Guppedantha Manasu: 4 దిక్కుల్లో నలుగురి బాధలు.. ఛైర్మన్‌కు వసు కంప్లైంట్.. రంగంలోకి కొత్త రౌడీ!
మహేంద్రతో జగతి చిన్నత్తయ్యతో మాట్లాడొచ్చు కదా అని ధరణి అడుగుతుంది. మీలాగే చిన్నత్తయ్య కూడా బాధపడుతోంది అని ధరణి అంటే.. లేదమ్మా.. తప్పు. రిషి దూరం కావాలని వాడి నుదుటి మీద రాత రాసిందే జగతి. అలాంటి తను బాధపడటంలో అర్థం లేదు అని మహేంద్ర అంటాడు. నువ్వు కొత్తగా వచ్చిన రోజుల్లో చూసుంటావ్. నేను రిషి ఎలా ఉండేవాళ్లమో.
అలాంటి రిషిని చిన్నప్పటి నుంచి పెంచిన నేను వాడు ఇప్పుడు నా పక్కన లేకపోతే తట్టుకోలేకపోతున్నా. ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉన్నానా అనిపిస్తుంది అని మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 6 మంగళవారం నాటి ఎపిసోడ్ 782 లో ఇంకా ఏం జరిగిందంటే?

ఎవరికీ తెలియదు: మహేంద్ర మాటలు పక్కనే ఉండి విన్న జగతి అల్లాడిపోతుంది. మహేంద్ర దగ్గరకు వచ్చి.. రిషి నా కడుపున పుట్టడమే పాపం, నన్ను ఇంటికి తీసుకురావడమే శాపం అని జగతి బాధగా అంటుంది. దీంతో సోఫాలో నుంచి లేచిన మహేంద్ర.. నాకొక సాయం చేయమ్మా ధరణి. ఇలా ఇంకెప్పుడు ఎవరి తరఫున వకల్తా తీసుకురావద్దని చెప్పేసి వెళ్లిపోతాడు.
చిన్నత్తయ్య మీరు రాకముందు ఆ తండ్రీ కొడుకులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్లను చూసి కుళ్లుకోని వారు లేరు. అలాంటిది వాళ్లు దూరంగా ఉంటారని కలలో కూడా అనుకోలేదు. రిషి ఎంత బాధపడుతున్నారో ఎవరికీ తెలియదు. నా అన్న వాళ్లు కూడా పక్కన ఎవరూ ఉండరని ధరణి అంటుంది. దీంతో అన్నింటికి తానే కారణమని జగతి కుమిలిపోతుంది.

అదే ప్రయత్నంలో: తప్పు చేసింది మీరు కాదు చిన్నత్తయ్య. ఎవరో మీకు తెలుసు. మిమ్మల్ని కట్టి పడేసిన బంధాలను వదిలించుకుంటేనే అందులో నుంచి బయట పడగలరు అని ధరణి అంటుంది. చాలా ఎదిగిపోయావ్ ధరణి. బాగా మాట్లాడుతున్నావ్. చాలా బాగా చెప్పావ్ అని జగతి అంటుంది. మీ బాధ చూడలేక చెప్పాలనిపించింది చిన్నత్తయ్య. ఇప్పుడు మీరు మౌనంగా ఉండటం సరికాదు.
ఇప్పుడు మిమ్మల్ని అందరు దోషిలా చూస్తున్నారు. ఏది చెప్పిన నమ్మరు. ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో కనుక్కోవాలి. వాళ్లను తీసుకొస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని ధరణి అంటుంది. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. కానీ వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు అని జగతి అంటుంది.

వంకర సమాధానాలు: వెతకాలి, వాళ్లని ఇంటికి తీసుకొస్తేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ చిన్నత్తయ్య రిషి, వసుధార ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి అని జగతి అంటుంది. మరోవైపు కాలేజీలో వసుధారకు ఇన్వేజిలేషన్ పడుతుంది. వెళ్లేముందు మీరు ఆ కేడీ బ్యాచ్ ఉన్న గదిలోకే వెళ్తున్నారు జాగ్రత్త అని మరో లెక్చరర్ చెబుతుంది. వాళ్లు ఎగ్జామ్ రాయరు. అడిగితే ఏవేవో కారణం చెబుతారు అంటుంది. తర్వాత ఎగ్జామ్ కి పేపర్స్ ఇస్తుంది వసుధార.
ఒకడు సరిగా ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఎందుకు రాయట్లేదని వసు అడుగుతుంది. పేపర్ చెట్ల నుంచి వస్తుంది. దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదని సోది చెబుతాడు. మరో నలుగురు కూడా అలాగే వంకర సమాధానాలు చెప్పి వసుధారకు చిరాకు తెప్పిస్తారు. దీంతో చెప్తా మీ సంగతి అని ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్తుంది వసుధార.

ఛైర్మన్ కు కంప్లైంట్: పరీక్ష సరిగా రాయట్లేదని, అడిగితే వెటకారంగా ఆన్సర్స్ ఇస్తున్నారని ప్రిన్సిపాల్ కు చెబుతుంది వసుధార. మీరు కొత్తగా చేరారు కాబట్టి అలా అనిపిస్తుంది. అసలు వాళ్లను మీరు పట్టించుకోవద్దు. అర్థం చేసుకుని, మీ పని మీరు చేసుకోండని ప్రిన్సిపాల్ సలహా ఇస్తాడు. లేదు సార్. వాళ్ల మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే నేను ఛైర్మన్ కు కంప్లైంట్ ఇస్తాను.
వాళ్లను సస్పెండ్ చేయిస్తాను అని వసుధార అంటుంది. అప్పుడే టీ పట్టుకుని వచ్చిన కాలేజీ బాయ్ ఆ మాటలు వింటాడు. ఈ విషయంలో నేను ఏం చేయలేను అని ప్రిన్సిపాల్ అంటాడు. సరే ఛైర్మన్ ను కలుస్తానని వసుధార అంటుంది. ఈ మాటలు విన్న బాయ్ వెళ్లి కేడీ బ్యాచ్ కు చెబుతాడు.
ద్రోహం చేశారు: ఇప్పటివరకు అందరూ పారిపోయారు. కానీ ఎవరూ ఛైర్మన్ కు చెబుతాని అనలేదు. నేను మా నాన్నతో మాట్లాడతాను అని పాండ్యన్ సీరియస్ గా అంటాడు. అంటే త్వరలో మరో కొత్త రౌడీని వసుధార ఢీ కొట్టబోతుందని తెలుస్తోంది. ఇక రాత్రిపూట జగతి, వసుధార, మహేంద్ర, రిషి నలుగురు నాలుగు చోట్ల ఉండి జరిగిన విషయాలను తలుచుకుంటూ బాధపడుతుంటారు.
రిషి తప్పు చేశాడని జగతి, వసు చెప్పడం బాధగా ఉంది. రిషిని పంపించడానికి కారణం ఏంటో చెప్పొచ్చు కదా అని మహేంద్ర అనుకుంటాడు. చెప్పలేం. రిషి ప్రాణాల కోసం అబద్దం ఆడాల్సి వచ్చిందని వసుధార అనుకుంటుంది. నా అనుకునే మనుషులే నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేకపోతున్నాను అని రిషి బాధపడతాడు.
ఆత్మాభిమానం అడ్డొస్తుంది: నన్ను కాపాడటానికి అని కారణం చెప్పి నన్ను బతికి ఉండగానే చంపేశారు కదా మేడమ్. ఈ నింద మోయలేకపోతున్నాను అని రిషి అనుకుంటాడు. నేను మీకు చెప్పాలని అనుకున్న సార్.. కానీ అప్పుడే మీ మీద పూల కుండీ పడబోయింది. అందుకే ఆగిపోయాను. మేడమ్ చేసింది కరెక్ట్ కాదని తెలిసి కూడా తప్పు చేశానని వసుధార అనుకుంటుంది.
మన మధ్య దాపరికాలు ఉండకూడదని చెప్పా. కానీ నువ్వు ఏదేదో ఆలోచించి నన్ను బలి పశువును చేశారు. వాళ్లు చేసినా తప్పుకు మీరు బలి అయ్యారు, మిమ్మల్ని బాధపెడుతున్నా. మీకోసం రావాలని ఉంది. కానీ నా ఆత్మాభిమానం అడ్డొస్తుంది డాడ్ అని రిషి అంటాడు. అందరినీ క్షమించి రా నాన్న ఆని మహేంద్ర అంటాడు. ఈ జీవితంలో వాళ్లను క్షమించలేను డాడ్ అని రిషి అనుకుంటాడు.


Click it and Unblock the Notifications











