Guppedantha Manasu: శైలేంద్ర కొత్త స్కెచ్.. వసు తండ్రిని బాధపెట్టిన రిషి.. కంటి చూపు పోయిందంటూ!
జగతి కొట్టిందన్న కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర. మహేంద్రతో పని చేయించుకుందాం. వెళ్లి మహేంద్రను కూల్ చేయమని దేవయాని అంటే ఇలా కూల్ చేయడాలు, దువ్వడాలు నాకు తెలియదు. నేను నిజం చెప్పేస్తా అని శైలేంద్ర అంటాడు. ఏంటా నిజం అని దేవయాని అడుగుతుంది. రిషి ప్రాణాలతో లేడనే నిజం అని శైలేంద్ర చెప్పడంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి ఎవరు చేశారు అని దేవయాని అడిగితే.. అలా చేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది. నేనే రౌడీలతో చంపించేశాను అని శైలేంద్ర చెబుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 21 బుధవారం నాటి ఎపిసోడ్ 795 లో ఇంకా ఏం జరిగిందంటే?
పరిస్థితులు దాటేలా:ఏంటీ వాగుతున్నావ్. అలా ఎందుకు చేశావ్ అని శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది దేవయాని. నీ సెంటిమెంట్ లు కాస్తా ఆపు మమ్మీ. వాడు ఎప్పటికైనా తిరిగి వస్తే ఎండీ సీటు దక్కదని గాల్లో కలిపేశాను. రౌడీల చేతిలో రిషి చనిపోయాడని ఇప్పుడు నిజం చెప్పేస్తాను అని శైలేంద్ర అంటే.. వాళ్లు అది నమ్ముతారా అని దేవయాని అంటుంది. అది వాళ్ల ఇష్టం అని శైలేంద్ర అంటాడు. రిషి లేడంటేనే జగతి కొట్టింది. రిషి చనిపోయాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా. మన అంతు చూస్తుంది. ఇన్ని రోజులు నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేశావ్. ఇప్పుడు పరిస్థితులు మన చేతులు దాటేలా ఉన్నాయి. అందుకే నేను చెప్పినట్లు విను, ఎలాగైనా నిన్ను ఎండీ సీటులో నేను కూర్చోబెడతాను అని దేవయాని నచ్చచెబుతుంది.

తప్పు చేయలేదు:మరోవైపు ఉదయం ఈరోజు వసుతో కాలేజీకి వెళ్లి రిషిని కలవలాని చక్రపాణి అనుకుంటాడు. నీతోపాటే కాలేజీకి వస్తానమ్మా. అక్కడి నుంచి చిన్న పని చూసుకుని వస్తానని వసుతో చెబుతాడు చక్రపాణి. ఇద్దరు అటోలో కాలేజీకి వెళ్తారు. ముందు వసు అటో దిగి వెళ్తుంది. తర్వాత రిషి కారులో కనిపించేసరికి చక్రపాణి కూడా అటో దిగుతాడు. కంగారుగా రిషి దగ్గరికి వెళ్లి బాబు అని పిలుస్తాడు. అది దూరం నుంచి వసుధార చూస్తుంది. మీతో మాట్లడాలి బాబు అని చక్రపాణి అంటే.. రాయబారానికి మీరే వచ్చారా ఇంకెవరైనా పంపిచారా అని రిషి అడుగుతాడు. మీతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వరా బాబు. నేనైతే ఏ తప్పు చేయలేదు కదా అని చక్రపాణి అంటాడు.

నీకు తండ్రి కావడమే :తప్పు ఎవరు చేశారని కాదు. గతాన్ని ఎప్పుడో వదిలేశాను. ఇది ప్రస్తుతం. గతాన్ని గుర్తి చేసే ప్రయత్నం చేయొద్దు. మీ అమ్మాయి ఇప్పుడు మిమ్మల్ని పంపింది. ఆ తర్వాత రాయబారానికి వాళ్లమ్మని పంపిస్తుందేమో. అందుకే ముందే చెబుతున్నా అని రిషి అంటే.. తను రాదులేండి బాబు అని బాధగా అంటాడు చక్రపాణి. ఇక ఇక్కడ నన్ను చూసిన విషయం ఎవరికీ చెప్పొద్దు. నాకు ఈ ఒక్క సాయం చేయండి అనేసి రిషి కోపంగా వెళ్లిపోతే చక్రపాణి కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా అడుగులేస్తాడు. రిషిని పిలుస్తుంది వసుధార. ఆయనతో కొంచెం మాములుగా మాట్లాడితే ఏమైంది సార్. మీ దృష్టిలో తప్పు చేసింది నేను. ఆయనేం తప్పు చేశారు అని వసుధార అంటే.. నీకు తండ్రి కావడమే అని రిషి అంటాడు. దీంతో వసు ఎమోషనల్ అవుతుంది.

నా గుండెకు బరువు:అవును సార్, నాలాంటి దానికి తండ్రి కావడమే ఆయన చేసిన తప్పు. కూతురి కష్టాన్ని కడుపులో దాచుకోలేక మీ దగ్గరకు రావడమే ఆయన చేసిన తప్పు. మీరు ఇలా స్పందిస్తారని తెలియక ప్రాధేయపడాలని అనుకోవడమే ఆ పిచ్చితండ్రి చేసిన తప్పు. ఆశతో మీ దగ్గరకు వచ్చిన వ్యక్తికి కన్నీళ్లు కానుకగా ఇచ్చి పంపించారు. థ్యాంక్యూ సో మచ్. అసలు ఆయన కలుస్తారని కూడా తెలియదు. తెలుసుంటే వద్దని చెప్పేదాన్ని. మా అమ్మకు కూడా మిమ్మల్ని కలిసే అదృష్టం లేదులేండి. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని వసుధార అంటుంది. నీ తండ్రితో అలా అంటేనే ఇంత బాధపడుతున్నావే.. ఇన్నాళ్లుగా నేను గుండె మోసిన బరువెంత, కార్చిన కన్నీటి విలువ ఎంత ఆ భగవంతుడికే తెలియాలి అని వెళ్లిపోతాడు రిషి.

మూడ్ బాగోలేదు:రిషి అన్న మాటలు తలుచుకుంటూ బాధగా వెళ్తుంటాడు చక్రపాణి. రోడ్డుపై వెళ్తుంటే రాయి తట్టుకుని కిందపడిపోతాడు. అతని కళ్లజోడు కూడా కింద పడితే దానిపైనుంచి బైక్ వెళ్లి పగిలిపోతుంది. నా బిడ్డ భవిష్యత్తు లాగే నా కంటిచూపు కూడా పోయింది. నా బిడ్డ భవిష్యత్తే నా కంటిచూపు కదా. సుమిత్ర నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్ అని కుమిలిపోతాడు చక్రపాణి. మరోవైపు మెట్లమీద కూర్చుని రిషి ఉంటాడు. ఆ పక్కనే వసుధార ఉంటుంది. తండ్రిని రిషి అన్న మాటలు తల్చుకుని వసు బాధపడుతుంటే చక్రపాణిని అన్న మాటలను రిషి తలుచుకుంటాడు. ఇద్దర్ని ఒకరినొకరు చూసుకుని జరిగినదంతా మనసులో మాట్లాడుకుంటారు. అలా ఇద్దరు మాట్లాడుకోవడం అయిపోయాక రిషికి ఏంజెల్ కాల్ చేసి షాపింగ్ వెళ్దామంటుంది. కానీ మూడ్ బాగోలేదని చెప్పి రిషి రానంటాడు.

రీప్లేస్ చేస్తాను:మరోవైపు మిషన్ ప్రాజెక్ట్ గురించి ఫణీంద్రతో జగతి మాట్లాడుతుంటుంది. అక్కడికి వచ్చిన శైలేంద్ర.. తమ్ముడు రిషి గురించి అన్నదానికి క్షమాపణలు చెబుతాడు. నన్ను క్షమించు పిన్నీ. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అని శైలేంద్ర అంటాడు. ఇంతలో మహేంద్ర వస్తే.. బాబాయ్ సారీ, నన్ను క్షమించండి అని శైలేంద్ర డ్రామా ప్లే చేస్తాడు. నేను శైలేంద్రకు బుద్ధి చెప్పాను అని దేవయాని కూడా నాటకం ఆడుతుంది. ఎందుకు ఇన్ని డ్రామాలు అని ధరణి మనసులో అనుకుంటంది. తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలి, బోర్డ్ మీటింగ్ ఏర్పాట్ చేయు అని మహేంద్రకు ఫణీంద్ర చెబుతాడు. నేను కూడా ప్రాజెక్టులోకి వస్తాను. నా తెలివితో రిషి ప్లేస్ రీప్లేస్ చేస్తానని శైలేంద్ర.. అంటే అది అసాధ్యం అని జగతి గట్టిగా చెబుతుంది.


Click it and Unblock the Notifications











