Guppedantha Manasu: కీలక మలుపు.. అన్ని నిజాలు చెప్పేసిన జగతి.. మహేంద్రకు డేంజర్.. వసు కన్నీళ్లు
వసుధారకు యాక్సిడెంట్, ట్రీట్ మెంట్ తర్వాత ఏంజెల్ డిశ్చార్చ్ చేయిస్తుంది. వసుధార ఇల్లు చాలా దూరంలో ఉంది కదా అని తన ఇంటికి తీసుకెళ్తుంది. హాల్లో నిలబడిన వసుధార లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంటుంది. మన ఇంట్లో ఉండేందుకు వసుధారా చాలా ఇబ్బంది పడుతుందని, జరిగినదంతా విశ్వనాథంకి చెబుతుంది ఏంజెల్. ఇది కూడా మీ ఇల్లే అనుకోమ్మా. ఫీల్ ఫ్రీ అని లోపలకి వెళ్లమని వసుధారతో అంటాడు విశ్వనాథం. తటపటాయిస్తూనే వసుధార లోపలకు వెళ్తుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 29 గురువారం నాటి ఎపిసోడ్ 802 లో ఇంకా ఏం జరిగిందంటే?
మంచి చెడు:రిషి కాల్ రావడంతో పక్కకు వెళ్లి అటెండ్ చేస్తాడు. అటునుంచి విష్ కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడతాడు. సార్ మీ కారణంగానే కేడీ బ్యాచ్ లో మార్పు వచ్చింది. వాళ్లు చాలా బుద్ధిగా ఉంటున్నారని లెక్చరర్స్ చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది అని ప్రిన్సిపాల్ అంటాడు. నాదేముంది సార్. కేవలం వాళ్లకు నాలుగు మంచి మటాలు చెప్పాను. వాళ్లు దాన్ని ఆచరిస్తున్నారు. మంచేదో చెడేదో వాళ్లు గుర్తించారు. అది చాలు సార్ అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు వసుధారకు ఏంజెల్ వాటర్ ఇస్తుంది. ఏంజెల్ నేను ఇక్కడ ఉంటడం ఎవరికీ ఇబ్బంది లేదు కదా అని అడుగుతుంది వసుధార. విశ్వం చెప్పాడు కదా. ఇంకా ఎవరికీ ఇబ్బంది ఉంటుంది చెప్పు అని ఏంజెల్ అంటుంది.

ఇష్టపడని వాళ్లు:ఓ నువ్వు రిషి గురించి ఆలోచిస్తున్నావా. రిషి ఏం ఫీల్ కాడు. నేను ఇలా సాయం చేశానంటే తను చాలా సంతోషిస్తాడు. అసలు రిషి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. తనలో అన్ని మంచి లక్షణాలే. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తుంటాడు అని ఏంజెల్ చెబుతుంటుంది. నీకు నీ ఫ్రెండ్ అంటే ఇష్టమా అని వసుధార అంటుంది. హా చాలా ఇష్టం. రిషిని ఇష్టపడని వాళ్లు ఎవరైనా ఉంటారా. తనతో స్నేహం చేస్తే నువ్వు కూడా ఇష్టపడతావ్ అని ఏంజెల్ అంటుంది. ఏంజెల్ చెప్పే విధానానికి లోలోపల కుమిలిపోతుంది వసుధార. బయటకు కన్నీళ్లు వచ్చినా కవర్ చేస్తుంది. మరోవైపు పిన్ని ఏమాత్రం వినలేదు. పిన్ని దారిలోకి రావాలంటే బాబాయ్ అడ్డు తొలగించాల్సిందే అన్న శైలేంద్ర మాటలు తలుచుకుంటుంది ధరణి.

నిద్ర పట్టదమ్మా:చిన్న మావయ్యకు ప్రమాదం తలపెట్టేలా ఉన్నారు. ఈ విషయం ఎలాగైనా చిన్నత్తయ్యకు చెప్పాలి. దానికంటే ముందు వీళ్లు ఏం చేస్తున్నారో చూడాలి అని వంట గదిలో నుంచి బయటకు వస్తుంది ధరణి. మరోవైపు చక్రపాణికి వసుధార యాక్సిడెంట్ గురించి ఏంజెల్ చెబుతుంది. దీంతో చక్రపాణి కంగారు పడతాడు. కంగారు పడకండి అంకుల్. వసుధార బాగానే ఉంది. ట్రీట్ మెంట్ కూడా ఇచ్చారు. అక్కడి దాకా ఏం వస్తుందేలే అని మా ఇంటికి తీసుకొచ్చాం అని ఏంజెల్ చెబుతుంది. అమ్మా నాకు కంగారుగా ఉంది. నాకు నిద్ర పట్టదమ్మా నేను అక్కడికి వస్తా అని వసుతో చక్రపాణి అంటే.. వసుధార వద్దంటుంది. నేను బాగానే ఉన్నా కంగారుపడకని వసు నచ్చజెప్తుంది.

జగతి కెపాసిటీ:ఇక ఫణీంద్రతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వదిలేయడం గురించి మాట్లాడతారు దేవయాని, శైలేంద్ర. మినిస్టర్ గారు కూడా జగతినే సపోర్ట్ చేశారట. ఏంటండి ఇది. మన కాలేజీకి, మావయ్య గారికి చెడ్డ పేరు వస్తుంది కదా అని దేవయాని అంటుంది. అలా జరగదు. అయినా శైలేంద్ర నేను నీకు చెప్పాను కదా. జగతికి మనం సపోర్ట్ అందించాలని. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి అలా ఎందుకు చెప్పావు. ఏం అవసరం ఉంది అని ఫణీంద్ర నిలదీస్తాడు. కాలేజీకి చెడ్డపేరు ఎక్కడ వస్తుందో అని నాకు భయం వేసింది అని శైలేంద్ర అంటే.. జగతి కెపాసిటీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. తాను పొరపాట్లు చేయదు. అన్ని విజయాలే అంటాడు ఫణీంద్ర.

మహేంద్రకు డేంజర్:ఇంతలో భోజనం వడ్డించమంటారా మావయ్య అని ధరణి అడుగుతుంది. మహేంద్ర వచ్చాకా తింటాను. వీళ్లతో మాట్లాడేది ఉంది అని ధరణిని వెళ్ల మంటాడు ఫణీంద్ర. వీళ్లు సీరియస్ డిస్కషన్ లో ఉన్నారని జగతి దగ్గరికి వెళ్లి ఒక విషయం చెప్పాలని లోపలకి తీసుకెళ్తుంది ధరణి. వాళ్లిద్దరు వెళ్లడం మహేంద్ర చూస్తాడు. చిన్నత్తయ్యా చిన్న మావయ్యకు ఆయన అపాయం తలపెట్టాలను చూస్తున్నారని చెబుతుంది ధరణి. ఇంతలో తలుపు నెట్టుకొచ్చిన మహేంద్రను చూసి షాక్ అవుతారు. అసలు ఏం జరుగుతుంది. ఏంటీ గూడు పుటాని అని గట్టిగా మహేంద్ర అరిస్తే.. చిన్నగా మాట్లాడండి మావయ్య అని ధరణి అంటుంది. ఎందుకు ఈ ఇంట్లో పరాయి వాళ్లు ఎవరున్నారు అని మహేంద్ర అంటాడు.

ఇంట్లోనే శత్రువులు:అయ్యే మావయ్య మీరు పొరపాటు పడుతున్నారు. శత్రువులు ఈ ఇంట్లోనే ఉన్నారు అంటుంది ధరణి. దీంతో షాక్ అయినా మహేంద్ర.. ఎవరు ధరణి అంటాడు. మహేంద్రకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. నేను అన్ని నిజాలు చెబుతాను నువ్వు వెళ్లు ధరణి. ఇక్కడ ఉంటే నీకు మాట వస్తుంది అని ధరణిని పంపించేస్తుంది జగతి. డోర్ క్లోజ్ చేసి ఇన్నాళ్లు మీరు మాట్లాడకపోయినా, దోషిగా చూసిన సహించాను. కానీ మీకే ప్రమాదం తలపెట్టేందుకు సన్నహాలు చేస్తున్నారంటే నిజం చెప్పక తప్పదు. నిజం విని ఆవేశ పడొద్దు. ఈ నిజం విని తట్టుకోవాలి అని జగతి అంటుంది. ఏంటా నిజం అని మహేంద్ర అడుగుతాడు.
బావగారి ప్రాణాలు:రిషిపై నేను అభియోగం మోపడానికి కారణం నీ అన్న కొడుకు శైలేంద్ర, దేవయాని అక్కయ్య అని జగతి చెబుతుంది. ఏం అంటున్నావ్ జగతి అని గంభీరంగా అంటాడు మహేంద్ర. రిషిపై జరిగిన ప్రతి దాడి శైలేంద్ర చేయించిందే అని కత్తితో పొడిపించింది, కారు యాక్సిడెంట్, పూల కుండీ పడేయటం, చెక్ మిస్ యూజ్ వంటి అన్ని విషయాలు చెబుతుంది జగతి. ఇంత కుట్ర పన్నారు. ఎండీ సీటు కావాలని ఒక్క మాట చెబితే రిషి ఇచ్చేవాడు కదా. ఇప్పుడే వాళ్ల అంతు చూస్తా అని మహేంద్ర ఆవేశపడుతాడు. ఇప్పుడు కాదండి, ఆలోచించి నిర్ణయ తీసుకోవాలి. మీ ప్రాణాలే కాదు నాకు బావగారి ప్రాణాలు కూడా ముఖ్యమే అని జగతి అంటుంది. దీంతో ఆలోచనలో పడిపోతాడు మహేంద్ర.


Click it and Unblock the Notifications











