Guppedantha Manasu: ఎమోషనల్ సీన్.. ఎదురుపడిన తండ్రీకొడుకులు.. బయటపడిన రిషిధార లవ్ స్టోరీ
కాలేజీలో లెక్చరర్ గా చేరిన రిషిని అవమానించేందుకు పాండ్యన్ బ్యాచ్ పేడ నీళ్లు చల్లాలని ప్లాన్ చేస్తారు. కానీ అది కనిపెట్టిన రిషి ఆ పేడ నీళ్లను కేడీ బ్యాచ్ తోనే క్లీన్ చేయిస్తాడు. రిషి గురించి తండ్రి మురుగన్ కు పాండ్యన్ ఫోన్ చేసి చెబుతాడు. లెక్చరర్ చెప్పినట్లు విని బుద్ధిగా వినమని మురుగన్ అంటాడు.
దీంతో వేరే స్టూడెంట్స్ తో క్లీన్ చేయమని బెదిరిస్తాడు పాండ్యన్. అది చూసిన రిషి ఎవరు తప్పు చేశారో వాళ్లే క్లీన్ చేయాలి అని చెప్పి.. పాండ్యన్ బ్యాచ్ తోనే క్లీన్ చేపిస్తాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 15 గురువారం నాటి ఎపిసోడ్ 790 లో ఇంకా ఏం జరిగిందంటే?

మాతో లంచ్: ఇక నుంచి పద్ధతిగా మార్చుకుని బుద్ధిగా ఉండాలి. ఇంట్లో ఉన్నట్లే కాలేజీలో ఉంటానంటే కుదరదు. చదువుపై శ్రద్ధా ఉండాలి, క్రమశిక్షణతో మెలగాలి, లెక్చరర్స్ కు గౌరవం ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు రిషి. తర్వాత లెక్చరర్స్ అంతా ఇప్పుడు సంతోషంగా, ధైర్యంగా ఉందని రిషితో అంటారు. వాళ్లు చేసే పనులు, వంకర మాటలు తట్టుకోలేకపోయామని అంటారు.
ఇకపై ఆ కేడీ బ్యాచ్ మీ విషయంలో తలదూర్చరు. వాళ్లను మారుస్తానని హామీ ఇస్తాడు రిషి. ఆ నమ్మకం మాకుందని అన్న మిగతా కాలేజీ స్టాఫ్ తమతో భోజనం చేయాల్సిందిగా కోరుతారు. రిషి క్యాంటిన్ కు వెళ్తానని చెప్పినా మీతో లంచ్ చేయాలని ఉందని చెబుతారు. దీంతో రిషి వాళ్లతో భోజనం చేస్తుంటాడు.

ఏ కాలేజీలో: వసుధార ఎక్కడ అని ఒక మేడమ్ అంటుంది. ఇంతలోనే అక్కడికి వసుధార రావడంతో రిషి పక్కన ఖాలీగా ఉన్న కుర్చీలో కూర్చోమంటారు. వసుధార వెళ్లబోతుంటే.. మన సారే కదా కూర్చోండి అని అనడంతో వసుధార రిషి పక్కనే కూర్చుంటుంది. రిషి సార్ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. అందరం షేర్ చేస్తున్నాం. మీరు కూడా షేర్ చేయండి అని మేడమ్ అంటుంది.
వద్దు నాకు ఇది సరిపోతుంది అని రిషి అంటే.. అయితే కర్రీ వేసుకోండని మేడమ్ చెబుతుంది. దీంతో వసుధార తన కర్రీ రిషికి ఇస్తుంది. రిషి కోపంగా చూసినా కాస్తా ఇబ్బందికరంగానే వసుధార కర్రీ ఇస్తుంది. తర్వాత మేడమ్ మీరు గతంలో ఏ కాలేజీలో వర్క్ చేశారు. ఈ సిటీలోనే పని చేశారా, ఇంకెక్కడైన చేశారా అని అడగితే వసుధార సైలెంట్ గా ఉంటుంది.
రగిలిపోయిన కేడీ గ్యాంగ్: మేడమ్ మీరు ఏది అడిగినా వెంటనే సమాధానం చెబుతారు. కానీ రిషి సార్ ఉన్నప్పుడు మాట్లాడరెందుకు, ఏది అడిగినా ఆయనవైపు చూస్తారు. మీకు రిషి సార్ కి ఇంతకుముందే పరిచయం ఉందా అని అడుగుతుంది. దీంతో వసు, రిషి షాక్ అవుతారు. లేదు ఇక్కడే పరిచయం అని రిషి అబద్ధం చెబుతాడు. అందరు పెట్టింది తిన్న రిషి వసుధార ఇచ్చిన కర్రీ మాత్రం కింద పడేస్తాడు. అది చూసి వసుధార బాధపడుతుంది.
ఒక్క తప్పు వల్ల నా జీవితం తలకిందులైంది. లేకుంటే మీకు అన్నం తినిపించే అదృష్టం కలిగేది అని వసుధార మనసులో బాధపడుతుంది. మరోవైపు తమ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ కావడంతో కేడీ బ్యాచ్ రగిలిపోతుంది. ఈసారి పెద్ద ప్లాన్ వేసి రిషిని అందరి ముందు నవ్వుల పాలు చేయాలని అనుకుంటారు.

తండ్రిని దూరం చేశావ్: మరోవైపు తన దగ్గర కూర్చున్నందుకు వసుధారపై ఫైర్ అవుతాడు రిషి. ఎంత చెప్పినా ఇలా ఎందుకు చేస్తావ్ అని రిషి అంటే.. సార్ నేను కావాలని చేయలేదు. కూర్చోకుంటే వాళ్లకు డౌట్ వస్తుందని కూర్చున్నాను అని వసుధార అంటుంది. నువ్వు ఇలా అబద్ధాలు చెబుతూనే బతికేస్తావ్ అని రిషి అంటాడు. నిజం చెబుతున్నా సార్. నన్ను నమ్మండి అని వసు అంటే.. నిన్ను నమ్మినందుకే నాపై నిందపడింది. దోషిగా మారాను. నాపై చెరగని మచ్చ పడింది.
చివరకు మనుషులపై నమ్మకం పోయేలా చేశారు. ఇన్నింటికి కారణమైన మిమ్మల్ని ఎలా నమ్మాలి అని రిషి అంటాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకున్న వసుధార మీరు దూరమైన తర్వాత నా జీవితం తలకిందులైంది. మా అమ్మ అని తల్లి చనిపోయిన విషయం చెప్పబోతుంటే రిషి అడ్డుకుంటాడు. నువ్వు నీ తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నావ్. నన్ను మాత్రం నా తండ్రికి దూరం చేశావని అంటాడు.

తండ్రిని చూసిన రిషి: తప్పు మీరు చేస్తే శిక్ష మాత్రం నాకు, డాడ్ కు పడింది. తప్పులు చేయడం. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం. అది బయటపడితే క్షమాపణ కోరడం. ఇదే కదా నీ వ్యక్తిత్వం. ఇలాగే కదా నువ్వు బతికేది. అసలు ప్రేమంటే, నమ్మకం అంటే ఏంటో తెలుసాత. తెలిస్తే ఇలా నన్ను ఇబ్బంది పెట్టవు. పక్కవాళ్లకు డౌట్ వస్తుందని నాతో మాట్లాడటానికి ట్రై చేయొద్దు. నా దగ్గరకు రావాలని ప్రయత్నించకు. నా మనసును చంపేశావ్.
నన్ను చంపేయకు అని చెప్పి రిషి వెళ్లిపోతాడు. ఇదంతా చాటు నుంచి పాండ్యన్ వింటాడు. ఇక పోలీస్ ఫ్రెండ్ ద్వారా వసుధార అడ్రెస్ తెలుసుకున్న మహేంద్ర విష్ కాలేజీకి వస్తాడు. ఓవైపు మహేంద్ర.. మరోవైపు రిషి వస్తారు. ఇంతలో మహేంద్రను రిషి చూస్తాడు. డాడ్ అని ప్రేమగా పిలుస్తాడు రిషి. అది విన్న మహేంద్ర చాలా ఎమోషనల్ అయిపోతాడు.
వసుధార గురించి: మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తాడు మహేంద్ర. కానీ అప్పటికి తేరుకున్న రిషి పక్క రూమ్ లో దాక్కుంటాడు. దీంతో అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి.. మహేంద్ర అల్లాడిపోతాడు. అక్కడ ఎవరు లేరు.. రిషి పిలిచినట్లు వినిపించిందని అటు ఇటూ చూస్తాడు. ఈ సన్నివేశం ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. తర్వాత కాలేజీ స్టాఫ్ దగ్గరికి వెళ్లి.. ఇక్కడ వసుధార లెక్చరర్ గా పనిచేస్తుంది కదా. ఎక్కడ ఉంది అని అడుగుతాడు. వసుధార గురించి మహేంద్ర అడగ్గానే రిషి షాక్ అవుతాడు. ఇక వసుధార మీకు ఏమవుతుంది అని మహేంద్రను లెక్చరర్స్ అడగ్గానే తడబడిపోతాడు.


Click it and Unblock the Notifications











