Guppedantha Manasu: దేవయానికి పెద్ద షాక్.. అత్తింట్లో అడుగు పెట్టిన వసుధార.. గాయం అంటూ రిషి!
మినిస్టర్ ఇచ్చిన బహుమతులను వసుధారకు ఇచ్చేస్తాడు రిషి. ఇది నువ్ చేసిన పనికి వచ్చిన గిఫ్ట్స్ అని రిషి అంటాడు. ఇవి మనవి కదా సార్ అని వసుధార అంటుంది. మంగళసూత్రం నీ మెడలోనే ఉంది. నీకు నువ్వుగా కట్టుకున్నావ్ కదా తీసుకో అని రిషి అంటాడు. అన్నీ నేనే తీసుకుంటే మీకు ఎలా సార్ అని వసుధార అంటుంది. నాకు నా గాయాలు ఉన్నాయి వసుధార అవే సరిపోతాయి అని బాధగా అన్న రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వసుధార బయటే నిల్చుని ఉంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 10 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 707లో ఇంకా ఏం జరిగిందంటే?

గాయాలన్నీ భరిస్తున్నా కదా..
వసుధార బయటే ఉండటం, వాళ్లిద్దరు మాట్లాడుకోవడం గమనిస్తాడు చక్రపాణి. ఏదో ఆలోచిస్తూ లోపలకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్లి కారు ఆపి దిగుతుండగా.. వసుధార కూర్చున్న సీట్లో మల్లెపూలు కనిపిస్తాయి. నేను మీ భార్యని కాదన్నప్పుడు ఈ పూలు ఎందుకు కొనిచ్చారని వసుధార అన్నమాటలు గుర్తు చేసుకుంటాడు రిషి.
ఇంతలో వసుధార నుంచి మెసేజ్ వస్తుంది. థ్యాంక్స్ ఎండీగారు. మీరు జెంటిల్ మెన్ అని మెసేజ్ చేస్తుంది. ఎందుకు థ్యాంక్స్ అని రిషి అడిగితే.. అన్నింటికి మీరు జెంటిల్మెన్ సార్ అని వసుధార అంటుంది. గాయాలన్నీ భరిస్తున్నా కదా నేను జెంటిల్మెన్ నే అని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార మంగళసూత్రానికి ఉన్న వీఆర్ ఉంగరం చూసి బాధపడుతుంది.

ఎదురుగా చక్రపాణి..
నాకోసం ఇంతలా తాపత్రయ పడుతున్నప్పుడు నేను మిమ్మల్ని అలా ఎలా వదిలేస్తాను సార్. మీకోసం ఒక అడుగు ముందుకు వేస్తాను అని అనకుంటూ గుడ్ డే ఎండీగారు అని మెసేజ్ చేస్తుంది వసుధార. దేవయాని సోఫాలో కూర్చుని కాఫీ తీసుకురమ్మని ధరణిని పిలుస్తుంది. ఇంతలోనే అక్కడికి ఫణీంద్ర, మహేంద్ర, జగతి వస్తారు. పాలు ఇంకా రాలేదని ధరణి అంటుంది. ఏంటీ ధరణి నువ్వు పాలు లేకపోతే తెప్పించుకోవాలి కదా.
వదిన గారిని ఇబ్బంది పెడితే ఎలా అని మహేంద్ర అంటాడు. నాకోసం కాదు మహేంద్ర రిషి కోసం. రిషి లేచి కాఫీ అడిగితే అప్పుడు ఏం చెప్పాలి అంటూ నటిస్తుంది దేవయాని. ఇంతలో పాలు వచ్చాయని తలుపు తీసేందుకు దేవయాని వెళ్లగా అక్కడ చక్రపాణి ఉండంతో షాక్ అవుతుంది. ఎవరు దేవయాని అని ఫణీంద్ర అడిగితే.. అలాగే షాక్ లో ఉన్న దేవయాని ఏం మాట్లాడదు. అందరూ అక్కడికి వెళ్లి చక్రపాణిని చూసి షాక్ అవుతారు.

పాడులోకం పాడు మనుషులు..
చక్రపాణితో వసుధార లగేజ్ తీసుకుని రావడంతో అక్కడే అందరూ నిలబడి ఉండిపోతారు. జగతి-మహేంద్ర మాత్రం సంతోషిస్తారు. అప్పుడు నమస్కారం బావగారు అని ఫణీంద్రకు నమస్కారం చేస్తాడు చక్రపాణి. ఏయ్ ఏంటా వరుసలు అని దేవయాని కోపంగా అంటే.. వసుధార ఈ ఇంటికోడలు అయినప్పుడు మీరు నాకు అక్కయ్య గారు ఆయన బావగారు అవుతారు కదా అక్కయ్య గారు అని చక్రపాణి అంటాడు.
వసుధారే తన భార్య అని రిషి సార్ అందరిముందు చెప్పినప్పుడు నా కూతురుని నా ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అక్కయ్య గారు. పాడులోకం పాడు మనుషులు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదా అక్కయ్య గారు అని. అందుకో మీ ఇంటి కోడలును మీకు అప్పగిస్తున్నాను అని చక్రపాణి అంటాడు.

సైలెంట్ గా దేవయాని..
అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ దేవయాని.. ఏంటీ జగతి, మహేంద్ర.. ఏంటీ ఇది. ఏం జరుగుతోంది అని ఆవేశంగా అంటుంది. సమయానికి మా ఇంటి ఆవడి కూడా అందుబాటులో లేదు అక్కయ్య. లేదంటే ఆమె కూడా వచ్చేది అని చక్రపాణి అంటాడు. అప్పుడే వసుధార ఇంట్లోకి అడుగుపెడుతుంది. దేవయాని ఆగు అని అరుస్తుంది. ఏ అధికారంతో లోపలికి వస్తున్నావ్ అని అంటుంది.
వసుధార తన మెడలో ఉన్న తాళిని దేవయానికి చూపించి ఈ హక్కుతో వస్తున్నా అని వసుధార అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దేవయాని ఏం మాట్లాకుండా సైలెంట్ గా ఉంటుంది. వెళ్లొస్తాను అక్కయ్య గారు. మంచి రోజు చూసుకుని అల్లుడిని కూతురిని మా ఇంటికి తీసుకెళ్తాను అని చక్రపాణి అంటే.. కోపంతో దేవయాని రగిలిపోతుంది.

మనసులో సంతోషిస్తాడు..
అత్తింట్లోకి వచ్చిన వసుధార.. ధరణితో మేడమ్ రిషి సార్ లేచారా, కాఫీ ఇచ్చారా అని అడుగుతుంది. పాలు రాలేదని ధరణి సమాధానం ఇస్తుంది. ఇంతలో పాలు రావడంతో.. మీరు వెళ్లి పాలు కాచండి. నేను దేవుడి గుడిలోకి వెళ్లి దండం పెట్టుకుంటాను అని అక్కడికి వెళ్లిపోతుంది వసుధార. ఆ తర్వాత వసుధార దగ్గరికి జగతి, మహేంద్ర వాళ్లు వచ్చి ఏంటిది వసుధార అని జగతి అడుగుతుంది. ఈ భూషణ్ ఫ్యామిలీలోకి స్వాగతం అని మహేంద్ర అంటాడు.
నాన్న తీసుకొచ్చారు మేడమ్.. ఇది తప్పో ఒప్పో తెలియట్లేదు అని వసుధార అంటుంది. చాలా మంచి పని చేశావ్. ముందుకు అడుగు అయితే వేశావ్ కదా అని జగతి అంటుంది. మహేంద్ర కూడా సపోర్ట్ చేస్తూ మహా అయితే రిషి అలుగుతాడు. అంతకుమించి ఏం అనడులే అని అంటారు. నువ్వు ఇంటికి రావడాన్ని రిషి ఒప్పుకోకపోయినా మనసులో సంతోషిస్తాడు. ఒక్క అడుగు వేశావ్. వెనక్కు తిరిగి చూడకు అని జగతి అంటుంది.
రెండోది రిషి సార్..
మరోవైపు ఇది కల నిజమా అని అయోమయంలో ఉంటుంది దేవయాని. తర్వాత తేరుకుని రిషి ఇంకా నిద్ర లేవలేదా అని ధరణిపై ఫైర్ అవుతుంది. రిషి ఏదో అన్నాడని పెట్టాబేడా సర్దుకుని వచ్చేయడమేనా.. భార్య భర్త బంధం అంటే ఏంటీ. అసలు రిషి నిద్ర లేవనీ చెబుతా సంగతి. వసుధార ఈ ఇంట్లోకి అంత ధైర్యంగా వచ్చిందంటే ఈ ఇంట్లో వాళ్ల సహాయం లేదంటావా.
జగతి-మహేంద్ర పాత్ర లేదా అని దేవయాని అంటుంది. మీరెలా షాక్ అయ్యారో వాళ్లు కూడా అలాగే షాక్ అయ్యారు. నేను కూడా ధరణి అంటుంది. ఛీఛీ పొద్దున్నే ఏంటో ఈ దరిద్రం ఇక్కడుంది అని దేవయాని అంటుంటే వసుధార వస్తుంది. ఏంటీ మేడమ్ ఏదో అంటున్నారు. ఈరోజు మంచి రోజు. మీరు మనసులో ఏమనుకుంటున్నార నాకు తెలుసు. మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా నేను రెండే సమాధానాలు చెబుతాను. ఒకటి ఈ తాళి, రెండోది రిషి సార్ అని వసుధార అంటుంది. దీంతో కోపంతో రగిలిపోతుంది దేవయాని.


Click it and Unblock the Notifications











