Guppedantha Manasu: షాకింగ్.. చనిపోయిన రిషి, వసుధార తల్లి.. మూడేళ్ల ముందుకు సీరియల్
దేవయాని, శైలేంద్రలకు ఎదురు తిరిగిన జగతి.. కాలేజీ బాధ్యతల నుంతి నన్ను తప్పించలేరు. ఆ సీటు శైలేంద్రకి దక్కనివ్వనని గట్టిగా చెప్పేస్తుంది. దానికి కక్ష పెంచుకున్న శైలేంద్ర రౌడీలకు కాల్ చేసి రిషిని చంపేయమని చెబుతాడు. నాకు టైమ్ లేదు. వాడు బతికి ఉంటే నాకు చాలా సమస్యలు వస్తాయి.
వెంటనే వాడిని మట్టిలో కలిపేయండి. భూమ్మీద నుంచి వాడి నామ రూపాలు లేకుండా చేయండి. పని జరిగిపోవాలి అని శైలేంద్ర అంటాడు. దానికి అలాగే సార్ అని రౌడీ అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 1 గురువారం నాటి ఎపిసోడ్ 778 లో ఇంకా ఏం జరిగిందంటే?

పెద్ద శిక్ష: అలాగే కాదు.. గంటలో నేను గుడ్ న్యూస్ వినాలి. మీ ప్లాన్ మీద నాకు నమ్మకం లేదు. నేను చెప్పింది చేయమని శైలేంద్రనే ఒక ఐడియా ఇస్తాడు. మరోవైపు కాలేజీలో ఎండీ సీటులో కూర్చుని జరిగింది అంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. అలా ఆలోచిస్తూ గోడపై రిషి ఫొటో చూస్తుంది. వెంటనే పైకి లేచి రిషిని చూస్తూ.. నేను తప్పు చేశాను. కానీ అది నీ క్షేమం కోసం చేశాను. నీ ప్రాణాలు కాపాడుకోవడం చేశాను. చేసిన పనికి మా మీద కోప్పడతావు అనుకున్నాను.
ఇలా వదిలి వెళ్లిపోతావనుకోలేదు. వసుకు దూరం అవుతావనుకోలేదు. నాకు ఇంత పెద్ద శిక్ష విధిస్తావనుకోలేదు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా నాన్న. వసు ఎలా ఉందో ఎక్కడుందో తెలియట్లేదు. మీ డాడ్ బాధను చూడలేకపోతున్నాను. నీ మంచి కోసం తీసుకున్న నిర్ణయం ఈరోజు శాపంగా మారింది. ఎలా ఉన్నావ్ రిషి అని మనసులో అనుకుంటుంది జగతి.

అలా పొడిచావేంట్రా: సరిగ్గా అప్పుడే వీధిలో ఒంటరిగా రిషి నడుచుకుంటూ వస్తాడు. రిషికి ఎదురుగా ఓ వ్యక్తిని తరుముకుంటూ ముగ్గురు రౌడీలు (శైలేంద్ర మనుషులు) వస్తుంటారు. సార్ కాపాడండి సార్ ప్లీజ్ అని రిషి వెనుక దాక్కుంటాడు పరిగెత్తుకొచ్చిన మనిషి. ఏరా వీడు నిన్ను కాపాడతాడు అది మేము చూడాల. వీడి ముందే నిన్ను చంపేస్తాం. వాడు ఆపుతాడో లేద్దో చూద్దాం అని రౌడీ అంటాడు.
దీంతో ఆ ముగ్గురితో రిషి ఫైట్ చేస్తుంటే ఉంటాడు. ఇంతలో రిషి వెనుక ఉన్న మనిషి కత్తితో రిషిని పొడుస్తాడు. రేయ్ ఏంట్రా అలా పొడిచావ్ అని కింద పడిన వ్యక్తి లేచి అంటాడు. రిషి వెనుకే ఉన్న మరో రౌడీ కత్తి తీసుకుని మళ్లీ పొడుస్తాడు. దీంతో రిషి బలహీనం అయిపోతాడు. ముందు ఉన్న రౌడీ కూడా కత్తితో పొడుస్తాడు. దీంతో స్పృహ తప్పి కిందపడతాడు రిషి. చనిపోయాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని వెళ్లిపోతారు రౌడీలు.

నువ్వే కాపాడాలి: రిషి కందపడగానే జగతి ముందున్న రిషి ఫొటో కిందపడి పగిలిపోతుంది. ఇలా జరిగిందేంటి. నా కొడుక్కి ఏదైనా ఆపదా. నో. తనకు ఏం కాకూడదు అని జగతి అనుకుంటుంది. ఫొటోను సరిచేస్తుంటే దానికి ఉన్న గాజు జగతి వేలుకు గుచ్చుకుని రక్తం వస్తుంది. ఆ రక్తం రిషికి బొట్టుగా కనిపిస్తుంది. దీంతో జగతి షాక్ అవుతుంది. దేవుడా నా కొడుకుని నువ్వే కాపాడాలి అని జగతి అంటుంది.
తర్వాత సార్ వాన్ని లేపేశాం అని శైలేంద్రకు ఫోన్ చేసి చెబుతారు రౌడీలు. దీంతో తెగ సంతోషపడిని శైలేంద్ర.. సరే వచ్చి కావాల్సినంత డబ్బు తీసుకుని పోండి అని అంటాడు. నా నిజస్వరూపం తెలుసుకోకుండానే పోయావ్. థ్యాంక్స్ తమ్ముడు. నాకు కావాల్సిన దానికోసం ఎంతకైనా దిగజారతాను. డీబీఎస్టీ కాలేజీకి ఎండీ అవుతాను అని అనుకుంటాడు శైలేంద్ర.
సుమిత్రకు గుండెనొప్పి: మరోవైపు రిషి చుట్టూ జనం గుమిగూడతారు. ఆంబులెన్స్ కు కాల్ చేస్తారు. ఇంతలో అటువైపు వచ్చిన మహేంద్ర ఎవరా అబ్బాయని అడుగుతాడు. ఎవరో అబ్బాయిని రౌడీలు పొడిచి పారిపోయారట సార్. ఆంబులెన్స్ కు కాల్ చేశాం అని ఓ వ్యక్తి అంటాడు. నా కారులో తీసుకెళ్దాం అని రిషి దగ్గరికి వెళ్లేలోపు ఆంబులెన్స్ వస్తుంది. ఎవరో ఏంటో చూద్దాం అని వెళ్తుంటే మహేంద్రకు కాల్ వస్తుంది.
ఫోన్ మాట్లాడుకుండా మహేంద్ర ఉంటే.. రిషిని ఆంబులెన్సు లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకుపోతారు. ఏ తల్లి కన్నబిడ్డో. దేవుడా క్షేమంగా చూడు అని మహేంద్ర అనుకుని వెళ్లిపోతాడు. మరోవైపు ఆసుపత్రిలో సుమిత్రకు మళ్లీ గుండెనొప్పి వస్తుంది. నర్స్, డాక్టర్స్ కంగారు పడుతుంటారు. ఇంతలో అదే ఆస్పత్రికి రిషిని తీసుకొస్తారు. అక్కడే వసుధార తల్లికోసం మెడిసిన్ తీసుకుంటుంది.

అమ్మగారు ఇక లేరు: రిషిని లోపలికి తీసుకెళ్తారు. కానీ డాక్టర్ మాత్రం రిషికి ఎవరు లేరని తెలుసుకుని ట్రీట్ మెంట్ ఇవ్వనని చెబుతాడు. అది విన్న వసుధార వచ్చి అలా ఎలా మాట్లాడతారు. మనిషి ప్రాణం పోతుందంటే.. పోలీసులు, కేసు అంటున్నారు. కావాలంటే ఆ ఎన్వోసీ మీద నేను సంతకం చేస్తాను అని చెబుతుంది వసుధార. దీంతో డాక్టర్ రిషిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తాడు.
ఇంతలో రిషి చేతికి తాను ఇచ్చిన బ్రేస్ లెట్ చూసి షాక్ అవుతుంది వసుధార. రిషి సార్ బ్రేస్ లెట్ లా ఉందని ముందుకు కంగారుగా వెళ్తుంది. ఇంతలో మేడమ్ అని వసుధారను నర్స్ పిలుస్తుంది. మీ అమ్మగారు ఇక లేరు అని చెబుతుంది. దీంతో వసుధార గుండెపగిలనంతా పనవుతుంది. అమ్మా అంటూ సుమిత్ర దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది.

అండగా చక్రపాణి: మరోవైపు రిషికి ట్రీట్ మెంట్ ఇస్తుంటారు. కాసేపటికే రిషి హాట్ బీట్ ఆగిపోయిందనే అనుమానంతో డాక్టర్ చాలా కంగారు పడుతుంటారు. హీ ఈజ్ నో మోర్ అన్నట్లుగా డాక్టర్స్ సైగలు చేసుకుంటారు. ఇదంతా ఎమోషనల్ గా సాగుతుంది. ఇక ఓవైపు తల్లి ముందు వసుధార ఏడవటం, రిషి ప్రాణాలు పోయినట్లుగా చూపిస్తూ ముగిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత అని చూపిస్తూ ఓ వాయిస్ ఓవర్ ఇస్తారు.
రిషి విషయంలో మహేంద్ర ఏం అనాలో అర్థం కాక జగతితో మహేంద్ర మాట్లాడటం మానేశాడు. శైలేంద్ర, దేవయాని కాలేజీ ఎలా దక్కించుకోవాలో తెలియక తల పట్టుకున్నారు. రిషితోపాటు తల్లిని కూడా దూరం చేసుకున్న వసుధారకు చక్రపాణి అండగా నిలబడ్డాడు. బాధ పొగొట్టుకోవడానికి చదువు కూడా మందుగా ఉపయోగపడుతుందని వసుధారను ముందుకు నడిపించాడు.

ఓ ప్లాన్ ఉంది: ఎన్నిసార్లు ప్రయత్నించినా జగతిని కలవడానికి వసుధార ఒప్పుకోలేదు. వసుధార తన ప్రేమను తిరిగి పొందుతుందా. ప్రశ్నలు చాలానే ఉన్నాయి. పదండి ఏం జరుగుతుందో చూద్దాం అని అసలు కథలోకి తీసుకెళ్తారు. మహేంద్ర పేపర్ చదువుతుంటే జగతి వచ్చి కాఫీ తీసుకోమంటుంది. శైలేంద్ర చూడనట్లుగా ఉంటే తనతో మాట్లాడమని మహేంద్రను బతిమిలాడుకుంటుంది జగతి.
విసుగు చెందిన మహేంద్ర కోపంగా పేపర్ కింద పడేసి.. అమ్మా ధరణి నాకు కాఫీ పంపించమ్మా అని వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన దేవయాని, శైలేంద్ర మూడేళ్లు గడిచిన పిన్నితో బాబాయ్ మాట్లాడలేదు. మనకు కాలేజీ ఎండీ సీటు దక్కలేదు అని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు జగతితో జాగ్రత్తగా ఉండాలి. ఎదురు తిరిగితే మనకు డేంజర్ అని దేవాయని అంటుంది. రిషి, వసులనే తప్పించిన వాన్ని పిన్నిని పంపించలేనా. ఆల్రెడీ ఓ ప్లాన్ ఉందని శైలేంద్ర అంటాడు.


Click it and Unblock the Notifications











