Guppedantha Manasu: మోకాళ్లపై కేడీ బ్యాచ్.. రిషిపై వసు డౌట్.. చక్రపాణిని చూసిన మహేంద్ర
ఏంజెల్ కు వంటింట్లో చపాతీలు చేసేందుకు రిషి సహాయం చేస్తుంటాడు. చపాతీలు ఎలా చేయాలో నేర్పించిన వసుధారను గుర్తు చేసుకున్న రిషి మూడ్ మారిపోతుంది. ఉన్నట్టుండి పరాగ్గా అయిపోతావ్ ఏంటీ. గతంలో నీకు ఏవైనా లవ స్టోరీస్ ఉన్నాయా. ఏవో జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతున్నాయి కదా. అవి తీపి జ్ఞాపకాలో, చేదు జ్ఞాపకాలో త్వరలనే గెస్ చేస్తాను అని ఏంజెల్ అంటుంది. దీంతో కాస్తా డిస్టర్బ్ గా రిషి ఫీల్ అవడంతో సరే వద్దులే అని వదిలేస్తుంది ఏంజెల్. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 26 సోమవారం నాటి ఎపిసోడ్ 799 లో ఇంకా ఏం జరిగిందంటే?
రిషి షాక్:నువ్వు ఎన్ని చపాతీలు తింటావ్. రెండు సరిపోతాయా అని ఏంజెల్ అడిగితే.. తాను చపాతీలు తినను చెబుతాడు రిషి. ఏంటీ చపాతీలు చేయడం వచ్చు కానీ తినవా. మొదటి నుంచే తినవా అని అడుగుతుంది ఏంజెల్. ముందు తినేవాన్ని ఇప్పుడు లేదు అని రిషి అంటాడు. అంటే నీకు నీ గర్ల్ ఫ్రెండ్ కు చపాతీ విషయంలో గొడవ అయిందా అని ఏంజెల్ అంటే రిషి కోపంగా చూస్తాడు. హేయ్.. జస్ట్ జోక్ అంతే అని కవర్ చేస్తుంది ఏంజెల్. ఇంతలో ఏంజెల్ కు వసుధార కాల్ చేస్తుంది. ఏంజెల్ చేతికి పిండి ఉండటంతో రిషి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ లో పెడతాడు. వసుధార గొంతు విని రిషి షాక్ అవుతాడు. కాలి నొప్పి గురించి అడిగిన వసుధారతో ఫ్రీగా ఉంటే ఇంటికి రావొచ్చు కదా. చపాతీలు చేసుకుంటున్నామని ఏంజెల్ అంటుంది.

రిషిపై డౌట్:కాలినొప్పి ఉండగా చపాతీలు ఎలా చేస్తున్నారని అని వసు అడిగితే.. రిషి హెల్ప్ చేస్తున్నాడని ఏంజెల్ అంటుంది. దీంతో తనతో రిషి చేసిన తీరు గుర్తు చేసుకున్న వసుధార.. నాతో చేసినట్లు ఏంజెల్ తో కూడా అని డౌట్ పడి.. వెంటనే అలా ఆలోచించకూడదు అని అనుకుంటుంది. కట్ చేస్తే.. మహేంద్ర హడావిడిగా బయలుదేరుతుంటే ధరణి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. ముఖ్యమైన పని మీద వెళ్తున్నాని మహేంద్ర వెళ్లిపోతాడు. అది చూసిన జగతి ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోమని ధరణికి చెబుతుంది. ఇప్పుడు నేను అడిగిన చెప్పరు అని ధరణి అంటుంద. దీంతో మాట్లాడకపోయినా పర్లేదు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పమని జగతి మెసేజ్ లో ప్రాధేయపడుతుంది.

అంతా కలిసే రోజు:వెంటనే ధరణికి ఫోన్ చేసిన మహేంద్ర స్పీకర్ లో పెట్టమంటాడు. అసలు ఏంటీ నీ సమస్య. ఇప్పుడు పెడుతున్న బాధ సరిపోవడం లేదా, ఇంకా బాధపెట్టాలా. నేను ఏ పని మీద వెళ్తున్నానో చెప్పకపోతేనే ఇంత బాధ పడుతున్నావ్. మరి నువ్వు నా కొడుకుని దూరం చేశావ్. అసలు ఏం జరిగిందో తెలియక నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా. నేను ఏమైపోతే నీకేంటి. ఇక ఇలా ఎప్పుడు మెసేజ్ చేయకు అని కోపంగా జగతిపై అరుస్తాడు మహేంద్ర. ఇలా చిన్న మావయ్య మీతో మాట్లాడతారని అస్సలు ఊహించుకోలేదు అని ధరణి అంటుంది. పరిస్థితుల ప్రభావం. వసుధార, రిషి, మహేంద్ర అంతా కలిసే రోజు వస్తుంది అని జగతి అంటుంది.

దాక్కున్న వసు:వసుధార పని చేస్తున్న విష్ కాలేజీకి వస్తాడు మహేంద్ర. ధరణి చెప్పినట్లుగా రిషి ఎక్కడున్నాడో వసుకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ల బంధం అలాంటిది. తనను కలిసి నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు మహేంద్ర. కానీ ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార.. మహేంద్రను చూసి దాక్కుంటుంది. ఈసారి కచ్చితంగా ఏం చెప్పిన నమ్మరు. మహేంద్ర సార్ తో చూస్తే రిషి సార్ కి కోపం వస్తుంది అని అనుకున్న వసుధార అటెండర్ ని పిలిచి మహేంద్రను పంపించేందుకు ఏదో చెబుతుంది. మహేంద్ర దగ్గరకు వెళ్లిన ప్యూన్ వసుధార మేడమ్ కాలేజీకి లీవ్ పెట్టారు అని అంటాడు. ఇంటి అడ్రస్ చెప్పమంటే అసలు ఊళ్లోనే లేరని ప్యూన్ చెబుతాడు. దీంతో అక్కడి నుంచి బయలుదేరతాడు మహేంద్ర.

మోకాళ్లపై కేడీ బ్యాచ్:మహేంద్ర బయలుదేరుతుంటే రిషి కారు ఎంట్రీ ఇస్తుంది. మహేంద్రను చూసిని రిషి మొహం కనిపించకుండా పక్కకు తిప్పుకుంటాడు. డాడ్ మళ్లీ ఎందుకు వచ్చారు. వసుధారే చెప్పి ఉంటుంది అని కోపంగా బయలుదేరతాడు రిషి. అప్పుడే వసుధార వాయిస్ మెసేజ్ వస్తుంది. నేనేం మహేంద్ర సార్ ని కలవలేదు. కాలేజీలో లేనని అబద్ధం చెప్పించాను. నేను అబద్దం చెప్పాను అంటే అది మీ కోసమే అని వసుధార అంటుంది. ఇంతలో అటెండర్ వచ్చి కేడీ బ్యాచ్ ఏదో చేస్తుంది అని చెప్పి రిషిని తీసుకెళ్తాడు. కేడీ బ్యాచ్ మోకాళ్లపై నిలబడి రిషితోపాటు అందరికీ సారీ చెబుతారు. ఎంజాయ్ మెంట్ పేరుతో అందరినీ టార్చర్ చేశాం. రిషి సార్ చెప్పడంతో రియలైజ్ అయ్యామని అంటారు.
చక్రపాణి షాక్:రిషి సార్ కాళ్లు పట్టుకోబోతుంటే ఆపుతాడు. మీలో మార్పు వచ్చింది చాలు. సారీ అవసరం లేదు. స్టూడెంట్స్ గా లెక్చరర్స్ కి రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఇకనైనా సంతోషంగా ఉండండి అని రిషి అనడంతో అంతా చప్పట్లు కొడతారు. అంతా వెళ్లిపోతే.. కాలేజీ స్టాఫ్ రిషిని పొగుడుతారు. మీరు కాలేజీకి రావడం అదృష్టం అంటారు. ఈ సందర్భంగా సెల్ఫీ తీసుకుందామని అంటాడు లెక్చరర్. సెల్ఫీ తీసుకునేప్పుడు రిషి పక్కకు వచ్చన వసుధార తాకుతుంది. దీంతో థ్యాంక్యూ అంటూ వెళ్లిపోతాడు రిషి. మరోవైపు మహేంద్ర కారు ఆగిపోతే.. మెకానిక్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతలో అక్కడ రోడ్డుపై చక్రపాణి కనిపించడంతో.. పిలుస్తాడు. మహేంద్రను చూసి చక్రపాణి షాక్ అవుతాడు.


Click it and Unblock the Notifications











