Guppedantha Manasu: మళ్లీ లెక్చరర్‌గా రిషి.. సంతోషంలో వసుధార.. జగతికి ఫణీంద్ర షాక్

మురుగున్ కు రిషి వార్నింగ్ ఇచ్చిన విషయం విశ్వనాథ్, ఏంజెల్ కు చెబుతాడు రిషి. పిల్లలు దారిలోకి రావాలంటే నువ్వు అక్కడే ఉండాలి రిషి. లెక్చరర్ గా కాలేజీలో చేరు అని విశ్వనాథ్ చెబుతాడు. ఏ ఇతర కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను చేపట్టరాదన్న జగతి మాటలు గుర్తుకు వచ్చి నో అంటాడు రిషి.

ఏంజెల్ కూడా కాలేజీలో చేరమని అడుగుతుంది. మేము అడగకకుండానే మాకోసం ఎన్నో చేశావ్. మేము ఇంతలా అడుగుతున్నా ఒప్పుకోవట్లేదు అంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని విశ్వనాథ్ అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూన్ 10 శనివారం నాటి ఎపిసోడ్‌ 786 లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial June 10 2023 Today Full Episode 786

జాడ తెలియట్లేదు: జగతి మాటలు గుర్తు చేసుకున్న రిషి అదేం లేదు అంటాడు. మరి ఒప్పుకోవచ్చు కదా అని విశ్వనాథ్ అంటాడు. అప్పుడు హాస్పిటల్ లో విశ్వనాథ్, ఏంజెల్ కాపాడటాన్ని గుర్తు చేసుకున్న రిషి.. కాలేజీ బాధ్యతలు తీసుకో అనడం లేదు కదా. లెక్చరర్ గా పని చేస్తే ఇబ్బంది ఏం లేదు. వీళ్ల కోసం చేయడం నా బాధ్యత కూడా అని అనుకుంటాడు.

కాలేజీలో లెక్చరర్ గా చేరడానికి అంగీకరిస్తాడు రిషి. దీంతో విశ్వనాథ్, ఏంజెల్ సంతోషపడతారు. మరోవైపు రిషి ఆచూకి కనిపెట్టడానికి తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ సహాయం తీసుకుంటాడు మహేంద్ర. చాలా రోజుల నుంచి ఎంత వెతికినా కూడా రిషి జాడ తెలియట్లేదు అని చెబుతాడు. దీంతో మహేంద్ర చాలా బాధపడిపోతాడు.

Guppedantha Manasu Serial June 10 2023 Today Full Episode 786

చూడకుండా ఉండలేడు: ఇదే అదనుగా దేవయాని, శైలేంద్ర ఇన్ డైరెక్ట్ గా జగతిని అనేక మాటలు అంటారు. రిషి తప్పి పోలేదు. రిషిపై చెరగని మచ్చ వేశారు. అందుకే జీవితంలో మళ్లీ చూడకూడదని వెళ్లిపోయాడు అని దేవయాని అంటుంది. రిషి మనసు చాలా గాయపడింది. అందువల్లే మనకు ఎదురుపడకూడదని ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు.

అందుకే ఇన్నేళ్లుగా దొరకట్లేదు అని శైలేంద్ర అంటాడు. రిషి మనకు దగ్గర్లోనే ఉన్నాడని అనిపిస్తోంది. మన చుట్టుపక్క ఊరిలోనో, సిటీలోనో ఉన్నాడని నా మనసు చెబుతోంది. నా కొడుకు అంటే నాకు ప్రాణం. వాడిని చూడకుండా ఒక్కపూట కూడా ఉండలేను. వాడు కూడా నన్ను చూడకుండా ఉండలేడు. డాడ్ అనే మాట నోటి నుంచి విని ఎన్ని సంవత్సరాలు అయిందో అని మహేంద్ర బాధపడతాడు.

Guppedantha Manasu Serial June 10 2023 Today Full Episode 786

ఎలా నటిస్తున్నారు: అబ్బా.. రిషి ఎప్పుడో చనిపోతే.. ఈయనగారికి చుట్టుపక్కలే ఉన్నట్లు అనిపిస్తుందట అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. నమ్మిన వాళ్లే రిషితోపాటు నన్ను మోసం చేశారు. ఒకరికొకరం కాకుండా చేశారు. అసలు ఢిల్లీ వెళ్లకుండా ఉండాల్సింది. రిషిని బుజ్జగించే, బతిమాలో ఇక్కడే ఉండమని కోరేవాన్ని, లేదా నేను కూడా రిషితోపాటే వెళ్లేవాన్ని అని మహేంద్ర అంటాడు.

రిషి దూరం కావడంతో మేము కూడా చిత్రవధ అనుభవిస్తున్నాం. కోపం తగ్గిపోయిన తర్వాత రిషి తిరిగి వస్తాడని అనుకున్నా. కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు అని దేవయాని అంటుంది. చేసింది అంతా చేసి, తండ్రికొడుకులను విడగొట్టి, ప్రేమికులను విడగొట్టి ఇప్పుడు ఇలా ఎలా నటిస్తున్నారు అక్కయ్య అని జగతి అనుకుంటుంది.

ఎవరి మంచి కోసం: రిషిపై అంతపెద్ద అభియోగం మోపడానికి కారణం ఏంటమ్మా జగతి. అది తెలిస్తే రిషి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం సులువు అవుతుందని పోలీస్ ఆఫీసర్ అంటాడు. అది అన్నయ్యా అని జగతి అంటే.. దేవయాని, శైలేంద్ర భయపడిపోతారు. మీకు తెలియకపోవడమే మంచిది అన్నయ్యా. నా కొడుకు వస్తాడు. రిషి వచ్చాకే అన్ని సమస్యలు తీరిపోతాయి అని జగతి అంటుంది.

ఇదే తన వైఖరి.. ఎందుకిలా చేస్తుందో, ఎవరి మంచికోసం చేస్తుందే అర్థం కావడం లేదు అని మహేంద్ర అంటాడు. నువ్ ఆవేశపడకు అని పోలీసు అంటే అంతకుమించి నాకు ఏం మిగిలిందిరా అని మహేంద్ర అంటాడు. మరోవైపు ఇంట్లోకి సంతోషంగా వస్తుంది వసుధార. అది గమనించిన తండ్రి చక్రపాణి ఏంటమ్మా విషయం అని అడుగుతాడు.

Guppedantha Manasu Serial June 10 2023 Today Full Episode 786

అప్పుడే పతనం: కాలేజీలో వచ్చిన కొత్త వ్యక్తి నా సంతోషానికి కారణం. మన ఇంటికి వచ్చి బెదిరించిన మురుగన్ కు ఆ వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడట. కేడీ బ్యాచ్ నుంచి ఇకపై లెక్చరర్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్టాఫ్ అందరు సంతోషంగా ఉన్నారు. అతని గురించె చెప్పారు. కానీ అతన్ని చూడలేకపోయాను నాన్నా. మరోసారి కచ్చితంగా కలిసి అభినందిస్తాను.

ఆ వ్యక్తి గురించి వింటే నాకు రిషి సార్ గుర్తుకు వస్తున్నారు. రిషి సార్ కూడా ఇలాగే ఏదైనా సమస్య ఎదురైతే అది పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు నిద్రపోయేవారు కాదు అని వసుధార అంటుంది. ఇక ఆలోచనలో మునిగిపోయి ఉన్న జగతి ముందు కొన్ని ఫైల్స్ వేస్తాడు శైలేంద్ర. డీబీఎస్టీ కాలేజీలో అటెండెన్స్, పాస్ పర్సంటేజ్ తగ్గిపోయింది. కాలేజీ డౌన్ అయింది. నువ్వు ఎండీ సీటులో కూర్చున్నప్పటినుంచే కాలేజీ పతనం మొదలైంది అని జగతిని అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Serial June 10 2023 Today Full Episode 786

శైలేంద్రకు చురకలు: ఇప్పటివరకు నువ్ చేసింది చాలు ఇకనైనా నా కొడుకును ఎండీ సీటులో కూర్చోబెడితే బాగుంటుంది అని దేవయాని అంటుంది. ఏం బాగుంటుంది. అవసరం లేదు అని జగతి అంటుండగా.. ఫణీంద్ర వస్తాడు. వాళ్లు అన్నారు అని కాదు. నువ్వు ఎండీ సీటు నుంచి తప్పుకోవడమే మంచిదమ్మా. రిషి దూరమైన బాధ, మహేంద్ర మాట్లడటం లేదన్న వెలితి వీటి మధ్య నలిగిపోతున్నావ్. అది మానేసి ప్రశాంతంగా ఉండమ్మా అని ఫణీంద్ర అంటాడు.

నేను అదే చెబుతున్నా డాడ్. దేని గురించో బాగా సంకోచిస్తుందనుకుంటా అని శైలేంద్ర అంటాడు. రాజు లేని సింహాసనం నీడలో కుట్రలు, కుతంత్రాలు పురుడు పోసుకున్నట్లు డీబీఎస్టీ సీట్ గురించి నక్కలు, తోడేళ్లు కుట్ర పన్నుతున్నాయని శైలేంద్ర సంకోచిస్తున్నాడు బావగారు. ఎవరో కష్టపడి స్థాపించిన సామ్రాజ్యాన్ని అప్పనంగా అనుభవించాలని అనుకునేవారు ప్రతిచోట ఉంటారు అని శైలేంద్రకు చురకలు వేస్తుంది జగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X