Guppedantha Manasu: 'పుష్ప' తరహాలో రిషి వార్నింగ్.. అదిరిపోయిన మాస్టర్ దెబ్బ భయపడిన మురుగన్

విష్ కాలేజీలో రిషి కారు టైర్లో గాలి తీస్తారు కేడీ బ్యాచ్. స్టెపినీతో టైర్ మార్చుకుని కేడీ బ్యాచ్ ను చూసి నవ్వి వెళ్లిపోతాడు రిషి. దీంతో కేడీ బ్యాచ్ లో ఒకడైన రోహిత్.. రేయ్ పాండ్యన్ వాడు లెక్చరర్ అయ్యి ఉండడురా అని అంటాడు. ఎవడైతే మనకెందుకురా వాడి ద్వారా కాసేపు మనం ఎంజాయ్ చేశామా లేదా అనేది ముఖ్యం అని పాండ్యన్ అంటాడు. అవును అన్నట్లుగా తల ఊపుతాడు రోహిత్. అయినా వాడి నవ్వు నాకు నచ్చేలేదు అంటాడు పాండ్యన్. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జూన్ 9 శుక్రవారం నాటి ఎపిసోడ్‌ 788 లో ఇంకా ఏం జరిగిందంటే?

ఎవరప్పా నువ్వు:మన కాలేజీలోకి వచ్చిన వాళ్లను అలాగే పంపిస్తున్నాం. స్టూడెంట్స్ అంటే లెక్చరర్స్ కు దడదడగా ఉంది. మళ్లీ వాడు వస్తాడంటావా అని రోహిత్ అంటాడు. వస్తే రాని. వాడు మళ్లీ వస్తే చుక్కలు చూపించాల్సిందే. టైర్లో గాలి తీయాల్సిందే. వాడికి ఓపిక ఉన్నంతవరకు టైర్ మార్చుకోవాల్సిందే అని పాండ్యన్ అంటాడు. మరోవైపు మురుగన్ ఇంట్లో తన మనుషులతో ఒళ్లు పట్టించుకుంటాడు. వాళ్లలొ ఒకడు మురుగన్ కు కొబ్బరి బోండాం కొట్టి ఇవ్వబోతుంటాడు. ఆ కొంబరి బోండాన్ని వెంటనే తీసుకుని అక్కడే కుర్చీలో కూర్చుని తాగుతాడు రిషి. ఎవరప్పా నువ్వు అని మురుగన్ అడుగుతాడు. దాహంగా ఉంది కొబ్బరి బోండాం తాగి చెబుతాను అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial June 9 2023 Today Full Episode 785

హద్దు దాటకూడదు:ఏంట్రా అట్లా చూస్తున్నావ్.. ఇంకో కొబ్బరి బొండాం కొట్టు అని మురుగున్ అంటాడు. కొబ్బరి బొండాం తాగిన తర్వాత.. ఇప్పుడు చెప్పప్పా ఎవరు నువ్వు అని అడుగుతాడు మురుగున్. విశ్వనాథం, కాలేజీ ఛైర్మన్ అని రిషి చెబుతాడు. హో.. కాలేజీలో పంతులువా. మావాడు నిన్నేమైన అన్నాడా. వాడివి అచ్చం నా పోలికలే అప్పా అని మురుగన్ అంటాడు. కాలేజీలో మీ పిల్లల ప్రవర్తన ఏం బాలేదు. పిల్లలు చెడిపోతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులే అవుతారు. అందుకే కొంచెం వాళ్లని దారిలో పెట్టమని చెప్పడానికి వచ్చాను అని రిషి అంటాడు. ఏందప్పా బెదిరిస్తున్నావా అని మురుగున్ అంటాడు. నువ్వు ఏమైనా అనుకో అప్పా. కానీ పిల్లలు మాత్రం ఇక నుంచి హద్దులు దాటి ప్రవర్తించకూడదు అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial June 9 2023 Today Full Episode 785

గుణపాఠాలు చెప్పగలను:కుదరదు అంటే అని తాపీగా అంటాడు మురుగన్. దానికి కాస్తా ముందుకు వంగి బెండు తీస్తా అని రిషి అంటాడు. ఏంట్రా.. పంతులు కదా అని కాస్తా మర్యదగా మాట్లాడుతుండ. ఏంటప్పా.. నా గురించి నీకు తెలియదు. అందుకే ఇంత ధైర్యంగా నా ఇంటికి వచ్చి నా ముందుకు కూర్చుని మాట్లాడుతున్నావ్ అని మురుగున్ అంటాడు. నీకే నా గురించే తెలియదు. అందుకే చెబుతున్నాను. నాకు ఎదురు రావడం మంచిది కాదు అని అంటాడు రిషి. నువ్వేమైనా పుడింగివా. ఏం చేయగలవ్. మహా అయితే పాఠాలు చెప్పగలవ్ అని మురుగన్ అంటాడు. దారి తప్పే వాళ్లకు బుద్ధి చెప్పగలను. పాఠాలతోపాటు గుణపాఠాలు కూడా నేర్పిస్తాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial June 9 2023 Today Full Episode 785

మురుగన్ లో భయం:కోపంగా లేచిన మురుగన్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని అంటే.. మురుగన్.. నేను మ్యాథ్స్ లో ఎక్స్ పర్ట్ ని. తీసివేతలు బాగా తెలుసు. అదే సొసైటీలో ఉన్న వెధవల్ని, దుర్మార్గుల్ని అలాగే కేడీ బ్యాచ్ లాంటి చిల్లర గ్యాంగ్ ను తీసివేయడం కూడా బాగా తెలుసు. ఎవరైనా మంచిగా చెప్పిన కూడా వినకుంటే కాళ్లు చేతులు విరగొట్టి హెచ్చరించడం తెలుసు. అలాగే కూడికలు బాగా తెలుసప్పా. సమాజంలో మంచి వాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారు. కానీ ఈ మధ్య ఎక్కువగా చెత్త ఎక్కువైపోతుంది. కూడికలు లాగా ఆ చెత్తనంతా ఒకేచోట కూడబెట్టి తగలబెట్టడం కూడా తెలుసు అంటాడు రిషి. మురుగన్ పక్కనే ఉన్న రౌడీ రిషి మీదకు చేయి ఎత్తితే వాడి చేయి విరుస్తాడు రిషి. వెనుక నుంచి వచ్చిన వాడిని చేతిలో ఉన్న బోండాంతో కొడతాడు రిషి. దీంతో మురుగన్ లో భయం మొదలవుతుంది.

Guppedantha Manasu Serial June 9 2023 Today Full Episode 785

ఫైనల్ వార్నింగ్:మురుగన్ ఇంకోసారి లెక్చరర్స్ ఇంటికి వెళ్లి భయపెట్టడాలు, విశ్వనాథం గారి ఇంటికి వెళ్లి బెదిరించాలని చూస్తే అస్సలు ఊరుకోను. నువ్వు తప్పు చేసినా పిల్లలు తప్పు చేసినా ఆ శిక్ష నీ పిల్లలకే వేస్తాను. నువ్వు ఎలా చెబుతావో. ఏం చెబుతావో నాకు తెలియదు. వాళ్లని అందరితో మర్యాదగా ఉండమని చెప్పు. ముందు నీ బెండు తీస్తేనే వాళ్లు సెట్ అవుతారు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నా మాట వింటే నీకే మంచిది. కాదు కూడదు.. లెక్చరరే కదా అనుకుని.. అంటూ ముందుకు వెళ్తుంటే పక్కన ఉన్న రౌడీ వాన్ని కొడతాడేమో అని భయపడిపోతాడు. అరేయ్ నిన్ను ఏం అనన్రా అని అన్న రిషి.. నీలాంటి రౌడీలను చూడటం నాకేమి కొత్త కాదు. కానీ నీలాంటి వాడిని చూడటం నీకే కొత్త జాగ్రత్త. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. అప్పుడే వచ్చిన మరో రౌడీ అన్నా ఏంటన్నా ఇది. చెప్పు వాన్ని వేసేయనా అంటాడు.

Guppedantha Manasu Serial June 9 2023 Today Full Episode 785

ధైర్యంగా ఉంటుంది:రిషి దెబ్బలకు వేరే గదిలోకి వెళ్లిన రౌడీలను పిలుస్తాడు మురుగన్. అందులో ఒకడికి చెవి సరిగా వినిపించకపోతే.. మళ్లీ వచ్చిన రిషి మరో దెబ్బ కొట్టి సెట్ చేస్తాడు. కొబ్బరి బోండానికి థ్యాంక్స్. అది చెబుదామనే వచ్చాను అని పుష్ప స్టైల్ లో చెప్పి వెళ్లిపోతాడు. ఏం చేద్దాం అన్న అని రౌడీ అంటే.. ఏం చేయొద్దు. వాడిపై ఓ కన్ను వేయండి అని మురుగన్ అంటాడు. మరోవైపు కాలేజీకి వెళ్లిన రిషి ప్రిన్సిపాల్ తో కేడీ బ్యాచ్ తో ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ల నాన్నకు బుద్ధి చెప్పి వచ్చాను అంటాడు. దీంతో సంతోషపడిన ప్రిన్సిపాల్ కాలేజీ స్టాఫ్ కు పరిచయం చేస్తాను, ఈ విషయం తెలిస్తే వాళ్లకు కాస్తా ధైర్యంగా ఉంటుంది అంటాడు. రిషి సరే అనడంతో కాలేజీ స్టాఫ్ లోకి తీసుకెళ్తాడు ప్రిన్సిపాల్. అప్పుడే తండ్రి చక్రపాణి ఫోన్ చేస్తే సరిగ్గా వినపడకపోవడంతో వసుధార బయటకు వెళ్తుంది.

Guppedantha Manasu Serial June 9 2023 Today Full Episode 785

మిస్ అయిన వసుధార:కాలేజీ స్టాఫ్ కు ఇతను రిషి. ఛైర్మన్ కా బాగా కావాల్సినవాడు. మురుగన్ కు బుద్ధి చెప్పారు అని ప్రిన్సిపాల్ అంటాడు. అవునా, చాలా థ్యాంక్స్ అండి అని కాలేజీ స్టాఫ్ అంటుంది. మీకు ఏ సమస్య ఉండదు. ఇక నుంచి మీరు చదువు చెప్పడంపై దృష్టి పెట్టండి అని చెప్పి రిషి వెళ్లిపోతాడు. ఇంతలో వసు వస్తుంది. వసుకి మురుగన్ కు ఓ వ్యక్తి వార్నింగ్ ఇచ్చారట. ఇక కేడీ బ్యాచ్ ఆగడాలు తగ్గినట్లే అంటారు. అవునా అనకుంటూ ఎవరో చూద్దామని వెళ్తుంది వసుధార. కానీ అప్పటికే రిషి కారులో వెళ్లిపోతాడు. కాలేజీ నుంచి కారు వెళ్లడం చూసిన వసు జస్ట్ మిస్ అనుకుంటుంది. మరోవైపు ఇంటికి వచ్చిన రిషి.. విశ్వనాథం, ఏంజెల్ కి జరిగింది చెబుతాడు. ఇక నుంచి కాలేజీలో ఉండు రిషి. అదే బెటర్. నువ్వు అక్కడ ఉంటేనే పిల్లల సంగతి చూసుకోగలవు. సమస్యలు తగ్గేదాకా కాలేజ్ చూసుకో అని విశ్వనాథ్ అంటాడు. అందుకు ససేమిరా ఒప్పుకోడు రిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X