Guppedantha Manasu: రిషిధార పాత కథ మళ్లీ కొత్తగా మొదలు.. టైమ్ ట్రావెల్ తో గతంలోకి!
ధర్మరాజు దొంగతనం బయటపడ్డాక కాలేజీ మెట్లపై కూర్చుని మాట్లాడుకుంటారు రిషి, వసుధార. మనిద్దరి పరిస్థితి, బంధం ఏంటని రిషి బాధడపతాడు. దీంతో రిషి దగ్గరిగా జరిగి అతని చేయి పట్టుకుంటుంది. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. బాధ పెడుతున్నాను. నేను కావాలని, ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టలేదు. కానీ నేను చేసిన పనులు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి.
మిమ్మల్ని చాలా ఆవేదనకు గురి చేస్తున్నాయి. చెప్పండి సార్. ఆ బాధ నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి అని వసుధార అడుగుతుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 28 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్ 722లో ఇంకా ఏం జరిగిందంటే?

కోరుకుంది ఇవ్వగలవా..
వసుధార అలా అడిగేసరికి.. అదే నేను అడుగుతున్నాను. ఇవన్నీ మర్చిపోవాలి అంటే ఏం చేయాలి. నిన్ను నేను ఇంతకుముందు చూసినప్పుడు నాకు ఓ ఫీలింగ్ కలిగేది. మళ్లీ ఆ ఫీలింగ్ కావాలని కోరుకుంటున్నాను. నేను నీతో మాట్లాడినప్పుడు నా హార్ట్ బీట్ ఎలా ఉండేదో ఇప్పుడు నేను వినాలి అనుకుంటున్నాను. నీతో మాట్లాడేటప్పుడు ఉన్న నిజాయితీ, స్వచ్ఛత అన్నీ ఇప్పుడు కోరుకుంటున్నాను.
ఇవ్వగలవా. నా మనసు ఆందోళన పడి పడి ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఇప్పుడు చల్లగాలి లాంటి పాత పరిచయాన్ని కోరుకుంటోంది ఇవ్వగలవా అని రిషి అడుగుతాడు. సార్ మీరు కోరుకుంటున్నట్లు మనిద్దరం మళ్లీ ఎప్పటిలాగ ఉండాలి అంటే మన రిలేషన్ మళ్లీ కొత్తగా మొదలు అవ్వాలి అని వసుధార అంటుంది.

చెప్పాల్లిన పని లేదు..
నేను మొదటిసారి కాలేజీకి వచ్చినప్పుడు మీరు నాతో ఎలా ఉండేవారు. ఇప్పుడు అలాగే ఉండండి. ఇద్దరం కొత్తగా ఉందాం. ఫ్రెష్ రిలేషన్ స్టార్ట్ చేద్దాం అని వసుధార అంటుంది. ఇప్పటివరకు జరిగినవన్నీ మర్చిపోమంటావా అని రిషి అంటే గుర్తు పెట్టుకోవద్దు సార్. ఒకవేళ గుర్తుకు వచ్చినా మైండ్ లో నుంచి వాటిని తీసేయండి అని వసుధార అంటుంది.
నువ్వు చెప్పేది సాధ్యపడుతుందా అని రిషి అడిగితే.. ఎస్ సార్ మనం సాధ్యం చేద్దాం అని వసుధార అంటుంది. మరి మనం అలా ఉంటే చూసేవారికి ఎలా ఉంటుంది అని రిషి అడిగితే.. వాళ్లను ఒప్పిద్దాం. లేదా వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన కోసం తీసుకున్న నిర్ణయం. ఇందులో వారి పాత్ర ఎలా ఉంటుందో వారినే తేల్చుకోనిద్దాం అని వసుధార అంటుంది.

మీరు నాకు ఇష్టం లేదు..
సాధారణంగా కొత్తదనం అనేది అందరికీ నచ్చుతుంది. ఆసక్తిగా ఉంటుంది. మన విషయంలో కూడా అదే జరుగుతుందని అనుకుందాం. మనం ఇక కొత్త జర్నీ మొదలు పెడదాం అని రిషి చేయి అందిస్తాడు. దీంతో సంతోషంగా ఆ చేయి అందుకుని మురిసిపోతుంది వసుధార. బెస్ట్ ఆఫ్ లక్ ఎండీ గారు అని నవ్వుతూ అంటుంది వసుధార.
సో మనకు ఈ రోజు 12 గంటలక వరకే టామ్. ఆ తర్వాత మనం టైమ్ మేషిన్ లో వెనక్కి వెళ్లినట్లుగా వెనక్కి వెళ్లిపోదాం. అక్కడ నేను అప్పటి వసుధార.. మీరు అప్పటి రిషీంద్ర భూషణ్. నా రాక మీకు ఇష్టం లేదు. మీ స్వభావం నాకు ఇష్టం లేదు. నన్ను పంపించేయాలని మీరు. మిమ్మల్ని గెలవాలని నేను.. రిషిధారల కథ మళ్లీ మొదలు అని వసుధార అంటూ పొంగిపోతుంది.

వసుధార వల్లే సాధ్యం..
ఇక్కడ సీన్ కట్ చేస్తే దేవయానికి, ఫణేంద్రకు కాలేజీలో ధర్మరాజు విషయం చెబుతారు మహేంద్ర, జగతి. రిషి లేకపోతే ఈరోజు కాలేజీ పరువు పోయేది. అసలు మన రిషి చాలా గొప్ప సాహసం చేశాడు అని మహేంద్ర అంటాడు. దీంతో పెద్ద గండం తప్పింది దేవయాని. రిషి చాలా తెలివైనవాడు. డీబీఎస్టీ కాలేజీ పరువు ప్రతిష్టలు కాపాడాడు. మా నాన్నగారి పరువు మర్యాదలను కాపాడాడు అని ఫణీంద్ర అంటాడు.
ఇంతలో రిషి రావడంతో దేవయాని డ్రామా స్టార్ట్ చేస్తుంది. చాలా గొప్ప పని చేశావట కదా నాన్నా.. వీళ్లంతా చెబుతున్నారు అని దేవయాని అంటుంది. దీనికి ఇందులో నేను చేసిందేం లేదు పెద్దమ్మా.. వసుధార వల్లే ఇదంతా సాధ్యమైంది అని రిషి అంటాడు. దీంతో వెంటనే నా వల్ల కాదు జగతి మేడమ్ వల్ల అని వసుధార అంటుంది.

మళ్లీ బరువు ఎత్తుకోవాలా..
ఎవరు ఒప్పుకోరు కదా. క్రెడిట్ ను కూడా అందరూ పంచుకుంటున్నారు అని ఫణీంద్ర అంటే.. అంతా నవ్వుతారు. ఆ తర్వాత రిషి, వసుధార ఇద్దరూ ఎవరికి వారు తమ కొత్త రిలేషన్ గురించి తలుచుకుంటూ సంతోషపడతారు. వసుధార నువ్వు చెప్పినట్లుగానే మనం కొత్త రిలేషన్ స్టార్ట్ చేయడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది.
ఈ రిషి పాత రిషిలా మారబోతున్నాడు. మళ్లీ వెనక్కీ వెళ్లి జర్నీ చేస్తే ఆ ప్రేమ ఉంటుందా. ఆ ఎదురుచూపులో ఉన్న సంతోషం ఇప్పుడు ఉంటుందా. పాత బాధలు, ఆ కన్నీటి బరువు మళ్లీ భుజానికి ఎత్తుకోవాలా ఏం జరుగుతుందో ఏంటో అని రిషి అనుకుంటాడు. మరోవైపు దీని గురించే వసుధార కూడా ఆలోచిస్తూ ఉంటుంది.

అనుమతి లేకుండా భర్తగా..
నేను పాత వసుధారను అవుతాను. ఈ టైమ్ ట్రావెల్ ప్లాన్ బాగుంది. నేను రిషి సార్ మళ్లీ గతానికి వెళ్తున్నాం. మొదట రిషి సార్ ని చూసినప్పుడు నాలో ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ ఆ తర్వాత తనే నా ఫీలింగ్ అయ్యారు. నా ప్రాణం అయ్యారు. ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను మీ లైఫ్ లోకి ఎందుకు వచ్చానో నాకు తెలియదు. మీరే నా జీవితం అయ్యారు. మీరు లేకపోతే ఈ వసుధార లేదు. అందుకే కష్టకాలంలో మీరు గుర్తొచ్చారు అనుకుంటూ మెడలోని తాళి వైపు చూస్తుంది. నన్ను నేను కాపాడుకోవడం కోసం, నా ప్రేమను గెలిపించుకోవడం కోసం మీ అనుమతి లేకుండా మిమ్మల్ని భర్తగా స్వీకరించాను అనుకుంటూ అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది వసుధార.
కాలం పెడుతున్న పరీక్ష..
గుండెలపై తాళితోపాటు గుండెల్లో నిజం దాచానన్న ఫీలింగ్ మిమ్మల్ని వేధిస్తోంది. ఆ భారం తొలగించేందుకే గతానికి వెళ్తున్నాను. ఈ ప్రయాణం మనకు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి అని వసుధార అనుకుంటుంది. ఈ సమయం గడిస్తే గతంలోకి వెళ్తాం. అంతకంటే ముందు నేను వసుధారను కలవాలి అంటూ పరుగున వసు గదివైపు రిషి వస్తుంటే రిషి కోసం వసుధార వస్తుంది. ఇద్దరు నీకోసమే అంటారు. మాట్లాడాలని కూడా ఇద్దరు ఒకేసారి అంటారు.
ఇద్దరు మెట్లపై కూర్చుని.. మనం ఇద్దరం అనుకున్నట్లుగా చేయగలమా. గతంలోకి వెళ్లాలంటే ఆందోళనగా ఉంది అని రిషి అంటాడు. నాకు కూడా అని వసు అంటే.. ప్రేమకి బంధానికి అగ్ని పరీక్ష పెడుతుంది కాలం. అందులో మనం నెగ్గాలి అని రిషి అంటాడు. కచ్చితంగా గెలుస్తాం అని వసుధార అంటుంది.


Click it and Unblock the Notifications











