Guppedantha Manasu: వసుధారకు ఉచ్చు బిగించిన దేవయాని.. శోభనంతో కొత్త స్కెచ్.. ముహుర్తం ఫిక్స్!

వసుధార, రిషి ఇద్దరు అద్దం ముందు ఉండి ఒకరి గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు. వసుధార నువ్వు చేసిన ఆ ఒక్క పని వల్ల మనం జీవితింలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు కోల్పోయాం కదా. నేను నిన్ను శిక్షిస్తున్నాను అని మాత్రమే ఆలోచిస్తున్నావ్. కానీ దాని వల్ల నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా. నీ మీద ప్రేమ తగ్గదు. అలాగే నా కోపం కూడా తగ్గదేమో కావచ్చు అని రిషి అంటాడు. సార్ ప్రతిసారి మనం కోరుకున్న విలువైన జ్ఞాపకాలు దొరకాలనిలేదు కదా.

మీరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని వసుధార బాధపడుతుంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 18 శనివారం నాటి తాజా ఎపిసోడ్‌ 714లో ఇంకా ఏం జరిగిందంటే?

నాకు భార్య స్థానం ఇవ్వలేదు..

నాకు భార్య స్థానం ఇవ్వలేదు..

వసుధార, రిషి కలిసి రిషిధారలు అయ్యారు. కానీ నేను మీ భార్యను కాలేకపోయాను. మీరు నా సొంత అనుకున్నా. కానీ మీరు ఇంకేదో అంటున్నారు. ఎమ్ డీ గారు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ తాళి చూసుకుంటూ అల్లాడిపోతుంది వసుధార. ఇంతలో జగతి వచ్చి.. ఏంటీ వసు ఇది..చేతిలో ఆ తాళి ఏంటీ.. ముఖంలో ఆ బాధ ఏంటీ అని అడుగుతుంది.

మేడమ్ బాధ నాది మాత్రమే కాదు. నా వల్ల రిషి సార్ ది కూడా. నేను చేసిన దానికి ఇలా జరిగింది ఏంటి అని సార్ బాధపడుతున్నారు. ఇంకా నాకు భార్య స్థానం ఇవ్వలేదు కదా అని వసుధార అంటుంది. కొన్ని బంధాలు ఇస్తే రావు. పొందితేనే వస్తాయి. అయిష్టం కాదు అది ఆవేదన అని జగతి చెబుతుంది.

అడిగితే ఇస్తాను..

అడిగితే ఇస్తాను..

అర్థం చేసుకోవాలే కానీ రిషి మనసు బంగారు కొండ. రిషికి నువ్వంటే ఎంత ఇష్టం నీకు చెప్పలేం. ఆ బంగారు మనసు మంచు కొండలగా గడ్డకట్టుకుపోయినట్లు ఉంది. దాన్ని నువ్వే ప్రేమతో కరిగించాలి. రిషి ఒకప్పుడు ఎలా ఉండేవాడో.. ఎలా మారాడో ఆలోచించు. మనిషి మనసు ఒక క్షేత్రం లాంటిది. రిషి మనసుకి దగ్గరగా వెళ్లాలి. ఒపికగా ఉండాలి.

బంధాలు అద్దాలు లాంటివి అపురూపంగా చూసుకోవాలి అని జగతి వసుధారకు చెబుతుంది. రిషి సార్ బాధే నన్ను ఎక్కువగా బాధిస్తోంది మేడమ్. రిషి సార్ కోసం కష్టమైన భరిస్తాను. కానీ రిషి సార్ కష్టపడటాన్ని చూడలేను. మా మధ్య దూరం తగ్గించేందుకు ఎంత దూరమైన వెళ్తాను మేడమ్ అని వసుధార అంటే జగతి సంతోషిస్తుంది.

రిషి కారు దగ్గరకు వెళ్తాడు. అప్పుడే వసుధార ఫైల్స్ పట్టుకుని బయటకు రావడం చూసి లిఫ్ట్ కావాలి సార్ అని అడుగుతుందా. అడిగితే ఇస్తాను లేకుంటే లేదు అని రిషి అనుకుంటాడు.

అంత పొగరు ఎందుకు..

అంత పొగరు ఎందుకు..

ఇప్పుడు ఏంటీ రిషి సార్ ని లిఫ్ట్ కావాలని అడగలా.. లేదంటే పిలవరా.. పిలవచ్చు కదా అని అక్కడే ఆగి వసుధార చూస్తుంటుంది. ఒకరికొకరు వెళ్లాలా.. రావొచ్చు కదా అనుకుంటూ ఉంటారు. కారులోకి వెళ్లి సీట్ లో కూర్చుంటాడు రిషి. ఏంటీ రిషి సార్ నన్ను బెదిరిస్తున్నారా. అందరి ముందు భర్త అని ఒప్పుకున్న రిషి సార్ కు లిఫ్ట్ ఇవ్వడం తెలియదా అని వసు అనుకుంటుంది.

తాళి కట్టుకునే ధైర్యం ఉంటుంది కానీ, లిఫ్ట్ అడగడం తెలియదా.. తను యూత్ ఐకాన్ అయితే.. నేను ఎండీని. ఆ ఎండీ కాదు కాలేజీ ఎండీ అంటూ కారు స్టార్ట్ చేసి వెళ్లిపోతాడు రిషి. కారులో వెళ్తూ వసుధార రావొచ్చు కదా.. ఎందుకో అంత పొగరు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వెనుక నుంచి హారన్స్ వస్తూ ఉంటాయి.

 సడెన్ బ్రేక్ వేసి..

సడెన్ బ్రేక్ వేసి..

ఎవరు అంతగా హారన్ కొడుతున్నారు అని రిషి చూస్తే ఒక బైక్ పై హెల్మెట్ పెట్టుకుని మహేంద్ర జగతిని ఎక్కించుకుంటే.. మరోవైపు వసుధార స్కూటీపై హెల్మెట్ పెట్టుకుని వస్తుంటుంది. వీళ్లేంటి ఇలా డిసైడ్ అయ్యారు అని రిషి అనుకునేలోపు మహేంద్ర, వసుధార ఇద్దరు రిషి కారును దాటేసే ముందుకు వెళ్తారు. ఇక రిషికి దారి ఇవ్వకుండా స్లోగా ముందుకు పోతూ ఉంటారు.

వీళ్లు నాకు దారి ఇచ్చేలా లేరు అని రిషి హారన్ కొడతాడు. అయినా వాళ్లు తప్పుకోరు. ఓ మలుపు దగ్గర కాలేజీకి వెళ్లే రూట్ కాకుండా వేరే రూట్ లోకి వెళ్తాడు మహేంద్ర. అది ఊహించని వసుధార సడెన్ బ్రేక్ వేసి ఒకవైపుకు వాలి నిలదొక్కుకుని ఆగుతుంది. అది చూసిన రిషి.. హేయ్ వసుధార జాగ్రత్త అంటాడు రిషి.

అదేంటీ మహేంద్ర సార్ వాళ్లు అటు వెళ్తున్నారు అనుకుని స్కూటి పోనిస్తుంది వసుధార. ఇక కాలేజీ గేట్ ముందు ఆగిన మహేంద్ర జగతి ఇప్పుుడు కాలేజీకి వెళ్తే రిషి ప్రశ్నలతో విసిగిస్తాడు మనం అలా వెళ్లి కాఫీ తాగొద్దాం అని అంటాడు.

బిజీగా ఉన్నానంటూ..

బిజీగా ఉన్నానంటూ..

ఇంతలో వసుధార వచ్చి అలా వచ్చారేంటి అని అడుగుతుంది. నీ ప్రశ్నల పరంపరను.. రిషి కోపాన్ని ప్రస్తుతానికి మేము ఎదుర్కోలేము అని వెళ్తారు మహేంద్ర, జగతి. వసుధార లోపలికి వెళ్తుంది. రిషి కారు కూడా వచ్చేస్తుంది. డాడ్ వాళ్ల బైక్ కనిపించట్లేదేంటీ.. స్కూటీ మీద రావడం ఏంటీ అనుకుంటూ మహేంద్ర సార్ వచ్చారా అని స్టూడెంట్స్ ను అడుగుతాడు. వాళ్లు రాలేదని చెబుతారు.

దీంతో తన క్యాబిన్ లోకి వెళ్లి కూర్చుంటాడు రిషి. వసుధారకు రమ్మని అటెండర్ చేత పిలిపిస్తాడు రిషి. దీంతో రిషి కాల్ చేసి బిజీగా ఉన్నాను అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది వసుధార. అయితే నేనే వస్తున్నాను అంటే సరే నేనే వస్తున్నాను అని చెప్పి బయలు దేరుతుంది వసుధార.

మంచి ముహుర్తం ఉంది..

మంచి ముహుర్తం ఉంది..

వసుధార వెళ్లేటప్పుడు జగతి కనిపిస్తుంది. రిషి ఏమైనా అన్నాడా అని జగతి అడిగితే.. రిషి సార్ అనబోతున్నారు అని వసు అంటుంది. మీ అబ్బాయో.. మా ఎమ్డీ గారో.. ఏ అవతారంలో ఉన్నారో తెలియాల్సి ఉంది అను వసుధార అంటుంది. ఇలా రిషి గురించి మాట్లాడుకుంటారు జగతి, వసుధార.

మరోవైపు ఇంట్లో దేవయాని అటు ఇటు తిరిగితే ధరణి వచ్చి ఎవరైనా వస్తున్నారా అని అడుగుతుంది. ఇది నీకు అవసరమా. నేను పిలిస్తేనే రావాలి. ఎవరు వచ్చిన నువ్వు రావొద్దు అని చెప్పి ధరణిని పంపించివేస్తుంది దేవయాని. ఇంతలో అక్కడికి పంతులు వస్తాడు. పంతులు రాగానే ఏదో ఒక విషయం చెబుతుంది దేవయాని. దీనికి రేపు, ఎల్లుండి మంచి ముహుర్తం ఉంది. ఏం నిర్ణయించుకుంటారో చెప్పండి అని పంతులు అని వెళ్లిపోతాడు.

దీనితో వసుధార నీ సంగతి ఏంటో తేలిపోతుంది అని దేవయాని అనుకుంటుంది. అయితే ఈ ముహుర్తం రిషి, వసులకు శోభనానికి అని తెలుస్తోంది. దీంతో వసుధారకు మరోసారి ఉచ్చు బిగించే ప్రయత్నం దేవయాని చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X