Guppedantha Manasu: తల్లీకొడుకులకు చుక్కలు చూపించిన జగతి.. ఫణీంద్ర పొగడ్తలు.. అరిచేసిన రిషి
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మహేంద్రతో ఫణీంద్ర చర్చిస్తుంటాడు. అనుకున్న ఐడియాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఫణీంద్ర అంటాడు. ఇంతలో కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకుని జగతి వస్తుంది. దానిపై ఫణీంద్ర సంతకం చేస్తుంటాడు. అప్పుడే మెట్లపై నుంచి దిగుతున్న దేవయాని, శైలేంద్ర అనుమానంగా చూస్తారు. డాడ్ ఏవో డాక్యుమెంట్స్ పై సంతకం చేస్తున్నారేంటి అని మనసులో అనుకుని వాళ్ల దగ్గరికి వెళ్తారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 7 శుక్రవారం నాటి ఎపిసోడ్ 809లో ఇంకా ఏం జరిగిందంటే?
జగతికి బాధ్యతలు: దేవయాని, శైలేంద్ర వస్తున్నప్పుడు మహేంద్ర సంతకం చేస్తుంటాడు. తర్వాత దేవయానికి డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు కూడా సైన్ చేయండని ఫణీంద్ర అంటాడు. ఏంటండి ఇవి అని దేవయాని అడుగుతుంది. మీరు కూడా కాలేజీ బోర్డ్ మెంబర్స్ కదా. మిషన్ ఎడ్యుకెషన్ బాధ్యతలన్నీ జగతికి అప్పగిస్తున్నట్లు డాక్యుమెంట్స్. అందుకే సైన్ చేయండి అని ఫణీంద్ర చెబుతాడు. అదేంటీ డాడ్.. ఇప్పుడెలాగు బాధ్యతలన్న పిన్నీనే చూసుకుంటోంది కదా. దానికి ఇదంతా ఎందుకు అని శైలేంద్ర అంటే.. అవును, శైలేంద్ర చెప్పేది కరెక్టే కదా అండి అని దేవయాని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.

నా డైరెక్షన్: మీరు చెప్పేది నిజమే కానీ, మినిస్టర్ గారు కాల్ చేసి బోర్డ్ మెంబర్స్ అందరితీ సైన్ చేసి పేపర్స్ రెడీ చేయమని చెప్పారు. మినిస్టర్ గారి ఆర్డర్స్ అందుకే చేస్తున్నాం అని ఫణీంద్ర అసలు విషయం చెబుతాడు. దీంతో దేవయాని, శైలేంద్ర షాక్ అవుతూ జగతి వైపు చూస్తారు. మా ఆయన, పెద్దత్తయ్య నుంచి కాలేజీని కాపాడేందుకు మీరు ఇలా చేశారని నాకు తెలుసు చిన్నత్తయ్య అని పక్కకు ఉండి వింటున్న ధరణి అనుకుంటుంది. మీరంతా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం నా డైరెక్షన్ లో వర్క్ చేస్తారు. ఏం శైలేంద్ర నీకు నా డైరెక్షన్ లో పని చేయడం ఇష్టం లేదా అని జగతి అంటుంది. అదేం లేదు జగతి అని ఫణీంద్ర అంటుంది.

హద్దు దాటి: జగతి చాలా ముందు చూపు గలది. ఏ పనైనా చాలా సమర్థవంతగా పని చేస్తుంది. జగతి డైరెక్షన్ లో శైలేంద్ర వర్క్ నేర్చుకుంటే వాడికి చాలా ఉపయోగపడుతుంది. ఏ పని ఎప్పుడు, ఏ టైమ్ కి చేయాలో తెలుస్తుంది. దీంతో త్వరలోనే గొప్పవాడు అవుతాడు అని జగతిని పొగడ్తలతో ముంచెత్తుతాడు ఫణీంద్ర. దీంతో శైలేంద్ర రగిలిపోతాడు. ఏం దేవయాని నీకు జగతి డైరెక్షన్ లో శైలేంద్ర పని చేయడం ఇష్టం లేదా అంటే.. అదేం లేదండి అని చాలా కష్టంగా సైన్ చేస్తుంది. అలాగే శైలేంద్ర సైన్ చేసి వెళ్లిపోతాడు. తర్వాత అంతా వెళ్లిపోయాక.. జగతి ఇదంతా నువ్వే కదా చేయించింది. నువ్ చాలా హద్దు దాటి ప్రయత్నిస్తున్నావ్. ఏం చేసుకుని ఇంత ధైర్యం అని దేవయాని అంటుంది.

ఓటమి కాదు: హద్దులు దాటి ప్రయత్నించింది మీరు. రిషిని పెంచానన్న కాస్త కనికరం కూడా లేకుండా హత్య ప్రయత్నాలు చేశారు. పదవి కోసం వెళ్లేలా చేశారు. ఎవరూ హద్దులు దాటారు. నా ధైర్యం రిషినే కొండంత అండ. ఇక నుంచి మీరు ఏ ప్లాన్స్ వేయకండి. అవి ఫలించవు. చూస్తూ ఉండండి అని జగతి అంటుంది. ఈ ధైర్యం ఎన్నాళ్లో చూస్తాను అని దేవయాని అంటే.. నేను చెప్పేది అదే.. చూస్తూ ఉండండి అని జగతి అనడంతో.. కోపంగా వెళ్లిపోతుంది దేవయాని. ఇదంతా మెట్లపై నుండి మహేంద్ర వింటాడు. నేను అన్ని పావులు కదుపుతున్నాను అక్కయ్య. విరామం ఓటమి కాదు. గెలుపు తీసుకునే ఊపిరి. డీబీఎస్టీ కాలేజీకి రాజు నా కొడుకు. భగవంతుడు కాలధర్మం పాటించడంలో అస్సలు తప్పు చేయడు అని జగతి అంటుంది.
బాగా అర్థమయ్యాడు: మరోవైపు విష్ కాలేజీలో ఫవర్ ఆఫ్ స్టడీస్ సెమినార్ గురించి వసుధారతో మాట్లాడతాడు ప్రిన్సిపాల్. ఈ టాపిక్ రిషి సార్ చెప్పారా అని వసు అడుగుతుంది. ఎగ్జాగ్ట్ గా ఎలా చెప్పారు. ఎవరైనా చెప్పారా. సరే మీకు విషయం తెలుసు కదా అని ప్రిన్సిపాల్ అంటే.. తాను తప్పకుండా వస్తానని వసుధార అంటుంది. తర్వాత గదిలోకి వెళ్లిన జగతితో.. దేవయాని వదినతో అంతా ధైర్యంగా మాట్లాడటం అవసరమా. కోపంతో ఇంకైమైనా ఆటంకాలు కల్పిస్తే ఎలా అని మహేంద్ర అంటాడు. వాళ్లు ఏం చేయలేరు. శైలేంద్ర నాకు బాగా అర్థమయ్యాడు. ప్రతీ దానికి అంచనా వేసి ప్రీ ప్లాన్ డ్ గా ఉంటున్నాను. ఫ్రస్టేట్ అవడం తప్పా చేసేది ఏముండదు. చేయనివ్వను అని జగతి అంటుంది.
హెల్త్ ముఖ్యం: మరోవైపు విష్ కాలేజీలో ఫవర్ ఆఫ్ స్టడీస్ సెమినార్ గురించి రిషితో లెక్చరర్స్ మాట్లాడతారు. క్లాసులన్నీ అయిపోయాక గంట కూర్చుని డిస్కస్ చేద్దాం. వసుధార మేడమ్ కూడా వస్తున్నారు అని లేడీ లెక్చరర్ అంటుంది. ఏంటీ.. వసుధార మేడమ్ వస్తున్నారు. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కదా. అలా ఎలా వస్తుంది. హెల్త్ ఇంపార్టెంట్ కదా అని వాళ్లపై కాస్తా గట్టిగా అరుస్తాడు రిషి. తర్వాత సముదాయించుకుని వసుధార మేడమ్ తో నేను డిస్కస్ చేస్తాను. తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అని రిషి అంటాడు. రిషి సార్ అలా అరిచాడేండీ. షార్ట్ టెంపర్ ఉందా ఏంటీ అని మరో లెక్చరర్ అనుకుంటాడు. ఇక ఇంట్లో అంతా భోజనం చేస్తుంటారు. ఒక రెండ్రోజులు దూరంగా వెళ్లి వస్తామని జగతి చెబుతుంది.
శైలేంద్రకు డౌట్: ఇంతకీ ఎక్కడికీ వెళ్తున్నారని దేవయాని అడిగితే.. ఔటాఫ్ స్టేషన్ వదినా. చాలా ముఖ్యమైన పనిపై వెళ్తున్నాం అని మహేంద్ర అంటాడు. మీరు వెళ్లిపోతే కాలేజీ పనులు ఎలా బాబాయ్ అని శైలేంద్ర అంటాడు. ఫోన్ లో నేను టచ్ లో ఉంటాను. ప్లాబ్లమ్ లేదు అని మహేంద్ర చెబుతాడు. నేను కూడా రానా అని ఫణీంద్ర అంటే.. వద్దులే అన్నయ్యా అని మహేంద్ర చెబుతాడు. అయితే నేను వస్తాను, ఇంతకీ ఎక్కడికీ, ఏం ఫంక్షన్ అని శైలేంద్ర ఆరా తీయడం మొదలు పెడతాడు. దీంతో ఈ కర్రీ వేసుకోండి అని కావాలనే ధరణి డైవర్ట్ చేస్తుంది. సరే త్వరగా వెళ్లి వచ్చేయండి అని ఫణీంద్ర అంటాడు. వీళ్ల ప్రవర్తన వింతగా ఉంది. బాబాయ్ కి పిన్ని నిజం చెప్పినట్టుంది అని శైలేంద్ర డౌట్ పడతాడు.


Click it and Unblock the Notifications











