Guppedantha Manasu: స్క్వాడ్ ముందు బిత్తరపోయిన ధర్మరాజు.. రిషి దెబ్బ అదుర్స్.. అంతలోనే బాధ!
డీబీఎస్టీ కాలేజీ వాల్యూషన్ పేపర్ బండిల్స్ ను దొంగతనం చేసిన స్కృటినింగ్ ఆఫీసర్ ధర్మరాజు తన గెస్ట్ హౌజ్ లో ఉంచుతాడు. దీంతో వసుధార, రిషి ఆ పేపర్ బండిల్స్ ను కొట్టేయడానికి ధర్మరాజు గెస్ట్ హౌజ్ కు వెళతారు. అక్కడ వసుధారను చూసి షాక్ అవుతాడు ధర్మరాజు. వసుధార కూడా బిత్తరపోయి చూస్తుంది. విండో కర్టెన్స్ వెనుక రిషి దాక్కుంటాడు.
వసుధారను చూసి షాక్ అయిన ధర్మరాజు నిజమా అబద్ధమా అన్నట్లుగా కళ్లు నులుముకుంటాడు. దీంతో వసుధారను వెనక్కి లాగేస్తాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 27 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 721లో ఇంకా ఏం జరిగిందంటే?

డూప్లికేట్ బండిల్స్ పెట్టి..
రిషిపై వసుధారపై పడిపోతుంది. ఇద్దరూ బెడ్ పక్కకు పడుకును ఉంటారు. ఇంతలో కళ్లు నులుముకున్న ధర్మరాజు కళ్లు తెరచి చూసేసరికి అక్కడ వసుధార కనిపించదు. దీంతో భ్రమా.. ఇదంత నా భ్రమ.. అనుకుంటూ బెడ్ పై పడిపోతాడు ధర్మరాజు. దీంతో రిషి, వసుధార ఇద్దరు మెల్లిగా లేచి హాల్లోకి వెళ్లిపోతారు. అక్కడ ఉన్న పేపర్ బండిల్స్ ఇవే అవి అని అంటాడు రిషి.
అయితే చివరి నిమిషం దాకా ధర్మరాజుకు మనం తీసుకుపోయినట్లు తెలియకూడదు. వీటి స్థానంలో ఏవైనా పెట్టాలి. ఇప్పుడు ఎలా అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో ఉండండి సార్ అంటూ వసుధార తన బ్యాగ్ లో నుంచి డూప్లికేట్ పేపర్ బండిల్స్ తీస్తుంది. ఇలాంటి అవసరం వస్తుందనే కొన్ని వేస్ట్ పేపర్స్ చుట్టి బండిల్స్ తెచ్చా అని వసుధార అంటుంది. నువ్ సూపర్ వసుధార అని రిషి పొగుడుతాడు.

ధర్మరాజు లేచేందుకు..
అసలైన పేపర్ బండిల్స్ తీసి డూప్లికేట్ పేపర్ బండిల్స్ పెడతారు రిషి, వసుధార. తర్వాత మనం వెళ్తాం కానీ, డోర్ తీసి ఉంటే అతనికి డౌట్ వస్తుంది కదా అని రిషి అంటాడు. హా, కానీ తనే వచ్చి మనకోసం డోర్ తీయ్యడు కదా అని వసుధార అంటుంది. నువ్వు సోఫా వెనుక దాక్కో అని చెప్పిన రిషి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి గట్టిగా కొడతాడు.
దీంతో ఎవడ్రా ఈ టైమ్ లో వెళ్లిపో అంటూ ధర్మరాజు అరుస్తాడు. తర్వాత మరోసారి తలుపు కొడుతూనే ఉంటాడు రిషి. అది విన్న ధర్మరాజు ఎవడ్రా, నా చేతుల్లో అయిపోయావ్ అంటూ బయటకు వచ్చి డోర్ తీస్తాడు. ధర్మరాజు డోర్ తీశాకా వసుధార, రిషి మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటారు. ఇక ధర్మరాజు చూస్తే అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటాడు.

మళ్లీ సీల్ వేశారా..
మరుసటి రోజు ఉదయం కాలేజీలో మహేంద్ర, జగతి, వసుధార, రిషి ఇతర కాలేజీ స్టాఫ్ అంతా ఎదురుచూస్తుంటే.. ధర్మరాజు ఇద్దరు స్క్వాడ్ ఆఫీసర్స్ తో వస్తాడు. కాలేజీలో ఏవో అవకతవకలు జరగాయని ఎవరో అజ్ఞాతవ్యక్తి కాల్ చేసి చెప్పారంట. అందుకే స్క్వాడ్ వచ్చిందని ధర్మరాజు చెబుతాడు. ఈ కాలేజీలో అలాంటివి జరగవని నేను చెబుతూనే ఉన్నాను అని ధర్మరాజు అంటే.. ఒకసారి చెక్ చేస్తే అయిపోతుంది కదా అని మహేంద్ర అంటాడు.
దీంతో అందరూ సీక్రెట్ రూమ్ కు వెళ్తారు. అక్కడ రూమ్ కి సీల్ వేసి ఉండటం చూసి ధర్మరాజు షాక్ అవుతాడు. నేను లాక్ ఓపెన్ చేసి ఉంచా కదా.. మళ్లీ సీల్ వేశారా. అయినా లోపల ఆన్సర్ షీట్స్ లేవు కదా. నేను ఎందుకు తొందర పడటం అని మనసులో అనుకుంటాడు ధర్మరాజు.

ఎందుకు రియాక్ట్ అవుతున్నారు..
జగతి ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఉన్నాయో లేదే చెక్ చేయడానికి స్క్వాడ్ ఆఫీసర్స్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తారు. మూడు బండిల్స్ మిస్ అయ్యాని చెప్తారు. అప్పుడు రెచ్చిపోదామని ధర్మరాజు అనుకుంటాడు. కానీ చెక్ చేసి వచ్చిన ఆఫీసర్స్ అంతా ఓకే అని చెబుతారు. దీంతో ధర్మరాజు బిత్తరపోతాడు. ఏంటీ అంతా ఓకేనా అని ధర్మరాజు అంటే.. దానికి అంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని వసుధార అంటుంది.
అంతా బాగా చెక్ చేశారా అని అడిగిన ధర్మరాజు లోపలికి వెళ్లి చూస్తాడు. అక్కడ మూడు బండిల్స్ చూసి షాక్ అయి.. నేను తీసుకెళ్లిన బండిల్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి. అక్కడ అవి అలాగే ఉన్నాయి కదా అని మనసులో అనుకుంటాడు ధర్మరాజు. తర్వాత ఇబ్బంది కలిగించినందుకు సారీ అని చెప్పి వెళ్లిపోతారు ఆఫీసర్స్.

మీరు ఎలా దొంగతనం చేశారో..
ధర్మరాజు గారే బండిల్స్ కొట్టేసారని ఎలా తెలిసింది అని రిషిని వసుధార అడుగుతుంది. డాడ్ వాళ్ల రూమ్ లో నుంచి ధర్మరాజు వస్తూ రిషికి షేక్ హ్యాండ్ ఇచ్చి దొరికిపోయాడని రిషి చెబుతాడు. ఎలా అని మహేంద్ర అడిగితే.. ధర్మరాజు చేతికి ఉన్న సబ్బు నా చేతికి అంటుకుంది అని చెప్పిన రిషి అతన్ని ఈజీగా వదలను అంటాడు. తర్వాత ధర్మరాజును పిలిచి ఆ మూడు బండిల్స్ ఎలా వచ్చాయా అని తెగ ఆలోచిస్తున్నారు కదా అని రిషి అంటాడు.
అవి దొంగతనం చేసింది మీరే అని, ఆ స్క్వాడ్ ను పిలిపించింది మీరే అని కూడా తెలుసు. ఇదంతా తెలిసిన నాకు మీరు దాచిన బండిల్స్ ఎక్కడ దాచారో తెలుసుకోవడం కష్టం అనుకున్నారా. మీరు ఎలా దొంగతనం చేశారో.. మేము కూడా మీలాగే మీ ఇంటికి వచ్చి దొంగతనం చేశామని రిషి చెబుతాడు.

అందనంత దూరంలో..
డీబీఎస్టీ కాలేజీని బ్లేమ్ చేయించడం కోసం మీతో ఎవరో ఈ పని చేయించారు. మిమ్మల్ని పోలీసులకు పట్టించొచ్చు. కానీ నేను ఆ పని చేయను. ఎందుకంటే మీరు ఒక గౌరవప్రదమైన లెక్చరర్ వృత్తిలో ఉన్నారు. అలాంటిది మీరు అరెస్టయితే మీ వృత్తికే చెడ్డపేరు వస్తుంది. అది నాకు ఇష్టం లేదు చాలా కూల్ గా ధర్మరాజుకు వార్నింగ్ ఇస్తాడు రిషి.
దీంతో నేను స్పాట్ వాల్యుయేషన్ స్కృటినైజర్ గా తప్పుకుంటున్నాని. రిజిగ్నేషన్ ఇస్తున్నట్లు ధర్మరాజు చెప్పి వెళ్లిపోతాడు. కాలేజీ పరువు కాపాడినందుకు వసుధార, జగతి, మహేంద్ర థ్యాంక్స్ చెబుతారు. కట్ చేస్తే రిషి, వసుధార ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటారు. ఇద్దరం ఒకే నీడన ఉన్నాం చేయి చాచితే అందేంత దూరం.. కానీ అందనంత దూరంలో ఉన్నావ్ అని రిషి ఫీల్ అవుతుంటాడు.
ఏం చేస్తే బాధ పోతుంది..
నిజానికి మనల్ని వేరు చేస్తుంది గదిలో గోడలు కాదు మన ఆలోచనలు, అభిప్రాయాలని వసుధార అంటుంది. మన మధ్య దూరాన్ని తొలగించాలని అనుకుంటున్నా, మునుపటి రిషిధారలా ఉంటే బాగుండని అనుకుంటున్నా. అందుకు ఏం చేయాలి. మనల్ని వేరు చేస్తూ మన మధ్య దూరాన్ని చెరిపేయాలంటే ఏం చేయాలి. ఏం చేస్తే ఈ బాధ తొలగిపోతుందని రిషి ఎమోషనల్ అవుతాడు.
వసుధార రిషి దగ్గరికి జరిగి చేతిని పట్టుకుంటుంది. మిమ్మల్ని చాలా బాధపెడుతున్నాను. గతంలో చేసిన పనులు, ఇప్పుడు చేస్తున్న పనులతో మిమ్మల్ని బాధపెడుతున్నాని తెలుసు. దాని నుంచి బయట పడాలంటే ఏం చేయాలో చెప్పండి అని వసుధార అంటుంది.


Click it and Unblock the Notifications











