Guppedantha Manasu: శైలేంద్ర ప్లాన్ సక్సెస్.. రిషిధార బంధంపై ఏంజెల్‌కు డౌట్.. అత్తపై ధరణి పంచులు
విశ్వనాథం ఇంట్లో నుంచి బ్యాగ్ పట్టుకుని బయలు దేరుతుంది వసుధార. ఏంటీ బ్యాగు పట్టుకున్నావ్. ఎక్కడికేంటీ ప్రయాణం అని ఏంజెల్ అడుగుతుంది. కాలేజీకి వెళ్లి అటునుంచే ఇంటికి వెళ్తాను. ఇప్పుడు బాగానే ఉంది కదా అని వసు అంటే.. అని నీకు అనిపిస్తే చాలా. అయినా మీ నాన్నగారు కూడా ఊరెళ్లారు కదా. మీ ఇంట్లో నిన్ను చూసుకునేందుకు ఎవ్వరూ లేరు. నీకు కష్టం అవుతుంది. నీ గాయం కూడా మానలేదు. ఇంకా రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారు కదా. నువ్వైనా చెప్పు రిషి. ఈ పరిస్థితుల్లో కాలేజీకి వెళ్లడం అవసరమా అని ఏంజెల్ అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 5 బుధవారం నాటి ఎపిసోడ్ 807లో ఇంకా ఏం జరిగిందంటే?
ఇక్కడే ఉండాలి:బాగా లేనప్పుడు కాలేజీకి వెళ్లి ఇబ్బంది పడేకన్నా ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోవడం మంచిది కదా. సిలబస్ నేను చూసుకుంటాను. ప్రిన్సిపల్ తో మాట్లాడతాను. పూర్తిగా నయం అయేవరకు ఇక్కడే ఉండమని చెప్పు ఏంజెల్ అని రిషి అంటాడు. ఇంతలో విశ్వనాథం వస్తే.. వసుధార వెళ్లిపోతుందట అని ఏంజెల్ చెబుతుంది. ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం మంచిది. వసుధార నీ ఫ్రెంజ్ మాత్రమే కాదు. మన కాలేజీ లెక్చరర్. తన వల్లే కేడీ బ్యాచ్ సంగతి తెలిసి, రిషి వెళ్లి మార్చడం జరిగింది. ఆరోగ్యం పూర్తిగా బాగయ్యే వరకు ఇక్కడే ఉండాలి. మీ నాన్నగారు కూడా కాల్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అక్కడ పరిస్థితులు సెట్టయ్యే వరకు రాలేనన్నారు అని విశ్వనాథం అంటాడు.

ఐడియాలు బాగున్నాయి:నీకు ఏరోజు పర్మిషన్ ఇస్తామో ఆరోజే ఈ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలి. అప్పటివరకు ఇక్కడే ఉండాలి. ఏమంటావ్ రిషి అని విశ్వనాథం అంటే.. నేను కూడా అదే చెబుతున్నా సార్. పూర్తిగా రికవరీ అయ్యేవరకు ఇక్కడే ఉండటం మంచిది అని అంటాడు. మీ పొగరుపై ప్రేమతో చెబుతున్నారా. లేదా జాలితో చెబుతున్నారా అని వసుధార మనసులో అనుకుంటే.. జాలితోనే అని రిషి అంటాడు. ఏంటీ రిషి అని ఏంజెల్ అంటే.. కష్టాల్లో ఉన్నవాళ్లపై జాలి చూపిస్తాం కదా అని రిషి అంటాడు. తర్వాత వసుధారను గదిలోకి తీసుకెళ్తుంది ఏంజెల్. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఐడియాలు బాగున్నాయి, వర్కౌట్ అవుతాయని ఫణీంద్ర అంటాడు.

ఇలా బాగోదు:ఇంతలో గెస్ట్ హౌజ్ కు శైలేంద్ర వస్తాడు. దేవయాని మాటలు గుర్తు చేసుకుని డ్రామా మొదలు పెడతాడు. ఏంట్రీ శైలేంద్ర వచ్చావంటే.. ఏ రాకూడద డాడ్. మీరు రాలేదని వచ్చాను డాడ్. మీరంతా ఇప్పుడే రావాలి. మమ్మీ మీకోసం తెగ ఆరాటపడుతుంది. పిన్ని బాబాయ్ కోసం వచ్చిన మీరు ఇక్కడే ఉండిపోయేసరికి కంగారు పడుతుంది. మీరు రాకుంటే తనే వస్తానని చెప్పింది. బాబాయ్ ప్లీజ్ రండి అని శైలేంద్ర అంటాడు. దేవయాని ఓ మాట అంటుందే తప్పా మనం ఇంట్లో కనిపించకపోతే కంగారుపడుతుంది. ఇక్కడికి వచ్చినా వచ్చేస్తుంది. మనం ఇల్లు వదిలేసి ఇక్కడ ఉండటం బాగోదు. ఇంటికి వెళదామా అని ఫణీంద్ర అంటాడు. దీంతో మహేంద్ర ఆలోచనలో పడిపోతాడు. మహేంద్రకు జగతి మెసేజ్ చేస్తుంది.

ఆగిపోయిన రిషి:వెళ్లిపోదాం. లేకుంటే శైలేంద్రకు మనపై అనుమానం వస్తుంది అని జగతి పంపిన మెసేజ్ లో ఉంటుంది. సరే అన్నయ్యా.. వెళ్దాం అంటాడు మహేంద్ర. ఇక్కడ వర్క్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ ను ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారా. ఏదైనా నా ముందే చేయాలి. అది నేను స్పాయిల్ చేస్తుండాలి. నువ్వు ఓడిపోయి నన్ను గెలిపించాలి అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. మరోవైపు హాల్లో ట్యాబ్లెట్ బాక్స్ చూసి వసుధార మెడిసిన్ వేసుకుందా లేదా అని ఏంజెల్ ని పిలుస్తాడు. ఇంతలో మెల్లిగా వచ్చిన వసుధార అక్కడ పడిపోబోతుంది. కానీ రిషి పట్టుకోబోయి ఆగిపోతాడు. అప్పుడే వచ్చిన ఏంజెల్ తో మీ ఫ్రెండ్ ట్యాబ్లెట్స్ వేసుకుందా లేదా అని అడుగుతాడు రిషి. ఇదేదో తననే అడిగితే సరిపోతుంది కదా అని ఏంజెల్ అంటుంది.

బిత్తర చూపులు:సార్ చెప్పరు. మనసులో నాపై ప్రేమ ఉంది. కానీ చెప్పరు అని వసుధార అనుకుంటుంది. మీరు వచ్చి ఇన్నాళ్లైంది. ఇద్దరూ మాట్లాడుకోవడం చూడలేదు. మీ ఇద్దరికి ఏదైనా ప్లాబ్లమ్ ఉందా. కొంపతీసి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా. గతంలో కూడా ఓసారి అడిగాను. మళ్లీ అడుగుతున్నాను. మీ తీరు చూస్తుంటే ఇద్దరి మధ్యా ఏదో ఉందనిపిస్తోంది అని ఏంజెల్ అంటుంది. దీంతో వసు, రిషి షాక్ అయి చూస్తారు. రిషి ఏం మాట్లాడడు కానీ, నువ్వైనా చెప్పు వసు. రిషి నీ సీనియర్ లెక్చరర్ అని రిజర్వ్ డ్ గా ఉంటున్నావా అని ఏంజెల్ అంటుంది. దీంతో బిత్తర చూపులు చూస్తుంది వసు. మేడమ్ కి నాకు మధ్య ప్లాబ్లమ్ ఉండేంత పరిచయం లేదు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఏముంటుంది. ట్యాబ్లెట్స్ టైమ్ ప్రకారం వేసుకోవాలి అప్పుడే తొందరగా నయం అవుతుంది అని రిషి అంటాడు.
ధరణి కౌంటర్లు:ఇది కూడా నాకే చెబుతున్నావా. తను పక్కనే ఉందిగా అని ఏంజెల్ అంటుంది. జాగ్రత్త. మధ్యాహ్నం కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయి అని ఏంజెల్ (ఇన్ డైరెక్ట్ గా వసుకి)కి చెప్పి రిషి వెళ్లిపోతాడు. నాకు మనుషులు అర్థం కారు అని ఏంజెల్ అంటే.. నాకోసం చెబుతున్నారా నా ఎండీ సార్ అని వసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక శైలేంద్ర రావట్లేదు. మహేంద్రకు నిజం తెలిసిందా అని దేవయాని కంగారుపడుతుంటే ధరణి వచ్చి కౌంటర్లు వేస్తుంది. ఈలోపు కారులో అంతా వస్తారు. హమ్మయ్యా తిరిగి వచ్చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు వెళ్లినప్పటి నుంచి నాకు అదోలా ఉంది. నిద్ర కూడా సరిగా పోలేదు. ఏం ధరణి అని దేవయాని అంటే.. అదేంటీ అత్తయ్య పప్పు చారు తిని హాయిగా పడుకున్నారుగా అని ధరణి చెబుతుంది. దీంతో మహేంద్ర, ఫణీంద్ర, జగతి నవ్వేస్తారు.


Click it and Unblock the Notifications











