Guppedantha Manasu: భర్తకు ధరణి కౌంటర్లు.. కేడీ బ్యాచ్‌కు షాక్ ఇచ్చిన రిషి.. వసుకు వార్నింగ్
జగతితో మహేంద్ర మాట్లాడకపోవడంపై ధరణి ఆలోచిస్తుంటుంది. ఎలాగైన మహేంద్రకు అసలు నిజం చెప్పాలను అనుకుని మహేంద్ర గదిలోకి వెళ్తుంది ధరణి. చిన్న మావయ్యా.. లోపలకి రావచ్చా అని అడుగుతుంది. దీంతో రా అమ్మా అని మహేంద్ర అంటాడు. లోపలికి వచ్చిన ధరణిని ఏంటీ ఇలా వచ్చావ్ అని మహేంద్ర అడగితాడు. చిన్నత్తయ్య కాలేజీకి వెళ్లారు. ఒకప్పుడు మీరిద్దరు కలిసి కాలేజీకి వెళ్లేవారు. మీ అన్యూనతను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు వేరు వేరుగా వెళ్తున్నారు. అది నాకు నచ్చడం లేదు అని ధరణి అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 19 సోమవారం నాటి ఎపిసోడ్ 793 లో ఇంకా ఏం జరిగిందంటే?
చనిపోతానేమో అని: ధరణి అన్న మాటలకు జగతితో మాట్లాడకుండ ఉన్నానంటే నా మనసు ఎంత గాయపడిందో అర్థం చేసుకో. అసలు రిషిని ఎందుకు పంపించాల్సి వచ్చిందో కారణం చెప్పడం లేదు. డాడ్ అని ఎవరు పిలిచినా నా రిషి అనిపిస్తుంది. ఈ బాధ భరించడం నా వల్ల కావడం లేదు. రోజు రోజుకీ మనసులో బాధ పెరిగిపోతుంది. ఇది ఎంతదూరం పోతుందో అర్థం కావట్లేదు. అసలు నా రిషిని చూడకుండానే చనిపోతానేమోనని భయమేస్తుంది అని మహేంద్ర అంటాడు. అయ్యే చిన్న మావయ్య అలా అనకండి అని చెప్పిన ధరణి.. మిమ్మల్ని ఒకటి అడగనా అని అంటుంది. అడుగమ్మా అని మహేంద్ర అంటే.. నేను మీకు కొన్ని విషయాలు మీకు చెబుతాను. దానికంటే ముందు నాకు కొన్ని విషయాలు మీరు చెప్పాలి అని ధరణి అంటుంది.

జాగ్రత్తగా ఉండాలి: అర్థం కాలేదమ్మా అని మహేంద్ర అంటాడు. రిషికి సంబంధించిన విషయాలు మీరు చెప్పండి. నాకు తెలిసిన విషయాలు మీకు చెబుతాను. నిజంగా మీకు వసుధార ఏం చెప్పలేదా అని ధరణి అడుగుతుంది. లేదమ్మా ఏం చెప్పలేదు అని మహేంద్ర అంటాడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. అది మావయ్య అని ధరణి చెప్పేలోపు.. తనకు షూ సౌండ్ వినొస్తుంది. దీంతో కావాలనే వాటర్ బాటిల్ కాళ్లపై వేసుకుంటుంది. దీంతో దెబ్బ తగిలి గట్టిగా అరుస్తుంది ధరణి. వెంటనే అక్కడికి శైలేంద్ర వస్తాడు. ఏంటీ ధరణి జాగ్రత్తగా ఉండాలి కదా అని శైలేంద్ర అంటే.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని అపాయాలు జరుగుతాయి అని ధరణి కౌంటర్ ఇస్తుంది.

గార్డెన్ లో కూర్చుని: శైలేంద్ర చూస్తావేంటీ ధరణికి సహాయం చేయి.. తీసుకెళ్లు అని మహేంద్ర అంటాడు. బయటకు తీసుకొచ్చిన శైలేంద్ర.. బాటిల్ నిజంగానే పడిందా.. కావాలని నువ్వే పడేసుకున్నావా అని అడుగుతాడు. ఎలా జరిగినా దెబ్బ అయితే తగిలింది కదా అని ధరణి అంటుంది. అంటే ట్రీట్ మెంట్ ఇవ్వాలిగా అని శైలేంద్ర అంటాడు. దీనికి ట్రీట్ మెంట్ అవసరం లేదులెండి. అయినా మీరు కరెక్ట్ గా దెబ్బ తగిలే టైమ్ కి అక్కడికి ఎలా వచ్చారు. చాలా ఆశ్చర్యంగా ఉంది అని ధరణి అనుమానంగా అంటుంది. దీంతో ధరణి అలా ఎందుకు మాట్లాడుతుందో అని డౌట్ పడతాడు శైలేంద్ర. మరోవైపు కాలేజీలో క్లాస్ కు వెళ్లకుండా బయట గార్డెన్ లో కూర్చుని మాట్లాడుకుంటుంది కేడీ బ్యాచ్.

ప్రకృతిలో చెబితే:ఇంతలో అటు నుంచి వస్తున్న రిషిని చూసి షాక్ అవుతారు. వీడికి ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని అనుకుంటారు. వాళ్ల పక్కనే ఉన్నా ఇతర స్టూడెంట్స్ ఏంటీ సార్ మీ లుక్ అని అడుగుతారు. పర్సనల్ విషయాలు కాలేజీ బయట టీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మాత్రం సబ్జెక్ట్ కు సంబంధించిన డౌట్స్ రావాలి. ఫొటోకు ఫ్రేమ్స్ ఎన్నైనా మార్చుకోవచ్చు. ఫొటో ముఖ్యం. అయినా క్లాస్ కు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని రిషి అడుగుతాడు. ఒక స్టూడెంట్స్ పాండ్యన్ వైపు చూస్తాడు. భయపడటం ఎందుకు చెప్పురా. ఇన్విరాన్ మెంట్ క్లాస్ కదా అందుకే ప్రకృతిలో ఉన్నాం. క్లాసులు కూడా ఇలా ప్రకృతిలో చెబితే బాగుంటుంది కదా అని కేడీ బ్యాచ్ అంటుంది.
మిషన్ ఎడ్యుకేషన్ పై: అంటే ఎలక్ట్రికల్ సబ్బెక్ట్ చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఆఫీస్, ట్రాన్స్ ఫార్మర్ల మధ్య చెప్పాలా అని రిషి అనడంతో షాక్ అవుతుంది కేడీ బ్యాచ్. సరే మీరు ప్రకృతి ప్రేమికులు కదా. ఎన్విరాన్ మెంట్ ను ఎంజాయ్ చేస్తారు కదా. దానికంటే ముందు ప్రకృతిని శుభ్రంగా ఉంచుకోవాలి కదా. ఇక్క ఎంత చెత్త ఉందో ముందు అది శుభ్రం చేయమని ఆర్డర్ వేస్తాడు రిషి. మేం క్లీన్ చేయం, డ్రెస్ పాడవుతుంది అని పాండ్యన్ అంటాడు. అయితే క్లీన్ చేయరా అని రిషి అనడంతో.. అరేయ్ వాడితో ఎందుకు వచ్చిన గొడవ చేద్దామని పాండ్యన్ తో రోహిత్ అంటాడు. దీంతో అంతా క్లీన్ చేస్తారు. మరోవైపు మినిస్టర్ దగ్గరికి వెళ్లిన జగతికి మిషన్ ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టమని చెబుతాడు. రిషిపై అభియోగం మోపడానికి గట్టి కారణం ఉంది. అందుకే సైలెంట్ గా ఉన్నానని మంత్రి అంటాడు.
గతం గుర్తు చేయొద్దు: మళ్లీ కాలేజీలో రిషి, వసుధార పక్క పక్కనే నడుస్తూ గతంలో ఒకరి కోసం ఒకరు ఎదురు చూసిన క్షణాలను గుర్తు చేసుకుంటారు. దీంతో రిషి ఒక చిటీ రాసి చెట్టుకు అంటించి వెళ్తాడు. దానిపై గతం నాకు గుర్తు లేదు. గుర్తు చేసే ప్రయత్నం నువ్వు చేయకు అని రాసి ఉంటుంది. గుర్తు చేయకని చెబుతూనే మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు. మీతో గడిపిన క్షణాలతోనే బతుకుతున్నా. ఏదో ఒకరోజు మీరు నన్ను క్షమిస్తారు అని వసు అనుకుంటుంది. కారులో వెళ్తున్న రిషి వసుధారతో గడిపిన క్షణాలు, చేసిన మోసం గుర్తు చేసుకుంటాడు. మీరు చేసిన తప్పు వల్ల జీవితాలు తలకిందులయ్యాయి. కానీ గతాన్ని గుర్తు చేసుకోవాలని అనుకోవడం లేదు అనుకున్న రిషి విశ్వనాథం ఇంటికి వెళ్తాడు. అక్కడ విశ్వనాథంతో రిషి చెస్ ఆడతాడు.


Click it and Unblock the Notifications











