Guppedantha Manasu: రిషి దెబ్బకు షాక్ అయిన కేడీ బ్యాచ్.. కొద్దిలో మిస్ అయిన వసుధార

కాలేజీలో కేడీ గ్యాంగ్ అరాచకాలు, పాండ్యన్ తండ్రి రౌడీ మురుగన్ ఇంటికి వచ్చి బెదిరించడం వంటి విషయాలన్ని ప్రిన్సిపాల్ తో క లిసి ఛైర్మన్ విశ్వనాథ్ కు వసుధార చెబుతుంది. అది విన్న ఛైర్మన్ యాక్షన్ తీసుకుంటానని అంటాడు. ఛైర్మన్ యాక్షన్ తీసుకుంటాడని పాండ్యన్ గ్యాంగ్ కు తెలుస్తుంది. దీంతో మురుగున్ నేరుగా ఛైర్మన్ విశ్వనాథ్ ఇంటికి వస్తాడు. ఛైర్మన్ అయుండి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. చిన్న పిల్లలు తప్పులు చేసినప్పుడు చూసి చూడనట్లు వదిలేయాలి అని మురుగన్ అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూన్ 8 గురువారం నాటి ఎపిసోడ్‌ 784 లో ఇంకా ఏం జరిగిందంటే?

నోటి మాట రాదు:నా కొడుకు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తే నాకు నచ్చదు అని మురుగున్ అంటాడు. ఏంటీ బెదిరిస్తున్నావా అని విశ్వనాథ్ అంటాడు. దీనికి నాకు బెదిరింపులు, వార్నింగ్ లు తెలియవు. పెద్దవాళ్ల కావడంతో మర్యాదగానే చెబుతున్నాను. నిజంగా నేను వార్నింగ్ ఇవ్వాలనుకుంటే లారీలో వందల మంది ఈ ఇంటిని చుట్టుముడతారు, ఇలా కత్తితో కొబ్బరిబోండాన్ని కాకుండా మీ నోటి నుంచి మాట రాకుండా చేస్తుంది. మావాడు ఏరికోరి ఎంచుకున్న కాలేజీ అది. నువ్వు కాలేజీ నుంచి పాండ్యన్ ను సస్పెండ్ చేస్తే వాడు బాధపడతాడు. వాడు బాధపడితే నాకు భయం వేస్తుంది. నాకు భయం వేస్తే కోపం వస్తుంది. ఆ కోపంలో నేను ఏదైనా చేయొచ్చు. ఏదైనా జరగొచ్చు అని మురుగున్ అంటాడు.

Guppedantha Manasu Serial June 8 2023 Today Full Episode 784

సస్పెండే చేస్తేనే:సస్పెండ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. అసలే రోజులు బాగాలేవు. బయట క్రైమ్ ఎక్కువగా జరుగుతోంది అని మురుగున్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇక మరోవైపు కేడీ బ్యాచ్ తనను క్లాస్ రూమ్ లో అవమానించడాన్ని తట్టుకోలేకపోతుంది. తను వెళ్తుంటే ప్రిన్సిపాల్ చూసి ఏమైందని అడుగుతాడు. వసుధార అంతా చెబుతుంది. కలెక్టర్స్, డాక్టర్స్ ను తయారు చేసే టీచర్లను అడుగడుగునా అవమానించడం తట్టుకోలేకపోతున్నాను. వారిని సస్పెండ్ చేయలకేపోతే కాలేజీ నుంచి వెళ్లిపోతానని వసుధార అంటుంది. ఈ విషయం గురించి కూడా ఛైర్మన్ విశ్వనాథ్ కు ఫోన్ చేసి చెబుతాడు ప్రిన్సిపాల్. సరే నేను మాట్లడాతను అని విశ్వనాథ్ అంటాడు. ఈ విషయం, మరుగన్ వార్నింగ్ గురించి రిషితో చర్చించిన విశ్వనాథ్ ఏం చేయాలో తెలియట్లేదు అంటాడు.

Guppedantha Manasu Serial June 8 2023 Today Full Episode 784

ప్లాన్ రివర్స్:సరే కాలేజీకి నేను వెళ్లొచ్చా అని రిషి అడిగితే.. సంతోషంగా వెళ్లొచ్చు అని విశ్వనాథ్ చెబుతాడు. దీంతో రిషి కాలేజీలో అడుగుపెడతాడు. అప్పుడే కాలేజీ ముందు కేడీ బ్యాచ్ ఫుట్ బాల్ ఆడుతుంటారు. కాలేజీ ముందు ఆటలేంటీ, గ్రౌండ్స్ కు వెళ్లి ఆడుకోమ్మని చెప్పిన లెక్చరర్ ను అవమానిస్తారు. ఇంతలో రిషి రావడంతో కొత్త లెక్చరర్ అనుకుని, అడుగుపెట్టినప్పుడే ఇన్సల్ట్ చేయాలని అనుకుంటారు కేడీ బ్యాచ్. ఫుట్ బాల్ తో రిషిని కొట్టాలని చూస్తాడు పాండ్యన్. కానీ ఆ ఫుట్ బాల్ ఆపి రివర్స్ కేడీ బ్యాచ్ కు రివర్స్ షాట్ కొడతాడు రిషి. దీంతో అందులో ఒక్కడికి దెబ్బ తగులుతుంది. అది చూసి వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటారు. రిషి వెళ్లేదారిలో కింద పడేలా వైర్ కడతారు. దాన్ని మరో లెక్చరర్ చూస్తే అతన్ని నీకెందుకు అని పంపిస్తారు.

Guppedantha Manasu Serial June 8 2023 Today Full Episode 784

ప్రాబ్లమ్ ఏంటీ:కాలేజీ స్టాఫ్ దగ్గరికి వచ్చిన ఆ లెక్చరర్ ఎవరో కింద పడేలా వైర్ కడుతున్నారని చెబుతాడు. అది విన్న వసుధార పాపం ఎవరో అనుకుంటూ ఆపేందుకు వెళ్తుంది. మరోవైపు రిషి ఆ వైర్ కు తాకి పడకుండా.. దాని మీద నుంచి దూకి వెళ్తాడు. దీంతో పాండ్యన్ బ్యాచ్ అవమానంగా ఫీలవుతారు. ఈసారి బొమ్మ కనపడేలా ప్లాన్ చేస్తానని అంటాడు పాండ్యన్. రిషి నడుచుకుంటా నేరుగా ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్తాడు. ఇక కేడీ బ్యాచ్ ఇన్సల్ట్ చేయాలనుకున్న వ్యక్తి కనపడకపోవడంతో వసుధార తిరిగి కాలేజీ స్టాఫ్ గదికి వెళ్తుంది. పాపం ఎవరో అతను, ఇప్పుడు కాలేజీ గురించి ఏమనుకుంటారో అనుకుంటుంది. మరోవైపు ప్రాబ్లమ్ ఏంటీ అని ప్రిన్సిపాల్ ను రిషి అడుగుతాడు.

Guppedantha Manasu Serial June 8 2023 Today Full Episode 784

తండ్రికి బుద్ధి చెప్పాలి:ఇక్కడ లెక్చరర్స్ నే స్టూడెంట్స్ ఏడిపిస్తున్నారు. కేడీ బ్యాచ్ అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. రోజురోజుకు దిగజారుతున్నారు అని ప్రిన్సిపాల్ అంటాడు. హా వాళ్ల వెకిలి చేష్టలు నేను కూడా చూశాను. వాళ్లకు మొదట్లోనే వార్నింగ్ ఇస్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని రిషి అంటాడు. వార్నింగ్ ఇచ్చాను. దాంతో నాపై కక్ష కట్టి నా కారులో చక్కెర పోశారు. కొత్తగా వచ్చిన మ్యాథ్స్ లెక్చరర్ ను క్లాస్ రూమ్ లోనే అవమానించారు అని చెబుతాడు ప్రిన్సిపాల్. కేడీ బ్యాచ్ ను సస్పెండ్ చేయాలని చెబితే.. వసుధారతోపాటు ఛైర్మన్ సర్ కే వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఏం చేయమంటారు అని ప్రిన్సిపాల్ అంటాడు. అయితే స్టూడెంట్స్ తో సమస్య కాదు. వాళ్ల నాన్నతో.. అతనితో ఓసారి మాట్లాడితే సరిపోతుంది అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial June 8 2023 Today Full Episode 784

కేడీ బ్యాచ్ షాక్:అయ్యో సార్.. వాడు నరరూప రాక్షసుడు. ఎదురుతిరిగన వాళ్లను మట్టిలో కలిపేస్తాడు అని ప్రిన్సిపాల్ భయపడితే.. ఆ స్టూడెంట్స్ లో మార్పు వచ్చేందుకు నేను ఎంతదూరం అయినా వెళ్తాను. మురుగన్ కు బుద్ధి చెబితే వీళ్లు సెట్ అవుతారు అని చెప్పిన రిషి మురుగున్ ఇంటి అడ్రస్ తీసుకుని వెళ్తాడు. రిషి కారు దగ్గరికి వచ్చేసరికి టైర్ లో గాలి తీస్తారు కేడీ బ్యాచ్. గాలిపోయిందంటూ కేడీ బ్యాచ్ ఆటపట్టిస్తారు. వాళ్లను చూసి నవ్విన రిషి స్టెపినీ తీసి కారు టైర్ మార్చుకుని వెళ్లిపోతాడు. అది చూసిన కేడీ బ్యాచ్.. షాక్ అవుతారు. వీడు లెక్చరర్ కాదనుకుంటారా అని కేడీ గ్యాంగ్ రేణుక అంటే.. ఎవడైతే మనకేంటి ఇప్పటివరకు ఎంజాయ్ చేశామా లేదా అని పాండ్యన్ అంటాడు. మనం ఇంత ఆటపట్టిస్తుంటే వాడేంట్రా చూసి నవ్వుతాడు అని రేణుక అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X