Guppedantha Manasu June 5th: నా గుండె కొట్టుకొంటుందంటే? రిషి బతికే ఉన్నాడు.. ఇన్స్‌పెక్టర్‌కు వసుధార షాక్!
వసుధారను తక్కువ అంచనా వేయకు. రిషితో పెళ్లి జరగకుండా నేను ఎత్తులు వేశాను. కానీ వాటిని పటాపంచలు చేసింది. ప్రతీ సిచ్యు వేషన్ ఫేస్ చేసి ఇంటి కోడలు అయింది. ఫారిన్ నుంచి వచ్చి ఎలా దూకుడు ప్రదర్శిస్తున్నదో నీవే చూశావు కద. నిన్ను ఇంట్లో అందరి ముందు నిలబెట్టి ఎలా చేసిందో నీకే అనుభవం అయింది కదా అని తన కొడుకుకు రిషి పెద్దమ్మ దేవయాని క్లాస్ పీకింది. గుప్పెడంత మనసు 2024 మే 5వ తేదీ 1093 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?
వసుధార అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు. రిషి కనిపించకుండా పోయిన తర్వాత చాలా వీక్ అయింది. ఆమె నమ్మకం గంగలో కలిపిపోయింది. దు:ఖంలో కూరుకుపోయింది. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని ఏమీ చేయలేదు అని అంటే.. నువ్వు తక్కువ అంచనా వేశావు కాబట్టే. వాళ్లు దెబ్బ కొడుతున్నారు. మనకు ఛాయిస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఓ మూలకు ఉండు. నీవు సైలెంట్‌గా ఉండు అంటూ అని దేవయాని హెచ్చరించింది.

అయితే దేవయాని తన కొడుకుకు క్లాస్ పీకుతుంటే.. అలా గడ్డిపెట్టు అంటూ కోడలు ధరణి సలహా ఇస్తుంది. దాంతో నేను ఏ క్లారిటీతో పనిచేయనని నీ అభిప్రాయమా? అంటే.. ఆకాశంలో చందమామను అందుకోవాలని అనుకొంటారు. కానీ కుదరదు కదా అంటే.. ఎండీ సీటు చందమామనా? అంటూ మనసులో అనుకొన్నాడు.
తన కోడలు అధైర్యంగా ఉంటే.. మహేంద్ర ఊరట కలిగించేందుకు ప్రయత్నించారు. దేవయాని, ఇతరులు అవమానించడాన్ని పట్టించుకోవద్దు. మన పరిస్థితి బాగాలేకుండా మన మనసులను ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తారని అంటే.. నా ప్రాణం నాకు దూరంగా ఉంది. కాలేజీ సమస్యలు నన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కానీ రిషి సార్ విషయం ఏమీ చేయలేకపోతున్నాను. ఆయన విషయంలో నేను చేతగానీ దానిలా ఉన్నాను అని వసుధార అంది.

రిషికి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు నెరవేరడం లేదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకొన్న జగతి నాకు దూరమైంది. ఆమె నా ప్రాణం అనుకొన్నాను. నా కొడుకు దూరమయ్యాను. నా ముందే నిన్ను అనేక విధాలుగా అవమానిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నాను. జగతితోనే నేను పోయి ఉంటే బాగుండేది. నీ కళ్లలో నీళ్లు చూస్తుంటే గుండె తురుక్కుపోతున్నది అని మహేంద్ర అంటే.. మామయ్య నేను ఓ పని చేస్తాను. నేను విషయానికి కట్టుబడి ఉన్నాను అని వసుధార అంటే.. ఇప్పుడు ఏం చేద్దామని అంటే.. సమాధానం ఇవ్వకుండా మీరు కూడా నాతో రావొచ్చు అని వసుధార అని అతడిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లగానే షాక్ తిన్న మహేంద్ర ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటే.. రండి అంటూ తీసుకెళ్లి ఇన్స్‌పెక్టర్ వద్దకు వెళ్లి.. రిషి కేసు ఏమైంది అంటే.. కేసు క్లోజ్ చేశామని పోలీస్ అన్నాడు. అయితే రిషి బతికి ఉన్నారని చెప్పానుగా.. కేసు ఎలా క్లోజ్ చేస్తారు అంటే.. మీరు బాధలో ఉన్నారని భ్రమలో ఉండి అలా మాట్లాడరంటే.. ఓకే..ఇప్పుడు కూడా అలామాట్లాడితే ఎలా? ఆయన డీఎన్ఏ కూడా రుజువు చేశాయి. మహేంద్ర గారు కూడా తన కొడుకు చనిపోయారని ఒప్పుకొన్నారని ఇన్స్‌పెక్టర్ సమాధానం ఇచ్చారు.

అయితే రిషి సార్ బతికే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి అని వసుధార వాదిస్తే.. మీరు ఇంకా వాస్తవం రావడం లేదు అని పోలీస్ జవాబిచ్చాడు. రాజీవ్ విషయంలో చనిపోయాడని భావించారు. కానీ అతడు బతికే ఉన్నాడని రుజువు అయింది అని వసుధార అంటే.. అరుదుగా అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి అని పోలీస్ సమాధానం ఇస్తూ.. రాజీవ్ కేసు వేరు.. రిషి సార్ కేసు వేరు. మీరంటే ఇష్టం లేదు కాబట్టే ఆయన మీకు దూరంగా వెళ్లిపోయారు అని పోలీస్ షాకిచ్చాడు.

అయితే అలా మాట్లాడకంటే.. రిషితో నా బంధం వేరు. ఆయన బతికే ఉన్నారు. మీరు అలా మాట్లాడకండి అని వసుధార ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రిషి ఉన్నారని రుజువు చేయండి.. నేను కేసు రీ ఓపెన్ చేస్తాను అని అంటాడు. అయితే ఇన్స్‌పెక్టర్ చెప్పిన మాటలు చెవుల్లో రీసౌండ్ ఇస్తూ ఉండటంతో ఆలోచనల్లో పడింది. అయితే నెలలు గడిచినా రిషి ఆచూకీ తెలియడం లేదు అంటే.. నిన్ను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. అతడి గుండెచప్పుడు నీవే అంటే మహేంద్ర అన్నాడు. నా గుండె చప్పుడు నా కోసం వేచి ఉంది.నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. రిషికి నాపై కోపమా? నా కళ్లలో నీళ్లు తిరిగితే.. రిషి సార్ భరించలేరు అని వసుధార కంటతడి పెట్టింది.

నా ప్రాణంగా ప్రేమించిన రిషిని సొంతం చేసుకొనేందుకు నేను అప్పుడు అలా చేశాను. ఆయన కోసం నా మనసును చంపుకొన్నాను. రిషి సార్ లేకపోతే నా జీవితం శూన్యం. నా జీవితం ఏమౌపోతుందని మా అమ్మ ఈ లోకం నుంచి దూరమయ్యారు. మనల్ని బాగా చూసుకొనే జగతి మనకు దూరమయ్యారు. ఇప్పుడు రిషి సార్ దూరమయ్యారు. రిషి సార్ లేరని.. అందరూ. పోలీసులు కూడా చెబుతున్నారు. ఇంకా నేను బతికే ఉన్నానంటే.. రిసి సార్ ఉన్నట్టు.. నా ఊపిరి ఆగిపోతే రిషి లేనట్టే.. అంటే.. అది నిజమేనని నేను నమ్ముతున్నాను అని మహేంద్ర అంటే.. అది కల బాబాయ్ అంటూ దేవయాని కొడుకు షాకిచ్చాడు.


Click it and Unblock the Notifications











