Guppedantha Manasu: రిషి దెబ్బకు బిత్తరపోయిన దేవయాని.. వసుధారకు క్లారిటీ.. దేవుడి ముందు అలా!
సత్యనారాయణ వ్రతం పేరుతో వసుధార, రిషిలను బుక్ చేయాలని చూస్తుంది దేవయాని. తనవెంట జగతిను తీసుకెళ్లి.. వసుధార, రిషిలకు ఇవ్వమని చేతుల్లో బట్టలు పెడుతుంది. నువ్వు మహేంద్ర కలిసి ఈ వాళ్లిద్దరికి ఇవ్వమని అంటుంది. వ్రతంలో కొత్త జంట కూర్చుంటేనే అందం అని దేవయాని అంటుంది. దీంతో షాక్ అయిన జగతి ఇదా అక్కయ్య మీ ప్లాన్. వసు, రిషిలు ఇప్పటికే దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా వాళ్లకు వీటిని ఇవ్వగలను అని మనసులో అనుకుంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 16 గురువారం నాటి తాజా ఎపిసోడ్ 712లో ఇంకా ఏం జరిగిందంటే?

దూరం పెరిగిపోతుంది..
జగతి ఆలోచిస్తుంటే.. వెళ్లు జగతి లేట్ అవుతుంది అని పంపిస్తూ ఇప్పుడు చూస్తా వేడుక. రిషి వసుల మధ్య బంధం ఏపాటితో తేలిపోతుంది అని దేవయాని అనుకుంటుంది. ఇది మనకు తప్పదు. వెనుకడుగు వేయలేం అని ఫిక్స్ అవుతారు జగతి మహేంద్ర. ఆ బట్టలు పట్టుకుని వసుధార రూమ్ కి వస్తారు. నువ్వు రిషి కట్టుకుని వ్రతంలో కూర్చోవాలంట వసు అని జగతి చెబుతుంది. మేడమ్ ఇది అయ్యేపనేనా.. రిషి సార్ ఏ అంటారో.. ఏం అనుకుంటారో మీకు తెలుసు. పైకి నవ్వడం కానీ ఆ నవ్వుల్లో ఏదో చీకటి. ఇప్పుడు ఇలా కూర్చోవాలి అంటే. అంతంతమాత్రంగా ఉన్న మా మధ్య దూరం అమాంతం పెరిగిపోతుంది అని వసుధార అంటుంది. ఈ రకంగా అయినా మీ మధ్య దూరం తగ్గుతుందని ఎందుకు అనుకోవు చెప్పు. వెనుకడుగు వేయడం సరి కాదు కదా. ఇదొక అవకాశంగా బావించు అని వసును ఒప్పిస్తుంది జగతి. ఆ బట్టలు పట్టుకుని రిషి దగ్గరికి వెళ్తుంది వసుధార.

పూజకు రెడీ అయిన మహేంద్ర-జగతి..
రిషికి అసలు విషయం చెబుతుంది. ఇది నిజంగానే పెద్దమ్మ గారి ఆలోచనేనా అని రిషి అంటే వసు షాక్ అవుతుంది. సార్ మీరు ఏం అనుకుంటున్నారు. నేను ఇలా చేశాను అంటున్నారా కోపంగా అంటుంది వసుధార. మనం నిజంగానే భార్యాభర్తలమేనా.. దంపతులుగా పీటల మీద కూర్చోవడానికి అర్హత ఉన్నవాళ్లమేనా.. అసలు నీకెం అనిపిస్తుంది అని నిలదీస్తాడు రిషి. దీంతో వసు తల దించుకోవడంతో.. సమస్య ఇంకా సజీవంగానే ఉన్నట్లు కదా వసుధార.. నీ మౌనమే నాకు సమాధానం చెప్పిందని రిషి అంటాడు. మరోవైపు కింద పూజకు రెడీ అయి మహేంద్ర, జగతి వచ్చేస్తారు. కొందరు ముత్తైదువులు వస్తారు. అంతా సిద్ధమే రిషి వసుధార ఎక్కడ అని దేవయాని అంటుంది. ఎంతసేపటికి రాకపోయేసరికి గొడవ జరుగుతున్నట్లు ఉంది అని మనసులో నవ్వుకుంటుంది దేవయాని. ఇంతలో కొత్త బట్టలు కట్టుకుని వసు, రిషి కిందకు దిగుతారు.

వాళ్లు ఎందుకు కూర్చుంటారు..
భార్యాభర్తలుగా రిషిధారను చూసి షాక్ అవుతుంది దేవయాని. అసలు గొడవ అయిందా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర, జగతి పక్కకు వచ్చి రిషి, వసు నిలబడితే.. రండి నాన్నా కూర్చొండి అని దేవయాని అంటుంది. మేము పీటల మీద కూర్చోవట్లేదు అని రిషి షాక్ ఇస్తాడు. డాడ్ మేడమ్ మీరు కూర్చోండి అని రిషి అంటాడు. వాళ్లిద్దరు ఎందుకు కూర్చుంటారు. రిషి ఏంటిది అని దేవయాని అంటుంది. పెద్దమ్మా ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను. డాడ్ మీరు కూర్చోండి అంటూ జగతి, మహేంద్రలను కూర్చోబెడతాడు రిషి. వాళ్లు తర్వాత కూర్చుంటారు మనకు వ్రతం ముఖ్యం అని ఫణీంద్ర అంటాడు. పెద్దమ్మా వ్రతం కానివ్వండి.. మనం తర్వాత మాట్లాడుకుందా అని రిషి అంటాడు. అసలు ఏం జరిగింది. ఇద్దరు కూల్ గా కనిపిస్తున్నారు. అసలు ఏం జరగలేదా అని దేవయాని రగిలిపోతుంది.

నమ్మకం నిలబెట్టడం కష్టమా..
బట్టలు మార్చుకోకముందు ఏం జరిగిందే రిషి గుర్తు చేసుకుంటాడు. వసుధార ప్రేమకు ఎవరు అవసరం లేదు. రెండు మనసులు ఉంటే చాలు. కానీ పెళ్లికి రెండు కుటుంబాలు ఉండాలి. ప్రేమకు సాంప్రదాయం అవసరం లేదు. కానీ పెళ్లికి కావాలి. నువ్వు ఒకటి అనుకున్నావ్. ఒక పరిస్థితులో తాళి వేసుకున్నావ్. నువ్ ఒకటి నమ్మావ్. ఆ నమ్మకాన్ని నేను గౌరవించాను. అది నీ మీద మన ప్రేమ మీదున్న గౌరవంతోనే. నమ్మకం నిలబెట్టడం ఇంత కష్టమా అనిపిస్తోంది. నమ్మకాన్ని గౌరవించడం బాధపెడుతుంది కదా వసుధార అని రిషి అంటాడు. సార్ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు కదా అని వసుధార అంటుంది.

పెద్దమ్మతో నేను చెబుతాను..
అనుకోవాలి వసుధార. అదే కదా జీవితం. సమస్య నీది నాది అనే పరిధిని దాటి ఎక్కడికో వెళ్తోంది. ఎంత మందిని నమ్మిద్దాం. ఎంత మందికి అబద్ధాన్ని నిజంగా చూపిద్దాం. ఆఖరికి దేవుడి పూజలో కూడా అయితే ఎలా అని ఆవేదనగా అంటాడు రిషి. సార్ ఈ తాళి నా మెడలో మనస్ఫూర్తిగా పడింది. ఈ విషయంలో నా మీద కోపం ఇగో అనిపిస్తే అని వసుధార మాట పూర్తి కాకుండానే వసుధార నేను కోపంతో ఈ మాట చెప్పడం లేదు. బాధతో చెబుతున్నాను. ఇగో ఎంత మాత్రం కాదు అని రిషి అంటాడు. హా సార్ ఇది దేవయాని మేడమ్ గారు ఇచ్చారు కదా అని బాధగా అంటుంది వసుధార. వసుధార నేను పెద్దమ్మతో చెబుతాను. ఈ పూజ మనం చేయట్లేదు అని రిషి కోపంగా అంటాడు. దీంతో వసుధార గుండెముక్కలైపోతుంది. ఇలా వసుధారకు క్లారిటీ ఇచ్చి.. దేవయానికి షాక్ ఇచ్చాడు రిషి.


Click it and Unblock the Notifications











