Guppedantha Manasu: షాకింగ్.. రక్తపు మడుగులో వసు.. సంతోషంలో మహేంద్ర.. పాండ్యన్‌తో అలా!
కారు ఆగిపోవడంతో మహేంద్ర రోడ్డుపై నిల్చుని ఉంటాడు. ఇంతలో అక్కడ చక్రపాణి కనిపించడంతో.. పిలుస్తాడు. మహేంద్రను చూసిన చక్రపాణి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు బావగారు అని అడుగుతాడు. మీ కూతురు, జగతి చేసిన పనికి నా కొడుకు కోసం రోడ్లపై తిరుగుతున్నాను. వసుధార కాలేజీకి వెళితే సెలవు పెట్టి ఊరికెళ్లిందని అన్నారు. మీరిక్కడ ఉంటే వసుధార ఎక్కడికి వెళ్లింది అని మహేంద్ర అడుగుతాడు. అంటే వసమ్మ అబద్ధం చెప్పిందన్నమాట అని మనసులో అనుకుంటాడు చక్రపాణి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 27 మంగళవారం నాటి ఎపిసోడ్ 800 లో ఇంకా ఏం జరిగిందంటే?
కిటికీలో నుంచి: బావగారు ఇంటికి రండి అన్ని విషయాలు చెబుతాను అని చక్రపాణి అంటే.. మీరేం చెప్పొద్దు. వసుధార ఎక్కడుందో చెప్పండి చాలు అని మహేంద్ర అంటాడు. ఇంతలో మెకానిక్ వచ్చి కారు రిపేర్ కు సమయం పడుతుందని చెప్పడంతో చక్రపాణి ఇంటికి వెళ్తాడు మహేంద్ర. మరోవైపు కాలేజీలో రిషి క్లాస్ చెబుతుంటే ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న కేడీ బ్యాచ్ శ్రద్ధగా వింటుంది. స్టూడెంట్స్ అంతా కేడీ బ్యాచ్ మారిన దాని గురించి మంచిగా మాట్లాడుకుంటారు. అది విని కేడీ బ్యాచ్ సంతోషిస్తుంది. అలాగే రిషి క్లాస్ చెబుతుంటే క్లాస్ రూమ్ కిటికీలో నుంచి వసుధార చూస్తూ ఉంటుంది. వసుధారను చూసిన రిషి డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతాడు. వెళ్లి విండో క్లోజ్ చేద్దామనుకునేసరికి అక్కడి నుంచి వసుధార లేచి వెళ్లిపోతుంది.

ఎందుకు చేశారు: నా చూపులు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ సార్. కానీ మీరు అలా పాఠాలు చెబుతుంటే చూసి సంతోషిస్తున్నాను. నా చూపులు, నా ఆశలు మీకు ఆనందం ఇచ్చే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ అని మనసులో అనుకుంటుంది వసుధార. మరోవైపు చక్రపాణి ఇంట్లో కూర్చున్న మహేంద్రకు వసుధార ఇక్కడే ఉన్నట్లు చెబుతాడు. దీంతో ఎంటీ వసుధార ఇక్కడే ఉంటే.. నాతో ఎందుకు అలా చెప్పించింది, రిషి ఎక్కడున్నాడో వసుధారకు తెలిసే ఉంటుందా, అసలు జగతి, వసుధార ఆరోజు ఎందుకు అలా చేశారుని వరుసగా ప్రశ్నలు వేస్తుంటాడు మహేంద్ర. దీంతో కాఫీ తీసుకొస్తానని లోపలికి వెళ్తాడు చక్రపాణి.

బలైపోయారు: వసుధార తల్లి సుమిత్ర ఫొటోకు దండ వేసి ఉండటం చూసి ఏమైందని ఆలోచిస్తాడు మహేంద్ర. సుమిత్ర గారు అని మహేంద్ర అడిగితే.. నన్ను ఒంటరిని చేసి తన దారి తాను చూసుకుని వెళ్లిపోయిందని బాధగా చెబుతాడు చక్రపాణి. ఎప్పుడు జరిగిందని మహేంద్ర అడిగితే.. మీ కొడుకు మీకు దూరమైన మరుక్షణమే గుండెపోటుతో చనిపోయిందని చక్రపాణి చెబుతాడు. దీంతో బాధపడిన మహేంద్ర.. వసుధార-జగతి చేసిన పనికి ఇంతమంది బలైపోయారు. ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లేదు. అడిగితే మాట దాటేస్తున్నారు, కానీ నిజం చెప్పడం లేదుని అంటాడు మహేంద్ర. నాక్కూడా కారణం తెలియదు. కానీ ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది అని చక్రపాణి అంటాడు.

నేనే వద్దన్నా: ఏం లాభం ఇన్ని దారుణాలు జరిగిపోయాక అవి దాచి ఏం లాభం. అసలు నా కొడుకుని నేను చూడంగానే చనిపోతానేమో అని భయమేస్తుంది. రిషి యోగాక్షేమాలు తెలియకుండానే కన్నుమూస్తానో అని మహేంద్ర ఆవేదన పడతాడు. అది విని తట్టుకోలేని చక్రపాణి.. రిషి సార్ క్షేమంగానే ఉన్నారండి అని అంటాడు. అది మీకు ఎలా తెలుసు.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని మహేంద్ర నిలదీస్తాడు. దీంతో వసధార పని చేస్తున్న కాలేజీలోనే రిషి లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. ఈ విషయం మీకు చెబుదామని ఆరోజు వసు కాల్ చేస్తే నేనే వద్దన్నాని. మీరు రిషిని చూసేందుకు వస్తే అది తెలిసి ఇక్కడి నుంచి కూడా ఎక్కడైనా వెళ్లిపోతాడమో అని అలా చేశాని అని చక్రపాణి చెబుతాడు.
ఎమోషనల్ సీన్: రిషిని చూసేందుకు మహేంద్ర బయులుదేరుతుంటే చక్రపాణి ఆపుతాడు. రిషి సార్ కి ఇంకా కోపం తగ్గలేదు. అదంతా పోయకా కలవడ మంచిది. మీరు మాట్లాడితే రిషి మాటలకు నొచ్చుకోవచ్చు అని చక్రపాణి అనడంతో కరెక్టే అని ఆలోచిస్తాడు మహేంద్ర. చక్రపాణికి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుని వెళ్లిపోతాడు మహేంద్ర. కాలేజీలో రిషి వెనుకే నడుస్తుంటుంది వసుధార. తను నా వెంట వస్తుంటే నా గతం నన్ను వెంటాడుతుందని ఒకచోట ఆగిపోతాడు రిషి. సార్ ఎందుకు ఆగిపోయారు అనుకుంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది వసు. తను నా కంటికి కనిపించనంత దూరం వెళ్లాక నేను వెళ్లాలి అనుకుంటాడు రిషి. ఇంతలో వసుధారకు యాక్సిడెంట్ అయిందని తెలిసి పరుగెత్తుకెళ్తాడు రిషి.

చాలా ఫాలోయింగ్: వెళ్లి చూసే సరికి రక్తపు మడుగులో వసుధార ఉంటుంది. బ్లడ్ చాలా పోయింది, అంబులెన్స్ కు కాల్ చేయమని లేడీ లెక్చరర్ అంటుంది. వసుధారను చూసి వెనక్కి వెళ్లి ఆగిపోతాడు. అక్కడ ఏదో ఆలోచించుకుని వసుధారను కారులో హాస్పిటల్ కు తీసుకెళ్తాడు రిషి. వసుధార కోసం రిషి ఆగిపోయి ఆలోచించే తీరు ఎమోషనల్ గా బాగుంది. రిషి కారు బయటకు వెళ్లగానే మహేంద్ర కారు కాలేజీలో ఎంట్రీ ఇస్తుంది. అక్కడ ఆడుకుంటున్న పాండ్యన్ ను పిలిచి రిషి సార్ ఉన్నారా అని అడుగుతాడు మహేంద్ర. ఇప్పుడే వెళ్లిపోయారు. మీరు తనకు ఏం అవుతారు అని పాండ్యన్ అడుగుతాడు. నాకు బాగా కావాల్సిన వ్యక్తి అని చెప్పి రిషి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు మహేంద్ర. రిషి సార్ కు చాలా ఫాలోయింగ్ ఉందే అని పాండ్యన్ అనుకుంటే.. రిషి గొంతు వింటాననే సంతోషంతో మహేంద్ర మురిసిపోతుంటాడు.


Click it and Unblock the Notifications











