Guppedantha Manasu: దేవయాని రాక్షసత్వం.. ఫస్ట్ నైట్ కు ప్లాన్ అమలు.. భారమంటూ రిషి!

వసుధార స్కూటీ దాచేసిన రిషి వసుధారను కారులో తీసుకెళ్తాడు. ఇద్దరు కారులో వెళ్తుంటారు. నేను ఏం ఆలచిస్తున్నానో అడగరా సార్ అని వసుధార అంటుంది. నువ్వు ఏం ఆలోచిస్తే నాకెందుకు అని రిషి అంటాడు. నేను మీ గురించే ఆలోచిస్తున్నాను సార్ అని వసుధార అంటే.. నా గురించి ఏం ఆలోచిస్తున్నావ్ అని రిషి అంటాడు. మీరు మా ఎండీ కదా సార్ అని వసుధార అంటుంది. ఎండీని కాదు. అయినా నా కోపం భరిస్తానన్నావ్ కదా భరించు అని కోపంగా రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 21 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 716లో ఇంకా ఏం జరిగిందంటే?

నా దగ్గర డబ్బులు లేవు..

నా దగ్గర డబ్బులు లేవు..

రిషి అలా కోపంగా అనేసరికి.. ఎక్కడో చదివాను.. భరించు వాడు భర్త అని. కానీ మన విషయంలో రివర్స్ గా ఉంది అని వసుధార అంటుంది. దీనికి నిదానమే ప్రధానం, దయచేసి తగిన చిల్లర ఇవ్వండి ఇలాంటివి నేను కూడా చదివాను అని రిషి అంటాడు. ఈ నెల శాలరీ తొందరగా వస్తే అంత మేలు సార్ అని వసుధార అంటుంది. ఇంకా రాలేదా.. అయినా డబ్బుతో నీకేం పని అని రిషి అడుగుతాడు. నాకు పెళ్లి అయింది కదా సార్.. ఖర్చులు ఉంటాయి కదా అని వసుధార అంటుంది. ఇంతలో సార్ కారు ఆపండి. మిర్చీ బజ్జీ తిందాం అని వసుధార అంటే.. నా దగ్గర డబ్బులు లేవు అని రిషి అంటాడు. నేను ఇస్తానంటుంది వసుధార. అయితే మిర్చీ బజ్జి తినడం ఇష్టం లేక ఏదేదో మాట్లాడుతుంటాడు రిషి. అర్థమైంది లేండీ అన్న వసుధార ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కు వెళదాం అని అడుగుతుంది. లేదు ఇంటికి వెళ్తున్నాం అని రిషి అంటాడు.

ఎంత పద్ధతిగా ఉందో..

ఎంత పద్ధతిగా ఉందో..

ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. సడన్ గా ఏంటీ ధరణి నన్ను ఏదో వీఐపీలా చూస్తున్నావ్. రిషికి వడ్డించు.. వసుధారకు ఏం కావాలో చూడు.. నన్ను ఎందుకు స్పెషల్ గా చూస్తున్నావ్ అంటుంది దేవయాని. దీంతో ఏంటీ వదినగారు ఏదో తేడాగా మట్లాడుతున్నారు అని మహేంద్ర అంటాడు. ఏమో మహేంద్ర నాకు అర్థం కావట్లేదు అని జగతి అంటుంది. ధరణీ నువ్వు కూర్చో తిను.. అని ధరణిని బలవంతంగా పక్కనే కూర్చోబెడుతుంది దేవయాని ఏంటీ ధరణి కొత్త కోడలిగా సిగ్గుపడుతున్నావ్. ఆ వసుధారను చూడు.. ఎంత పద్ధతిగా ఉందో అని దేవయాని అంటుంది. థ్యాంక్యూ మేడమ్ నన్ను తలుచుకున్నందుకు అని వసుధార అంటుంది. మీ పెళ్లి విషయం ప్రెస్ మీట్ ద్వారా తెలిసింది. అయిందేదో అయింది. పెళ్లి తర్వాత రావడాలు.. పోవడాలు, అత్తిళ్లు, పుట్టిళ్లు చీర సారే. ఇంకా చాలా సాంప్రదాయాలు ఉంటాయి కదా అని దేవయాని అంటుంది.

కంగారుగా జగతి..

కంగారుగా జగతి..

దేవయాని అన్నమాటలకు జగతి, మహేంద్ర షాక్ అవుతారు. పెద్దమ్మా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని రిషి అంటాడు. రిషి నువ్వు ఆగు.. జగతి, మహేంద్రలు ఎలాగో పట్టించుకోరు. నేనైనా చూసుకోవాలి కదా అని దేవయాని అంటుంది. వెంటనే వసుధారపై వచూస్తూ మీ అమ్మనాన్నలను రమ్మని కబురు పెట్టు అని దేవయాని అంటుంది. దీనికి ఎందుకు అక్కయ్య అని జగతి కంగారుగా అంటే.. ఇది పెళ్లయిన ఇల్లులా ఉందా.. పెళ్లి తర్వాత తంతులు, సాంప్రదాయాలు అన్నీ పూర్తి చేయాలి కదా అని దేవయాని అంటుంది. అవన్నీ ఇప్పుడు వద్దు మేడమ్ అని వసు అంటే.. చూశావా నువ్వు నన్ను ఇంకా మేడమ్ అనే అంటున్నావంటే.. దూరం ఎంతుందో అని దేవయాని అంటుంది.

ఇంకా గెస్టుగా ఆ గదిలో..

ఇంకా గెస్టుగా ఆ గదిలో..

పెద్దమ్మ నా మాట వినండి అని రిషి అంటే.. ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. అసలు నలుగురు ఏం అనుకుంటారు అని దేవయాని అంటుంది. దానికి అవును భూషణ్ ఫ్యామిలీ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి అని ఫణీంద్ర అంటాడు. ఎందుకు ఇవన్నీ వసుధార అంటే నువ్వు ఊరుకో వసుధార.. ఇంకా ఆ గెస్ట్ రూమ్ లో గెస్ట్ గా ఎన్నాళ్లు ఉంటావ్. నువ్ ఈ ఇంటి కోడలివి అని దేవయాని అంటుంది. దీంతో రిషి చేయి కడిగి వెళ్లిపోతాడు. రిషి ఏం మాట్లాడలేదు అంటే ఒప్పుకున్నట్లే కదా అని వసుధారను అడుగుతుంది దేవయాని. అప్పుడు వసుధార కూడా చేయి కడుక్కుని వెళ్లిపోతుంది. నాకు కావాల్సింది ఇదే.. రిషికి కోపం రావాలి. వీళ్ల మధ్య దూరం పెరగాలి అని దేవయాని అనుకుంటుంది.

మీ నాన్నతో మాట్లాడదమా..

మీ నాన్నతో మాట్లాడదమా..

తర్వాత జరిగినదాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర జగతి. మనమే ఏదో ఒకటి చేయాలని అని మహేంద్ర అంటుండగా.. వాళ్ల దగ్గరికి వసు వస్తుంది. అక్కయ్య అన్నదాంట్లో సగం నిజముంది. సాంప్రాదాయాలను పాటించి తీరాలి. ఒకసారి రిషితో మాట్లాడితే బెటర్ కదా. నువ్వే ముందు అడుగు వేయాలి. ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడదమా అని జగతి అంటుంది. రిషి సార్ మనసులో మాట స్పష్టంగా చెప్పాక నేను ఏం చేయగలను మేడమ్ అని వెళ్లిపోతుంది వసుధార. తర్వాత వసు నిద్రపోతుంది. వసు గది దగ్గరికి వచ్చి తలుపు కొట్టాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు రిషి. అసలు వసుధార మనసులో ఏముంది. ఏం మాట్లాడదు చెప్పదు అనుకుంటాడు.

సంఘర్షణ మాత్రమే..

సంఘర్షణ మాత్రమే..

ఇంతలో వసుధారకు మెలకువ వచ్చి గుమ్మం తలుపు తీస్తుంది. అప్పుడు రిషి తలుపు కొట్టడానికి చేయిని తలుప వైపు ఉంచుతాడు. వసు తలుపు తీస్తుంది. సార్ మనిద్దరి మధ్య గోడలు మాత్రమే అడ్డున్నాయి.. దూరం అని వసుధార మాట పూర్తికాకుండానే దూరం ఉందని అనకు వసుధార. దూరం లేదు. భారం మాత్రమే ఉంది. సంఘర్షణ ఉంది అంతే అని రిషి అంటాడు. ఇద్దరం ఎదురు ఎదురుగానే ఉంటాం. అయినా ఏదో తెలియను దూరం అని వసుధార మనసులో అనుకుంటూ బాధపడిపోతుంది. పెద్దమ్మ అన్నదాని గురించి ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని రిషి అంటే.. మనసులో నాకేం ప్రశ్నలు లేవు. సమాధానాలు మాత్రమే ఉన్నాయి. కానీ మీ ప్రశ్నలకు అవి సరిపోవడం లేదని మీరు అనుకుంటున్నారు అని వసుధార అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X