Guppedantha Manasu: వసుపై మహేంద్ర సీరియస్.. సరికొత్తగా కనిపించేందుకు రిషి ప్లాన్
వసుధార కోసం విష్ కాలేజీలోకి వచ్చిన మహేంద్ర అక్కడున్న లెక్చరర్స్ ను అడుగుతాడు. వారు అటువైపు ఉన్నారు అని చెబుతారు. మహేంద్ర వెళ్లబోతుంటే.. ఇంతకీ మీరు వసుధారకు ఏం అవుతారని అడుగుతారు. దీంతో మహేంద్ర ఇబ్బంది పడటం చూసి పర్లేదు వెళ్లండి అని ఓ లెక్చరర్ చెబుతాడు. అదంతా చూసిన రిషి.. తండ్రి వసుధార కోసం వచ్చాడని తెలిసి షాక్ అవుతాడు. నేను ఇక్కడున్న విషయం వసుధార చెప్పేసిందా, అందుకే డాడ్ వచ్చాడా అని టెన్షన్ పడుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 16 శుక్రవారం నాటి ఎపిసోడ్ 791 లో ఇంకా ఏం జరిగిందంటే?
అంతా చేసి:రిషి, వసుధార మాటలు విన్న పాండ్యన్ తన బ్యాచ్ వద్దకు వచ్చి జరిగింది చెబుతాడు. వసుధార మేడమ్ కి రిషి సార్ దండం పెట్టాడురా. ఎందుకు పెట్టాడో తెలియదు. కానీ వాళ్లు ఎప్పటి నుంచే పరిచయం ఉన్నవాళ్లలా మాట్లాడుకున్నారు. వారి మాటలు నాకు సరిగ్గా వినిపించలేదు కానీ, వాళ్లిద్దరి మధ్యో ఏదో నడుస్తుంది. ఇక నుంచి మనం వాళ్లపైనే ఫోకస్ పెట్టాలి. ఆ మిస్టరీ ఏంటో తెలిస్తే రివేంజ్ తీసుకునే అవకాశం వస్తుందని అనుకుంటారు. ఇక మహేంద్ర రావడాన్ని చూసిన రిషి.. వెళ్లి వసుధారను గార్డెన్ కు ఈడ్చుకెళ్తాడు. ఏమైంది సార్ అని వసుధార అడిగితే.. చేసింది అంతా చేసి ఏమైందని అడుగుతున్నావా అని కోప్పడతాడు రిషి. ఇక్కడికి డాడ్ వచ్చారు. నేను ఇక్కడున్న విషయం మా డాడ్ కి ఎలా తెలిసింది అని ఫైర్ అవుతాడు.

శిక్ష అనుభవిస్తున్నా:నేను చెప్పలేదు సార్ అని వసుధార అంటే రిషి నమ్మడు. అబద్ధాలు ఆడటం, మోసం చేయడం నీకేం కొత్త కాదు కదా. ఫేక్ ప్రామిస్ లు చేయడం, ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం నీకు అలవాటే కదా. నువ్వు చెప్పకపోతే నేను ఈ ఊర్లో, ఈ కాలేజీలో ఉన్న విషయం ఎలా తెలుస్తుంది. నా అడ్రస్ ఎవరికీ చెప్పొద్దని ఇదివరకే నీతో అన్నాను. ఒకవేళ నా గురించి నువ్వే నాన్నకు చెప్పావని తెలిసినా, నీ వల్ల ఆయన ఇక్కడకు వచ్చారని తెలిసినా జీవితంలో నీ మొహం ఇంకోసారి చూడను అని వార్నింగ్ ఇస్తాడు రిషి. ఆల్రెడీ ఒకసారి తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నా. మళ్లీ తప్పు చేసే ధైర్యం చేయనంటూ ఎమోషనల్ అవుతుంది వసుధార.

కన్నీళ్లతో మహేంద్ర:నేను ఇక్కడున్నట్లు ఎవరికీ ముఖ్యంగా నా ఫ్యామిలీకి చెప్పొద్దు అని రిషి అంటాడు. సరే అని వసుధార అంటుంది. ఇంతలో అటునుంచు వసుధార వైపు మహేంద్ర వస్తాడు. అది చూసిన వసుధార సార్ మహేంద్ర సార్ వస్తున్నారని చెప్పండంతో రిషి పక్కకు పరుగెత్తుకు వెళ్లి దాక్కుంటాడు. మహేంద్ర రాగానే బాగున్నారా సర్ అని అడుగుతుంది వసుధార. బాధలో ఉన్నామని తెలిసి బాగున్నారా అని అడగడం మూర్ఖత్వం వసుధార అని మహేంద్ర అంటాడు. నా కొడుకు రిషి గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాను. ఎక్కడున్నాడు అని మహేంద్ర అడిగితే తనకు తెలియదని వసుధార అంటుంది. నీ కళ్లు, నీ మాటల్లో బెరుకు చూస్తేనే తెలుస్తోంది నువ్ అబద్దం చెబుతున్నావని అన్న మహేంద్ర.. రిషి ఎక్కడున్నాడని కన్నీళ్లతో అడుగుతాడు. నాకు తెలియనప్పుడు ఎలా చెబుతాను సార్ అని వసుధార అంటుంది.
రిషి చేసిన పాపమా:అలా అయితే నాకు ఎందుకు ఫోన్ చేశావ్. నేను తిరిగి ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదని మహేంద్ర కోపంగా అడుగుతాడు. చూసుకోకుండా వచ్చింది, రిషి సార్ గురించి తెలిసిందేమో అని వసుధార అనడంతో అబద్ధం అని మహేంద్ర గట్టిగా అరుస్తాడు. ఇలా అబద్ధాలు ఆడే.. నువ్వు, జగతి కలిసి రిషిని దోషిని చేశారు. అబద్ధాలు ఆడి మోసగాడిగా చిత్రీకరించారు. కష్టపడి నిర్మించుకున్న డీబీఎస్టీ సామ్రజ్యాన్ని దూరం చేశారు. చివరకు ఈ కన్నతండ్రికి దూరం చేశారని మహేంద్ర చాలా ఎమోషనల అవుతాడు. అదంతా విన్న రిషి కూడా ఎమోషనల్ అవుతాడు. సమాజం అంగీకరించకపోయినా నిన్ను భార్యగా స్వీకరించడమే రిషి చేసిన పాపమా అని మహేంద్ర అంటాడు.

ఎమోషనల్ గా సీన్:అలా అనకండి సార్ వసుధార అంటే.. మరి చెప్పు రిషికి నమ్మకద్రోహం ఎందుకు చేశారు. ఎవరి స్వార్థం కోసం చేశారు అని మహేంద్ర అంటే.. వసుధార అది.. అది అని తటపటాయిస్తుంది. దీంతో అక్కడ జగతి చెప్పకుండా, ఇక్కడ నవ్వు చెప్పకుండా ఉంటే ఎలా అని మహేంద్ర అంటాడు. దీంతో అంటే మేడమ్ ఇంతవరకు చెప్పలేదా అని వసుధార అనుకుంటుంది. నా కొడుకు గురించి తెలిస్తే కనీసం కబురు పెట్టు.. రిషిని మోసం చేసినట్లు నన్ను కూడా మోసం చేయకు అని ప్రాధేయపడిన మహేంద్ర వసుధారకు దండం పెట్టి వెళ్లిపోతాడు. ఈ సీన్ అంతా చాలా ఎమోషనల్ గా సాగుతుంది. అయితే ఇదంతా పైనుంచి పాండ్యన్ వింటాడు.

సరికొత్తగా మారాలి:మరోవైపు ఇంటికొచ్చిన మహేంద్రను రిషి గురించి ఏమైనా తెలిసిందా అని వరుసగా ప్రశ్నలు వేస్తుంది జగతి. అమ్మా ధరణి.. నా కన్నీళ్లు గమనించి కూడా ఇన్ని ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా. కొడుకుని చూస్తానని ఎన్నో ఆశలతో, ఊహలతో బయలుదేరిన నాకు అన్నీ గాల్లో కలిసిపోయాయి. దీనంతటికి కారణం జగతే. నా కొడుకును దూరం చేసిన పాపం మూటగట్టుకుంది అని మహేంద్ర అంటాడు. మరోవైపు వసుధారలో నాపై ప్రేమ, ఆరాధన ఇంకా మారలేదు. ఇప్పటికీ రిషి సార్ లా చూసే నీ చూపు మారాలి. అలా జరగాలంటే నేను సరికొత్తగా మారాలి అని రిషి అనుకుంటాడు. వసుధార మనసులో ఉన్న నా స్థానాన్ని చెరిపేయాలి. నేను ప్రశాంతంగా ఉండాలంటే గతం నన్ను వెంటాడకూడదు. వసుధారతో పాటు ఆమె చూపు డిస్ట్రబ్ చేయకూడదు, వసుధార కళ్లలో ప్రేమ కనిపించకూడదు. పాత రిషీంద్ర భూషణ్ అధ్యాయం ముగిసిపోయాలా నేను కొత్తగా మారతాను అని రిషి అనుకుంటాడు.


Click it and Unblock the Notifications











