Guppedantha Manasu: ధర్మరాజుకు దొరికిపోయిన వసుధార.. ఇక జైలుకే అంటూ.. రిషి మాత్రం అలా!

డీబీఎస్టీ కాలేజీలోని సీక్రెట్ రూమ్ లో ఉన్న వాల్యూషన్ పేపర్స్ బండెల్స్ ను కొట్టేసి వెళ్లిపోతాడు స్పెషల్ ఆఫీసర్ ధర్మరాజు. అది చూసిన జగతి, వసు, రిషి, మహేంద్ర కంగారు పడుతుంటారు. మూడు పేపర్ బండెల్స్ మిస్ అయినట్లు వసుధార కనిపెడుతుంది. ఇంతలో రూమ్ కీకి సబ్బు అంటుకోవడం జగతి కనిపెడుతుంది.

దీంతో ఈ పని ఎవరు చేశారో తెలుసు అని వసుధారను తీసుకుని బయలు దేరతాడు రిషి., మరోవైపు తను ఉన్న ఫామ్ హౌజ్ లో ధర్మరాజు మందు తాగుతూ హ్యాపీగా ఉంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 25 శనివారం నాటి తాజా ఎపిసోడ్‌ 720లో ఇంకా ఏం జరిగిందంటే?

సార్ మీ పని అయిపోయింది..

సార్ మీ పని అయిపోయింది..

తను ఎత్తుకొచ్చిన పేపర్ బండిల్స్ పట్టుకుని.. రేపు ఎప్పటిలానే కాలేజీకి వెళ్తాను. లాకర్ ఊడిపోయి ఉండటంతో రచ్చ చేస్తాను. పేపర్స్ మిస్ అయ్యాయని అరుస్తాను. స్పెషల్ స్క్వాడ్ వాళ్లకు నేనే అజ్ఞాతవ్యక్తిగా ఫోన్ చేసి రమ్మని చెబుతాను. దీంతో డీబీఎస్టీ కాలేజీ విందా.. గోవిందా.. అంటూ డ్యాన్స్ చేస్తాడు ధర్మరాజు. ఇంతలో అతనికి కాల్ వస్తుంది.

సార్ మీ పని అయిపోయింది. డీబీఎస్టీ కాలేజీ పరువు పోవడం రేపు టీవీలో చూసుకోండి. మన డీల్ ప్రకారం నా అకౌంట్ లో డబ్బులు వేయండి అని ధర్మరాజు మాట్లాడతాడు. రేపు రిషి సార్ మొహం చూడాలి. నాకు ఇప్పటికే ఎక్కువైంది. అయినా ఈ విజయం సందర్భంగా బాటిల్ లేపేస్తా అంటూ సంబరిపడిపోతాడు ధర్మరాజు.

సాహసానికి బ్యాగ్..

సాహసానికి బ్యాగ్..

మరోవైపు ధర్మరాజు ఫామ్ హౌజ్ ముందు రిషి, వసుధార కారులో వచ్చి ఆగుతారు. వసుధార ఈ టైమ్ లో బ్యాగ్ ఏంటీ. మనం వచ్చింది కాలేజీకి కాదు. దొంగతనానికి. అదే మన పేపర్ బండిల్స్ ను తీసుకుపోయేందుకు అని రిషి అంటాడు. సార్ దీన్ని దొంగతనం అనొద్దు. సాహసం అనాలి అని వసుధార అంటే.. ఈ సాహసానికి బ్యాగ్ ఉండాలా అని రిషి కౌంటర్ వేస్తాడు.

సార్ ఇందులో ఆయుధాలు ఉన్నాయి సార్.. అంటూ కటింగ్ ప్లేయర్ కరెంట్ కట్ చేయడానికి, స్క్రూ డ్రైవర్ కిటికీ లేదా తలుపు విప్పడానికి, ఇదుగోండి గ్లౌజులు వేలి ముద్రలు పడకుండా అని ఒక్కొక్కటి చూపిస్తుంది వసుధార. తర్వాత తాడు తీస అవసరం అయితే కట్టేయడానికి, లేదా బంజ్ చేయాల్సి వస్తే కిటికీకి కట్టి జాగ్రత్తగా పారిపోవడానికి సార్ అని చెబుతుంది వసుధార.

కోడ్ నేమ్స్ తో పిలవాలి..

వామ్మో వామ్మో ఏంటీ వసుధార ఇది. ప్రొఫెషనల్ దొంగలానే ఆలోచిస్తున్నావ్. క్రిమినల్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నావా ఏంటీ అని రిషి అంటాడు. సార్ ఏ పని చేసిన అందులో లీనమై పోయి చేయాలి. మీరు ఒక దొంగ, నేను ఒక దొంగ అదే క్యారెక్టర్ లో ఉండాలి అని వసుధార అంటుంది.

తర్వాత ఫోన్ సైలెంట్ లో పెట్టమని చెప్పి.. కోడ్ నేమ్స్ తో పిలిచుకోవాలని అంటుంది వసు. రిషిని ఆర్ అని, వసుధారను వీ అని పిలవమని చెబుతుంది. తర్వాత ఇద్దరు మెల్లిగా అడుగులో అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్తారు. ఏంటీ నేను ఇప్పుడు ఇలా నడవలా అనుకుంటూ వసుధార చెప్పినట్లుగానే నడుస్తాడు. ఇద్దరు నక్కి నక్కి లోపలికి వెళ్తారు. ఇద్దరు కలిసి డోర్ దగ్గరికి వెళ్తారు.

అంతగా ఎక్కేసిందా..

అంతగా ఎక్కేసిందా..

సరిగ్గా అప్పుడే ఫుల్ గా తాగిన ధర్మరాజుకి టాయిలెట్ అర్జెంట్ అనుకుంటూ ఉంటాడు. డోర్ అవతలివైపుకు నిలుచున్న రిషి, వసు డోర్ ఎలా తీయ్యాలి అని అనుకుంటారు. ఇంతలో పిన్నీసు తీసి దీంతో తెరుద్దామని ట్రై చేస్తుంది వసుధార. కానీ అది ఓపెన్ కాదు. సినిమాల్లో తిప్పితే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు రావట్లేదు అని వసు అంటే.. అబ్బా వసుధార ఇది సినిమా కాదు. జీవితం అని కోపంగా మెల్లిగా అంటాడు రిషి.

సార్ పేరు కాదు వీ వీ అని కోడ్ నేమ్ చెబుతుంది వసుధార.ఇంతలో ధర్మరాజు టాయిలెట్ అనుకుని మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాడు. దీంతో రిషి ఇటు, వసు అటు గోడకు ఆనుకుంటారు. ధర్మరాజు బయటకు వచ్చి ప్యాంట్ జిప్ తీసేలోపు రిషి, వసు లోపలికి వెళ్తారు.

తర్వాత తేరుకున్న ధర్మరాజు ఇది టాయిలెట్ కాదా.. అంతగా ఎక్కేసిందా అని లోపలికి వెళ్లి గడియ పెడతాడు. అయ్యే తలుపు వేసేశాడు ఇప్పుడు ఎలా ఆర్ అని వసు అంటే అది వెళ్లేటప్పుడు చూసుకుందాం అని రిషి అంటాడు.

మీడియా ముందు పరువు..

మీడియా ముందు పరువు..

లోపల ఉన్న గదుల్లో పేపర్ బండిల్స్ కోసం వెతుకుంటారు రిషి, వసుధార. కానీ దొరకవు. మరో గదిలోకి వెళ్దామనుకుంటారు. ఇంతలో రిషి సార్ అని గట్టిగా అరుస్తాడు ధర్మరాజు. అది విని దొరికిపోయామా అని బిత్తరపోతారు రిషి, వసుధార. అయ్యో దొరికిపోయాం. జైల్లో వేస్తారా అని వసు అంటుంది. తర్వాత ధర్మరాజు వైపు టెన్షన్ గా చూస్తాడు రిషి.

ధర్మరాజు మాత్రం కూల్ గా సోఫాలో కూర్చుని పేపర్ బండిల్స్ చేత్తో పట్టుకుని.. మీ కాలేజ్ పరువు రేపు మీడియా ముందు పోతుంది. అది ఒకరికి అవసరం అని అంటాడు. ఎవరికీ అవసరం అని వసు అనుకుంటుంది. ఇద్దరు ధర్మరాజు మాట్లాడేది వింటూ ఉంటారు. ధర్మరాజు తనలో తానే అలా మాట్లాడుకుంటూ ఉంటాడు.

వసుధారను చూసిన ధర్మరాజు..

వసుధారను చూసిన ధర్మరాజు..

తర్వాత ధర్మరాజు పేపర్ బండిల్స్ ను సోఫాలోనే ఉంచి.. పైకి లేస్తాడు. దీంతో రిషి, వసు పక్కనే ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటారు. ఇక ధర్మరాజు వాష్ రూమ్ కి వెళ్తూ బెడ్ రూమ్ డోర్ తీసి ఉండటంతో.. వచ్చి ఆ డోర్ లాక్ చేస్తాడు. దీంతో వసుధార, రిషి ఆ గదిలోనే ఉండిపోతారు. ఇద్దరు ఏం చేద్దాం అని వెటకారంగా వాదించుకుంటారు.

ఇక ధర్మరాజు వాష్ రూమ్ కి వెళ్లి బెడ్ రూమ్ వైపుకు వస్తాడు. అప్పుడే రెండోసారి డోర్ వస్తుందో లేదో చూడటానికి అని వెళ్తుంది వసుధార. ఇంతలో బెడ్ రూమ్ డోర్ తీసిన ధర్మరాజు వసుధారను చూసి షాక్ అవుతాడు. వసుధార కూడా షాక్ అయి అలాగే నిల్చుంటుంది. రిషి మాత్రం కర్టెన్స్ వెనుక దాగి ఉండి చూస్తాడు. వసుధారను చూసిన ధర్మరాజు షాక్ తో వసుధార అని అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X