Guppedantha Manasu: అత్తింట్లో వసుధారకు షాక్.. వెళ్లిపొమ్మన్న రిషి.. అయోమయంలో దేవయాని!
అత్తారింట్లో అడుగు పెట్టిన వసుధార తను ఇంతకుముందు ఉండే గెస్ట్ రూమ్ లోకి వెళుతుంది. ఆ గది చూస్తూ మురిసిపోతుంది. ఇన్నాళ్లు ఈ గెస్ట్ రూమ్ లోకి అతిథిగా వచ్చాను. కానీ ఇప్పుడు ఈ ఇంటి మనిషిగా వచ్చాను. అదే రూమ్ అదే మనిషి. కానీ మనసులో ఏదో తెలియని ఆనందం అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధరణి వస్తుంది. అదేంటో వసుధార అనుకోకుండా ఇవాళే ఈ గది అంతా సర్ది పెట్టాను అని ధరణి చెబితే.. నా కోసమే మేడమ్ అని ధరణిని వసుధార హత్తుకుంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 11 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 708లో ఇంకా ఏం జరిగిందంటే?

రిషి సార్ దగ్గరే..
ఇన్ని రోజులు గెస్ట్ గా వచ్చావ్. ఈరోజు ఇంటి మనిషిగా వచ్చావ్ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పిన ధరణి వెంటనే జాగ్రత్తగా ఉండు అని అంటుంది. నువ్వు రావడంతో దేవయాని అత్తయ్య కోపంతో ఉన్నారు అని ధరణి అంటే.. ఆవిడ ఎప్పుడు కోపంగా లేరు. నేనంటే చాలు చిర్రుబుర్రులాడుతుంటారు. నేను ఒక రిషి సార్ దగ్గరే జాగ్రత్తగా ఉంటాను. మిగతా వారంటే నాకు ఏ భయం లేదు అని వసుధార అంటుంది. మరోవైపు రిషి నిద్ర లేచి ఏంటీ ఇంతసేపు నిద్రపోయాను అనుకుంటూ ఫోన్ చూసుకుంటాడు. ఏంటీ ఈ పొగరు ఈపాటికి బోలెడన్నీ మెసేజ్ లు పెడుతుంది కదా. ఇవాళ ఒక్క మెసేజ్ లేదు అని అనుకుంటాడు రిషి.

ఇక్కడ ఉండటం ఏంటీ..
బాల్కనీ పైన బయటకు వచ్చి చూస్తాడు రిషి. అక్కడ తులసి కోటకు పూజ చేస్తూ వసుధార కనిపిస్తుంది. ఏంటీ వసుధార ఇక్కడ కనిపిస్తుంది. ఊహల్లో కూడా వదలద ఈ వసుధార. అక్కడ ఉన్న వసుధార ఏం చేస్తుందో అని కాల్ చేస్తాడు రిషి. తన కింద ఉన్న వసుధార ఫోన్ చూడటంతో.. షాక్ అయి కాల్ కట్ చేస్తాడు. వసుధార లోపలికి వెళ్లి పూజ గది దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. హాల్లోకి మెట్లపై నుంచి దిగుతూ వసుధారను చూస్తాడు రిషి. నువ్వేంటీ ఇక్కడ అని రిషి అడుగుతాడు. వచ్చాను సార్.. ఇక్కడే ఉండేందుకు వచ్చాను సార్ అని వసుధార అంటుంది. ఇక్కడ ఉండటం ఏంటీ, రావడం ఏంటీ అని రిషి అంటాడు.

పదిమందిలో భార్య అన్నందుకే..
వసుధారను రిషి ప్రశ్నిస్తుంటే.. ఇంతలో సరిగ్గా నేను కూడా ఇదే అడిగాను రిషి అని దేవయాని ఎంట్రీ ఇస్తుంది. తను వచ్చిన విషయం మీకు తెలుసా పెద్దమ్మా అని రిషి అడుగుతాడు. తను ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నావా రిషి.. వసుధార వచ్చి చాలా సేపు అయింది. వాళ్ల నాన్నే వచ్చి స్వయంగా లగేజ్ ఇచ్చి మరి దిగబెట్టాడు. వాళ్ల నాన్న వినయం నటిస్తూనే ఎంత పొగరుగా మాట్లాడారో తెలుసా. ఇదేంటని వసుధారను అడిగితే తాళి బొట్టు చూపిస్తోంది. అంతా హక్కు అధికారం అని మాట్లాడుతోంది. ఇదంతా నువ్వు ఆ పది మందిలో నా భార్య అన్నందుకే రిషి. ఆ మాట పట్టుకుని ఇంటికి వచ్చేసింది. దీనికి మీ అమ్మ వంత పాడింది. అదే జగతి, మహేంద్రలు కూడా సపోర్ట్ చేశారు. ఇక మీ పెదనాన్న సంగతి సరేసరి. ఏంటీ వసుధార అప్పుడు చాలా మాట్లాడావు. ఇప్పుడేం మాట్లాడటం లేదు అని దేవయాని అంటుంది.

ఎందుకు వచ్చావ్..
వసుధార కమ్ టు మై రూమ్ అని చెప్పి రిషి వెళ్లిపోతాడు. చూశారా మేడమ్ నన్ను ఒక్కదాన్నే రూమ్ లోకి పిలిచారు. అక్కడికి వెళ్లి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. అన్నట్టు రిషి సార్ నన్ను మాత్రమే రమ్మన్నారంటూ వెటకారంగా అనేసి వెళ్తుంది వసుధార. దీంతో దేవయాని అయోమయంలో పడిపోతుంది. అసలేంటీ నువ్వు. ఎందుకు ఇక్కడికి వచ్చావ్. పైగా మీ నాన్న ఇక్కడ దిగబెట్టి వెళ్లారని అంటున్నారు అని రిషి అంటాడు. నిజాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఉన్నాను సార్ అని వసుధార అంటుంది. ఆ నిజానిజాలు ఏంటో నీకు నాకు తెలుసు కదా. వచ్చేముందు ఒక్క మాటైనా చెప్పాలి కదా. అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని రిషి అంటే.. మీ ఇష్టం సార్ అని వసు అంటుంది.

వసుధార నిజం చేస్తోంది..
అన్నీ నీ ఇష్టానికి చేసి ఇప్పుడు నా ఇష్టం అంటున్నావా. నా ఇష్టం ఏంటీ. నా అనుమతి తీసుకుని ఇంట్లోకి వచ్చావా. కాఫీ వద్దు ఏం వద్దు వెళ్లిపో వసుధార. ఇక్కడి నుంచి వెళ్లిపో వసుధార అని రిషి అంటాడు. దీంతో అక్కడి నుంచి వసు వెళ్లిపోతుంది. ఆ తర్వాత రిషి వెళ్లి జగతిని అడుగుతాడు. వసుధార ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు మేడమ్. మీకు తప్పుగా అనిపించలేదా అని రిషి అడుగుతాడు. ఈ విషయంలో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదని జగతి అంటే.. మీరు ఈ విషయాన్ని సమర్దిస్తున్నారా మేడమ్ అని రిషి అంటాడు. నేను పది మందిలో చెప్పిన మాటను నిజం అని అన్నావ్. వసుధార అది నిజం చేస్తోంది. అక్కడ నిజం అయింది. ఇక్కడ అబద్ధం ఎలా అవుతుంది. ఇంతకు మించి నా పరిధి దాటి మాట్లాడలేను అని జగతి అంటుంది. ఇంతలో జగతికి వసుధార కాల్ చేస్తుంది.

నన్ను ఇరికిస్తోంది ఏంటీ..
మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలని జగతిని రమ్మంటుంది వసుధార. వసుధార, జగతి, మహేంద్ర, ఫణీంద్ర అందరూ కలిసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి నన్ను ఎందుకు పిలవలేదు అని అడుగుతాడు. ఫణీంద్ర కూడా అదే అడగడంతో.. ప్రతి చిన్న విషయానికి ఎండీగారిని పిలవలేం కదా. ప్రాజెక్ట్ గురించి ముందు అన్ని మనం చర్చించుకున్నాకా ఎండీగారికి ప్రపోజల్ పెడతాం. పైపర్ పై రాసి ఎండీగారికి పంపించాలి కదా మేడమ్ అని జగతితో అంటుంది వసుధార. ఈ వసు ఏంటీ నన్ను ఇరికిస్తోంది అని అనుకున్న జగతి అవును అంటుంది. మరి కాలేజీలో మీటింగ్స్ ఎందుకు పిలుస్తున్నారు. అప్పుడు కూడా ఇలాగే చేయాలి కదా అని రిషి అడుగుతు ఏం డాడ్ అని అంటాడు. అవును కదా అని మహేంద్ర అంటాడు.

ప్రోటోకాల్ ప్రకారం..
కాలేజీలో ప్రతి విషయం ఎండీగారి పర్యవేక్షణలో జరగాలి. బోర్డ్ మెంబర్స్ ఇలా అందరి సమయం మళ్లీ దొరకదు కదా. ఇది ఇల్లు. ప్రతి విషయంలో ఎండీగారిని ఇబ్బంది పెట్టలేం కదా అని వసుధార అంటుంది. దీంతో బాగా చెప్పావ్ వసుధార. రిషికి కాలేజీ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు అని ఫణీంద్ర అంటాడు. సార్ నేనేమైనా తప్పు చెప్పానా అని వసు అంటే.. చేసిన విషయాలు ఒప్పుకోవడం అందరికీ సాధ్యం కాదులే వసుధార అని రిషి అంటాడు. దీంతో వేరే టాపిక్ లోకి వెళ్తుంది అని మహేంద్ర డైవర్ట్ చేస్తాడు. వసుధార చెప్పింది ఎలా ఉంది అని మహేంద్ర అంటే.. ప్రోటోకాల్ ప్రకారం పేపర్ పై రాసి పంపించండి. అప్పుడు చెబుతాను. అద్భుతమైన ఐడియాలు చర్చించండి అంటూ రిషి వెళ్లిపోతాడు. తర్వాత మీటింగ్ అయిపోయిందని ఫణీంద్ర, వసు వెళ్లిపోతారు. రిషి, వసు గురించి మహేంద్ర-జగతి మాట్లాడుకుంటారు.


Click it and Unblock the Notifications











