Guppedantha Manasu: మనసును కదిలించేలా రిషి మాటలు.. వసుతో ప్రయాణం.. శైలేంద్రకు జగతి చెక్?
రిషి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కంగారుగా విశ్వనాథం వస్తాడు. ఏమైంది సార్ కంగారుగా ఉన్నారు. ఏంజెల్ కు ఏమైనా అయిందా అని అడుగుతాడు రిషి. కాదు. కేడీ బ్యాచ్ వల్ల సమస్య వచ్చింది. వాళ్లను రేవ్ పార్టీలో పోలీసులు అరెస్ట్ చేశారట. వాళ్లపై కేసు నమోదు చేస్తే.. వాళ్లు మన కాలేజీ పిల్లలను రేపు పేపర్లో వస్తే మన కాలేజీ పరువు పోతుంది అని టెన్షన్ అవుతుంటాడు విశ్వనాథం. మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 23 శుక్రవారం నాటి ఎపిసోడ్ 797 లో ఇంకా ఏం జరిగిందంటే?
ఎస్సైని చూసి: నేను ఇప్పటికే ఎస్సైతో మాట్లాడించాను. కానీ అతను వినడం లేదు అని విశ్వనాథం అంటాడు. పర్లేదు నేను చూసుకుంటాను అని రిషి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ కారు దిగ్గానే వసుధార కూడా కనిపిస్తుంది. ఏంటీ ఇక్కడికి కూడా వస్తావా నువ్వు అని ఫైర్ అవుతాడు రిషి. మీకోసం రాలేదు. పోలీసుల నుంచి కాల్ వస్తే వచ్చానని చెబుతుంది వసుధార. లోపలికి వెళ్లిన రిషి ఎస్సైని చూసి షాక్ అవుతాడు. గతంలో కాలేజీలో వసుధార బావను అరెస్ట్ చేయిస్తాడు రిషి. అప్పుడున్న ఎస్సై ఇక్కడ ఉంటాడు. రిషిని చూసిన ఎస్సై సార్ మీరా.. మీరు ఇక్కడ ఏంటీ అని అడిగితే.. లోపలకు వెళ్లి మాట్లాడుకుందాం అని రిషి అంటాడు. అదేంట్రా వీళ్లొచ్చారు.. వీళ్లు మనల్ని బుక్ చేస్తారు అని కంగారు పడుతుంది కేడీ బ్యాచ్.

భయపడిన బ్యాచ్: ఎలా ఉన్నార్ సార్. మీరిద్దరు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని ఎస్సై అడిగితే రిషి, వసు మౌనంగా ఉంటారు. అయినా ఇక్కడ ఇప్పుడు ఏంటీ సార్ అని ఎస్సై అనడంతో.. మీరు రేవ్ పార్టీలో స్టూడెంట్స్ ను తీసుకొచ్చారు కదా. అందులో మా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ల పై ఎలాంటి కేస్ బుక్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ల భవిష్యత్తు నాశనం అవుతుంది అని రిషి రిక్వెస్ట్ చేయడంతో ఎస్సై ఒప్పుకుంటాడు. బయటకు వెళ్లి కేడీ బ్యాచ్ పేర్లు చెప్పడంతో.. రిషి సార్ మనగురించి గట్టిగానే చెప్పినట్లు ఉన్నాడ్రా. అందుకే కానిస్టేబుల్ లాఠీ పట్టుకుని వస్తున్నాడు అని కేడీ బ్యాచ్ భయపడిపోతుంది. ఎస్సైకి థ్యాంక్స్ చెప్పి బయటకు వెళ్తారు రిషి, వసుధార.

షికారుకు కాదు: మీ వయసు ఎంత, చేస్తున్న పనులు ఏంటీ. రిషి సార్ స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలి. సార్ చెప్పారు కాబట్టి కేస్ బుక్ చేయకుండా వదిలేస్తున్నా అని రిషి గురించి గొప్పగా చెప్పి పంపించేస్తాడు ఎస్సై. బయటకు వచ్చిన కేడీ బ్యాచ్ ను తన కారును ఫాలో అవ్వమని చెబుతాడు. వసుధార క్యాబ్ కోసం బుక్ చేస్తుంటే తన కారులో ఎక్కమంటాడు రిషి. దీంతో సంతోషిస్తుంది వసుధార. ముందు సీట్ లో కాదు వెనుక సీట్లో కూర్చోమంటాడు రిషి. మనల్ని తీసుకెళ్లి పనిష్ మెంట్ ఇస్తాడా అని పాండ్యన్ అంటే.. అలా అనిపించడం లేదని రోహిత్ అంటాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ అని వసుధార అంటే.. సరదాకో, షికారుకో కాదు. మీతో నాకేం పని ఉంటుంది. నా పర్సనల్ పనిపై తీసుకెళ్లడం లేదు. కాలేజీ స్టూడెంట్స్ కోసం తీసుకెళ్తున్నా. మీరు కూడా ఉంటే బాగుంటుంది అని రిషి అంటాడు.

ఎప్పుడైనా వచ్చారా: నేను ఉంటే బాగుంటుందా సార్ అని వసుధార అడిగితే.. కాలేజీ కొలిగ్ గా స్టూడెంట్స్ తో పాటు ఉంటే బాగుంటుంది. ఇందులో మీకేదైనా శ్రమ ఉంటే ఇక్కడే దింపేస్తాను అని రిషి అంటాడు. మీరు చేసే పనిని నేను శ్రమ అనుకోను అని చెప్పిన వసుధార మనసులో.. ఈరోజు వెనుక సీట్లో ఉండొచ్చు. కానీ ఒకే కారులో ప్రయాణం చేస్తున్నాం. ఏదో ఒకరోజు ముందు సీట్లోకి వచ్చే రోజు వస్తుందని అనుకుంటుంది. అంతా కలిసి నైట్ కాలేజీకి వెళ్తారు. మనం పగలే చదవవం, నైట్ చదువుకునే వాళ్లు కూడా ఉన్నారా అని కేడీ బ్యాచ్ అనుకుంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అని కేడీ బ్యాచ్ ను రిషి అడుగుతాడు. ఈ సమయానికి సెకండ్ షో, పార్టీల్లో ఉంటాం అని పాండ్యన్ చెబుతాడు.

కష్టం తెలుసుకోండి: అది మీ లైఫ్ స్టైల్. ఇది వీళ్ల లైఫ్ స్టైల్. అందరికీ 24 గంటలే. కానీ వీళ్లంతా డే టైమ్ లో కుదరకా నైట్ చదువుకుంటున్నారు. మీలా వీళ్లు రిచ్ కాదు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు. మీ పార్టీల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తారు. స్టూడెంట్స్, లెక్చరర్స్ ను ఆటపట్టించేందుకు కూడా ఖర్చు చేస్తారు. కానీ వీళ్లు ప్రతిరోజు పరిస్థితులతో యుద్ధం చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. జీవితంలో ఒక్కో అడుగు కష్టంగా ముందుకు వేస్తున్నారు అంటూ ఒక్కొకరి జీవితం, వాళ్ల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, చదువు ప్రాముఖ్యత గురించి చెబుతాడు రిషి. మీరు గోల్డెన్ స్పూన్ తో పుట్టారు. కాబట్టి మీకు కష్టం తెలియదు. మీరు కష్టపడాలి అని చెప్పట్లేదు. అది తెలుసుకోండి చాలు అని రిషి అంటాడు.
మారతారు సార్: మీరు ఒకర్ని ఏడిపిస్తే ఎంజాయ్ మెంట్ అనుకుంటున్నారు. కానీ ఆకలిగా ఉన్న వారికి ఒక్క రూపాయి, ఓ ముద్ద అన్నం పెట్టి చూడండి అసలైన సంతోషం, ఎంజాయ్ మెంట్ ఏంటో తెలుస్తుంది. మీరు ఇప్పటికైనా మారాలి అనుకుంటున్నాను. లేదంటే నేను తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటాను అని రిషి వెళ్లిపోతాడు. మీరు జెంటిల్ మెన్ సార్. వాళ్లు కచ్చితంగా మారతారు. మీ మాటలు వాళ్లలో బలంగా నాటుకుపోయాయి అని వసుధార అనుకుంటుంది. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీ గురించి డీబీఎస్టీ కాలేజీలో మీటింగ్ నడుస్తుంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ కు ప్రభుత్వం సరిగ్గా నిధులు ఇవ్వడం లేదు. ఆ ప్రాజెక్ట్ ను మనం చేయమని చెబుదాం అని శైలేంద్ర అంటాడు.
అదే మంచిది కదా:విద్యను డబ్బుకు ముడిపెట్టకు శైలేంద్ర. అయినా ఇక్కడ డబ్బుకోసం ఎవరూ మిషన్ ఎడ్యుకేషన్ చేపట్టలేదు. పేద విద్యార్థుల కోసం చేశాం. అందుకే డీబీఎస్టీ కాలేజీకి మంచి పేరొచ్చింది. దాన్ని నడిపించినందుకు రిషికి పేరు వచ్చింది అని జగతి అంటుంది. అవును అని రిషిని పొగుడుతాడు ఫణీంద్ర. నేను కాదనట్లేదు డాడ్.. కానీ మిషన్ ఎడ్యుకేషన్ ను ముందుకు తీసుకెళ్లాలంటే మన దగ్గర స్టాప్ లేరు కదా. కొత్త వాళ్లను అపాయింట్ చేసి నేర్పించినా వాళ్లు హ్యాండిల్ చేస్తారో లేదో తెలియదు. అలాంటప్పుడు నడిపించలేక చెడ్డపేరు తెచ్చుకునే కన్నా.. క్విట్ చేయడం మంచిది కదా అని శైలేంద్ర అంటాడు.


Click it and Unblock the Notifications











