Guppedantha Manasu: వసుధార స్కూటీ చోరీ.. నేరం ఒప్పుకున్న రిషి.. పెళ్లిచేద్దామంటూ మహేంద్ర!
పంతులును పిలిపించి ఇంట్లో దేనికో ముహుర్తం పెట్టిస్తుంది దేవయాని. ఇప్పుడు ఏం చేస్తావో చూస్తా వసుధార అని మనసులో అనుకుంటుంది దేవయాని. రిషి క్యాబిన్ కు వెళ్లబోతుంటే మధ్యలో జగతి వస్తుంది. ఏమైంది అని అడిగితే.. రిషి సార్ అనబోతున్నారు అని వసుధార చెబుతుంది. ఇప్పుడు ఆయన మీ కొడుకులా ఉన్నారో.. లేక ఎండీ గారి అవతారంలో ఉన్నారో వెళ్తేగానీ చెప్పలేం మేడమ్ అని వసుధార అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 20 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 715లో ఇంకా ఏం జరిగిందంటే?

అందుకే స్కూటీపై..
కాలేజీలో రిషి క్యాబిన్ కు వెళ్తుంది వసుధార. సార్ మీరు నన్ను ఎందుకు పిలిచారో నాకు తెలుసు. బైక్ మీద ఎందుకు వచ్చావనే కదా. మీరేమో లిఫ్ట్ ఇవ్వలేదు. మహేంద్ర సార్ వాళ్లు కూడా బైక్ మీదొచ్చారు. మరి నన్ను ఏం చేయమంటారు. అందుకే స్కూటీ మీద వచ్చాను. ఇందులో తప్పేముంది అని వసుధార అంటుంది. నేను దానికోసం పిలవలేదు వసుధార. మన కాలేజీ స్పాట్ వాల్యూషన్ చేసే అవకాశం వచ్చిందట. విషయం జగతీ మేడమ్ వాళ్లకు చెప్పు అని అంటాడు రిషి. నేను అడగాల్సిందంతా చెప్పేసింది ఇంకేం అడుగుతాను అని మనసులో అనుకుంటాడు రిషి.

కెమికల్ ల్యాబ్ లోకి..
సర్ సరా అని వసుధార వెళ్లిపోతుంటే.. బైక్ ఎందుకు వేగంగా పోనిస్తున్నావ్. పైగా వేగంగా వెళ్తూ వెనక్కి చూడటం అవసరమా అని రిషి తిడతాడు. దీంతో వసుధార తల దించుకుంటుంది. రిషి కోపంగా వెళ్తుంటే.. సార్ స్పాట్ వాల్యూషన్ లో నాకు కాస్తా పాత్ర కల్పించి జీతం పెంచుతారా. అసలే పెళ్లి అయింది. పైగా మావారు అని వసుధార అంటుంటే మధ్యలోనే ఆపేయ్.. సరే అని రిషి అంటాడు. సార్ మరి నాకు మిగిలిన స్పాట్ వాల్యూషన్ కార్యక్రమాల్లో నేను ఉన్నట్లేనా అని వసు అంటే.. రిషి ఉన్న ప్రతి చోట వసుధార ఉంటుంది అని కోపంగా వెళ్లిపోతాడు రిషి. తర్వాత కొద్దిసేపటికి రిషి కెమికల్ ల్యాబ్ లోకి వెళ్తున్నాడని తెలిసి వెళ్లకుండా ఆపుతుంది. సార్ మీరు ల్యాబ్ కు వెళ్లడానికి వీళ్లేదు. గతంలో జరిగిందే నాకు గుర్తొస్తుంది అని అంటుంది.

ప్రేమను మాత్రం మరిచిపోలేం..
ప్రతిసారి అలా ఎందుకు జరుగుతుంది వసుధార తప్పుకో అని రిషి అంటాడు. మీరు నా మాట వినాల్సిందే. నేను అస్సలు ఒప్పుకోను. అప్పటి ప్రమాదం గుర్తుకు వస్తే ఇప్పటికీ వణుకు వస్తుంది సార్ అని వసుధార ఆవేదనగా అంటుంది. ఏంటీ ఇదంతా అని రిషి అంటే.. ప్రేమ అని వసు అంటుంది. నీ ప్రేమలో ఒకసారి భవిష్యత్ బాధ్యతను మరిచిపోతావ్ అంటాడు రిషి. ఏది మరిచిపోయినా ప్రేమను మాత్రం మరిచిపోలేం సార్ అది మీరు గుర్తించాలి అని వసుధార అంటుంది. ఒక్కసారి ప్రమాదం జరిగిందని.. ప్రతిసారి అలానే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావ్. అప్పుడు నన్ను బాధపెట్టావ్ (లవ్ రెజెక్ట్ చేసి), ఇప్పుడు బాధపెడుతున్నావ్ (తాళి మెడలో వేసుకుని). నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి వసుధార అని రిషి అంటాడు.

మీ ఆరోగ్యం బాగోదు..
సార్ నా ప్రేమని అర్థం చేసుకోండి. నా మనసుని అర్థం చేసుకోండి. ఇప్పటికైన మన ప్రేమను అంగీకరించండి. ఇలా మౌనంగా ఎన్నాళ్లు. నాకు సమాధానం కావాలని వసు అంటుంది. నా మనసుకి సమాధానం దొరికినప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది అని రిషి వెళ్లిపోతాడు. తర్వాత బైక్ మీద ఎందుకొచ్చారు అని రిషి అడుగుతాడో అని జగతి, మహేంద్ర తప్పించుకుని తిరిగుతుంటారు. బయటకు వచ్చేసరికి బైక్ పై రిషి కూర్చుని ఉండటం చూసి షాక్ అవుతారు. బైక్ మీద రావడం ఏంటీ డాడ్ అని రిషి అడిగితే.. అది.. అది.. జస్ట్ ఫర్ ఛేంజ్ రిషి. రావాలనిపించింది వచ్చేశాం అంతే అని మహేంద్ర అంటాడు. దీంతో బైక్ దిగిన రిషి.. డాడ్ మీ ఆరోగ్యం బాగోదు కదా. ఎందుకు ఇలా చేశారు. జాగ్రత్తగా వెళ్లండి. మేడమ్ చూసుకోండి మీరే అని అంటాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిన మహేంద్ర.. మనం తప్పించుకున్నాం జగతీ కానీ వసుధార పరిస్థితి ఏంటో అని గట్టిగా నవ్వుతాడు.

నేను ఏమైనా సెక్యూరిటీనా..
వసధార స్కూటీవైపు చూస్తూ మహేంద్ర వాళ్ల కోసం వెనక్కి చూసి బండి మీద నుంచి వసుధార పడిపోవడాన్ని గుర్తు చేసుకుంటాడు రిషి. ఈ బైక్ ఇక్కడ అవసరమా అని దాన్ని మాయం చేస్తాడు. తర్వాత వసుధార వచ్చి స్కూటీ కోసం వెతుకితే కనిపించదు. ఎదురుగా కారు దగ్గర నిలబడిన రిషిని అనుమానంగా చూస్తూ నా బండి రిషి సార్ దాచేశారా అని అనుకుంటుంది. రిషి దగ్గరికి వెళ్లి అడుగుతుంది. రిషి ఏం తెలియినట్లుగా అవునా అంటాడు. ఇప్పుడు నీ టూ వీలర్ కనిపించకపోతే నన్ను అడుగుతున్నావేంటీ. నేను ఏమైనా నీ బండికి సెక్యూరిటీనా అని రిషి అంటే.. సార్ నా బైక్ ఎవరో కొట్టేశారు. ఎవరి కడుపులో ఏముందో. ఎలా తెలుస్తుంది అని రిషినిచ చూస్తూ అంటుంది వసుధార.

నేనే పక్కన పెట్టించాను..
ఏంటీ అలా చూస్తున్నా అని రిషి అంటే.. అది మీ పని అయితే కాదు క దా అని వసుధార అడుగుతుంది. దీంతో తాను కాదని బుకాయిస్తాడు రిషి. లై డిటెక్టర్ తో చెక్ చేయాలి అని వసు అంటే.. రిషి కంగారు పడిపోతాడు. లేకపోతే ఏంటీ సార్ నా బండి కొట్టేసిన వాళ్లు తప్పించుకోలేరు. చట్టం, దాని చేతులు పెద్దవి అని చెప్పి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఇప్పుడే తేల్చుకుంటాను అని వెళ్లబోతుంది వసుధార. దీంతో ఆగమని కంగారుగా చెబుతాడు రిషి. ఏంటీ సార్ అప్రూవర్ గా మారతారా అని వసు అంటే.. ఏంటీ ఆ భాష అని రిషి అంటాడు. ఇప్పుడు సీసీ టీవీ టెక్నీషీయన్ లేడు. నేను వెళ్తున్నాను అని రిషి అంటే.. నన్ను వదిలేసి మీరు ఎలా వెళ్తారు. మీ బాధ్యత కదా అని రిషి కారు ఎక్కుతుంది వసు. తర్వాత కారులో తన బండి గురించి విసిగించేసరికి.. అమ్మా వసుధార నేనే నీ బండిని పక్కన పెట్టించాను సరేనా అని రిషి చెబుతాడు. రిషిధార కారులో వెళ్లడం చూసి జగతి మహేంద్ర సంతోషిస్తారు. ఇద్దరికి పెళ్లి చేద్దామని మహేంద్ర అంటాడు.


Click it and Unblock the Notifications











