Guppedantha Manasu: తుస్సుమన్న దేవయాని వార్నింగ్.. రిషి గదిలోకి వసును తోసేసిన జగతి!
వసుధాను బుక్ చేద్దామని ప్రయత్నించిన దేవయాని ప్లాన్ వర్కౌట్ కాకుండా బెడిసి కొడుతోంది. సత్యనారాయణ వ్రతానికి పీటలపై మహేంద్ర, జగతిలను కూర్చోమని చెప్పి తనకు తెలియకుండానే దేవయాని ప్లాన్ ఫెయిల్ చేస్తాడు రిషి. వసు, రిషి రూమ్ లో బట్టలు మార్చుకోవడానికి ముందు జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంటారు. ఈ వ్రతం మనం చేయడం లేదు. నేను పెద్దమ్మకి చెబుతానంటూ రిషి అంటాడు. వ్రతం పూర్తి అవుతుంది. అన్నింటా నాకు తోడుగా ఉండే రిషి సార్.. ఈ తాళి విషయంలో కష్టపెడుతున్నారు. న్యాయం చేయు స్వామి అని వసుధార అనుకుంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 17 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 713లో ఇంకా ఏం జరిగిందంటే?

ప్రసాదం తీసుకోని దేవయాని..
తాళి విషయంలో వసుధార తొందరపడింది. ఈ దూరం ఎన్నాళ్లు అని రిషి అనుకుంటాడు. వసుధార, రిషిని తొందరగా కలుపు దేవుడా అని మహేంద్ర అనుకుంటే.. వసు, రిషి వాళ్లకు వాళ్లే సమస్యగా మారారు. ఆ సమస్యను నువ్వే తీర్చాలి అని జగతి కోరుకుంటుంది. అందరికీ ప్రసాదం పంచమని చెబితే ధరణి పంచి పెడుతుంటుంది. అయితే దేవయాని మాత్రం ప్రసాదం తీసుకోదు. దీంతో రిషి దేవయానిని బతిమిలాడతాడు. నాకు తెలుసు పెద్దమ్మ మీకు బాధగా ఉంటుందని రిషి అంటే.. నాప్లాన్ తలకిందులు చేశావ్ కదా అని మనసులో అనుకున్న దేవయాని.. నా బాధ ఏంటో తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నేను నీతో మాట్లాడను అని అంటుంది.

నిద్ర ఎలా పడుతుందిలే..
మీరు అలా అనొద్దు పెద్దమ్మా నా కారణంగా మీకు నిరాశ కలిగినందుకు బాధగా ఉంది. ఇంకోసారి నన్ను అడగకుండా ఇలాంటివి చేయొద్దంటూ ప్రసాదం ఇస్తాడి రిషి. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా వసుధార రూమ్ కు వెళ్తుంది దేవయాని. నువ్వు ఇంకా పడుకోలేదా వసుధార. జరిగింది తలుచుకుంటే నాకే ఎలాగో ఉంది. ఇక నీకు నిద్ర ఎలా పడుతుందిలే అని దేవయాని అంటుంది. ఏమంటున్నారు మేడమ్ మీరు అని వసుధార్ అంటుంది. ఇంకా ఎందుకు నటిస్తన్నావ్.. నువ్వేంటో, నీ స్థాయి ఏంటో స్పష్టంగా అర్థమైంది అనుకుంటా. లోకం దృష్టిలో మాత్రమే రిషికి భార్యవి. కానీ ఈ ఇంట్లో మాత్రం నువ్ ఒక అతిథివి. అర్తమైందా.. క్లారిటీ వచ్చిందా.. ఈ నీ స్థానం ఏంటో.. సప్త సముద్రాలు ఈది వచ్చి మురికి గుంటలో పడిపోయాడంట అలా ఉంది నీ పరిస్థితి. తెలివైన దానివని గర్వం క గా. నీ తెలివి ఎక్కడుంది. పూజలో కూర్చోలేదు కదా అని దేవయాని నవ్వుతుంది.

ఏడుస్తుంటానని ఊహించారు..
దేవయాని నవ్వు చూసి వసుధార నవ్వుతుంటుంది. చిటికే వేయడం నాకు కూడా వచ్చు మేడమ్. పెద్దవారు నేను అలా చేయలేను. మీరు ఏదో ఊహించుకుని సంబరబడుతున్నారు. రిషి, వసు బంధం ఎప్పటికీ చెక్కు చెదరదు. అయినా మేడమ్ ఒకరు సంతోషంగా ఉంటే సంతోషించాలి. కానీ ఒకరి కన్నిటీతో దాహం తీర్చుకోవాలని అనుకోకూడదు అని వసుధరా అంటుంది. నేను అలా ఆలోచించను అని కోపంగా అంటుంది దేవయాని. మీరేంటో.. మీ ఆలోచనలు ఏంటో నాకు తెలుసు.. మీకు తెలుసు. మీరేదో ఊహించుకుని, నాకు అవమానం జరిగిందని ఏడుస్తుంటానని ఊహించారు కదా. బాధపడుతుంటే చూసి ఓదార్చి వెళదామని వచ్చారు కదా మేడమ్. నా పేరు వసుధార. చిన్న చిన్న వాటికే కుంగిపోతానా. రిషి సార్ నా గుండెల్లో ఉన్నారు. మా ఇద్దరి మధ్య ఉన్న ఒకటి రెండు అభిప్రాయ బేధాలు త్వరలోనే పోతాయి అని వసుధార అంటుంది.

సార్ ఇంకా నిద్ర లేవలేదు..
ఎప్పటికైనా ఈ ఇంటి గడప దాటుతావ్. గుమ్మం బయటే నీ బతుకు అని దేవయాని అంటుంది. అంత అత్యాశ పనికి రాదు. అదే గడపలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని రిషి సార్ చెప్పారు. అందరి ముందు తాళి విషయంలో జగతి మేడమ్ చెప్పింది ఒప్పుకున్నారు. ఇన్ని జరిగాక గుమ్మం బయటకు నేను ఎందుకు వెళతాను మేడమ్. నిద్ర వస్తోంది మేడమ్. అయినా మీకు నిద్ర పడుతుందో లేదే కానీ, ట్రై చేయండి అని వసుధార అంటుంది. కట్ చేస్తే ఉదయం రిషి గది ముందు అటు ఇటు తిరిగుతుంది. ఇంతలో జగతి వచ్చి ఏమైందని అడిగితే కాలేజీకి టైమ్ అవుతోంది. రిషి సార్ ఇంకా నిద్ర లేవలేదు. లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నా అంటే.. జగతి సర్ది చెప్పి వసుధారను రిషి గదిలోకి బలవంతంగా నెడుతుంది. రిషి నిద్ర పోవడం చూస్తూ కుర్చీలో కూర్చుంటుంది వసుధార. తర్వాత నిద్ర లేచిన రిషి గుడ్ మార్నింగ్ అని హ్యాపీగా చెబుతాడు. తర్వాత తేరుకోని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. కాలేజీకి టైమ్ అవుతోందని వసుధార అంటుంది.

అక్షరాలు పక్కపక్కనే..
మంచం పైనుంచి నిద్ర లేచిన రిషి కుర్చీలో కూర్చున్న వసుధారవైపుకు ముద్దు పెట్టుకుంటున్నట్లుగా రొమాంటిక్ గా వెళతాడు. తర్వాత వసుధార జుట్టుకు ఉన్న దువ్వెన తీస్తాడు. అది కింద పడుతుంది. దాన్ని కిందికి వంగి వసుధార తీస్తుండగా తాళి బయటకు పడుతుంది. దానిమీద ఉన్న వీఆర్ ఉంగరం చూసి రిషి వసుధార తాళి కట్టుకున్నది గుర్తు చేసుకుంటాడు. ఈ రెండు అక్షరాలు పక్కపక్కనే.. మనమిద్దరం ఎదురుఎదురుగానే. నేను రెడీ అవుతాను. నువ్వెళ్లు అని పంపించేస్తాడు రిషి. తర్వాత రిషి అన్న మాటలు తలుచుకుంటూ బాధగా వెనక్కి చూసుకుంటూ వెళ్తుంది వసుధార. తర్వాత వంటగదిలో ఉన్న ధరణి వద్దకు వెళ్తుంది వసు. దేవయాని మేడమ్ నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంది కదా అని వసు అంటే.. ఆవిడ అంతే.. నాకు అలవాటు అయిందని ధరణి చెబుతుంది.

రిషి నీ భర్తే కదా..
అయినా ఏంటీ మేడమ్ అని పెద్ద అత్తయ్య, అక్కయ్య, చిన్న అత్తయ్య అని వరుసలు పెట్టి పిలిస్తే కదా బంధం దగ్గర అవుతుంది అని ధరణి అంటుంది. నేను నీకు భర్తనే.. నువ్వు నాకు భార్యవి కాదు అన్న రిషి మాటలు తల్చుకున్న వసుధార.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాను అని వసు అంటుంది. ఎదురుచూడటం ఏంటీ రిషి నీ భర్తే కదా. కోడలిగా ఈ ఇంట్లో అన్ని హక్కులు నీకు ఉన్నాయి కదా అని ధరణి అంటుంది. హక్కుల దాకా ఎందుకులే ఇలా పిలిచే రోజు త్వరలోనే వస్తుందనుకుంటున్నా అని వసుధార అంటుంది. మిమ్మల్ని అలా పిలవాలంటే రిషి సార్ అనుమతి కావాలి. ఆయన నాకు భర్తే కానీ నేను ఆయనకు భార్యని కాదు. మరి ఎలా అవుతానో తెలియాలి అనుకుని వెళ్లిపోతుంది వసుధార. తర్వాత రిషి కాలేజీకి రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటూ మాట్లాడుకుంటాడు. వసుధార కూడా తాళిని చేతుల్లోకి తీసుకుని మాట్లాడుకుంటుంది.


Click it and Unblock the Notifications











