Guppedantha Manasu: కొత్త విలన్ ఎంట్రీ.. గజగజ వణికిన జగతి, వసు.. కనిపెట్టేసిన రిషి!

రిషి తన బెడ్ రూమ్ లో పడుకునేసరికి హాల్లోకి వెళ్లి పడుకుంటుంది వసుధార. మరుసటి రోజు ఉదయం వసుధార నిద్ర లేచేసరికి తన ఎదురుగా దేవయాని ఉంటుంది. చూశావా వసుధార.. నీ స్థానం ఏంటో నీకు కూడా తెలిసింది కదా. ఎవరి స్థానం వారిదే మరి.. అలాగే ఉంటుంది అని దేవయాని అంటుంది. మేడమ్ నా స్థానం ఎప్పుడు రిషి సార్ గుండెల్లోనే.. ఇప్పుడు ఏదో అయిందని మీరు అనుకుంటున్నారేమో.. ఏం జరగలేదు అని వసుధార కూల్ గా సమాధానం ఇస్తుంది. ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 24 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 719లో ఇంకా ఏం జరిగిందంటే?

కొత్త విలన్..

కొత్త విలన్..

మీరు కూడా గుర్తు పెట్టుకోండి మేడమ్.. రిషి సార్ కి అసలు నిజాలన్నీ తెలిస్తే ఎవరి స్థానం ఏమవుతుందో. ఇంతకన్న ఎక్కువగా మాట్లాడితే బాగుండదు అని చెప్పేసి వెళ్లిపోతుంది వసుధార. ఇదంతా విని జగతి నవ్వుకుంటుంది. ఏంటీ జగతి వసుధారకు బాగా ధైర్యం ఎక్కువైంది అని దేవయాని కోపంగా అంటుంది. అవును అక్కయ్య. వసు నా కోడలు కదా.. నీ కోడలు లాగా చెప్పింది వినే రకం కాదు. ఒకటికి పది అనే రకం అని జగతి చెప్పి వెళ్లిపోతుంది. దీంతో మీ ఇద్దరికి సంగతి చూస్తాను అని దేవయాని రగిలిపోతుంది. తర్వాత ధర్మరాజు అనే కొత్త విలన్ క్యారెక్టర్ సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తాడు. డీబీఎస్టీ కాలేజీ ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి సూట్ వేసుకుని ఒకతను దిగుతాడు. కారు దిగగానే అతనికి ఫోన్ వస్తుంది.

ధర్మరాజు అంటే చూపిస్తా..

ధర్మరాజు అంటే చూపిస్తా..

నమస్తే ధర్మరాజు గారు.. ఎక్కడున్నారు అని అవతల వ్యక్తి అంటే.. జస్ట్ ఇప్పుడే డీబీఎస్టీ కాలేజీకి వచ్చాను అని ధర్మరాజు అంటాడు. మన కాలేజీ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అవతల వ్యక్తి అడిగితే.. నిజానికి స్పాట్ వాల్యూషన్ మీ కాలేజీకే రావాలి. కానీ అలా కాదాని ఇదిగో ఈ డీబీఎస్టీ కాలేజీకి ఇచ్చారు అని ధర్మరాజు అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నదానికి చూద్దాం వీళ్లెంత ఘనంగా పని చేస్తారో. వీళ్ల గొప్పతనం విన్నాం. కానీ ఇప్పుడు కళ్లారా చూస్తాను. చిన్న తప్పు దొరికినా వదిలిపెట్టను. దర్మరాజు సార్ నా పేరు. తప్పు చేయనీయండి. ధర్మరాజు అంటే ఏంటో చూపిస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు ధర్మరాజు. తర్వాత కాలేజీలో మహేంద్రను కలుస్తాడు ధర్మరాజు. స్పాట్ వాల్యూషన్ కి ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ నియమించిన స్పెషల్ ఆఫీసర్ ని. మీ కాలేజ్ పని తీరును పర్యవేక్షించడానికి నియమించారు అని చెబుతాడు ధర్మరాజు.

 ఎలాగైనా బుక్ చేయాలి..

ఎలాగైనా బుక్ చేయాలి..

థ్యాంక్యూ సర్ మీ డ్యూటీ మీరు చేస్తారు. మా డ్యూటీ మేం చేస్తాం అని మహేంద్ర అంటాడు. చాలా బాగా చెప్పారు అని ధర్మరాజు అంటాడు. ఇక మిగిలిన టీచర్స్, లెక్చరర్స్ అంతా ప్రత్యేకమైన రూమ్ లో ఉన్న పేపర్స్ కరెక్షన్స్ చేస్తూ ఉంటారు. అంత పద్ధతిగా సాగుతుంది. ఇంతలో ఆ రూమ్ లోకి రిషి వచ్చి.. అంతా ఓకేనా.. అని అడిగితే.. ఓకే అని జగతి, వసుధార చెబుతారు. ఇంతలో మహేంద్రతో పాటు లోపలికి వచ్చిన ధర్మరాజు.. రిషిని పరిచయం చేసుకుంటాడు. మీరు నాకు బాగా తెలుసు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి చాలా వింటున్నాను. అందుకోసం మీరు ముందుంటారు కదా అని అంటాడు ధర్మరాజు. వాల్యుషన్ చేస్తున్న లెక్చరర్స్ ని అంతా పరిశీలిస్తాడు. కానీ తేడాగా ఏదీ కనిపించదు. వీళ్లను ఎలాగైన బుక్ చేయాలని మనసులో అనుకుంటాడు ధర్మరాజు. ఆరోజు వాల్యుషన్ తర్వాత మహేంద్ర క్యాబిన్ లో ధర్మరాజు కూర్చుంటాడు.

డూప్లీకేట్ కీ చేయించి..

డూప్లీకేట్ కీ చేయించి..


ఇంతలో మహేంద్ర వచ్చి హాలో సార్ మీ సౌకర్యాలు అంతా ఓకేనా అంటూ మాట్లాడిస్తాడు. ఈలోపు టేబుల్ పై వాల్యుషన్ జరిగిన పేపర్ బండిల్స్ దాచే రూమ్ కీ పడుతుంది. అది ధర్మరాజు కళ్ల ముందు ఉంటుంది. అది మహేంద్ర చూసుకోడు. ఇదే కదా ఆ రూమ్ కీ.. దీన్ని డూప్లికేట్ కీ చేయిస్తే వీళ్లని ఈజీగా బుక్ చేయొచ్చు అని అనుకుంటాడు ధర్మరాజు. ఇంతలో జగతి వచ్చి మహేంద్రను పిలుస్తుంది. దాంతో మహేంద్ర జగతి వద్దకు వెళ్తాడు. వెంటనే టైబుల్ పై ఉన్న కీని తీసుకుని.. బ్యాగ్ లోపల ఉన్న సబ్బుకి కీని నొక్కి.. ఆ సబ్బును బ్యాగ్ లోపల పెట్టుకుంటాడు ధర్మరాజు. తర్వాత అసలు కీని టేబుల్ పై పెడతాడు. తర్వాత మహేంద్ర గారు నేను ఒక అరగంటలో వస్తాను అని చెప్పి వెళ్తాడు ధర్మారాజు. డూప్లీకేట్ కీ చేయిస్తాను.. మీ అందరి పని తేల్చేస్తాను అని నవ్వుకుంటూ వెళ్తుండగా.. ఎదురుగా రిషి కనిపిస్తాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ధర్మరాజు.

మూడు బండిల్స్ తీసుకుని..

మూడు బండిల్స్ తీసుకుని..

సార్ ఎక్కడికి అని రిషి అడిగితే.. బయటకు ఒక అరగంట వెళ్లొస్తానని చెప్పి బయలు దేరతాడు ధర్మరాజు. ఇక వాల్యుషన్ బండిల్స్ గురించి మహేంద్ర, జగతిలకు జాగ్రత్తలు చెప్పి.. రిషి అందరూ ఆ సీక్రెట్ రూమ్ కు వెళ్తారు. వసుధార కూడా ఉంటుంది. కాసేపటికి ధర్మరాజు కళ్లముందే అన్ని బండిల్స్ ఆ రూమ్ లో పెట్టి తాళం వేసి సీల్ వేస్తారు మహేంద్ర వాళ్లు. తర్వాత కొద్దిసేపటికీ డూప్లికేట్ కీ తీసుకొచ్చి ఆ సీక్రెట్ రూమ్ లాక్ ఓపెన్ చేసి అందులోని పేపర్ బండిల్స్ లో మూడు తీసుకుని బ్యాగ్ లో పెట్టేసుకుంటాడు ధర్మరాజు. మరోవైపు వసుధారను వెతుక్కుంటూ జగతి వస్తూ ఉంటుంది. అయితే ధర్మరాజు ఆ సీక్రెట్ రూమ్ కు తాళం వేయకుండా రేపు పొద్దున వరకు ఎవరు చూడరు.. ఉయాన్నే వచ్చి బండిల్స్ ఎక్కడ ఆని రచ్చ చేయొచ్చు అని మనసులో అనుకుని వెళ్లిపోతాడు. ఇంతలో సీక్రెట్ రూమ్ ఎదురుగా వసుధార కనిపించడంతో ఇక్కడే ఉన్నావా అని ఆగిపోతుంది జగతి.

రిషికి అనుమానం..

రిషికి అనుమానం..

ఈ క్రమంలో సీక్రెట్ రూమ్ కు తాళం తెరచి ఉండటం చూసి షాక్ అవుతుంది జగతి. వెంటనే మహేంద్ర, రిషీలకు కాల్ చేయమని వసుధారకు చెబుతుంది. దీంతో మహేంద్రలు ఇద్దరు వస్తారు. లోపలికి వెళ్లు చూస్తారు. మూడు బండిల్స్ మిస్ అయ్యాయని వసుధార చెబుతుంది. ఇంతలో జగతీ తన చేతిలో ఉన్న అసలు కీని పరిశీలనగా చూస్తుంది. దీనికి సబ్బు అంటుకుంది ఏంటీ అని జగతి అంటుంది. దాన్ని వసుధారకు ఇస్తే.. కీని వాసన చూసి.. అవును మేడమ్ దీనికి సబ్బు అంటుకుంది. రేపు మన కాలేజీ పరువు పోతుంది అని కంగారు పడుతుంది వసు. దీంతో ఈ పని ఎవరు చేశారో నాకు తెలుసు. వసుధార పదా బయలుదేరదాం అని రిషి అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X