Guppedantha Manasu: కొడుకు రుణం తీర్చుకోవాలన్న జగతి.. దేవయానికి చురకలు.. రిషిధార రొమాన్స్

రిషి, వసుధార మాటలు విన్న జగతి ఆలోచనలో పడిపోతుంది. అప్పుడే ఫంక్షన్ కు వెళ్లి వచ్చిన మహేంద్ర.. ఏంటీ జగతి అలా ఉన్నావ్ అని అడుగుతాడు. రిషి, వసుధార మధ్య ఏదో జరుగుతుందని నేను చెబుతే మీరు అలాంటిదేం లేదన్నారు. కానీ వాళ్లు మళ్లీ కొత్తగా వ్యక్తులుగా పరిచయం అయి ప్రేమికులుగా మారుదామనుకున్నారు అని జగతి చెబుతుంది. దీంతో షాక్ అవుతాడు మహేంద్ర. పాపం వాళ్లు మానసిక ఒత్తిడి పడుతున్నారు. వాళ్ల మనసులు గందరగోళానికి గురయ్యాయి. వాళ్ల జీవితాల్లో ఎటూ పోలేక స్తంభించిపోయాయి. ఇలా అయితే వాళ్లు ఏమైపోతారోనని భయమేస్తుంది మహేంద్ర అని జగతి అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 31 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 724లో ఇంకా ఏం జరిగిందంటే?

రిషి నాకు చాలా చేశాడు..

రిషి నాకు చాలా చేశాడు..


రిషి, వసుధార గురించి చెప్పి బాధపడుతుంటే ఏం కాదు అని ధైర్యం చెబుతాడు మహేంద్ర. నువ్వు భయపడొద్దు. పోనీ మనమే ఏదైనా పరిష్కారం చూసి చెబితే వినే స్థితిలో వాళ్లు ఉన్నారా అని మహేంద్ర అంటాడు. అలా అని వదిలేసే స్థితిలో మనం ఉండకూడదు కదా. మనం ఏం చేయగలం అనేది చాలా తప్పు మహేంద్ర అని జగతి అంటుంది. రిషి నాకు చాలా చేశాడు మహేంద్ర. ఒక అమ్మగా నేను తనకు ప్రేమను అందించలేకపోయాను. అయినా నన్ను తన ఇంటికి తీసుకొచ్చాడు. అక్కయ్యా దాష్టికాన్ని ఎదిరించి నాకు ఇక్కడ స్థానం కల్పించాడు. అందరితో కలిసి ఉండటానికి అంగీకరించాడు. ఆ రుణం తీర్చుకునే అవకాశం అయినా నాకు కావాలి. వాళ్లిద్దరి మధ్య ఉన్న చిక్కుముడులను విప్పి.. వాళ్లని ఒక్కటి చేస్తేనే.. ఆ రుణం తీర్చుకున్నదాన్ని అవుతాను. ఏదోకటి చేద్దాం. వాళ్ల సంతోషం కోసం మనం ఏదోకటి చేయాలి అని జగతి అంటుంది.

 నా ఆనందం కోసమే..

నా ఆనందం కోసమే..

జగతి అన్నదానికి చేద్దాం అని మహేంద్ర అంటాడు. మరోవైపు రిషీంద్ర భూషణ్ అలజడుల మధ్య నలిగిపోతున్న ప్రేమ.. కొత్త ప్రయాణానికి తెరపడింది. మా మధ్య ఉన్న ప్రేమే బంధం అని నమ్మాలి. అది నా మనసు అంగీకరించాలి. ఎలా.. ఇంకా ఎన్ని రోజులు వేచి ఉండాలి అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు రిషి. మంచం మీదున్న నెమలి ఈకను చూసి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని చేత్తో తీస్తాడు రిషి. దానికింద పేపర్ ఉంటుంది. అందులో ఎండీగారు ఈ రోజు మనం భోజనంలో ఆనందం కూడా రుచి ఉండాలి. ఉప్పు, తీపి, కారాలను మించిన ఆనందం అది అని తన కోరికను రాసుకుంటుంది వసుధార. అది చదివిని రిషి వసుధార ఏం చేసిన నా ఆనందం కోసమే అనుకుంటాడు. కట్ చేస్తే.. ఇంట్లో అంతా మేడమీద భోజనాలు చేస్తుంటారు.

మధ్యతరగతి వాళ్ల కోరికలు..

మధ్యతరగతి వాళ్ల కోరికలు..

వసుధార నువ్వు కూడా వడ్డించుకో. ఇదంతా నీ కోరిక వల్లే కదా జరిగింది అని రిషి అంటాడు. దీంతో అంతా ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటీ వసుధార కోరిక అని మహేంద్ర అంటాడు. అవున్ డాడ్. ఉప్పు, తీపి, కారం కాకుండా భోజనంలో ఆనందం కావాలని కోరింది. అందుకే ఇలా మేడమీద వెన్నెల్లో ఏర్పాటు చేశాను అని రిషి అంటాడు. కోరిక వసుధారదే అయినా.. మనందరం ఆస్వాదిస్తున్నాం అని మహేంద్ర అంటాడు. దీనికి ఏంటీ ఆస్వాదించేది.. కింద డైనింగ్ టేబుల్ దగ్గర తిన్నా అదే తిండి. ఇక్కడ గిన్నెలన్నీ మోసుకుని రావడంలో చాకిరీ తప్పా ఏముంది. అయినా ఇలాంటివి మధ్యతరగతి వాళ్ల కోరికలు అని దేవయాని అంటుంది. ఎవరి కోరికైనా అందులో ఆనందం ఉంది కదా. దాన్ని పొందడం చేతకాకపోతే ఎన్ని కోట్లు ఉన్నా వృథానే అని జగతి దేవయానికి కౌంటర్ వేస్తుంది.

స్టూడెంట్స్ కు ఉపయోగం..

స్టూడెంట్స్ కు ఉపయోగం..


భోజనం అయ్యాక రిషి చేయి కడుక్కుంటే తన చున్నీని ఇస్తుంది వసుధార. థ్యాంక్యూ వసుధార నీవల్ల ఆనందకరమైన భోజనం తిన్నాం అంతా అని రిషి అంటాడు చున్నీతో తుడుచుకుంటూ. అది చూసిన దేవయాని.. ఈ వసుధార రిషికి రోజురోజుకి దగ్గరైపోతుంది అని రగిలిపోతుంది. వెనుకే ఉన్న జగతి.. మరి అంతలా చూడకండి అక్కయ్య. వారికి మీరే దిష్టి తీయాల్సి ఉంటుంది అని అంటుంది. తర్వాత ఉదయం దేవయాని, ఫణీంద్ర అంతా టీవీలో ఓ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటారు. జయచంద్ర.. ది పవర్ విత్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్స్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ మన సంస్కృతి, సాంప్రాదాయాలను పాటిస్తూ వాటి విలువలను కాపాడుకోవాలని తపన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు జయచంద్ర అని యాంకర్ చెబుతుంది. ఈయనతో కాలేజీలో లైవ్ పోగ్రామ్ చేయమని మినిస్టర్ గారు చెప్పారు పెదన్నాన్న. మనం ప్లాన్ చేద్దాం. స్టూడెంట్స్ కు ఉపయోగపడుతుంది అని రిషి అంటాడు.

అన్నీ సగం సగం పనులే..

అన్నీ సగం సగం పనులే..

రిషి అన్నదానికి అంతా సరే అంటారు. ఆరోజు దేవయానిని తీసుకుని కాలేజీకి వస్తానని ఫణీంద్ర అంటాడు. ఇక జయచంద్ర రాబోతున్న రోజు కాలేజీకి వెళ్తుంది వసుధార. రిషి క్యాబిన్ కు వెళ్లి ఎండీ అని రాసి ఉన్న లవ్ హార్ట్ తీసుకుని దాని వెనుకవైపు MH (మై హార్ట్) అని రాయబోతుంది. ఇంతలో రిషి వచ్చేసరికి వదిలేసి తెలియనట్లుగా ఫైల్ చూపిస్తుంది. జయచంద్ర రాక గురించి రాశాం. నోటీస్ బోర్డ్ లో పెట్టిస్తాను అంటుంది. వసు వెళ్లిన తర్వాత హార్ట్ ను గమనించిన రిషి ఈ పొగరు అన్నీ సగం సగం పనులే చేస్తుంది అనుకుంటూ పెన్ వెతుకుతాడు. వసుధార ఆపేసిన హెచ్ లెటర్ ను రిషి పూర్తి చేస్తాడు. ఇప్పుడు బాగుంది అనుకుంటాడు.

నేను వదిలిపెట్టినా పనిని..

నేను వదిలిపెట్టినా పనిని..

ఇంతలో గుమ్మం దగ్గరకు వచ్చిన వసుధార.. థ్యాంక్యూ సార్.. నేను ఏది వదిలిపెట్టినా దాన్ని మీరు పూర్తి చేస్తారు. నాకు తెలుసు సార్. థ్యాంక్యూ సార్ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక కాలేజీలో ఆధ్యాత్మిక ఆధునిక సంగమం మేధోమూర్తి జయచంద్ర గారికి ఆహ్వానం అంటూ బ్యానర్స్ వేలాడదీస్తూ ఉంటుంది వసుధార. అనుకోకుండా కాలు జారి పడబోతుంటే రిషి వచ్చి పట్టుకుంటాడు. అక్కడ ఇద్దరు పెనవేసుకోవడంతో రొమాంటిక్ గా సాగుతుంది ఆ సీన్. నువ్ ఏది వదిలిపెట్టినా అది నేను పూర్తి చేస్తానని ఇందాకే కదా అన్నావ్ అని ఆ ఫ్లెక్సీని రిషినే కట్టడానికి పైకి ఎక్కుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X