Guppedantha Manasu: ఒక్కటైనా రిషి, దేవయాని.. ఆల్ ది బెస్ట్ చెప్పిన జగతి.. మనసును చంపేశారంటూ వసు!
రిషి చేసినదానికి నా ఒళ్లు మండిపోతుంది. ఆ వసుధారని అందరి ముందు నా భార్య అంటాడా.. అసలు అలా ఎలా అంటాడండి.. మనం అందరం ఉన్నాం కదా.. అలా అనొచ్చా అని దేవయాని కోపంతో రగిలిపోతుంటే రిషి వస్తాడు. పెద్దమ్మా అని పిలిచి లోపలికి వస్తాడు. రిషి నువ్వు నాతో మాట్లాడకు.. నేను నీతో మాట్లాడను అంటుంది దేవయాని. నీ మీద కోపం వచ్చినట్లుంది రిషి. కొంచెం ప్రసన్నం చేసుకో అని ఫణీంద్ర అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి.. కోపం రావడం ఏంటీ.. రిషిని ఈ చేతులతో పెంచాను అంటూ డ్రామా మొదలుపెడుతుంది దేవయాని. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 4 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 702లో ఇంకా ఏం జరిగిందంటే?

నా రిషినేనా ఇలా..
దేవయాని కోపంతో అలా అనడంతో.. పెద్దమ్మా ప్లీజ్.. నేను అలా మాట్లాడటం మీకు కోపాన్ని, బాధని తెప్పిస్తాయని నాకు తెలుసు. మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను అలా అనడానికి కారణాలు ఉన్నాయి. కానీ ఆ వివరాలు నేను ఇప్పుడు చెప్పలేను. కావాలంటే జగతి మేడమ్ ను అడిగితే తెలుస్తుంది అని రిషి అంటాడు. లేదు రిషి నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు కదా.. అంతమంది ముందు అలా ఎలా అంటావ్. నేను అక్కడ లేకపోయి ఉండి ఉంటే నాకు ఇంత బాధేసేది కాదేమో.. నా చేతుల్లో పెరిగిన రిషి ఇలా మాట్లాడటం తట్టుకోలేకపోతున్నాను. నిజంగా నా రిషినేనా ఇలా మాట్లాడింది అనుకున్నాను అని దేవయాని అంటే.. నేను ఎప్పటికీ మీ రిషినే పెద్దమ్మా.. మీ చేతుల్లో పెరిగాను. మీ చేతి గోరుముద్దలు తిన్నాను. ఎప్పటికీ మీ రిషీంద్ర భూషణ్ నే అని ఎమోషనల్ గా అంటాడు రిషి.

అక్కడ కూడా ఒప్పుకోకుంటే..
రిషీ ఇంకా నా ఆధీనంలోనే ఉన్నాడన్నమాట అని మనసులో అనుకున్న దేవయాని.. నిన్ను తప్పు బట్టడం లేదు. నేను ఎప్పుడు నీ మంచికోసమే కదా ఆలోచిస్తాను. నా మాటలతో నిన్ను బాధపెట్టి ఉంటే సారీ నాన్నా అని దేవయాని అంటుంది. పెద్దమ్మ మీరు నాకు సారీ చెప్పడం ఏంటీ అని రిషి అంటే.. చప్పట్లు కొడుతూ ఇద్దరూ శాంతించారు అని అంటాడు. రిషి ఎప్పుడు నా రిషీనే అని దేవయాని అంటే.. అవును పెద్దమ్మా నేను ఎప్పుడు మీ రిషినే అని భుజంపై చేయి వేసి ప్రేమగా అంటాడు రిషి. మరోవైపు వసు, చక్రపాణి, జగతి మాట్లాడుకుంటారు. రిషి అంతమాట అన్నాడా అని జగతి బాధగా అంటుంది. అందరిలో నా భర్త అని ఒప్పుకున్న రిషి సార్ నాలుగు గోడ మధ్య నా భార్యవి కాదని మాట మార్చేశారు. అలాంటప్పుడు అక్కడ కూడా ఒప్పుకోకుండా ఉంటే సరిపోయేది కదా అని వసుధార అంటుంది.

నేను ఏదో చాడీలు చెబుతున్నట్లు..
ప్రపంచానికి మేము భార్యా భర్తలం.. బంధాలకు మాత్రం కాదా. ఎందుకు మేడమ్ నన్ను ఇంతలా శిక్షిస్తున్నారు. ఆయన ప్రేమ, కోపం ఇప్పటికీ సరిగా అర్థం చేసుకోలేదేమో అని అనిపిస్తుంది అని వసుధార అంటే.. అందరి ముందు ఒప్పుకున్న రిషి, బంధాన్ని కాదని ఎలా అంటాడు. తన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కదా అని జగతి అంటుంది. దీనికి మేడమ్ మీకు తెలియకుండానే రిషి సార్ ని వెనకేసుకొస్తున్నారు కదా అని వసు అంటుంది. సరే ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను అని జగతి అంటే మేడమ్ మీరు వెళ్లి రిషి సార్ ని అడిగితే.. నేను ఏదో చాడీలు చెప్పినట్లు అవుతుంది అని వసుధార అంటుంది. ఇదే వసు బంధంలో ఉన్న అందం.. ఇదే ప్రేమంటే.. మీ ఎండీ గారిని నేనేం అనను.. నా కొడుకుకు ఏం చెప్పాలో చెబుతాను అని వెళ్లిపోతుంది జగతి.

సంతోషంగా ఉంటుండగా..
వసుధార ఒంటరిగా కూర్చుని.. తాళి అంటే కలపాలి కదా సార్.. కానీ ఈ తాళి మనల్నీ విడదీస్తుందా. మీరు ఎప్పుడు మారతారు. అందరి ముందు నన్ను కాపాడి బతికించారు. కానీ నాలుగు గోడల మధ్య నా మనసును చంపేశారు అని వసుధార అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు అందరిముందు నిస్సహాయంగా నిలబడొద్దనే అలా చెప్పాను వసుధార. అది నీకు నచ్చనప్పుడు తర్వాత చెప్పింది చేదుగా అనిపిస్తుంది అని రిషి అనుకుంటాడు. ఇలా వసుధార, రిషి ఒకరి గురించి ఒకరు అనుకుంటూ బాధపడుతుంటారు. మరోవైపు జగతి, ధరణి కాఫీ తాగుతూ సంతోషంగా ఉంటారు. ఇంతలో దేవయాని వచ్చి కాఫీ ఇవ్వమని అడుగుతుంది.

ఎంతైనా పంతులమ్మవి కదా..
ఇంకేంటీ జగతి.. కొత్త కోడలు గృహ ప్రవేశం ఎప్పుడు చేస్తుంది అని దేవయాని అంటే.. ఆ గడియలు వస్తే.. తప్పక వస్తుంది కదా అక్కయ్యా అని జగతి అంటుంది. ఆ గడియలు ఎప్పుడు వస్తాయి.. ఏంటీ ప్లానింగ్స్ అని అడుగుతున్నా దేవయాని అంటుంది. ప్లానింగ్స్ అంటూ ఏం ఉండవు అక్కయ్యా.. జరిగే వాటిని జరగనివ్వాలి అంతే.. అని జగతి అంటే.. ఇంకా ఏం జరుగుతుందని ఊహిస్తున్నావో అని దేవయాని అంటుంది. మీరు ఏం జరగొద్దని ఊహిస్తున్నారో అదే జరుగుతుందని ఊహిస్తున్నాను అని జగతి అంటుంది. మాటలు బాగానే మాట్లాడతావులే.. ఎంతైనా పంతులమ్మవు కదా అన్న దేవయాని మనసులో.. అందరి ముందు వసుధార నా భార్య అన్నంత ఈజీ కాగు ఇక్కడికి రావడం.. ఇక్కడున్నది దేవయాని.. వసుధార ఈ ఇంట్లో ఎలా అడుగుపెడుతుందో.. నేను చూస్తాను అని ఆలోచిస్తుంది దేవయాని. అది చూసి ఏం ఆలోచిస్తున్నారు అక్కయ్య అని జగతి అడుగుతుంది.

నీ అనుమతి లేకుండానే..
ఆలోచించాలి కదా జగతి. నాకంటూ ఓ బాధ్యత ఉంది. నీలా ఎలా జరిగితే అలా అని వదిలేయలేను కదా అని దేవయాని అంటుంది. సరే అక్కయ్యా ఆల్ ది బెస్ట్ అని జగతి అని వెళ్లిపోతుంది. ఒంటరిగా బాధపడుతున్న రిషి దగ్గరికి జగతి వస్తుంది. మాట్లాడొచ్చా రిషి అని జగతి అడిగితే.. ప్రతీది నా అనుమతితోనే చేశారా మేడమ్.. ప్రతి మాట నా అనుమతితోనే మాట్లాడారా ఇంతకుముందు అని రిషి అంటాడు. గతంలో వసుధారను ప్రేమిస్తున్నావ్ అని జగతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది జగతి. నిజమే రిషి.. ప్రతీది కాకపోయినా కొన్ని మాత్రం నీ అనుమతి లేకుండానే జరిగాయి. నువ్వు వసుధారను ప్రేమిస్తున్నావ్ అన్న విషయం నీ అనుమతి లేకుండానే చెప్పాను. నిన్ను అడిగి ఆ తాళి బొట్టు పంపలేదు. నువ్వు కూడా చూడలేదు. వసు తనకు తోచింది చేసింది. తాళి బొట్టు వేసుకుంది అని జగతి చెబుతుంటే రిషి మధ్యలోనే మేడమ్ అంటూ ఆపేస్తాడు.


Click it and Unblock the Notifications











