Guppedantha Manasu: రాత్రంతా వసుధార బెడ్ పై రిషి.. దేవయానికి జగతి చురకలు

రిషి కోసం వసుధార వంట చేసి కాలేజీలో వడ్డిస్తుంది. వంటలు బాగున్నాయి పెద్దమ్మ చేసిందా అని రిషి అంటే వసుధార ఫీల్ అవుతుంది. పొద్దున్నే లేచి కష్టపడి మీకు నచ్చిన వంటలన్నీ చేస్తే నా కష్టాన్ని గుర్తించలేదంటుంది వసుధార. ఆ వంటల గురించి కాసేపు ఇద్దరు ఫన్నీగా వాదించుకుంటారు. వంటలు బాగున్నాయి థ్యాంక్స్ అని రిషి చెబుతాడు. లంచ్ తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటారు. స్పాట్ వాల్యుషన్ కి మన కాలేజీ ఎంపిక కావడం సంతోషం అని చెబుతూ ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 23 గురువారం నాటి తాజా ఎపిసోడ్‌ 718లో ఇంకా ఏం జరిగిందంటే?

లోకం నమ్ముతుంది.. నేను కాదు..

లోకం నమ్ముతుంది.. నేను కాదు..

ఏ చిన్న పొరపాటు లేకుండా కాలేజీ గౌరవాన్ని కాపాడాలని అనుకుంటారు. ఈ వర్క్ మొత్తానికి జగతి మేడమ్, మహేంద్ర సార్ ఇంఛార్జ్ గా ఉంటారని రిషి చెబుతాడు. సాయంత్రానికి జగతి, మహేంద్రలు ఇంటికి వచ్చేస్తారు. అక్కడే హాల్లో ఉన్న దేవయాని.. ఏం జగతి రిషి ఎక్కడా.. వెనుక వస్తున్నారా.. లేక షికార్లు చేసి వస్తున్నారా అని అంటుంది. అక్కయ్యా వాళ్లు ఎప్పుడు రావాలో.. ఎప్పుడు వెళ్లాలో డిసైడ్ చేయడానికి మేము ఎవరం చెప్పండి అని కోపంగా అంటుంది జగతి. రిషి వసుధారలు భార్యాభర్తలను లోకం నమ్ముతుంది నేను కాదు అని దేవయాని కోపంగా అంటుంది. అందరి ముందు రిషి ఒప్పుకున్నాడు కదా అని మహేంద్ర అంటాడు. అందరి ముందు అందరికోసం వసుధారను రక్షించడం కోసం మాత్రమే ఒప్పుకున్నాడు. నిజానిజాలేంటో మీకు తెలుసు.. నాకు తెలుసు. వాళ్లను అలా వదిలేయడం కరెక్ట్ కాదు జగతి అని దేవయాని అంటుంది.

 ఓ హద్దు ఉంటుంది..

ఓ హద్దు ఉంటుంది..


వాళ్ల బంధం ఏంటో మాకు తెలుసు అని జగతి అంటే.. నాకు తెలియదా అని దేవయానికి కోపంతో అంటుంది. ఆ విషయం మీకు మీరే ప్రశ్నించుకోండి. నా కొడుక్కి అన్నీ తెలుసు. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రేమను, తన భార్యను, తన బంధాన్ని తనే కాపాడుకోగలడు. ఒకరి వ్యక్తిగత విషయాల్లో అది భార్యాభర్తల మధ్య కల్పించుకోవడం కొందరిలాగా నాకు అలవాటు లేదు అక్కయ్య. నాకు సంస్కా తెలుసు కాబట్టే సహనంగా కొన్నింటిని భరిస్తున్నాను అని దేవయానికి జగతి చురకలు వేస్తుంది. వదినగారు సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది తెలుసుకోండి అని మహేంద్ర అని జగతిని తీసుకువెళ్లిపోతాడు. మరోవైపు కాలేజీ అయిపోయాక ఓ బల్లమీద కూర్చుని పని చేసుకుంటుంది వసుధార. రిషి వెళ్లి పక్కన నిల్చున్న పట్టించుకోదు. కొద్దిసేపటికి రిషిని చూసి ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది.

రిషి అడుగుజాడల్లో..

రిషి అడుగుజాడల్లో..

ఏంటీ కాలేజ్ అయిపోయి, అంతా వెళ్లిపోయాక కూడా కష్టపడిపోతున్నావ్ అని రిషి అంటాడు. స్పాట్ వాల్యూషన్ కి సంబంధించి మెయిల్స్ పంపిస్తున్నా అని వసుధార చెబుతుంది. టీమ్ లో మేమంతా ఉన్నాం కదా. మొత్తం నువ్వే చేసేయ్యాలా.. అయినా ఏ టైమ్ లో చేయాల్సిన పని ఆ టైమ్ లోనే చెయ్యాలి.. పదా వెళ్దాం అని రిషి అంటాడు. దీంతో ముందు మీరు నడవండి సార్. మీ అడుగుజాడల్లో నేను నడుస్తాను అని వసుధార అంటుంది. దీంతో రిషి ముందు నడుస్తాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఓ సాంగ్ ప్లే అవుతుంది. రిషి అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వసుధార వెళ్తుంది. సీన్ కట్ చేస్తే.. రాత్రి భోజనానికి అంతా కూర్చుంటారు. స్పాట్ వాల్యూషన్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో దేవయాని ఎంట్రీ ఇచ్చి ఏంటీ మన ఇంట్లో బాధ్యత అనే మాట వినిపిస్తోంది అని అంటుంది. అప్పుడు స్పాట్ వాల్యుషన్ గురించి దేవయానికి చెబుతారు.

 వసుధార గదిలోకి..

వసుధార గదిలోకి..

దాని వల్ల మనకు లాభమేంటీ అని దేవయాని అడిగితే.. లాభం ఏం లేదు పెద్దమ్మా.. ఇది మన కాలేజీకి గర్వకారణం అని రిషి అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ అంటూ లేని తలనొప్పులన్నీ రిషి మీదకే వేశారు. ఇప్పుడు ఇదొక్కటా. రిషికి కష్టం ఎక్కువైపోతుంది రిషిని ఎవ్వరూ పట్టించుకోరు అని దేవయాని అంటుంది. రిషి సర్ది చెబుతాడు. గతంలో ఈ ప్రాజెక్ట్ ద్వారానే రిషికి వసుధార దగ్గరైంది. ఇప్పుడు కొత్తగా స్పాట్ వాల్యూషన్ అంటా.. ఏంటో ఇదంతా అని లోపల రగిలిపోతుంది దేవయాని. తర్వాత వసుధార తన గదిలో చాలా రాత్రి వరకు మెయిల్స్ చేస్తుంది. ఇంతలో అటు ఇటు తిరుగుతున్న రిషి వసుధార గదిలోకి తొంగి చూస్తాడు. వసు పనిచేయడం చూసి దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. పని ఉంది సార్. చాలా మెయిల్స్ పంపించాలి అని వసు అంటే.. సరే వర్క్ చేసుకో అని వెళ్లిపోతాడు. ఈ టైమ్ లో కాఫీ ఉంటే బాగుండేది అని వసుధార మనసులో అనుకుంటే.. రిషి కాఫీ కప్పుతో వస్తాడు.

 చందమామతో చాటింగ్..

చందమామతో చాటింగ్..

సగం సాసర్ లో వేసుకుని సగం కాఫీ కప్పు వసధారకు ఇస్తాడు రిషి. సార్ ఇలా మనసులో అనుకున్నాను మీరు తెచ్చారు అని వసుధార అంటుంది. వసుధార కాఫీ తాగుతూ సార్ బయట చందమామ ఉన్నాడా అని అడుగుతుంది. ఏ ఇప్పుడు అక్కడికి వెళ్లి కాఫీ తాగుదాం అంటావా. అయితే నువ్వు చందమామతో చాటింగ్ చేసుకో నేను వెళ్తాను అని రిషి పైకి లేస్తాడు. అయ్యే లేదు సార్ కూర్చోండి అని వసుధార అంటుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు. ఇంతలో ఇంకో మెయిల్ ఉంది సార్. మరిచిపోయాను. మీరు వెళ్లి పడుకోండి. నేను చేస్తా అని వసుధార అంటుంది. పర్లేదు నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాలే. నువ్వు కానీ అంటూ వసుధార బెడ్ మీదకు వెళ్లి కూర్చుంటాడు రిషి.

 ఎందుకు ఇలా ఉంటున్నారు..

ఎందుకు ఇలా ఉంటున్నారు..

గోడకు తలగడలు ఆనించి.. వసుధార వైపు కూర్చుని వసుధాను చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు రిషి. వసుధార వర్క్ పూర్తి చేసేసరికి రిషి పూర్తిగా నిద్రలో ఉంటాడు. దీంతో రిషికి దుప్పటి కప్పేసి.. కప్పు, సాసర్ పట్టుకుని లైట్ ఆఫ్ చేసేసి బయటకు వెళ్లిపోతుంది వసుధార. బయట హాల్లో కూర్చుని రిషి చూపించే కేరింగ్ తలుచుకుంటుంది. రిషి సార్ కి నేనంటే ఎనలేని ప్రేమ కదా. కానీ ఈ విషయంలో ఎందుకు ఇలా ఉంటున్నారు అని ఆవేద పడుతుంది. నేను నీకు భర్తనే.. కానీ నేను నువ్వు నా భార్యవి కాదు అన్ని రిషి మాటలు తలుచుకుంటు బాధపడుతుంది వసుధార.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X