Guppedantha Manasu: కాలేజీలో వసుధారకు అవమానం.. ఆడుకున్న లెక్చరర్.. జగతికి ధరణి సలహా
రిషి దూరం, కావడం, తల్లి చనిపోవడంతో వసుధార దిగాలుగా ఉంటుంది. మేడ మీద ఓ మూలన కూర్చుని రిషితో గడిచిన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. విపరీతంగా గాలి పెట్టడంతో అక్కడ గోడపై ఆరేసిన బట్టలు ఎగిరిపోతుంటాయి. కానీ అదేం పట్టించుకోదు వసుధార. ఇంతలో అక్కడికి తండ్రి చక్రపాణి వస్తాడు. వసు పరిస్థితి, బట్టలు కొట్టుకుపోవడం చూస్తాడు. బట్టలు తనే తీసి వసుధార ఏంటమ్మా ఈ పరధ్యానం అని అంటాడు. దీంతో అక్కడి నుంచి లేచి ఇంట్లోకి వెళ్లిపోతుంది వసుధార. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 2 శుక్రవారం నాటి ఎపిసోడ్ 779 లో ఇంకా ఏం జరిగిందంటే?
గమనించకుండా:వర్షం స్టార్ట్ అవుతుంది. రిషితో వర్షంలో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది వసుధార. బట్టలు కిందకు తీసుకొచ్చిన చక్రపాణి వసుధార దగ్గరికి వెళ్తాడు. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. రోజురోజుకీ ఇలా అయిపోతున్నావేంటీ. ప్రతి క్షణం పరధ్యానంలో ఉంటున్నావ్. నీ పక్కనే ఏం జరుగుతుందో కూడా గమనించకుండా ఉంటున్నావ్. నీ ముఖంలో చిరునవ్వు చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసమ్మా అని చక్రపాణి బాధగా అంటాడు. ఇంకెప్పుడు చూడలేరు నాన్న. నేను చేసిన తప్పే నా చిరునవ్వును చిదిమేసింది. నేను మంచి కోసం చేసిన అది తప్పు. దాని వల్ల రిషి సార్, మహేంద్ర సార్ లను బాధపెట్టాను. గత జ్ఞాపకాలు తప్పా నాకు ఇంకో ఆశ లేదు నాన్న అని వసు అంటుంది.

ఎప్పటికీ మర్చిపోరు:అలా అనకమ్మా రిషి సార్ కోపం ఏదో ఒకరోజు తగ్గుతుందమ్మా. మళ్లీ మీ అందరినీ కలుస్తాడు అని చక్రపాణి అంటాడు. అమ్మా అనే పిలుపు కోసం జగతి మేడమ్ ఎన్నో సంవత్సరాలు ఎదురచూశారు. అలాంటిది రిషి సార్ వెళ్తూ అమ్మా అనే పిలుపు వినలేదనే బెంగ ఉండకూడదని మేడమ్ ని అమ్మా అని పిలిచారు. అప్పుడే అర్థమైంది నాన్న. రిషి సార్ మమ్మల్ని దూరం పెట్టారని. సార్ కి నా మీద ఉన్నది కోపం కాదు. ద్వేషం, అసహ్యం, నమ్మిన వాళ్లే మోసం చేశారనే బాధ. రిషి సార్ అది ఎప్పటికీ మరిచిపోరు. తను లేని నా జీవితం ఇలాగే ఉంటుంది నాన్న అని వసుధార అంటుంది. ఇంతలో అక్కడికి ఓ అమ్మాయి వచ్చి లెటర్ ఇస్తుంది. నాన్న ఇది అపాయింట్ మెంట్ లెటర్ అని డౌట్ గా వసుధార అంటుంది.

కొంచెం జాగ్రత్త:అవునమ్మా.. ఆ కాలేజీలో పంతులు పోస్ట్ ఖాళీగా ఉందంటే నేనే అప్లై చేశానమ్మా. పంతులమ్మ అవ్వాలనేదే నీ కల. పిల్లల భవిష్యత్ తీర్చి దిద్దాలనుకున్నావ్. అది నెరవేరాలి తల్లి. నీ కోసం కాకపోయినా నా కోసం వెళ్లమ్మా. నిన్ను ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా మీ అమ్మలా నిన్ను ఒంటరిదాన్ని చేసి పోతానేమోనని భయం నాకు రోజు పెరిగిపోతుంది అని చక్రపాణి ఏడుస్తూ అంటాడు. దీంతో తండ్రి కోసం వసుధార ఒప్పుకుంటుంది. లెటర్ తెచ్చిన అమ్మాయి కంగ్రాట్స్ అక్కా.. అది ఏ కాలేజ్ అని అడుగుతుంది. విష్ సైన్స్ కాలేజీ అని వసుధార చెబితే.. ఏంటీ ఆ కాలేజా.. అక్కడ లెక్చరర్స్ ప్రాబ్లమ్ లేదు కానీ స్టూడెంట్స్ అల్లరి పిల్లలు. ప్రతి విషయంలో స్టూడెంట్స్ లెక్చరర్స్ ని ఆట పట్టిస్తుంటారు. నువ్ వెళ్తావ్ కదా నీకే తెలుస్తుంది. కొంచెం జాగ్రత్త అని ఆ అమ్మాయి అంటుంది.

స్వీకరించలేరు:రిషి ఇంటికి దూరం కావడానికి తానే కారణం కావండతో జగతి తల్లడిల్లిపోతుంది. ఇంతలో అక్కడికి ధరణి వచ్చి మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది చిన్నత్తయ్య అంటుంది. మీరేం బాధపడొద్దు ధరణి. దీనంతటికి కారణం నేను. తండ్రి కొడుకుని విడదీసిన పాపం నాదే. ప్రతి తండ్రి తన కొడుకును తన జీవితంలో ప్రాణంగా భావిస్తాడు. అలాంటి ఓ తండ్రికి కొడుకును దూరం చేశాను. అది చిన్న తప్పు కాదు అని ఏడుస్తుంది. ఈ విషయం దాచిపెట్టి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా చెప్పేయండి అని ధరణి అంటుంది. నిజం చెప్పాలని అనుకున్నా దాన్ని స్వీకరించే శక్తి ఉండాలి. జరిగింది బావగారు తట్టుకోగలరా అని జగతి అంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటని ధరణి అడుగుతుంది.

మీరేంటీ ఇక్కడ:రిషి రావడమే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం. ఎప్పటికైనా రిషి వస్తాడు. వీళ్ల ఆటలు కట్టిపడేస్తాడని జగతి నమ్మకంగా చెబుతుంది. మరోవైపు కాలేజీలో లెక్చరర్ గా కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుతుంది వసుధార. క్లాస్ రూమ్ కి వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని అటెండెన్స్ తీసుకుంటుంది. వాళ్లు కూడా బుద్ధిగా అటెండెన్స్ చెప్పడంతో.. స్టూడెంట్స్ క్రమశిక్షణగానే ఉన్నారు. ఆమె ఏంటీ అలా చెప్పింది అనుకుని క్లాస్ స్టార్ట్ చేస్తుంది వసుధార. ఇంతలో అక్కడికి మరో లెక్చరర్ వచ్చి తన పేరు కొదండ పాణి అని చెప్పి, మీరేంటీ ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నారు అని అడుగుతాడు. ఇది నా క్లాస్ మీరు బయటకు వెళ్లండి అని చెబుతాడు.

మీ క్లాసుకే పంపాను:కొత్తగా జాయిన్ అయినా రోజే ఇలా చేస్తారా.. టైమ్ టేబులు తెలియదా.. ఫాలో అవ్వరా.. టైమ్ టేబులే ఫాలో అవ్వడం రాదు వీళ్లు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారో. అయినా మిమ్మల్ని కాదు లెక్చరర్స్ లేరని ఎవరినీ పడితే వాళ్లను తీసుకురావడం కాలేజీ దురదృష్టం అంటూ వసుధారను నానా మాటలు అంటాడు ఆ లెక్చరర్. అది విన్న స్టూడెంట్స్ ఎగతాళిగా నవ్వుతుంటారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిన వసుధార ప్రిన్సిపాల్ ను కలిస్తుంది. వేరే వాళ్ల క్లాస్ కి నన్నెందుకు పంపించారని అడిగితే.. నేను మీ క్లాసుకే పంపించాను అని ప్రిన్సిపాల్ అంటాడు. ఇక్కడ స్టఫ్ లోనే సమస్య ఉందని అర్థమైంది అని వసుధార అంటుంది. అదేం అర్థం కాకా చూస్తాడు ప్రిన్సిపాల్.


Click it and Unblock the Notifications











