Guppedantha Manasu: శైలేంద్రకు గట్టి దెబ్బ.. మినిస్టర్ వార్నింగ్.. రిషి లవ్ స్టోరీపై ఏంజెల్ ఆరా

మిషన్ ఎడ్యుకేషన్, డీబీఎస్టీ మెడికల్ కాలేజీ గురించి డీబీఎస్టీలో బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రన్ చేసేందుకు స్టాఫ్ లేరు. కొత్తవాళ్లను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి నడిపించినా వర్కౌట్ అవుతుందని నమ్మకం లేదు. అలాంటప్పుడు ప్రాజెక్ట్ చేసి ఫెయిల్యూర్ అనిపించుకోవడం కన్నా క్విట్ చేయడమే మంచిది కదా.

అలా అయితేనే రిషి పరువు పోకుండా ఉంటుంది అని శైలేంద్ర అంటాడు. కాలేజే స్టాఫ్ కు శైలేంద్ర సైగ చేయడంతో.. అవును మేడమ్, సర్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది అని అంటారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూన్ 24 శనివారం నాటి ఎపిసోడ్‌ 798 లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial June 24 2023 Today Full Episode 798

మీటింగ్ ఓవర్: మరో మేడమ్ కూడా శైలేంద్ర సార్ చెప్పింది నిజమే అని అంటుంది. దీంతో జగతి ఫైర్ అవుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించాలి కానీ, ఎలా వదిలేయాలి, ఇతరులకు ఎలా ఇవ్వాలి అని ఉచిత సలహాలు ఇవ్వకండి. మిషన్ ఎడ్యుకేషన్ నా బ్రెయిన్ చైల్డ్. దానిపై ఎలాంటి నిర్ణయమైన తీసుకునే హక్కు నాకు, రిషికి, వసుకి మాత్రమే ఉంది.

వాళ్లు లేరు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ను నేను ముందుకు తీసుకు వెళ్తాను. ఇష్టం లేని వాళ్లు సంతోషంగా పక్కకు తప్పుకోవచ్చు. నాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. మీటింగ్ ఈజ్ ఓవర్ అని కోపంగా వెళ్లిపోతుంది జగతి. తన నిర్ణయం సరైనది, తను స్టూడెంట్స్ మంచి కోసం ఆలోచిస్తుంది అని ఫణీంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial June 24 2023 Today Full Episode 798

ఎంత కోప్పడ్డారో: శైలేంద్ర.. వీళైతే మనం జగతికి సపోర్ట్ ఇద్దాం. మహేంద్ర నీ సపోర్ట్ ఉంటుందా అని ఫణీంద్ర అడిగితే.. హా ఉంటుంది అన్నయ్యా.. నువ్వు ఎవరికీ సపోర్ట్ చేస్తే వాళ్లకే నా సపోర్ట్ అని మహేంద్ర అంటాడు. వెరీ గుడ్. మరి మీరేమంటారు అని ఫణీంద్ర కాలేజీ స్టాఫ్ ను కూడా అడిగితే.. వాళ్లు కూడా సపోర్ట్ చేస్తామంటారు. ఇందాకా అలా మాట్లాడినందుకు క్షమించండి అని కూడా స్టాఫ్ అనడంతో శైలేంద్ర షాక్ అవుతాడు.

మీటింగ్ తర్వాత తను సెట్ చేసిన కాలేజీ స్టాఫ్ పై కోప్పడతాడు శైలేంద్ర. అలా ఎలా ప్లేట్ ఫిరాయిస్తారు. సపోర్ట్ చేయొద్దని చెప్పాను కదా అని శైలేంద్ర అంటాడు. అలా మేము చేయలేం సార్. చూశారు కదా జగతి మేడమ్ ఎంత ఆవేశంగా వెళ్లారో. ఫణీంద్ర, మహేంద్ర సార్ వాళ్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని కాలేజీ స్టాఫ్ అంటారు.

Guppedantha Manasu Serial June 24 2023 Today Full Episode 798

రిషి ఆశయం: వాళ్లు చేస్తే ఏంటీ అని శైలేంద్ర అంటాడు. ఫణీంద్ర, మహేంద్ర సార్ ఎండీలు. మేము సపోర్ట్ చేయకపోతే మా లైఫ్ ను రిస్క్ చేసినవాళ్లం అవుతాం. గతంలో కూడా ఇద్దరు ఇలాగే మీ ఫ్యామిలీ విషయాల్లో దూరి ఉద్యోగం పోగొట్టుకున్నారు. మీరు బాగానే ఉంటారు. కానీ మేం అలా చేయలేం అని చెప్పేసి వెళ్లిపోతారు. దీంతో శైలేంద్ర ఈ ప్లాన్ కూడా మిస్ అయిందని కోప్పడతాడు.

కట్ చేస్తే మినిస్టర్ తో జగతి మాట్లాడుతుంటుంది. చదువుకునే పిల్లలకు అండగా ఉండాలన్నది రిషి ఆశయం. నేను తన ఆశయాన్ని నిలబెడతాను సార్ అని జగతి అంటుంది. రిషికి అయిన గాయం చిన్నది కాదు. తాను కోలుకోని రావాలంటే.. మీరు నిజం చెప్పాలి. తనపై ఉన్న అభియోగాన్ని తొలగించాలి. అందుకు మీరు నిజం చెప్పాలి అని మినిస్టర్ అంటాడు.

Guppedantha Manasu Serial June 24 2023 Today Full Episode 798

నేను రిఫర్ చేస్తాను: ఇప్పుడే చెప్పలేను సార్. రిషి వస్తేనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుంది అని జగతి అంటుంది. అలా రాడు మేడమ్. మీరు నిజం చెబితేనే వస్తాడు. ఎవరి నుంచి ఇబ్బంది ఉందో చెప్పండి. నేను చూసుకుంటాను అని మినిస్టర్ అంటుండగా శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. పర్మిషన్ లేకుండా వచ్చినందుకు సారీ చెప్పిన శైలేంద్ర.. మా పిన్ని మిషన్ ఎడ్యుకేషన్ గురించేనా మాట్లాడుతున్నారు.

ఆవిడ ఆ పని చేయలేరు. మీతో చెప్పడానికి మొహమాట పడుతున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ ను తప్పించి వేరే కాలేజీకి ఇచ్చేయండి. కావాలంటే రెండు మూడు కాలేజీ పేర్లు కూడా నేను రిఫర్ చేస్తాను అని శైలేంద్ర అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. మేడమ్ అతని చెప్పేది నిజమేనా అని మినిస్టర్ అంటాడు.

నువ్వు ఊహించలేవు: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను నేను టేకప్ చేస్తాను అని జగతి అంటుంది. చూశావ్ కదా. నీకు జగతి సామర్థ్యం గురించి తెలియదు. ఇంకెప్పుడు ఇలా తక్కువ చేసి మాట్లాడకు. వీలైతే హెల్ప్ చేయు. లేకుంటే పక్కకు తప్పుకో అని శైలేంద్రని మినిస్టర్ మందలిస్తాడు. మీరంతా సపోర్ట్ చేయగా మనం ప్రాజెక్ట్ ను ముందుకు నడిపిస్తాం. నువ్వు ఏదేదే ఊహించుకుని ఇంకోసారి మినిస్టర్ గారిని విసిగించకు అని జగతి అని అక్కడి నుంచి బయలు దేరతారు.

ఇంట్లోకి వచ్చిన శైలేంద్ర కోపంగా ఉండటం చూసి ఏమైందని అడుగుతుంది దేవయాని. పిన్నీ.. ఏంటీ నీ ధైర్యం. ప్రాజెక్ట్ ఎలా రన్ చేద్దామనుకుంటున్నావ్ అని శైలేంద్ర అంటే.. నన్ను నమ్ముకునే వాళ్లే నా ధైర్యం. నాకు ధైర్యం చాలా ఎక్కువ. నేను లొంగిది కేవలం రిషి విషయంలోనే. ఇప్పుడు అలా జరిగేదే లేదు. రిషి వచ్చాక నా ధైర్యం ఏంటో నువ్వు ఊహించలేవు అని జగతి అంటుంది.

దానికి ఏర్పాట్లు: అసలు వాడు బతికి ఉంటే కదా. ఏదో ఒక రోజు వాడు చచ్చాడని విషయం చెబితే ఏమైపోతావో అని మనసులో అనుకున్న శైలేంద్ర ఏంటీ మమ్మీ పిన్నీ ఇలా మాట్లాడుతుంది అని శైలేంద్ర అంటాడు. వాళ్లకు జగతిపై ఉన్న నమ్మకం అలాంటిది. అది ఇప్పటిది కాదు. నువ్వు వాళ్ల నమ్మకాన్ని చెడగొట్టలేవు అని జగతికి సపోర్ట్ గా మాట్లాడి శైలేంద్రను సైలెంట్ అవ్వమని కనుసైగ ద్వారా చెబుతుంది. మీరంతా ఒక్కటయ్యారు.

నేను ఒంటరి అనుకుంటూ వెళ్లిపోతాడు శైలేంద్ర. నేను ఆలోచించి అడుగులు వేస్తాను. మేము అనుకున్నది జరుగుతుంది. ఇది మా టైమ్ అని జగతితో దేవయాని అంటుంది. అవును, కానీ ఇప్పుడు నా టైమ్. నేను ఏది చెబితే అదే జరుగుతుంది. కాలేజీ మీ చేతుల్లోకి రాదు. ఒకవేళ నన్ను చంపి చేజిక్కుంచుకుందామన్న కుదరదు. దానికి అన్ని ఏర్పాట్లు చేశాని అని జగతి వెళ్లిపోతుంది.

Guppedantha Manasu Serial June 24 2023 Today Full Episode 798

లవ్ స్టోరీస్ ఉన్నాయా: జగతికి ఏంటీ ఇంత పొగరు. ఏదో ఒక రోజు ఆ పొగరు దించుతాను అని దేవయాని అనుకుంటుంది. మరోవైపు కాలు నొప్పితో బాధపడుతున్న ఏంజెల్ వాటర్ కోసం హాల్లోకి వస్తుంది. ఎందుకు వచ్చావు, వాపు వస్తుందని రిషి అంటాడు. పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను అని ఏంజెల్ అంటే..

శరీరానికి పెయిన్ కిల్లర్స్ ఉన్నట్లే మనసు గాయానికి కూడా పెయిన్ కిల్లర్స్ ఉంటే బాగుండేది అనుకుంటాడు రిషి. తర్వాత ఏంజెల్ కు చపాతీ చేయడంలో సాయం చేస్తున్న రిషి.. వసుధార చపాతీలు నేర్పించడాన్ని గుర్తు చేసుకుంటాడు. అది గమనించిన ఏంజెల్.. ఎందుకు ఉన్నట్టుండి పరాగ్గా అయిపోతావ్. నీకు గతంలో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అడుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X