Guppedantha Manasu: రిషి మాటలకు ఏడ్చేసిన వసుధార.. రగిలిపోతున్న దేవయాని.. కొత్త సమస్య!

నేను నీకు భర్తనే, కానీ నువ్వు నా భార్యవి కాదంటాడు రిషి. దీంతో ఇప్పటివరకు రిషిధార అంటే మనం అని భావించాను. కానీ రిషి, ధారకు మధ్య కనిపించని దూరం ఏదో మీకు కనిపిస్తున్నట్లుంది. భార్యాభర్తల మధ్యలోనే కొత్త లాజిక్ ని చూపించారు. మీ దృష్టి కోణంలో ఆలోచించి నా భార్యవి నువ్వు కాదని అంటున్నారు అని వసుధార అంటుంది. నేను చెప్పింది నీకు నచ్చలేదేమో కానీ, నేను చెప్పినదాంట్లో తప్పేముంది వసధార. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదని అంటాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 3 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 701లో ఇంకా ఏం జరిగిందంటే?

నన్నేం అడక్కండి మేడమ్..

నన్నేం అడక్కండి మేడమ్..

రిషి అన్నదానికి.. అయ్యో అర్థమైంది సార్. యూత్ ఐకాన్ ని, కాలేజ్ టాపర్ ని అయిన నాకే అర్థం కాలేదు మొదట. కానీ ఇప్పుడు అర్థమైంది అంటూ కోపం, బాధతో వసుధార వెళ్లబోతుంటే.. చేసిందంతా చేసి.. పైగా కోపమా పొగరు.. అని రిషి అంటాడు. నేను తప్పు చేయను సార్ అని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు జగతి, మహేంద్ర సంతోషంగా ఉంటారు. వసు, రిషీల మధ్య దూరం తొలగిపోయింది. పార్టీ చేసుకుందాం అనుకుంటారు. ఇంతలో ఏడుస్తూ వసుధార కనిపిస్తుంది. వసుధార ఏడవడం చూసి షాక్ అయిన జగతి, మహేంద్ర వసు దగ్గరికి వెళ్లి ఏం అయింది అని అడుగుతారు. నన్నేం అడక్కండి మేడమ్.. కాస్త ప్రశాంతత కావాలి అని వెళ్లిపోతుంది వసుధార.

 నేను చాలా హ్యాపీ..

నేను చాలా హ్యాపీ..

నేను వసుతో వెళ్తాను.. నువ్వు రిషి దగ్గరికి వెళ్లు ధైర్యంగా ఉంటుంది అని జగతి అంటుంది. రిషి దగ్గరికి నేను ఎందుకు అని మహేంద్ర అంటే.. ఇప్పుడు రిషి కూడా టెన్షన్ లో ఉంటాడు వెళ్లు అని అంటుంది. రిషి హార్ట్ సింబల్ తో మాట్లాడుతుంటాడు. హే హార్ట్ నేను వసుధారతో అన్నదాంట్లో తప్పేముంది. తన మీద ప్రేమ ఉంది. నేను తన భర్తనే. కానీ తను నా భార్య ఎలా అవుతుంది అనుకుంటాడు. ఇంతలో మహేంద్ర వస్తాడు. కంగ్రాట్స్ రిషి అని మహేంద్ర అంటే.. దేనికి అని అడుగుతాడు. అందరిముందు అలా ఒప్పుకున్నావ్ చూడు. నేను చాలా హ్యాపీ. పాపం వసుధార సమాధానం చెప్పలేక ఎంత టెన్షన్ పడిందో అని మహేంద్ర అంటే.. అందరి ముందు దోషిలా నిలబడొద్దనే ఒప్పుకున్నాన్ డాడ్ అని రిషి అంటాడు.

 రిషి నువ్వు ఇలా ఆలోచించావా..

రిషి నువ్వు ఇలా ఆలోచించావా..

ఏదైమైనా అందరి నోర్లు మూయించావ్. అవును వసుధార ఏంటీ ఇందాకా ఏడుస్తూ వెళ్లింది. ఏమైంది అని అడుగుతాడు మహేంద్ర. తనకు వాస్తవం చెప్పాన్ డాడ్ అంటాడు రిషి. వాస్తవం ఏంటీ అని మహేంద్ర అడిగితే.. డాడ్ వసుధారకి నేను భర్తనని అందరిముందు తన గౌరవం కాపాడటం కోసం చెప్పాను. కానీ వసుధార నా భార్య కాదన్న వాస్తవం కూడా తనకు చెప్పాను అని అంటాడు రిషి. దీంతో బిత్తరపోయిన మహేంద్ర ఏంటీ రిషి.. నాకు అర్థం కాలేదు. మళ్లీ చెప్పు.. నువ్వు తన భర్తవి అయినప్పుడు.. తను నీకు భార్య కాకుండా ఎలా ఉంటుంది అని మహేంద్ర అడుగుతాడు. డాడ్ కాస్తా జాగ్రత్తగా ఆలోచించండి.. తనకు తానుగా మెడలో వేసుకున్న తాళికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను చెప్పండి.. అని రిషి అంటాడు. మై గాడ్ రిషి నువ్వు ఇలా ఆలోచించావా.. అని మహేంద్ర అంటే.. ఇందులో తప్పేముంది అని రిషి అంటాడు.

కొత్త సమస్యలు..

కొత్త సమస్యలు..

వసుధారకు కూడా ఇలానే చెప్పావా ఏంటీ అని మహేంద్ర అంటే.. ఇంతకన్నా స్పష్టంగా చెప్పాను అని రిషి అంటాడు. ఏంటీ రిషి నువ్వు ఇలా చెబితే ఎలా.. అందుకేనా తను ఏడుస్తూ వెళ్లింది. ఇదంతా అవసరమా అని మహేంద్ర అంటాడు. డాడ్ నేను లేనిది చెప్పలేదు కదా. తనను నేను తప్పా ఇంకెవరు కాపాడలేరు కాబట్టి అవును అన్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను కూడా అని రిషి అంటాడు. వసుధారను నువ్వు ప్రేమించావ్ అని మహేంద్ర అంటే.. ఇప్పటికీ ప్రేమిస్తున్నా అని రిషి అంటాడు. మరి ఎందుకు బాధ పెట్టాలి అని మహేంద్ర అంటే.. తను చేసినదానివల్లే కదా ఇదంతా అంటే బంధాల్లో బాధ్యతల్లో కొన్ని తప్పులు క్షమించాలి కదా. మీరు ప్రేమలో ఉన్నారు కదా నాన్నా అని మహేంద్ర అంటే.. ప్రేమలో ఉన్నంత మాత్రానా తప్పులు క్షమించేస్తామా డాడ్ అని రిషి అంటే.. ఇంకేం మాట్లాడలేక కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నావేమో ఓసారి ఆలోచించూ అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు మహేంద్ర.

మనం మాట్లాడుకోవడం ఏంటీ..

మనం మాట్లాడుకోవడం ఏంటీ..


మరోవైపు కారులో జగతి, వసుధార వెళ్తుంటారు. అప్పుడు రిషి వెనుక ఉన్నట్లు మెసేజ్ చేస్తే కారు ఆపుతుంది జగతి. వసు దగ్గరికి వచ్చి మాట్లాడాలి అంటే నేను లీవ్ సార్.. తలనొప్పిగా ఉంది అని వసు అంటుంది. పర్మిషన్ లేకుండా లీవ్ ఏంటీ అని రిషి అంటే.. వసుధార అక్కడికక్కడే మెసేజ్ పెట్టి.. మా ఎండీ గారికి మేనేజింగ్ డైరెక్టర్ ను అడిగాను అని చెబుతుంది. తలనొప్పి ఎందుకు వచ్చింది అని అంటే తలను అడిగి చెబుతాను సార్ అని వసు అంటుంది. మనసులో ఏదో పెట్టుకుని తలనొప్పి అని చెబుతున్నావ్ కదా అని రిషి అంటే.. మనసుల గురించి మనం మాట్లాడుకోవడం అంత కరెక్ట్ కాదేమో సార్ అని వసుధార అంటుంది. ఇలా ఇద్దరు పోట్లాడుకుంటారు. తర్వాత ఇప్పుడు ఏమంటావ్ అని రిషి అంటే.. బై అంటాను అని వసు చెబుతుంది. దీంతో అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు.

వసుధారను నా భార్య అంటాడా..

వసుధారను నా భార్య అంటాడా..

తర్వాత ఏమైంది నాకు అర్థం కావట్లేదు అని జగతి అడిగితే.. ఏదేదో చెబుతుంది వసుధార. ఇవాళ మీటింగ్ లో ప్రపంచానికి సమాధానాలు దొరికాయ్ మేడమ్.. మా ఇద్దరికీ కాదు.. ఏం చేయాలో తెలియడం లేదు మేడమ్.. రిషి సార్ తో బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని వసుధార అంటే ఇంకేం అడక్కుండా జగతి వెళ్దాం అంటుంది. మరోవైపు రిషి చేసిన పనికి దేవయాని రగిలిపోతుంది. ఇంతలో రిషి వస్తే చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. దేవయాని వెనుకే రిషి వెళ్తాడు. రిషి వచ్చాడా అని ఫణీంద్ర అడిగితే.. ఇక రిషి గురించి చూసే రోజులు పోయాయి లేండీ.. ఒకప్పటి రిషి కాదండి. మనకంటే ఎత్తుకు ఎదిగిపోయాడు. గొప్ప పేరొచ్చింది. అందరూ పొగుడుతున్నారు. అందరి ముందు వసుధారను నా భార్య అంటాడా అలా ఎలా అంటాడు అని దేవయాని అంటే అప్పుడే వచ్చిన రిషి వింటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X