Guppedantha Manasu:రౌడీలను చితకొట్టిన రిషి.. ఏడ్చేసిన వసుధార.. నిజం తెలుసుకున్న జగతి
వసుధార, రిషి ఇద్దరి గురించి మహేంద్రతో మాట్లాడుతుంటుంది జగతి. వాళ్లిద్దరూ ఏదో దాస్తున్నారని జగతి అంటుంది. అదేం లేదు జగతి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావ్ అని మహేంద్ర అంటాడు. అయినా మన దగ్గర దాచి పెట్టాల్సిన అవసరం వాళ్లకు ఏముందంటాడు మహేంద్ర అడుగుతాడు. ఎవరి పంతం వాళ్లది.. ఏ ఒక్కరు తగ్గరు. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్లకే తెలియదు.
రిషి నాకు సారీ ఎందుకో చెప్పాడు. అదే విషయం వసుధారను అడిగితే మీకే తెలుస్తుంది మేడమ్. మీరు టెన్షన్ పడకండి అని అంటుందని జగతి చెబుతుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 30 గురవారం నాటి తాజా ఎపిసోడ్ 724లో ఇంకా ఏం జరిగిందంటే?

ఎవరికీ చెప్పకుండా..
వాళ్లు దాస్తున్నది కొంత సమస్య తీసుకొచ్చేదా.. ఇద్దరు కలిసి పోవడానికా. అసలు ఏం జరుగుతుంది అని మహేంద్రను జగతి అడుగుతుంది. నువ్వేం టెన్షన్ పడొద్దు జగతి. వాళ్ల జీవితాలు బాగుపడతాయి అని మహేంద్ర అంటే.. అంతకంటే నాకు ఏం కావాలి మహేంద్ర అని జగతి అంటుంది. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. గదిలో అటు ఇటు చూసి మేడమ్ వసుధార కనిపించిందా అని అడుగుతాడు.
కిచెన్లో ఉందేమో అని జగతి అంటే.. ఇల్లంతా వెతికాను ఎక్కడ కనిపించేలేదు. ఎక్కడైన వెళ్తున్నట్లు మీకేమైనా చెప్పిందా అని రిషి అడుగుతాడు. లేదు అని జగతి అంటుంది. సరే నేనే కనుక్కుంటానంటూ వెళ్లిపోతాడు రిషి. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికీ వెళ్లిపోయింది అని ఆలోచిస్తాడు రిషి.

ఏదో డల్ గా ఉన్నారు..
కొద్దిసేపు ఆలోచించినా తర్వాత వసుధార ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు రిషి. మరోవైపు రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటుంది వసుధార. రెస్టారెంట్ మేనెజర్ తో అడిగిన వెంటనే ఉద్యోగం ఇచ్చినందుకు థ్యాంక్యూ సార్ అని చెబుతుంది వసుధార. నీ పని చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నీకు ఇష్టమైనప్పుడు చేయొచ్చు. కష్టమైనప్పుడు మానేయొచ్చు అని అతను అంటాడు. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు.
పర్లేదు కనుక్కున్నారు సార్ అని రిషి దగ్గరికి వెళ్తుంది. గుడ్ ఈవెనింగ్ సార్. ఏదో డల్ గా ఉన్నారు అని వసుధార అడుగుతుంది. కస్టమర్స్ మూడ్ తో ఏం సంబంధం. ఆర్డర్ తీసుకోవడం మీ పని అని రిషి అంటాడు. ఏం తీసుకుంటారు అని వసుధార అడిగితే.. వేడి వేడిగా ఏం ఉన్నాయి అని రిషి అడుగుతాడు.

నా శాలరీలో కట్ చేస్తారు..
మీరు ఏది అడిగినా వేడి వేడిగా తీసుకొస్తాను సార్ అని వసుధార అంటుంది. ఐస్ క్రీమ్ కావాలి అని అంటాడు రిషి. సార్ ఐస్ క్రీమ్ వేడి వేడిగా ఎలా తీసుకొస్తారు అని వసుధార అంటుంది. మరి ఏదైనా వేడివేడిగా తీసుకొస్తా అన్నావ్. సరే కాఫీ తీసుకురా అని రిషి అంటే.. ఒక్క నిమిషం అని వెళ్లిపోతుంది వసుధార. అప్పుడు ఫోన్ లో టైమ్ సెట్ చేస్తాడు రిషి. వసుధార కాఫీ తీసుకొచ్చాక.. క్యాన్సిల్ అంటాడు రిషి.
అయ్యే సార్.. ఏమైంది అని వసుధార అడిగితే.. వన్ మినిట్ లో తీసుకొస్తానన్నావ్. కానీ లేట్ అయింది. అందుకే క్యాన్సిల్ అని రిషి అంటాడు. అలా కాదు సార్.. అలా క్యాన్సిల్ చేస్తే కుదరదు అని వసు అంటే.. నేను ఊహించిన సమయానికి రాలేదు. నాకు కాఫీ వద్దు అని రిషి అంటాడు. కాఫీ చల్లారిపోతుంది సార్. ఇప్పుడు మీరు కాఫీ తీసుకోకపోతే ఈ బిల్ నా శాలరీలో కట్ అవుతుంది అని వసుధార అంటుంది.

వసు బయటకు రావడంతో..
వసుధార అలా అనగానే రిషి కాఫీ తాగుతాడు. ఈ పార్ట్ టైమ్ జాబ్ వదిలేసేయ్ అని రిషి అంటే.. నాకు పాకెట్ మనీ కావాలి కదా సార్ అని వసుధార అంటుంది. అంతకంటే ఎక్కువ ఇస్తాను. నా అసిస్టెంట్ గా జాయిన్ అవ్వు అని రిషి అంటాడు. సరే సార్ జాయిన్ అవుతాను జీతం ఇస్తారు కదా అని అంటుంది. అవును అని రిషి అనడంతో ఒప్పుకుంటుంది.
దీంతో అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు. అప్పుడు రిషి తాగిన కాఫీ తాగుతుంది వసుధార. అది రిషి చూస్తాడు. వసుధార కోసం ఎదురుచూస్తుంటాడు. అప్పుడు వసుధార బయటకు రావడంతో నేను పాత రిషిని.. పాత రిషి లాగే ఉండాలి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కొందరు రౌడీలు వసుధారను ఏడిపిస్తూ ఉంటారు.

మనం మాట్లాడుకోవాలి..
వసుధారను రౌడీలు ఏడిపించడం చూసిన రిషి వాళ్లను చితక్కొట్టి తను నా భార్య అని చెప్పి తీసుకెళ్తాడు. కారులో వెళ్తుండగా.. తను నా భార్య అన్న రిషి మాటలు గుర్తు చేసుకుని వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు జగతి పని చేసుకుంటూ ఉండగా వచ్చిన మహేంద్ర.. ఏంటీ ఇంకా బయలుదేరలేదు. అవతల ఫంక్షన్ కు టైమ్ అవుతుంది. వదిన, అన్నయ్య అప్పుడే వెళ్లిపోయారు.
మనమే లేట్ తొందరగా వెళ్దాం పద అని అంటాడు. నేను రాను. నువ్వు వెళ్లు అని అంటుంది జగతి. ఇంతలో అక్కడికి ధరణి రావడంతో మీ మావయ్య కూడా రెడీగా ఉన్నారు. మీరు కలిసి వెళ్లండి అని చెప్పి జగతి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత వసు, రిషి ఇంటికి చేరుకుంటారు. వసుధార లోపలికి వెళ్తుండగా.. మనం మాట్లాడుకోవాలి అని పిలుస్తాడు. వసుధార డల్ గా వచ్చి కూర్చుంటుంది. మనం టైమ్ ట్రావెల్ చేయలేము అని రిషి అంటాడు. ఎందుకు సార్ అని వసుధార అడుగుతుంది.

కోపం తెచ్చుకోలేకపోతున్నా..
ఇప్పటికే మనం చాలా దూరం వచ్చేసాం. ప్రేమలో ఎప్పుడు ముందుకు వెళ్లడమే ఉంటుంది. కానీ వెనక్కి వెళ్లడం ఉండదు. ఇప్పుడు మనం ప్రేమికులుగానే ఉన్నా మళ్లీ మారలేం. పాత కథలు తిరిగి రావు. మనం పాత రిషి, వసులం అవుదామని అన్నావ్. అది ఎప్పటికీ కుదరదు వదిలేయ్ అని రిషి అంటాడు.
ఇంట్లో ఉండిపోయిన జగతి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి రిషి, వసుధార మాటలు వింటుంది. అప్పుడు నాకు జగతి మేడమ్ అంటే కోపం.. కానీ ఇప్పుడు జగతి మేడమ్ అంటే గౌరవం. పాత రిషిలా ఉండలేకపోతున్నాను. కాలేజీలో మేడమ్ ఎదురుపడినా కోపగించుకోలేకపోతున్నాను. కోపం తెచ్చుకోవాలి అనుకున్న కూడా రావట్లేదు అని రిషి అంటాడు. ఆ మాటలు విన్న జగతి సంతోషిస్తుంది.
ఒక్కటయ్యేవరకు..
ఒకప్పుడు నిన్ను భార్య కాదు అన్నాను. ఇప్పుడు వాళ్లతో (ఆ రౌడీలతో) నువ్వే నా భార్య అని చెప్పాను. ఎందుకంటే నేను నిన్ను పాత వసుధారగా చూడలేకపోతున్నాను రిషి అంటాడు. వసుధార, రిషి మాటలకు జగతి కన్ఫ్యూజ్ అవుతుంది. సర్ మీరు దూరం ఉన్న, ప్రేమిస్తారు. దగ్గర ఉన్నా ప్రేమిస్తారు. మీ ప్రేమ నాకు తెలుసు సార్. ఆ ప్రేమ ఎప్పటికీ నాకు కావాలి అని వసుధార అంటుంది. ఈ రిషి ప్రేమ ఎప్పటికీ నీకే వసుధార.
ఈ రిషీంద్ర భూషణ్ ఒకసారి ప్రేమను ఇస్తే.. తిరిగి తీసుకోడు అని రిషి అంటాడు. దీంతో వసుధార సంతోషపడుతుంది. నువ్వు నేను వేర్వేరుగా ఉంటే చూడలేకపోతున్నాను. అందుకే రిషిధారలు ఒక్కటయ్యేంతవరకు ఎదురుచూద్దాం అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. ఆ మాటలు విన్న జగతికి వారి విషయం అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications











