను భరించలేను సార్ అని వసు అంటే.. మీరు చాలా వింతగా మాట్లాడుతున్నారు. కొందరు నా జీవితాన్ని నా నుంచి లాగేసి గార్బేజ్ లో పడేశారు. అలాంటి మీరు నా అవసరం, అసౌకర్యం గురించి మాట్లాడుతున్నారా. అలాంటి సానుభూతి నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది నమ్మకం. నమ్మిన వాళ్లను మోసం చేయకుండా ఉండటం అని రిషి అంటాడు. మేం మోసం చేయలేదు. మమ్మల్ని నమ్మిన వాళ్ల బాగు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అని వసు అంటుంది.

Guppedantha Manasu Serial July 4 2023 Today Full Episode 806

కొట్టినా సహిస్తాను:అది నాకు అనవసరం. పరిస్థితులకు భయపడి రిషి పారిపోడు. తను వద్దనుకుంటే మాత్రమే వెళ్లిపోతాడు. రిషి ఒంటరిగా బతకగలడు అని రిషి అంటాడు. మీ స్వభావం నాకు తెలుసు. అందుకే శూలాల్లాంటి మాటల్ని భరిస్తున్నాను. నేను అబద్ధం చెప్పాను. మీకు నచ్చదని తెలిసినా చెప్పాను. అది మీ మనసుకు గాయమై మిమ్మల్ని నాకు దూరం చేసింది. మీ పొగరుని చిన్న మాట కూడా అననివ్వరు. అలాంటిది మీరే నన్ను నిందిస్తున్నారంటే మీ మనసులో ఎంత మంటలు చెలరేగాయో అర్థం చేసుకోగలను. మీరు కొట్టినా సహిస్తాను అని వసు అంటే రిషి ఆపేస్తాడు. ఇక ఆపండి మేడమ్.. ఇలాంటి మాటలతో మళ్లీ నన్ను ఏమార్చకండి అని వెళ్లిపోతాడు రిషి. మీకు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నారు. నిజం తెలిస్తే మమ్మల్ని అర్థం చేసుకుంటారు. మళ్లీ మన బంధం నిలబడుతుంది అని వసు అనుకుంటుంది.

Guppedantha Manasu Serial July 4 2023 Today Full Episode 806

కొత్త ప్లాన్:మరోవైపు ఫణీంద్ర ఇంటికి రాకపోవడంపై దేవయాని, శైలేంద్ర ఆలోచిస్తుంటారు. నువ్వు వాళ్ల దగ్గరికి వెళ్లి ఇంటికి తీసుకు రా. ఇప్పుడు మన ఆయుధం మీ నాన్న. నువ్వు దూకుడుగా ఉంటే ప్రయోజనం లేదు. నువ్వు చెప్పే ప్రతి మాటకు మీ నాన్న కరిగిపోవాలి. లేదంటే అక్కడే ఉంటారు. మీ నాన్న మాటను మహేంద్ర కాదనలేడు. మహేంద్ర చెబితే జగతి వింటుంది. మీ నాన్నకి మనపై అనుమానం వచ్చింది. ఎప్పుడు కోప్పడని మా నాన్న నిన్న ఎలా ఊగిపోయారో చూశావ్ కదా. కొంచెం తడబడినా పసిగట్టేస్తారు. అందుకే పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ముగ్గుర్ని ఇంటికి తీసుకు రా అని దేవయాని చెబుతుంది. దీంతో శైలేంద్ర బయలుదేరతాడు. మరోవైపు పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని వచ్చి కాలేజీ, అటు నుంచే మా ఇంటికి వెళ్తాను, ఇప్పుడు బాగానే ఉన్నా కదా అని ఏంజెల్ కు చెబుతుంది వసుధార. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా అని ఏంజెల్ అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X