Guppedantha Manasu: అదిరిపోయిన రిషి రీఎంట్రీ.. జైల్లో ఖైదీలతో అలా.. ప్లాష్ బ్యాక్ స్టోరీ ఇదే
జైల్లో రిషి ఎంట్రీతో నేటి ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. రిషి వెనుక కానిస్టేబులు లాటీ పట్టుకుని నడుస్తూ ఉంటే అతను ఒక ఖైదీలా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. రిషి నడుచుకుంటూ వస్తున్నప్పుడు వచ్చిన బీజీఎమ్ ఆకట్టుకునేలా చాలా బాగుంది. ఇక నలుగురు ఖైదీలు ఉన్న గది తలుపు తీసి అక్కడ ఓ కుర్చీ వేసి రిషిని కూర్చోమంటాడు కానిస్టేబుల్.
రిషిని చూసి లేచి నిల్చున్న ఖైదీలను కూర్చోమ్మని చెబుతాడు రిషి. అప్పుడు అర్థం అవుతుంది రిషి ఖైదీలా కాకుండా వేరేలా వచ్చాడని. ఈ సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 5 శనివారం నాటి ఎపిసోడ్ 781 లో ఇంకా ఏం జరిగిందంటే?

ఖైదీలతో రిషి: ఖైదీలతో మాట్లాడతాడు రిషి. ఎప్పుడు విడుదల అవుతున్నారు అని రిషి అడుగుతాడు. ఒక వారంలో అని ఓ ఖైదీ సమాధానం ఇస్తాడు. ఒక మనిషి సహనం కోల్పోయి.. క్షణికావేశంలో తప్పులు చేస్తే.. ఆ తర్వాత అనుభవించాల్సిన శిక్ష ఎంత బాధగా ఉంటుందో.. ఎంత ఆవేదన కలిగిస్తుందో.. ఎంతమందికి దూరం చేస్తుందో మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను అని రిషి అంటాడు.
దీంతో ఖైదీలు తల దించుకుంటారు. కష్టం వస్తే పరిస్థితులను ఎదుర్కోవాలి. కానీ ఎదుటి వారి మీద రుద్దకూడదు. దేని మీదైనా ఆశ ఉంటే సాధించుకోవాలి. లాక్కోకూడదు. కోపం ఉన్న ఆ క్షణమే ప్రదర్శించాలి. కానీ ఆ కోపానికి ఎవ్వరూ బలి కాకూడదు అని రిషి వాళ్లతో అంటాడు.

మోసం చేయొద్దు: అలాగే సార్ మీరు చెప్పినట్లే ఉంటాం. ఇంతకాలంగా చాలా కోపంగా ఉన్నాను. విడుదల అయిన వెంటనే నాకు ఈ గతి పట్టించిన వాడికి బుద్ధి చెప్పాలని ఊగిపోయాను. మొన్న మీరు చెప్పిన మాటలు నాలో ఆలోచన కలిగేలా చేశాయి. ఏదొక తప్పు చేయబట్టే కదా ఇన్ని రోజులు శిక్ష అనుభవిస్తున్నాను. మళ్లీ వెళ్లి అదే తప్పు చేస్తే ఇక జీవితంలో ఏం మిగులుతుంది సార్.
మళ్లీ జైలుకే రావాలిగా.. నా వాళ్లందరికి దూరం కావాలి. మీరు చెప్పిన మాటలు మాలో చాలా మార్పుని తీసుకొచ్చాయి సార్ అని ఒక్కో ఖైదీ చెబుతారు. జీవితంలో ఒక్క మాట బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరినీ అంత త్వరగా నమ్మొద్దు. నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు అని చెప్పేసి వెళ్లిపోతాడు రిషి.

డీటెల్స్ ఇవ్వొద్దు: జైల్లో కానిస్టేబుల్ రిషిని మెచ్చుకుంటాడు. ఖైదీలకు మోటివేషన్ క్లాస్ చెప్తానంటే మొదట్లో నవ్వుకున్నాను. కానీ ఇప్పుడు నేను తప్పు అని తెలిసింది. మీరు చాలా గొప్పవాళ్లు సార్. కరుడుగట్టిన నేరస్థులకు కూడా ఒక మనసు ఉంటుందని.. దాన్ని మార్చగలమని నిరూపించారు అని కానిస్టేబుల్ అంటాడు. సరే కానీ, నా డీటెల్స్ గురించి ఎవరికీ చెప్పొద్దు అని రిషి అంటాడు.
ఎందుకు సార్ అలా. చాలా సార్లు అడిగిన సమాధానం చెప్పట్లేదు అని కానిస్టేబులు అంటే.. నేను ప్రజంట్ లోనే ఉంటాను, గతం, భవిష్యత్ ఆలోచించను. ఇప్పుడు మీతో మాట్లాడింది గతంలోనే కలిసిపోవాలి అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. జైలు నుంచి బయటకు రాగానే అక్కడ ఏంజెల్ ఉంటుంది.

మనమో కదా: రిషిని తీసుకుని సినిమాకు వెళ్తుంది ఏంజెల్. మరోవైపు కాలేజీ లెక్చరర్ గా జాయిన అయిన తర్వాత ఇంటికి వస్తుంది వసుధార. ఫస్ట్ డే కాలేజీ అనుభవం ఎలా ఉంది అక్క అని పక్కింటి అమ్మాయి అడుగుతుంది. వేరీ బ్యాడ్ అంటుంది. కాలేజీ బాగోలేదా.. ఇబ్బందిగా ఉందా అని చక్రపాణి అంటాడు. అవును నాన్న.. కాలేజీలో స్టూడెంట్సే లెక్చరర్స్ ను ర్యాగింగ్ చేస్తున్నారు.
పొద్దున ఒకడు లెక్చరర్ గా నన్నే బురిడి కొట్టించాడు అని వసుధార అంటే.. మరి మానేయమని చక్రపాణి అంటాడు. లేదు నాన్నా.. వాళ్లను సరైనా దారిలో పెట్టాల్సిన బాధ్యత లెక్చరర్స్ ది కదా. మారుస్తానని చెబుతుంది వసుధార. కానీ వాళ్లు నీకు ఎలాంటి కీడు తలపెడతారోనని భయంగా ఉంది అని చక్రపాణి అంటే.. ఏం కాదు నాన్న అని నచ్చజెప్పి వెళ్లిపోతుంది వసుధార.
విజిటింగ్ కార్డుతో: ఇన్ని రోజులు అక్క సైలెంట్ గా ఉంటే ఏమో అనుకున్నా కానీ, ధైర్యం ఎక్కువే. ఎన్నో ఎదురుదెబ్బలు తింటే కానీ ఇలా ఉండరని ఎక్కడో బుక్ లో చదివాను అని పక్కింటి అమ్మాయి అంటుంది. మరోవైపు రిషి, ఏంజెల్ ఇంటికి వెళ్తారు. ఏంజెల్ వాళ్ల తాత ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటే సినిమాకు వెళ్లాం అని చెబుతుంది.
తర్వాత ఖైదీలకు నువ్వు చెప్పే పాఠాలకు వాళ్లలో పరివర్తన వస్తుందట. జైలర్ ఫోన్ చేసి చెప్పాడు అని ఏంజెల్ తాతయ్య రిషిని మెచ్చుకుంటాడు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం అని జరిగింది గుర్తు చేసుకుంటారు. రిషిని హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు అతని పాకెట్ లో ఉన్న ఏంజెల్ విజిటింగ్ కార్డ్ చూసి ఆమెకు ఫోన్ చేస్తాడు డాక్టర్.
పెద్ద శిక్ష వేశారు: ఏంజెల్ హాస్పిటల్ కు వచ్చి రేర్ బ్లడ్ గ్రూప్ అయిన రిషికి ఏంజెల్ రక్తం ఇస్తుంది. తర్వాత డాక్టర్స్ ప్రయత్నించి రిషిని కాపాడుతారు. ఏంజెల్ ది నాది సేమ్ బ్లడ్ గ్రూప్ కావడం, మీరు చేసిన సాయం లైఫ్ లో మర్చిపోలేను. నన్ను కాపాడటమే కాదు మీ ఇంట్లో మనిషిగా చూసుకుంటున్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని రిషి చెబుతాడు.
నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ మన మధ్య అలాంటివి ఎందుకని ఏంజెల్ అంటుంది. ఇక మహేంద్ర ఇంట్లో దిగాలుగా కూర్చుని ఉంటాడు. ధరణి వచ్చి కాఫీ ఇస్తుంది. అప్పుడే జగతి కూడా వస్తుంది. చిన్నత్తయ్యకి అంత పెద్ద శిక్ష వేశారు కదా. ప్లీజ్ చిన్న మామయ్య తనతో మాట్లాడొచ్చు కదా అని ధరణి బతిమిలాడుతుంది.
అందులో అర్థం లేదు: ఇది నాకు కూడా శిక్షే అమ్మా. మీ చిన్నత్తయ్య అబద్ధం చెప్పిందంటే ఏదో గట్టి రీజనే ఉంటుంది. ఇక రిషి తప్పు చేశాడంటే నేనే కాదు ఎవరూ నమ్మరు. రిషి తప్పు చేశాడని సాక్ష్యాలు ఉన్నా అవి అబద్ధపు సాక్ష్యాలు అని మీ చిన్నత్తయ్యకు బాగా తెలుసని నాకు తెలుసు అని మహేంద్ర అంటాడు.
మీరు ఎంత బాధపడుతున్నారో చిన్నత్తయ్య అంతే బాధపడుతున్నారు అని ధరణి అంటుంది. తప్పమ్మా.. నా బాధకు తన బాధకు తేడా ఉంది. రిషి దూరం అవ్వాలని తన నుదుటి మీద రాసిందే తను. అలాంటప్పుడు తను బాధ పడటంలో అర్థం లేదు అని మహేంద్ర అంటాడు.


Click it and Unblock the Notifications











