Guppedantha Manasu: సూపర్బ్ సీన్లు.. కలుసుకున్న రిషిధార.. మహేంద్రకు వసు ఫోన్.. జగతిలో కంగారు!

రిషిని లెక్చరర్ గా ఉండమని విశ్వనాథ్, ఏంజెల్ కోరడంతో ఒప్పుకుంటాడు. దీంతో కాలేజీలోకి లెక్చరర్ గా ఎంట్రీ ఇస్తాడు రిషి. రిషిని చూసి కేడీ బ్యాచ్ చూసి వీడు మళ్లీ వచ్చాడేంట్రా అని అనుకుంటారు. వాడు కచ్చితంగా లెక్చరర్ అయే ఉంటాడు. మనం చేసే పనిని జీవితంలో మర్చిపోకూడదు. క్లాస్ లో అడుగు పెట్టగానే మనకి దండం పెట్టి వెళ్లిపోవాలి అని ప్యాండన్ అంటాడు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లిన వసుధార.. మురుగన్ కు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి గురించి అడుగుతుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూన్ 12 సోమవారం నాటి ఎపిసోడ్‌ 787 లో ఇంకా ఏం జరిగిందంటే?

బ్రేకప్ విషయం: వసుధారకు రిషి గురించి గొప్పగా చెబుతాడు. మురుగన్ కు వార్నింగ్ ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది. ఆ పిల్లలను దారిలో పెడతాడని. వాళ్లకు బుద్ధి చెప్పడానికి ఎవరు రాననుకున్నాం. కానీ ఆయన్ను చూశాక నమ్మకం వచ్చింది. అతను ఛైర్మన్ విశ్వనాథ్ గారికి బాగా కావాల్సిన వ్యక్తి. ఈరోజు లెక్చరర్ గా జాయిన్ అవుతున్నారు అని విశ్వనాథ్ గారు చెప్పారు అని ప్రిన్సిపాల్ అంటాడు. ఇంతకీ అతని పేరు ఏంటీ సార్ అని వసుధార అంటుంది. రిషి అని ప్రిన్సిపాల్ చెప్పేసరికి షాక్ అయినా వసుధార అలాగే ఉండిపోతుంది. తనకు బ్రేకప్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఏంటీ మేడమ్ అలా ఉండిపోయారు. అతను మీకు తెలుసా అని ప్రిన్సిపాల్ అంటాడు.

Guppedantha Manasu:

ఇవాళ నెరవేరింది: రిషి అంటే నా రిషి సార్ కాదా అని మనసులో అనుకుంటుంది వసుధార. ఇంతలో ఫ్యూన్ వచ్చి రిషి సార్ వస్తున్నారని చెబుతాడు. దీంతో పరుగెత్తుకును వెళ్తుంది వసుధార. అటువైపు నుంచి రిషి వస్తాడు. ఒకరినొకరు చూసుకోకుండా ఇద్దరు గుద్దుకుంటారు. రిషిని చూసిన వసుధార చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూడగానే ప్రాణం లేచివచ్చినట్టుంది. ఎక్కడికి వెళ్లిపోయారు. ఆరోజు నేను చేసింది తప్పే. తప్పని నాకు తెలుసు. కానీ చేయాల్సి వచ్చింది. నా ప్రేమ కోసం తిరిగి వస్తారని చిన్న ఆశతో బతుకుతున్నాను. అది ఇవాళ నెరవేరింది. నా ఎండీ సార్ నాకోసం వచ్చారు. ఇక మీ దగ్గర ఏది దాచిపెట్టను. మీరు కోరుకున్నట్లే దాపరికం లేని ప్రేమను అందిస్తాను అని రిషిని గట్టిగా హగ్ చేసుకుంటుంది.

సంతోషంలో చక్రపాణి: కాసేపటికి పక్కనే ఉన్న మరో లెక్చరర్ ఏంటీ మేడమ్ అలానే చూస్తున్నారు అని అనడంతో భ్రమలో నుంచి బయటకు వస్తుంది వసుధార. ఈ సార్ అని ఆ లెక్చరర్ అంటే రిషి సార్ అని వసుధార అంటుంది. ఈ సార్ ముందే మీకు తెలుసా అని అంటే అయోమయంలో పడిపోతుంది వసుధార. సార్ ఈమె వసుధార. కొత్తగా వచ్చిన మ్యాథ్స్ లెక్చరర్. సరే సార్ నాకు టైమ్ అవుతుంది అని ఆ మేడమ్ వెళ్లిపోతుంది. వసుతో బ్రేకప్ గుర్తు చేసుకున్న రిషి అక్కడి నుంచి ఏం వినకుండా వెళ్లిపోతాడు. వసు వెనకాలే ఆగమని ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపోతాడు. బాధగా ఇంటికి వెళ్తుంది వసుధార. ఏంటమ్మా ఈ టైమ్ లో వచ్చావ్ అని అడిగితే రిషి సార్ ను కలిశాను. మురుగన్ కు వార్నింగ్ ఇచ్చింది రిషి సారే అని వసు అంటుంది. చాలా సంతోషంగా ఉందని చక్రపాణి అంటాడు.

Guppedantha Manasu:

మహేంద్రకు వసు కాల్: రిషి సార్ ఎలా ఉన్నారు. మాట్లాడారా. పలకిరించారా అని చక్రపాణి అడుగుతాడు. రిషి సార్ మాట్లాడలేదు. అసలు మనిషిలాగే చూడలేదు. అప్పుడు ఎంత కోపంగా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. మనం ఊరి వదిలి వెళ్లిపోదాం నాన్నా. మనం ఉన్నామని తెలిస్తే.. రిషి సార్ మరెక్కడికైన వెళ్లిపోతారు. ఆ అల్లరి పిల్లలను దారిలో పెట్టాలంటే రిషి సార్ వల్లే అవుతుంది. ప్లీజ్ నాకోసం వెళ్లిపోదాం నాన్నా అని వసుధార అంటే చక్రపాణి సరే అంటాడు. పరోక్షంగా మీ మనసును చంపాను. ప్రత్యక్షంగా నా తల్లిని చంపుకున్నాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. మీకోసం మహేంద్ర సార్ ఎంత బాధపడుతున్నారో. కనీసం ఈ విషయం అయినా మహేంద్ర సార్ కి చెప్పాలి అని వసుధార ఫోన్ చేస్తుంది.

రిషి గురించి ఆలోచించావా: మహేంద్ర ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఎక్కడికో వెళ్లిపోతాడు. మహేంద్రకు వసుధార ఫోన్ చేయడం తెలుసుకున్న చక్రపాణి మొబైల్ లాక్కుని కాల్ కట్ చేస్తాడు. మహేంద్ర గురించి ఆలోచించావ్ కానీ రిషి గురించి ఆలోచించలేదు. నీ మీద కోపంగా ఉన్న రిషికి మహేంద్ర సార్ కనిపిస్తే ఏం జరుగుతుందో ఊహించావా. అందరి వద్దనుకునే దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మహేంద్ర సార్ కి తెలిసిందని తెలిస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతారు అని నచ్చజెప్పుతాడు చక్రపాణి. తర్వాత మిస్డ్ కాల్ చూసిన మహేంద్ర రిటర్న్ కాల్ చేస్తాడు. దాన్ని లిఫ్ట్ చేసి తన పేరు చక్రపాణి అని చెబుతాడు. చక్రపాణి అని మహేంద్ర షాక్ కాగా అది విని జగతి కూడా ఆశ్చర్యపోతుంది. ఏం కావాలి అని చక్రపాణి అడిగితే.. అంటే ఈయన నాకు కాల్ చేయలేదా. వసుధార కాల్ చేసిందా అని మహేంద్ర అనుకుంటాడు.

Guppedantha Manasu:

నిజాలు తెలుస్తాయి: అప్పుడే వచ్చిన వసుధార పోన్ ఎవరు నాన్నా అని అంటుంది. అది మహేంద్ర వింటాడు. వెంటనే ఫోన్ నెంబర్ చూసిన వసుధార కాల్ కట్ చేస్తుంది. మహేంద్ర తిరిగి మళ్లీ కాల్ చేస్తూనే ఉంటాడు. లిఫ్ట్ చేసి ఏదోకొటి మాట్లాడమ్మా. లేకుంటా డౌట్ వస్తుంది అని చక్రపాణి అనడంతో వసుధార కాల్ లిఫ్ట్ చేస్తుంది. వసుధార నా ఫోన్ ఎందుకు తీయడం లేదు. నువ్వే ముందు నాకు కాల్ చేశావ్ ఎందుకు అని మహేంద్ర అడిగితే.. వసుధార సైలెంట్ గా ఉండిపోతుంది. తర్వాతి ఎపిసోడ్ లో వసుధార నెంబర్ ను పోలీస్ కు ఇస్తాడు మహేంద్ర. ఇన్ని రోజులకు వసుధార నాకు కాల్ చేసిందంటే రిషి కనిపించి ఉండాలి. వసుధారని కలిస్తే అన్ని నిజాలు తెలుస్తాయి అని మహేంద్ర అనడం విన్న జగతి షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X