Guppedantha Manasu: జగతి-మహేంద్రను చంపించనున్న శైలేంద్ర.. దానికోసం వసుతో రిషి
రిషి కారులో వెళ్తూ వసుధార కూడా పవర్ ఆఫ్ స్టడీస్ ప్రాజెక్టులో పార్టిస్ పేట్ చేస్తుందని తెలిసి ఆలోచిస్తుంటాడు. అంతకుముందు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు కలిసి తిరిగింది గుర్తు చేసుకుంటాడు. ఈసారి తనతో గడిపే క్షణాలు గాయాలు గుర్తుకు తేవాలి.
వసుధార నా సమీపంలో ఉంటే కాన్సంట్రేట్ చేయలేను. మిషన్ ఎడ్యుకేషన్ లాగే పవర్ ఆఫ్ స్టడీస్ ను తీర్చి దిద్దాలి. నన్ను ఎవరూ డిస్ట్రబ్ చేయకూడదు. చేయలేరు అని రిషి మనసులో అనుకుంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూలై 8 శనివారం నాటి ఎపిసోడ్ 810లో ఇంకా ఏం జరిగిందంటే?

ఏ తల్లి చేయదు: మరోవైపు జగతి బట్టలు సర్దుకుంటూ ఎప్పుడూ బయలుదేరుదాం అని మహేంద్రను అడుగుతుంది. రేపు మధ్యాహ్నం లంచ్ తర్వాత స్టార్ట్ అవుదాం. నైట్ అక్కడ స్టే చేసి ఎల్లుండి మార్నింగ్ ఆ కాలేజీకి వెళ్దాం అని మహేంద్ర చెబుతాడు. రిషిని స్కామ్ లో ఇరికించింది అంతా గుర్తు చేసుకుంటుంది జగతి. అవన్నీ తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావని మహేంద్ర అడుగుతాడు. ఎలాంటి తప్పు చేయని నా కొడుకుని కోటి రూపాయలు స్కామ్ చేశాడని నిరూపించాను. ఇలా ఏ తల్లి చేయదు అని జగతి అంటుంది. అవును జగతి నీలా ఏ తల్లి చేయదు. కొడుకు ప్రాణాల కోసం ఇలా ఏ తల్లి చేయదు అని సపోర్ట్ గా మాట్లాడతాడు మహేంద్ర.
అవసరం లేదు: రిషి క్షేమం కోసమే కదా అలా చేశావ్. కానీ రిషి కంటే నువ్వు ఎంత బాధ అనుభవించావో నాకు తెలుసు అని మహేంద్ర అంటాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఫోన్ చూస్తూ పైకి వస్తాడు శైలేంద్ర. ఇన్నేళ్ల తర్వాత రిషిని చూడబోతున్నాని అనే ఫీలింగ్ నా మనసుని నిలకడగా ఉంచలేకపోతోంది అని జగతి అంటే.. దాన్ని కొంచెం ఆపుకో జగతి.
రిషిని చూశాక ఇలా ఎగ్జైట్ కాకు అని మహేంద్ర అంటాడు. మహేంద్ర రేపు మనం అక్కడకు వెళ్తున్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు అని జగతి అంటే అన్నయ్యకు చెబుతాం అని మహేంద్ర అంటాడు. ఏం అవసరం లేదు. నిన్న చెప్పాం కదా. వాళ్లకు తెలిస్తే మనల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది అని జగతి అంటుంది.

ఫాలో అవ్వు: జగతి అన్న మాటలు విన్న శైలేంద్ర.. దేవయానిక దగ్గరికి వెళ్తాడు. మమ్మీ వీళ్లు ఏదో ఫంక్షన్ కు వెళ్తున్నాం అన్నారు. కానీ ఏదో ప్లాన్ చేస్తున్నారు. బాబాయ్ కి పిన్ని నిజం చెప్పిందా అనేది మనకు క్లారిటీ రావాలి. నిజం చెప్పకుంటే ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ నిజం చెబితే మనం ఏం చేయాలా అని ఆలోచించాలి అని శైలేంద్ర అంటాడు.
అయితే రేపు నువ్వేం పనులు పెట్టుకోకుండా వాళ్లను ఫాలో అవ్వు అని దేవయాని అంటే.. శైలేంద్ర సరే అంటాడు. ఇంటికి చేరుకున్న రిషి.. ప్రిన్సిపాల్ వసుధార కోసం పంపించిన కారుని పంపించి వేస్తాడు. ఈలోగా వసుధార బయటకు వస్తుంది. రిషి అడ్డుగా ఉంటే.. సర్ కొంచెం తప్పుకోమ్మని చెబుతుంది.
లోపలి గాయాలు: మీరు కూడా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. మీరు రాలేరని, రారని ప్రిన్సిపాల్ తో చెప్పాను. అయినా వెళ్తానంటే నా మాటకు విలువ ఇవ్వనట్టే అని రిషి అంటాడు. అదేంటి సార్ నేను సార్ తో వస్తానని చెప్పాను అని వసుధార అంటుంది. పూర్తిగా నడవలేని స్థితిలో కాలేజీకి వెళ్లాల్సిన అవసరం ఏంటీ, ఎవరికోసం వెళ్తున్నారో తెలుసుకోవచ్చా అని రిషి అంటాడు.
కాలేజీలో సెమినార్ జరగబోతుంది. నా పార్టిస్ పేషన్ ఉంటే బాగుంటుందని వస్తున్నాని చెప్పాను. అయినా నేను పని చేయాలి అనుకుంటున్నాను అని వసుధార అంటే.. అదేం లేదు మీరు కోలుకునే వరకు ఉండాలి అని రిషి అంటాడు. పైన గాయాల గురించి కాదు. లోపల అయినా గాయాల గురించి చెబుతున్నాను. అందుకే పని చేయాలని ఉందని వసు అంటుంది.
భారం దించేసుకోవాలి: మరి ఎదుటి వారి మనసుకు అయినా గాయాల గురించి ఎప్పుడైన ఆలోచించారా అని రిషి అంటాడు. నేను కాలేజీకి వెళ్తాను సార్ అని వసుధార అంటుంది. పొగరు.. చెబితే వినదు కదా అని మనుసులో అనుకున్న రిషి.. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంతగా చేయాలనుకుంటే ఇంట్లోనే ఉండి చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఫెసిలిటీ ఒకటి ఉంది.
అలా చేయొచ్చు అని చెబుతాడు. మరోవైపు కారులో జగతి-మహేంద్ర బయలుదేరుతారు. శైలేంద్ర వెనుకే ఫాలో అవుతాడు. కొడుకును కలిసేందుకు వెళ్తున్నందుకు జగతి సంతోషంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడూ రిషిని చూస్తామా. రిషి నాతో మాట్లాడతాడ.. నా భారం దించేసుకోవాలని ఉంది అని జగతి అంటుంది. రిషి కోసం వెళ్లినట్లు తనకు తెలియకూడదు అని మహేంద్ర అంటాడు.
చంపించేస్తా: బాబాయ్ పిన్నీ.. ఏ పనిపై వెళ్తున్నారో.. ఫాలో అవుతున్నా కదా అన్నీ తెలుస్తాయి. అప్పుడేం ఏం చేయాలో ఆలోచిస్తాను అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు ఇంట్లో కంగారుగా దేవయాని తిరుగుతుంటుంది. శైలేంద్ర నుంచి కాల్ రాలేదని ఆలోచిస్తుంటుంది. ఇంతలో ధరణి వచ్చి భోజనానికి అని పిలిచి మళ్లీ సెటైర్లు వేస్తుంది.
ఇంతలో శైలేంద్ర కాల్ చేసి నేను వాళ్లను ఫాలో అవుతున్నాను. హోటల్లో ఉన్నారని చెబుతాడు. అక్కడ మనకు వ్యతిరేకంగా ఏమైనా జరిగితే.. వాళ్లను ఆపు అని దేవయాని అంటే.. అదే జరిగితే వాళ్లని రిషిని పంపించినట్లే చంపేస్తానని శైలేంద్ర అంటాడు. ఇలా అనాలోచితంగా చేయకు అని ఫైర్ అవుతుంది దేవయాని.
మట్టిలో కలిపేస్తే: వాళ్లు ఎందుకు వెళ్లారో తెలుసుకో. అప్పుడు ఏం చేయాలో చెబుతాను అని దేవయాని అంటే.. అసలు ఈ తంటాలన్నీ అవసరమా. నా వల్ల కావట్లేదు. ఆ రిషి గాడు లేడు. వీళ్లను మట్టిలో కలిపేస్తే నాకు అడ్డెవరూ ఉండరు అని ఊగిపోతాడు శైలేంద్ర. మహేంద్రకు ఏ హాని తలపెట్టొద్దని దేవయాని చెబుతుంది. శైలేంద్ర కాల్ కట్ చేస్తాడు. మరోవైపు విశ్వనాథం ఇంట్లో ఆన్ లైన్ లో మీటింగ్ పెడతాడు రిషి. ఎవర్నీ ఇబ్బంది పెట్టాలను అనుకోవడం లేదు. మనం అనుకున్న వర్క్ అంతా ఛైర్మన్ సార్ ఇంట్లో నుంచే చేద్దాం అని పవర్ ఆఫ్ స్టడీస్ గురించి ఐడియాస్ చెబుతాడు రిషి. వసుధార కూడా కొన్ని పాయింట్స్ చెబుతుంది.


Click it and Unblock the Notifications











