Guppedantha Manasu: వాటే సీన్: శైలేంద్ర చెంప పగులగొట్టిన జగతి.. ఫణీంద్ర ఉగ్రరూపం, వాళ్లకు వార్నింగ్
ఇంట్లో విశ్వనాథంతో చెస్ ఆడుతుంటాడు రిషి. ఈ ఆటలో రిషినే గెలుస్తాడు విశ్వం. నువ్వు ఓడిపోతావ్ అని ఏంజెల్ అంటుంది. అలా మాట్లాడటం తప్పు. నువ్వు తాతయ్యకు సపోర్ట్ చేయాలి అని రిషి అంటాడు. దీనికి ఏంటీ రిషి నువ్వు తాతయ్యకు సపోర్ట్ చేస్తున్నావ్. మీ తాతయ్యకు నువ్ అనుకూలంగా ఉండేవాడివా అని ఏంజెల్ అంటుంది. దీంతో ఫణీంద్రతో తాతయ్య కల నెరవేరుస్తానన్న రిషి మాటలు తల్చుకుంటాడు. సారి తాతయ్య మీ కలను నెరవేర్చలేకపోయాను. నాపై పడిన మచ్చ నా ఆశయాన్ని నాశనం చేసింది అని రిషి ఆలోచనలో పడిపోతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 20 మంగళవారం నాటి ఎపిసోడ్ 794 లో ఇంకా ఏం జరిగిందంటే?
మనసు గాయపడింది:ఏంటీ రిషి ఆలోచనలో పడిపోయావ్ అని ఏంజెల్ అనడంతో బయటకు వస్తాడు రిషి. చెస్ ఆటలో రిషి ఓడిపోయి విశ్వనాథం గెలుస్తాడు. ఏంటీ రిషి ఏంజెల్ నాకు సపోర్ట్ చేస్తే నేను గెలిచానని చెప్పేందుకు కావాలని ఓడిపోయావా అని అడుగుతాడు విశ్వనాథం. అలానే అనుకోండి. సరే నేను వెళ్లి పడుకుంటానని చెప్పి వెళ్లిపోతాడు రిషి. ఇన్నేళ్లు అవుతున్నా రిషిలో ఈ మూడ్ నెస్ పోవడం లేదని ఏంజెల్ అంటుంది. నా అనుభవం ప్రకారం చెబుతున్నాను రిషి మనసు చాలా గాయపడింది. అది మానేవరకు తను మాములు మనిషి కాలేడని విశ్వనాథం అంటాడు. అలా అయితే మనం ఎన్నిసార్లు అడిగినా తన గతం చెప్పడం లేదని ఏంజెల్ అంటుంది.

చాటుగా శైలేంద్ర:తనకు చెప్పడం ఇష్టం లేనప్పుడు అలా వదిలేయమే మంచిది. నువ్వు నిజంగా తనకు బెస్ట్ ఫ్రెండ్ అయితే తనను ఇబ్బంది పెట్టొద్దు అని విశ్వనాథం అంటాడు. నాకు రిషి లైఫ్ టైమ్ ఫ్రెండ్ అంతే తప్పా ఇంకేం లేదు. అందుకే తన మూడ్ మార్చేందుకు సినిమాలకు తీసుకెళ్తాను అని ఏంజెల్ అంటుంది. మరోవైపు మహేంద్ర పోలీసుకు కాల్ చేసి రిషి గురించి ఆరా తీస్తాడు. వసుధార గురించి తెలిసినట్లే రిషి గురించి కూడా త్వరలోనే తెలుస్తుందని పోలీస్ ధైర్యం చెబుతాడు. ఆ ఆశతో బతుకుతున్నాను అని మహేంద్ర అంటాడు. ఇంతలో అక్కడికి ధరణి వచ్చి పలకరిస్తుంది. రిషి మనకు ఎంతో దూరం లేడు. దగ్గర్లోనే ఉన్నాడని అనిపిస్తుంది. కానీ మనకు కనిపించకుండా తిరుగుతున్నాడని అనిపిస్తుందని మహేంద్ర అంటాడు. అప్పుడే వచ్చిన శైలేంద్ర వాళ్ల మాటలు చాటుగా వింటాడు.

భూమ్మీద ఉండాలిగా:రిషి మీకు దొరకడు. కనిపించడు అని ధరణి అంటే.. అదేంటమ్మా అలా అంటున్నావ్ అని మహేంద్ర అంటాడు. రిషి గురించి ఏదైనా తెలిస్తే ముందుకు వసుకు తెలుస్తుందని నా నమ్మకం. రిషి ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు. మీరు ధైర్యంగా ఉండండి అని ధరణి అంటుండగా.. శైలేంద్ర పిలుస్తాడు. రిషి క్షేమంగా ఉన్నాడని చెబుతున్నావ్. నువ్వు ఏమైనా చూశావా, లేదంటే వాడు నీకు ఫోన్ చేశాడా అని అడుగుతాడు శైలేంద్ర. ఒకవేళ ఫోన్ చేస్తే క్షేమంగా ఉన్నాడని చెబుతాను కదా. తను నింద వేశారని వెళ్లిపోయాడు. కోపం తగ్గితే మళ్లీ తిరిగి వస్తాడని ధరణి అంటుంది. రిషి ఇక తిరిగిరాడు అని శైలేంద్ర అంటాడు. నిజానిజాలు తెలుసుకుని రిషి కచ్చితంగా తిరిగవస్తాడు అని ధరణి అంటుంది. అసలు ఆ మనిషి భూమ్మీద ఉండాలి కదా అని శైలేంద్ర అంటే.. ఏం అంటున్నారండి అని ధరణి అంటుంది.

ఈయన మాట జారారు:వాడు అసలు బతికి లేడేమో అని శైలేంద్ర అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది జగతి. ఆ సౌండ్ కి ఇంట్లో అందరూ వచ్చేస్తారు. ఏం జరిగింది నాన్నా అని దేవయాని అంటే.. నువ్వు ఆగు ఏమైందమ్మా అని జగతిని అడుగుతాడు ఫణీంద్ర. జగతి మౌనంగా ఉండటంతో ధరణి నువ్ ఇక్కడే ఉన్నావ్ గా ఏమైందని ఫణీంద్ర అంటాడు. అది మావయ్యా.. ఈయన రిషి గురించి ఒక మాట జారారు. తను బతికి లేడేమో అన్నారు. చిన్నత్తయ్య కోపంతో కొట్టారు అని ధరణి చెబుతుంది. దీంతో కోపంతో రగిలిపోయిన ఫణీంద్ర ఏం కూశావ్ రా అని శైలేంద్ర పట్టుకుంటాడు. ఆగండి అన్నయ్యా మహేంద్ర అంటే.. దానికే కొట్టాలా అని దేవయాని అంటుంది.

కీడు మాట్లాడటం ఏంటీ:కొట్టడం కాదు. వీడన్నమాటకు ఏం చేసినా తప్పు లేదు. ఆ మాట వింటే నాకో ఇంత కోపం వచ్చింది. జగతి తన కన్న తల్లి. తనకు ఎంత కోపం రావాలి. అదే నేను అయితే ఏం చేసేవాన్నో నాకే తెలియదు. వీడు హద్దు దాటి ప్రవర్తిస్తున్నాడు. నేను మహేంద్ర ఎలా ఉన్నామో నువ్వు రిషి అలాగే ఉండాలి. నేను మహేంద్ర క్షేమం ఎలా కోరుకుంటానో నువ్వు కూడా రిషి క్షేమం అలాగే కోరుకోవాలి. ఇంకోసారి ఇలాంటి మాటలు నీ నోటి నుంచి వస్తే సహించేది లేదు అని ఫణీంద్ర ఉగ్రరూపం చూపించాడు. అయినా నువ్వు ఇలా మాట్లాడటం ఏంటీ. రిషి గురించి ధైర్యం చెప్పాల్సింది పోయి.. కీడు మాట్లడటం ఏంటీ అని మహేంద్ర అంటాడు. రిషి నీ తమ్ముడు నువ్ అలా మాట్లాడొచ్చా అని దేవయాని అంటుంది. వీలైతే రిషి గురించి వెతకాడనికి ట్రై చేయి లేదంటే మాట్లాడకు. దేవయాని నీ కొడుకుని సరైన దారిలో పెట్టకపోతే ప్రతిఫలం నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుంది అని ఫణీంద్ర చెప్పేసి వెళ్లిపోతాడు.

నిజం చెప్పేస్తా:శైలేంద్ర తెలియక ఒక మాట అంటే కొడతావా అని దేవయాని నిలదీస్తుది. అవును కొడతానని జగతి కోపంగా అంటుంది. నేను అంటే కూడా కొడతావా అని దేవయాని అంటే.. ఏదీ అని చూడండని అన్న జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు నిన్ను మేడమ్ ని ఎంతగానో నమ్మాను. కానీ మీరు నా మీద మచ్చ వేసి పెద్ద తప్పు చేశారని రిషి అనుకుంటే మమ్మల్ని క్షమించమని వసుధార అనుకుంటుంది. ఇక శైలేంద్రతో చూశావా జగతిని రెచ్చగొడితే ఎలా ఉంటుందో. జగతి ఆడపులి. తన కోపాన్ని మనం తట్టుకోలేం. ఎండీ సీటు కావాలంటే కాస్తా ఓపిక పట్టాలి అని దేవయాని అంటే.. శైలేంద్ర మాట వినడు. అందరికీ నిజం చెప్పేస్తాను అని శైలేంద్ర అంటే.. ఏం నిజం అని దేవయాని అంటుంది. రిషి ప్రాణాలతో లేడని శైలేంద్ర అనేసరికి.. దేవయాని షాక్ అవుతుంది.


Click it and Unblock the Notifications











