Guppedantha Manasu: తల్లిని మోసం చేస్తున్న కొడుకు.. శైలేంద్రకు దేవయాని-జగతి వార్నింగ్

కొత్త కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగంలో చేరిన రోజే వసుధారను లెక్చరర్ కోదండపాణి ఇష్టమొచ్చినట్లుగా మాటలు అంటాడు. దీంతో స్టూడెంట్స్ ముందు వసుధారకు అవమానం జరుగుతుంది. టైమ్ టేబుల్ ఫాలో కాకుండా వచ్చావా అంటూ లెక్చరర్ అనడంతో కోపంగా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంది వసుధార. ఏంటీ సార్ ఇదంతా. ఇలాంటప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వడం ఎందుకని ప్రశ్నిస్తుంది వసుధార. నేను కరెక్ట్ గానే పంపించాను. ఈ పీరియడ్ మీదే అని క్లారిటీ ఇస్తాడు ప్రిన్సిపాల్. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూన్ 3 శనివారం నాటి ఎపిసోడ్‌ 780 లో ఇంకా ఏం జరిగిందంటే?

మరోసారి ఫూల్ చేసి : ఇక వసుధార మాటలు విన్న ప్రిన్సిపాల్ కాస్తా ఆలోచించి.. అది కేడీ బ్యాచ్ పని అని చెబుతాడు. ప్రిన్సిపాల్ అలా చెప్పడంతో వసుధార షాక్ అవుతుంది. మరోవైపు కేడీ బ్యాచ్ వసుధారకు జరిగిన అవమానం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లెక్చరర్ గా వేశం వేసిన డ్రైవర్ ను పిలిచి డబ్బులిస్తాడు. భలే చేశావ్ అంటూ మెచ్చుకుంటారు. వసుధారను మరోసారి ఫూల్ ని చేసి కాలేజీ నుంచి బయటకు పంపించాలని కేడీ బ్యాచ్ డిసైడ్ అవుతారు. మన కాలేజీకి ఏ లెక్చకర్ వచ్చినా ఫూల్ ని చేయడంలో నువ్వు గ్రేట్ మామా అని టీమ్ లీడర్ పాండ్యన్ ను పొగుడుతారు.

 gm1

ఉద్యోగాలు వదిలి : ఈ గెలుపుతో వచ్చిన మనీతో పార్టీ చేసుకుందాం. అయినా ఈసారి వచ్చిన లెక్చరర్ ఈ దెబ్బతో పారిపోతుందా. ఇంకా ఉంటుందా. ఈమె మాత్రమే కాదు ఏ లెక్చరర్ వచ్చినా పారిపోయేలా చేయడమే అని అనుకుంటారు వారందరు. మరోవైపు కాలేజీలో ఈ కేడీ బ్యాచ్ ఏంటీ మేడమ్ అని మరో లెక్చరర్ ను అడుగుతుంది వసుధార. కాలేజీలో అల్లరి చేయడమే కేడీ బ్యాచ్ పని అని ఆమె చెబుతుంది. మరి వాళ్లను అలా వదిలేస్తే ఎలా అని వసుధార అంటే.. వాళ్లు చేసే పనులకు ఎవ్వరైనా భయపడాల్సిందే అంటూ తమని ఎలా ఫూల్స్ చేశారో చెప్పుకుని బాధపడుతుంది. చివరకు ప్రిన్సిపాల్ కూడా భయపడతారని చెబుతారు. వీళ్లు చేసిన పనులకు చాలా మంది లెక్చరర్స్ ఉద్యోగాలను వదిలిపెట్టి వెళ్లిపోయారు. వాళ్లను బాగు చేయడం ఎవరి వల్ల కాదు అని లెక్చరర్ చెబుతుంది.

 gm1

మార్చేవారు లేరు : కేడీ బ్యాచ్ అంటే.. ఆ నలుగురే. రోహిత్, రేణుక, ప్రసాద్, పాండ్యన్. కేడీ బ్యాచ్ కు లీడర్ గా ప్యాండన్ ఉంటాడు అంటూ వారిలో ఒక్కొక్కరి గురించి చెబుతుంది ఆ లెక్చరర్. పిల్లలు ఇంత దిగజారిపోతున్నా వారి తల్లిదండ్రులు ఎలా ఊరుకుంటున్నారో అర్థం కావడం లేదంటుంది వసుధార. ఇంటి దగ్గర ఎలా అయినా ఉండని. కాలేజీ కదా. ఇలా విచ్చలవిడిగా ఏది పడితే అది చేయడం ఏంటీ అయినా వాళ్లలో మార్పు ఎలా వస్తుందని వసుధార అంటుంది. వాళ్లను మార్చేవారు భూమ్మీద లేరని అన్న లెక్చరర్.. క్లాస్ కి టైమ్ అవుతుందని పిలుస్తుంది. మరోవైపు ఎన్ని బాధలు పెట్టినా ఎండీ సీట్ ను తనకు జగతి ఇవ్వలేదని అసహనానికి లోనవుతాడు శైలేంద్ర.

 gm1

నీ ఆటలు సాగవు : నిన్ను బాధపెట్టింది. రిషిని వెళ్లగొట్టింది ఎండీ సీటు కోసమే కదా. అది నాకెందుకు ఇవ్వడం లేదు. రిషి వస్తాడని ఇంకా ఊహల్లో బతుకుతున్నావు. వాడు జన్మలో రాడు. తన కోసం ఎదురుచూసే ఓపిక నీకు ఉందేమో కానీ, నాకు ఎండీ సీటు కోసం ఎదురుచూసే ఓపిక లేదు. ఇన్ని రోజులు అర్థం చేసుకుంటావని వదిలేశాను. ఇప్పుడు నీ వాళ్లను శాశ్వతంగా దూరం చేస్తాను అని శైలేంద్ర అంటాడు. నువ్వు ఎన్ని వేశాలు వేసినా నీ ఆటలు నా దగ్గర సాగవు. నీకు భయపడను. నా కొడుకుని, వసుధారను దూరం చేశావ్. నా భర్తను నాతో మాట్లాడకుండా చేశావ్. నువ్ ఇంత నీచుడివి అని తెలిసినా నిన్ను వదిలేసింది రిషి ప్రాణాలు కాపాడకోవడానికి. అంతేకానీ నిన్ను ఎదుర్కోవడం తెలియక కాదు. రిషి వస్తే తాను కాకపోయినా వసుధార నిజాలను చెబుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని జగతి అంటుంది.

 gm1

జగతి అడ్డు తొలగించుకోవాలి : బతికి ఉన్నోడికైతే చెప్పచ్చు. చచ్చినోడికి ఎలా చెబుతావంటూ మనసులో అనుకుంటాడు శైలేంద్ర. మహేంద్రకు ఏదైనా ఆపద తలపెట్టాలని చూస్తే నీ నిజస్వరూపం మొత్తం బయట పెడతానని వార్నింగ్ ఇస్తుంది జగతి. రిషి ఎక్కడున్నాడో నీకు తెలుసు కదా అని జగతి అడిగితే.. శైలేంద్ర తడబడిపోతాడు. రిషిని చంపిన విషయం బయట పడుతుందేమో అని భయపడి తెలియదని అంటాడు. రిషి ఎక్కడున్నాడో నీకు తెలిసిన మరు క్షణమే నాకు తెలుస్తుంది అని జగతి అంటుంది. రిషిని ఇంటి నుంచి పంపించడం వల్ల ఒరిగింది ఏం లేదని, జగతిని తక్కువగా అంచనా వేశానని, ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అవుతాడు శైలేంద్ర.

 gm1

శైలేంద్రకు దేవయాని క్లాస్ : రిషి తిరిగి వస్తే అందరూ కలిసిపోతారు. జన్మలో డీబీఎస్టీ కాలేజీ ఎండీ సీటు నీకు దక్కదు అని దేవయాని అంటుంది. రిషిని చంపించిన విషయం దేవయాని దగ్గర దాచిపెట్టిన శైలేంద్ర.. ఎండీ సీటు దక్కించుకోవాలంటే మహేంద్రను చంపేయడం ఒక్కటే పరిష్కారం అని తల్లితో అంటాడు. దీంతో దేవయాని షాక్ అవుతుంది. ఎన్ని ఘోరాలు చేసిన జగతి ఎదురుతిరగకపోవడానికి కారణం మహేంద్ర. అతడి అడ్డు తొలగిపోతే జగతి పులిగా మారిపోతుంది. అప్పుడు ఆపడం మన తరం కాదు. మహేంద్రకు ఏదైనా జరిగితే తండ్రి కూడా గుండె ఆగి చచ్చిపోతాడు. మనకు కావాల్సింది దక్కే వరకు ఎదురుచూద్దాం. తొందరపడి పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. అయినా రిషి వస్తాడంటావా అని దేవయాని అంటే.. వాడు ఉంటే కదా రావడానికి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X