Guppedantha Manasu: షాకింగ్.. లుక్ మార్చేసిన రిషి.. గుండుతో అవతారం.. మహేంద్ర సీరియస్

రిషి గురించి ఆలోచిస్తూ వెళ్లిపోయిన రోజులను లెక్కేస్తూ బాధపడుతుంటుంది జగతి. నీ రాకకోసం ఈ తల్లి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది నాన్నా. ఎక్కడ ఉన్నావ్. ఎప్పుడు వస్తావ్ అని అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అది గమనించిన ధరణి అక్కడికి వస్తుంది. చిన్నత్తయ్య మీరు ఇలా తేదీలు మారుస్తూ రిషి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు దీనివల్ల మీ బాధ పెరుగుతుంది. కానీ తరగదు అని ధరణి అంటుంది. రిషి కోసం వెతకని చోటు లేదు. ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఏం తెలియడం లేదు అని జగతి అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూన్ 17 శనివారం నాటి ఎపిసోడ్‌ 792 లో ఇంకా ఏం జరిగిందంటే?

నలుగురకి తెలిసేలా:చిన్నత్తయ్య ఒక పని చేస్తే రిషి వస్తాడు అని ధరణి అంటుంది. ఏంటీ ధరణి అది. రిషి వస్తాడు అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఆఖరికి నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నాను అని జగతి అంటుంది. పేపర్ లో ప్రకటన వేయిద్దాం, పోలీస్ కంప్లయింట్ ఇద్దాం అని ధరణి అంటుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావ్ ధరణి. అలా పేపర్ లో ప్రకటన ఇస్తే రిషి రాడు. రిషి చాలా తెలివైన వాడు. మనం ఎంతబాధపడుతున్నామో అర్థం చేసుకోగలడు. అయినా రావట్లేదు అంటే పేపర్ లో ప్రకటన ఇచ్చిన రాడు. పైగా తాను పారిపోయినట్లు నలుగురికి తెలిసేలా చేశామని కోపం తెచ్చుకుంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రిషిని కనిపెట్టవచ్చు. కానీ రిషి మనసు మరింత బాధపడుతుంది అని జగతి అంటుంది.

Guppedantha Manasu Serial June 17 2023 Today Full Episode 792

తెలిసే తప్పు చేశాను:అలా అయితే రిషి ఎప్పుడు వస్తాడు.. ఎవరి కోసం వస్తాడు అని ధరణి అంటుంది. తన కల కోసం వస్తాడు. మహేంద్ర కోసం, నాకోసం తిరిగి వస్తాడు అని జగతి అంటుంది. వచ్చేవాడు అయితే ఎప్పుడో వచ్చేవాడు కదా. కొంచెం ఆలోచించండి. ఇంకెంత కాలం ఎదురుచూడాలి అని ధరణి అంటుంది. ఎదురుచూడక తప్పదు. నేను చేస్తోంది తప్పు అని తెలిసి చేశానని, రిషిని దోషిగా అందరి ముందు నిలబెట్టాను. నేను చేసింది రిషి మంచి కోసం చేశాను. కానీ అది చెడు అయింది. మహేంద్రను, వసును దూరం పెట్టాడు. ఎప్పటికైనా నా కొడుకు నాకోసం తిరిగి వస్తాడు అని జగతి అంటుంది. అదంతా విన్న మహేంద్ర ఇక చాలు ఆపు అని గట్టిగా అరుస్తూ సీరియస్ అవుతాడు మహేంద్ర.

ప్రేమించడమే పాపం:ఇంకోసారి ఆ మాట అనొద్దని చెప్పు ధరణి. ఇన్నేళ్లైన రిషి రాట్లేదని, ఆరోజు ఎందుకు అలా చేశావని అడిగితే తల్లిగా బిడ్డ కోసం చేశానని చెబుతుంది. చెప్పలేని నిజం అంటే అది తప్పు అన్నట్లే కదా అని మహేంద్ర కోప్పడతాడు. మనసు పొరల్లో దాగి ఉన్నవన్నీ తప్పులే అనుకుంటే ఎలా మహేంద్ర. నిప్పులాంటి నిజాలు కూడా ఉంటాయి. బయట వాళ్లకు కనిపించవు. కానీ నన్ను నిప్పులా దహించివేస్తాయి అని జగతి అంటుంది. ఇన్ని రోజుల నుంచి నిజం చెప్పడం లేదు. నా కొడుకు కోసం ఎదురుచూసిన నా ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. జగతి దగ్గరైందని ఆనందాన్ని తీసుకునే లోపే కొడుకుని దూరం చేసింది. ఎందుకు ధరణి మీ చిన్నత్తయ్య నా మీద ఇంత పగ సాధిస్తోంది. తనను ప్రేమించడమే నేను చేసినా పాపం. తనను పెళ్లి చేసుకోవడమేనా నేను చేసిన నేరం, ఎందుకు నాకు ఈ శిక్ష అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial June 17 2023 Today Full Episode 792

వసుకు అడ్డుగా:చిన్న మామయ్య మీరు ఇలా మాట్లాడొద్దు. మీరు చిన్నత్తయ్య బాధను అర్థం చేసుకోవాలి. తను చేసింది తప్పని చెబుతుంది కదా అని ధరణి అంటుంది. నా బాధను ఎవరు అర్థం చేసుకోవాలి, రిషి కోసం నా మనసు ఎంత విలవిలాడుతుందో చూడమని ధరణి చేయి తీసి గుండె మీద పెడతాడు మహేంద్ర. అడుక్కునేవాడిలా కన్న కొడుకు కోసం తిరుగుతున్నాను. ఎక్కడా నా రిషి జాడలేదు. ఆఖరికి వసుధార కూడా సమాధానం చెప్పలేదు అని వెళ్లిపోతాడు మహేంద్ర. అంటే వసుధార కూడా మహేంద్రకు ఏం చెప్పలేదా అని మనసులో అనుకుంటుంది జగతి. మరోవైపు కాలేజీలో నడుస్తున్న వసుధారకు ఒకరు అడ్డం వస్తారు. అతను సైడ్ ఇచ్చాక పక్కకు వెళ్లిన వసుధార అతన్ని చూసి షాక్ అవుతుంది.

Guppedantha Manasu Serial June 17 2023 Today Full Episode 792

రూపం మారితే:అది రిషి. గుండు, షేవింగ్ తో టోపీ పెట్టుకుని కొత్త అవతారంలో కనిపిస్తాడు రిషి. రిషిని చూసి షాక్ అయిన వసు చేతిలో ఉన్న బుక్ కిందపడేస్తుంది. సర్ మీరేంటి ఇలా. మీరు మా రిషి సారేనా అని అంటుంది. నాకు ఈ ఫీలింగే కావాలి. నేను ఎవరో అన్నట్లుగా అనిపించాలి. ఇంతకుముందు ఏ పరిచయం లేని వ్యక్తిగా మీ మనసు మార్చుకుంటే మంచిది. కొంతమంది మనుషులు నా నుంచి నన్ను దూరం చేశారు. మేడమ్ మీ బుక్ తీసుకోండి అని చెప్పేసి వెళ్లిపోతాడు రిషి. నా మనసులో మార్పు రావాలని మీరు ఇలా మారిపోయారని నాకు అర్థమైంది సర్. అయినా మీ రూపం మారినంత మాత్రానా, నా మనసు ఎలా మార్చుకుంటాను సార్. అది మీకు కూడా తెలుసు కదా. నాకు ఇది కొత్త పరీక్ష అనుకుని క్లాస్ కి వెళ్తుంది వసుధార.

Guppedantha Manasu Serial June 17 2023 Today Full Episode 792

నాకైన చెప్పమ్మా:డీబీఎస్టీ కాలేజీలో జగతితో మాట్లాడుతుంటాడు ఫణీంద్ర. మన కాలేజీకి ప్రపంచం నలుమూలల నుంచి పేరు వచ్చిందంటే రిషినే కారణం. రిషి వెళ్లడంతో కాలేజీ అంతా బోసి పోయింది. కళ తప్పింది. నువ్వు రిషిపై నింద వేయడానికి ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఇప్పటివరకు నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. కనీసం నాకు అయినా చెప్పమ్మా. దాని వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతాడు ఫణీంద్ర. దీనంతటికి కారణం మీ కొడుకు, మీ భార్య అని ఎలా చెప్పను బావగారు. అది విని తట్టుకునే శక్తి మీకు ఉందా అని మనసులో అనుకుంటుంది జగతి. రిషి వస్తే నిజాలు తెలుస్తాయి అని జగతి అంటుంటే మినిస్టర్ కాల్ చేస్తాడు. బిజీగా ఉన్నారా అని తెలుసుకుని వీలైతే ఆఫీస్ కు అర్జంట్ గా రమ్మని చెబుతాడు. దీంతో అక్కడి నుంచి మినిస్టర్ దగ్గరికి బయలు దేరుతుంది జగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X