Guppedantha Manasu: రిషి కోసం పోలీసు వేట.. వసు రిజైన్ లెటర్ ముక్కలు.. ఏంజెలే ముఖ్యం

మహేంద్ర నుంచి వరుసగా వసుధారకు కాల్స్ రావడంతో లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పమ్మా.. లేకపోతే డౌట్ వస్తుంది అని చక్రపాణి అంటాడు. దీంతో వసుధార లిఫ్ట్ చేయగానే.. ఎందుకు వసుధార కాల్ చేశావ్ అని మహేంద్ర అడుగుతాడు. రిషి సార్ గురించి ఏమైనా తెలిసిందై అని అడుగుతుంది వసుధార. మీరిద్దరు కలిసి నా కొడుకును మోసం చేసి వెళ్లిపోయేలా చేస్తాడు. ఇంకా ఇంటికి ఎందుకు వస్తాడు. ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుస్తుంది అని మహేంద్ర అంటాడు. సరే సార్ అని కాల్ కట్ చేస్తుంది వసుధార. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూన్ 13 మంగళవారం నాటి ఎపిసోడ్‌ 788 లో ఇంకా ఏం జరిగిందంటే?

త్వరలోనే కలుస్తారు:మహేంద్ర మాటలు విన్న జగతి.. ఏమైంది.. వసుధార కాల ఎందుకు చేసింది అని అడుగుతుంది. జగతి మీద కోపంతో ధరణిని పిలిచి వసుధార రిషికోసం కాల్ చేసింది అని మహేంద్ర చెబుతాడు. కానీ వసుధార ఏదో దాస్తుంది అని చెప్పిన మహేంద్ర వెళ్లిపోతాడు. తనకు కాల్ చేయకుండా మహేంద్రకు కాల్ చేసిందంటే నా మీద ఇంకా కోపం పోలేదని ధరణికి చెప్పి బాధపడుతుంది జగతి. బాధపడకండి చిన్నత్తయ్య త్వరలోనే రిషి, వసుధార కలుస్తారు అని ధరణి అంటుంది. మరోవైపు ఇంట్లో రిషి వసుధార కనిపించిన విషయం గుర్తు చేసుకుంటాడు. ఎవరినీ లైఫ్ లో చూడొద్దు అనుకున్నానో.. వాళ్లే ఎదురుపడ్డారు. నాకు జరిగిన మోసం, అన్యాయం నా మనసులో తిరుగుతుంటే ప్రశాంతంగా ఎలా ఉండాలి అని రిషి అనుకుంటాడు.

Guppedantha Manasu Serial June 13 2023 Today Full Episode 788

ఏమైనా సమస్య:తను నాకు మళ్లీ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి. కాలేజీకి వెళ్లకుండా ఉండాలి. దానికి విశ్వనాథ్ సార్ కి కారణం చెప్పాలి. అంటే గతం మొత్తం చెప్పాలి. దానికిబదులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిదని అనుకుంటాడు రిషి. తర్వాత కాలేజీకి వెళ్లలేదా అని విశ్వనాథం అడిగితే.. వెళ్లాలని అనిపించలేదు. నేను ఇక వెళ్లను సార్ అని రిషి అంటాడు. నువ్వు కాలేజీలో ఉంటే లెక్చరర్లకు దైర్యంగా ఉంటుంది. నువ్వు వస్తున్నావంటే ప్రిన్సిపాల్ చాలా సంతోషించారు. ఇప్పుడేంటి ఇలా అంటున్నావ్. ఏమైనా సమస్యా అని విశ్వనాథ్ అడుగుతాడు. అలాంటిదేం లేదు. ఇదొక్కటి మాత్రం అడగొద్దు. అది తప్పా ఇంకే చెప్పినా చేస్తాను అని రిషి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu Serial June 13 2023 Today Full Episode 788

మౌనంగా ఉంటుంది:మహేంద్ర దగ్గరికి పోలీస్ ఫ్రెండ్ వస్తాడు. వసుధార కాల్ చేసింది. ఏదో గట్టి కారణంతోనే కాల్ చేసి ఉండొచ్చు. వసుధారకు రిషి కనిపించాడేమో అని నాకు అనిపిస్తుంది అని మహేంద్ర అంటాడు. అలా ఎందుకు అంటున్నావ్. మనం రాత్రి పగలు వెతుకుతున్న రిషి మనకు కనిపించలేదు. అసలు మొహమే చూడొద్దనుకున్న వసుధారకు ఎలా కనిపిస్తాడు. నీకు బై మిస్టేక్ గా కాల్ చేసింటుంది అని పోలీస్ అంటాడు. లేదురా.. వసుధార చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నా మనసు చెబుతుంది రిషిని వసుధార చూసుంటుందని. నేను రిషి కోసం చాలా బాధపడుతున్న విషయం వసుధారను వెంటాడుతుంది. అందుకే నాకు కాల్ చేసి చెప్పాలనుకుంది. కానీ ఏదో దాస్తుంది. జగతిని అడిగితే మౌనంగా ఉంటుంది. వసుధారను కలిస్తే అయినా అన్ని నిజాలు తెలుస్తాయి అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial June 13 2023 Today Full Episode 788

జాబ్ మానేస్తున్నా:ఇదిగో వసుధార నెంబర్. దీని ఆధారంగా లొకేషన్, ఎవరి ఫ్రూప్స్ మీద ఉన్నాయో కనుక్కో అని మహేంద్ర చెబుతాడు. సరేరా కనుక్కుంటా అని చెప్పిన పోలీసు వెళ్లిపోతాడు. ఇదంతా మెట్లపై నుంచి విన్న జగతి కూడా పైకి వెళ్లిపోతుంది. ఎక్కడున్నావ్ నాన్నా. ఈ డాడ్ ను చూడాలనిపించట్లేదా. ఏం చేస్తున్నావ్ నాన్న అని మహేంద్ర బాధపడుతాడు. మరోవైపు రిషి అడ్రస్ కోసం విశ్వనాథం ఇంటికి వెళ్తుంది వసుధార. ఏంటమ్మా ఇలా వచ్చావ్ అని విశ్వనాథం అడిగితే.. రిషి సార్ ఎక్కడా ఉంటారు అని అంటుంది వసుధార. ఎక్కడో ఉండటమేంటీ అమ్మా.. ఇక్కడే మాతో పాటే రిషి ఉంటాడు. రిషి కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు అని విశ్వనాథం చెబుతుండగా రిషి ఎంట్రీ ఇస్తాడు. రిషిని పిలిచి ఈమె వసుధార. మన కాలేజీలో కొత్త లెక్చరర్ అని విశ్వనాథ్ చెబుతుంటే.. ఇక నుంచి కాదు సార్ అని వసుధార అంటుంది. నేను కాలేజీలో లెక్చరర్ గా జాబ్ మానెస్తున్నా అని వసుధార అంటుంది.

Guppedantha Manasu Serial June 13 2023 Today Full Episode 788

కాలేజీ మూసేస్తాను:కాలేజీలో ఏదైనా సమస్య ఉంటే రిషి సాల్వ్ చేస్తాడు. రిజైన్ మాత్రం చేయకమ్మా. ఇష్టపడే కదా చేరావ్ అని విశ్వనాథ్ అంటాడు. ఇష్టపడి చేరిన జాబ్ అయినా ఇప్పుడు కష్టంగా ఉంది. ఒక్క సందర్భం చాలు, ఒక్క ప్లేస్, మనిషి, ఉద్యోగం మీద అభిప్రాయం మారడానికి అని వసుధార అంటుంది. విశ్వనాథ్ ఎంత అడిగినా కారణం చెప్పదు. తెలియాల్సిన వాళ్లకు కారణం తెలిస్తే చాలు అని వెళ్లిపోతుంది వసుధార. దీంతో లెక్చరర్స్ ను కాపాడుకోలేకపోతున్నాను అని విశ్వనాథం టెన్షన్ పడుతుంటాడు. కాలేజీ ఇక రన్ చేయలేను. ఛైర్మన్ గా ఫేయిల్ అయ్యాను. కాలేజీని మూసేస్తేనే బెటర్ అంటాడు. అలా ఆలోచించకండి. ఒక్క సంఘటనతో కాలేజీ మూసేస్తానని నిర్ణయం తీసుకోకండి. ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial June 13 2023 Today Full Episode 788

ముక్కులు చేసిన రిషి:కారులో వెళ్తూ వసుధార గురించి ఆలోచిస్తంటాడు రిషి. నమ్మించి ప్రాణాలు పోయేలా చేసినా వసుధార గురించి కాకుండా నా ప్రాణాలు కాపాడిన ఏంజెల్, విశ్వనాథం కోసం, స్టూడెంట్స్ భవిష్యత్ కోసం చక్కదిద్దాలి. నా జీవితంలో నుంచే వసుధార వెళ్లిపోయింది. అలాంటిది పక్కన ఉంటే ఏంటీ. ఇక నా దృష్టి కాలేజీపైనే అని అనుకుంటాడు రిషి. ప్రిన్సిపాల్ కు రిజైన్ లెటర్ ఇస్తుంది వసుధార. షాక్ అయినా ప్రిన్సిపాల్ మీరు వచ్చిన తర్వాతే కాలేజీ మెరుగుపడింది. మీరు ధైర్యం చేయడం వల్లే రిషి సార్ వచ్చారు. మీ ఇద్దరి రాకతో కాలేజీ రూపురేఖలు మారిపోయాయి అని బతిమిలాడుతాడు ప్రిన్సిపాల్. అయినా వసుధార వినదు. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి ఆ రిజైన్ లెటర్ తీసుకుని ముక్కలుగా చించేస్తాడు. ఇప్పుడు ఉద్యోగం మానేయదు అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. దీంతో వసుధార, ప్రిన్సిపాల్ అర్థం కాక చూస్తుండిపోతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X