Guppedantha Manasu: తొలిసారిగా ఏడ్చేసిన ధరణి.. తప్పు చేశామంటూ రిషి.. త్వరలో కొత్త క్యారెక్టర్!

దేవయానికి తెలియకుండా హోలీ సంబురాలు చేసుకుంటారు మహేంద్ర, జగతి, వసుధార, రిషి, ధరణి. హోలి సెలబ్రేషన్స్ లో రంగులు చల్లుకుని ఇద్దరు కలిసిపోతారు రిషి, వసుధార. మొత్తానికి జగతి వేసిన రంగుల స్కెచ్ బాగా వర్కౌట్ అవుతుంది. మరోవైపు వీళ్లంతా ఎక్కడకు వెళ్లారు. కనీసం చెప్పను కూడా చెప్పలేదు అని ఫణీంద్రతో ఫైర్ అవుతుంది.

సింపుల్ గా చెప్పాలంటే పెద్దరికం, పెత్తనం ఐస్ క్రీమ్ లాంటివి. ఫ్రిజ్ లో ఉన్నంతసేపు బాగుంటాయి. బయటకు తీస్తే కరిగిపోతాయి అని చెబుతాడు ఫణీంద్ర. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 14 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 710లో ఇంకా ఏం జరిగిందంటే?

హాగ్ చేసుకుని..

హాగ్ చేసుకుని..

ఫణీంద్ర చెబితే హా చెప్పారులేండీ సామెతా అని రగిలిపోతుంది దేవయాని. ఇంతలో కారు సౌండ్ వస్తుంది. రిషి, వసు, జగతి, మహేంద్ర, ధరణి అంతా ఎంట్రీ ఇస్తారు. ఎక్కడికి వెళ్లారు. ఏంటిది అని దేవయాని విరుచుకుపడుతుంది. ఇంతలో హ్యాపీ హోలి అని దగ్గరకు వెళ్తుంది వసుధార. ఆగు ఆగు అని దేవయాని అంటుంది.

ఇంతలో రిషి కూడా హ్యాపీ హోలి అని హగ్ చేసుకుంటాడు. ఏంటీ వసుధారను తిడదాం అనుకుంటే రిషి ఇలా బుక్ చేశాడని అనుకుంటుంది దేవయాని. నన్ను మీ వదినను కూడా పిలిస్తే వచ్చేవాళ్లం కదా అని ఫణీంద్ర అంటాడు. ఎక్కడో బస్తీలో ఆడి వస్తే సంబరపడతారేంటీ అని దేవయాని అంటుంది. పండుగ ఎక్కడైన పండుగే కదా దేవయాని అని ఫణీంద్ర జవాబిస్తాడు.

చాటుగా వింటున్న దేవయాని..

చాటుగా వింటున్న దేవయాని..

ఆటపాటలు అవన్నీ ఎంత బాగున్నాయో అని రిషి అంటే.. అవి కూడా ఉన్నాయా అని దేవయాని అంటుంది. అవును అత్తయ్యగారు. ఆ డప్పులు మెడలో వేసుకుని స్టెప్పులు వేస్తే చాలా బాగుందని ధరణి అంటుంది. తర్వాత రిషి నీకు రంగులు పడవు. నిన్ను పెంచిన నాకు తెలుసు. వెళ్లి ఫ్రెష్ అవ్వు అంటూ పంపించివేస్తుంది దేవయాని.

ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్కకొక్కరు మెల్లిగా జారుకుంటారు. పైకి వెళ్లిన రిషి వసుధార వచ్చేదాకా ఎదురుచూస్తుంటాడు. వసుధార ఈ రంగులు కరిగిపోతాయేమో కానీ ఈ ఆనందం చాలా రోజులు ఉండిపోతుంది అని రిషి అంటాడు. అవును సార్ నాకు అదే అనిపించిందని వసుధార అంటుంది.

ఇదంతా చాటుగా వింటుంది దేవయాని. ఈరోజు ఇంత సంతోషంగా ముగిసినందుకు నువ్వే కారణం. డాడ్ తో కలిసి హోలీ సంబురాలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అని రిషి అంటే.. మీ ఆనందమే నా ఆనందం సార్ అని వసుధార అంటుంది.

నన్ను పిలిచి ఉంటే..

నన్ను పిలిచి ఉంటే..

ఇదంతా గోడపక్కన ఉండి చాటుగా వింటున్న దేవయానిని చూస్తాడు రిషి. దొరికిపోయాను అనుకుని హా రిషి అది ఇలా వెళ్తున్నాను. కాళ్లకు చీర తట్టుకుంది అందుకే ఆగాను అని కవర్ చేస్తుంది దేవయాని. మరోవైపు జగతి, మహేంద్రలు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. వాళ్ల మాటలు కూడా దేవయాని చాటుగా వింటూ ఉంటుంది.

వసు, రిషి చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నారు జగతి. అది మనకు చాలు అని మహేంద్ర అంటే.. ఈ ఇంట్లో నేను తప్పా అందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటూ దేవయాని వెళ్లిపోతుంది. వసు, రిషీలు కాఫీని కప్పు, సాసర్ లో పోసుకుని షేర్ చేసుకుని తాగుతు ఉంటారు. రిషి చేతికి హోలీ రంగులు సరిగా వదల్లేదని ఆయిల్ కాటన్ తీసుకుని క్లీన్ చేస్తుంటుంది వసు.

ఇంతలో దేవయాని రావడంతో.. హా పెద్దమ్మా రంగుల్ని క్లీన్ చేస్తోంది అని చెబుతాడు రిషి. నన్ను కూడా పిలిచి ఉంటే బాగుండేది. నీ సంతోషాన్ని చూసి ఉండేదాన్ని. అయినా అక్కడ బదులు ఇక్కడే చేసుకుంటే అందరం ఉండేవాళ్లం కదా అని దేవయాని అంటుంది.

నన్ను మర్చిపోయింది..

నన్ను మర్చిపోయింది..

కరెక్టే కదా వసుధార. నాకేందుకు ఈ ఐడియా రాలేదు అని రిషి అంటాడు. ఏం వసుధార. నువ్వైనా చెప్పాలి కదా. నాన్నా సంతోషాలు, సంబురాలు ఇవన్నీ కలిసి జరుపుకుంటేనా కదా ఆనందం ఉంటుంది అని దేవయాని అంటే.. తప్పు చేశాం వసుధార. చాలా పెద్ద తప్పు చేశాం అని రిషి అంటాడు. నువ్వేం తప్పు చేయలేదు నాన్నా. వసుధార పాపం నన్ను మర్చిపోయింది.

కదా వసుధార అని దేవయాని అంటే.. రిషి సార్ ముందు నన్ను ఇరికిస్తోంది అని మనసులో అనుకుంటుంది వసు. సరేలే నాన్నా మీరు సంతోషంగా ఉన్నారు. అది చాలు నాకు అని దేవయాని అంటే తనను దూరం పెట్టిన తను బాధపడరు. ఇక ఏ సెలబ్రేషన్ జరిగినా పెద్దమ్మా నా పక్కనే ఉండాల్సిందే ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అని రిషి అంటాడు. వసు ఓకే అంటుంది.

ధరణి భర్త కూడా..

ధరణి భర్త కూడా..

గుర్తు పెట్టుకో వసుధార. రిషి నా చేతుల్లో నుంచి జారిపోనివ్వను అని మనసులో అనుకుంటుంది దేవయాని. కట్ చేస్తే అంతా కలిసి భోజనం చేస్తుంటారు. వసు-రిషి, జగతి-మహేంద్ర, దేవయాని-ఫణీంద్ర మూడు జంటలు తింటుంటే ధరణి వడ్డిస్తుంటుంది. మన జంటలు బాగున్నాయి కదా. ఓ ఫొటో తీసుకుందామా అని మహేంద్ర్ అంటాడు. ధరణి మేడమ్ భర్త కూడా ఉండుంటే ఫ్యామిలీ ఫొటో బాగుండేది కదా.

మేడమ్ (దేవయాని) తన గురించి కూడా ఆలోచించండి. అవును తన పేరు ఏంటీ మేడమ్ అని వసుధార అంటే.. సైలేంద్ర భూషణ్ అని జగతి చెబుతుంది. వసుధార ఇవన్నీ నీకు అవసరమా అని దేవయాని అంటే.. నాకేం అవసరం లేదు. మీకు కూడా మీ అబ్బాయి ఇక్కడికి రావాలనే ఉంటుంది కదా. ఏం అంటారు వసుధార అంటుంది. ఈ వసుధార హద్దులు దాటుతోంది. పగ్గాలు వేయాల్సిందే అని మనసులో అనుకుంటుంది దేవయాని.

అత్తయ్యే ఆపుతున్నారు..

అత్తయ్యే ఆపుతున్నారు..

అవును పెద్దమ్మా అన్నయ్యని ఇక్కడికి రప్పిద్దాం అని రిషి అంటే తను కూడా వస్తే బాగుంటుందని మహేంద్ర అంటాడు. అక్కా సైలేంద్రను పిలవచ్చు కదా అని జగతి అంటుంది. పెద్దమ్మా సైలేంద్ర అన్నయ్యా అని రిషి అంటుంటే.. రిషి సైలేంద్ర రాడు. ఇప్పట్లో రాకపోవచ్చు. తనకు ఏదో అగ్రిమెంట్ ఉన్నట్లుంది అని దేవయాని చెబుతుంది.

నాకు తెలిసి అత్తయ్యగారు తను రాకుండా ఆపుతున్నారు అని ధరణి మనసులో అనుకుంటుంది. అన్నయ్యకు రావడం లేటు అవుతుంది అంటే.. వదిననే అక్కడికి పంపించొచ్చు కదా అని రిషి అంటాడు. గుడ్ ఐడియా అని మహేంద్ర అంటే.. అన్నంత ఈజీ కాదు మహేంద్ర. అక్కడికి వెళ్లడానికి చాలా తతంగం ఉంటుంది కదా అని దేవయాని చిరాకుగా అంటుంది.

ఆరోగ్యాలకు మంచిది కాదు..

మేడమ్ అదంతా ఒకప్పుడు ఇప్పుడు ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది అని వసుధార అంటుంది. దీంతో మరింతగా రగిలిపోయిన దేవయాని.. ధరణీ కూరల్లో కొంచెం ఉప్పు కారాలు తగ్గించు. ఆరోగ్యాలకు మంచిది కాదు. చేసే పనుల మీద వంటల మీద శ్రద్ధ పెట్టు అని అరుస్తుంది. పైకి వస్తున్న బాధను ఆపుకుంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది ధరణి. వంట గదిలోకి వెళ్లి ఒక్కతే ఏడుస్తూ ఉంటుంది. ధరణి బాధ అక్కడున్న వాళ్లందరికి అర్థం అయి బాధపడితే.. దేవయాని మాత్రం రగిలిపోతూ ఉంటుంది. అయితే త్వరలో కొత్త క్యారెక్టర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X