Guppedantha Manasu: గుండెను పిండేసే తల్లి కొడుకుల సీన్.. వసుకి రిషి కౌగిలింత.. అంతలోనే దూరం!
రిషి నీ అనుమతి లేకుండానే కొన్ని జరిగాయి. తాళి బొట్టు నీ అనుమతి లేకుండానే పంపాను. అందులో ఏముందో నీకు తెలియదు. ప్రెస్ మీట్ లో నీ అనుమతి లేకుండానే నీ పేరు చెప్పాను. వసుధార ఆవేశంతోనో, ఆవేదనతోనే తాళి వేసుకుంది. అక్కడ కూడా నీ పేరు చెప్పకుండానే అని జగతి చెబుతుంటే మధ్యలోనే ఆపేసిన రిషి.. మేడమ్.. మీరు అలా చేసింది వసుధార చేసిన దానికి దిద్దుబాటు చర్యగా భావిస్తున్నాను అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 6 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 703లో ఇంకా ఏం జరిగిందంటే?

అన్ని రైట్ అని ఒప్పుకోను..
నేను చేసిన దాంట్లో ఏదైనా పొరపాటు అని నీకు అనిపిస్తే అని జగతి చెప్పబోతుంటే.. మేడమ్ మీరు చేసింది పొరపాటు అని నేనేం అనలేదు క దా.. నిజంగా మీరు పొరపాటు చేసుంటే అక్కడ మీరు నా పేరు చెప్పగానే కాదు అనేవాడని కదా.. మీరు అందరి ముందు చెప్పింది నేనేందుకు ఒప్పుకుంటాను అని రిషి అంటాడు. కానీ రిషి నువ్వు లేని సమయంలో నువ్వు వస్తావని తెలియకుండానే నేను అలా నీ పేరు చెప్పడం అంటూ జగతి చెబుతుంటే.. మేడమ్ జరిగిన దాని గురించి మీరు నన్ను కన్విన్స్ చేయాల్సిన పని లేదు అంటాడు రిషి.
రిషి నేను ఏం చేసినా నీ మంచికే చేస్తా. చేశాను కూడా జగతి అంటుంది. మేడమ్ మీరు అక్కడ చేసింది రైట్ అనే భావిస్తున్నాను. అలా అని గతంలో నా విషయంలో మీరు చేసినవన్నీ రైట్ అని నేను ఒప్పుకోవట్లేదు అని రిషి అంటాడు.

గాయం ఎప్పటికీ మానదు..
రిషి అలా అనగానే నన్ను నిర్దాక్షిణ్యంగా మా అమ్మ వదిలేసి వెళ్లిపోయింది. మా అమ్మ లేదు అన్న రిషి మాటలు గుర్తు వస్తాయి. ఈరోజు చేసింది తప్పు అనను. గతంలో చేసినవి కరెక్ట్ అనుకోలేను. నేను ఒకటి నమ్మితే గట్టిగా నమ్ముతాను మేడమ్. అది మనిషి అయినా.. మాట అయినా సరే మేడమ్. రోజులు మారితే గాయాలు కూడా మారతాయి అంటారు. కానీ మనసుకు అయిన గాయం ఎప్పటికీ మానదు మేడమ్ అని రిషి అంటాడు.
వసుని ఎప్పటికీ క్షమించలేవా అని జగతి అడుగుతుంది. ఈ ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం నా దగ్గర లేదు అని రిషి అంటాడు. రిషి రోజులు మారితే గాయాలు మానవని అన్నావ్ కదా.. కొన్నింటిని కొందరు తట్టుకోగలరు. బాధల్ని మనసులో దాచుకోగలరు (తల్లిగా నేను దాచుకుంటున్నాన్న అర్థంలో). కానీ కొందరు కాదుగా.. (వసుధార అలా కాదు అన్న అర్థంలో) వసుకి నా పరిస్థితి రాకూడదు రిషి అని చాలా ఎమోషనల్ గా అంటుంది జగతి.

మీకు తలనొప్పి కూడానా..
ఈ సీన్ కి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మరింత ఎమోషనల్ హైప్ ఇస్తుంది. జగతి అన్న మాటకు గుండే బద్దలైనట్లుగా రిషి ఎక్స్ ప్రెషన్ ఉంటుంది. ఆవేదనగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మనసుకు ఎమోషనల్ గా గట్టిగా తాకేలా ఉంది ఈ సీన్. రిషి వెళ్లిపోతుంటే కన్నీళ్లతో జగతి అలా చూస్తూ ఉంటుంది. మరోవైపు తండ్రి చక్రపాణికి దిండు, దుప్పటి కప్పి వచ్చేసరికి గుమ్మం తలుపు తీసి ఉంటుంది. గుమ్మం తలుపు వేయలేదా అంటూ అక్కడికి వెళ్తుంది. అక్కడ రిషి ఉంటాడు.
సార్ మీరా.. రండి అని లోపలికి పిలిచి హాల్లో కూర్చొమంటుంది. బాగా తలనొప్పిగా ఉంది.. నీ చేత్తో కాఫీ తాగాలని వచ్చాను అని రిషి అంటాడు. మీకు తలనొప్పి కూడా వస్తుందా అని వసుధార అంటుంది. నాకూ తల ఉందిగా అని రిషి అంటే కాఫీ తీసుకొచ్చేందుకు వసు వెళ్తుంది. తర్వాత కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది వసుధార. ఇద్దరు సైలెంట్ గా అలానే ఉండిపోతారు.

వసుని హగ్ చేసుకున్న రిషి..
మాట్లాడరేంటీ సార్ అని వసు అంటే.. నువ్వు మాట్లాడు వింటాను అని రిషి అంటాడు. నాకు పొగరు ఎక్కువ అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. నాకు పొగరు, ఈగో ఉన్నాయి, కాదనడంలేదు. కానీ అవన్నీ మీ ముందు ఉండవు సార్. నా అస్థిత్వాన్ని ప్రశ్నించే వారి ముందు కచ్చితంగా నా పొగరు చూపిస్తానేమో కానీ మీ ఎదురుగా మంచు శిల్పంలా కరిగి నీరైపోతుంది సార్. నేనే మీరు.. మీరే నేను అనే భావం ఎక్కువగా ఉంటుంది అని తాళి మెడలో వేసుకోవడం గురించి చెబుతుంది వసుధార.
ఆ ఒక్క పని చేయకుండా ఉండి బాగుండేది కదా వసుధార అని మనసులో అనుకున్న రిషి థ్యాంక్స్ ఫర్ కాఫీ అని చెప్పి పైకి లేస్తాడు. ఏదో మాట్లాడాలని వచ్చి.. మాట్లాడకుండా వెళ్తున్నారు అని వసు అంటే.. జగతి అన్న మాటలు గుర్తు చేసుకున్న రిషి (వసుకి నా పరిస్థితి రాకూడదు) ఒక్కసారిగా వసుధారను ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటాడు. ఈ సీన్ కూడా మంచి ఎమోషనల్ గా ఉంటుంది.
బ్యూటిఫుల్ కపుల్..
తను కూడా రిషిన తన చేతులతో చుట్టుకోవాలని చూస్తుండగా.. ఒక్కసారిగా వదిలేస్తాడు రిషి. ఇదే మనం బంధం.. ఇదే మన దూరం అనేసి వెళ్లిపోతాడు రిషి. ఇక మరుసటి రోజు కాలేజీకి వెళ్తాడు రిషి, జగతి, మహేంద్ర. అక్కడ స్టూడెంట్స్ అంతా ఫ్లవక్ బొకేస్, ప్లకార్డ్స్ పట్టుకుని కంగ్రాచ్యులేషన్స్ సార్ అని చెబుతారు. ప్లకార్డ్స్ పై బ్యూటిఫుల్ కపుల్ అని వసు, రిషిల పిక్స్ ఉంటాయి. రిషి కోప్పడితే.. ప్రెస్ మీట్ ఎఫెక్ట్ అని మహేంద్ర రిషికి సర్ది చెబుతాడు.
దీంతో అక్కడి నుంచి రిషి వెళిపోతాడు. తన క్యాబిన్ కు వెళ్లి ఈ పొగరు ఇంకా రాలేదేంటని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు నెమలీకలు, గోలీలు చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఇంతలో మినిస్టర్ పీఏ కాల్ చేసి రిషి సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు ఒకసారి రమ్మన్నారు అని చెబుతాడు.

ఏదో అలా జరిగిపోయింది..
మినిస్టర్ పీఏతో ఓకే అని చెప్పిన వసుధార కాసేపటికీ కాలేజీకి వెళ్లాలని లేదు అనుకుంటూ రావట్లేదు అంటూ రిషికి మెసేజ్ చేసి డిలీట్ చేస్తుంది. ఏంటీ ఈ పొగరు ఉద్దేశం మెసేజ్ చేసి డిలీట్ చేస్తే నాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటాడు రిషి. మరోవైపు మినిస్టర్ గారి విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఇంతలో రిషికి మినిస్టర్ కాల్ చేస్తాడు. రిషికి కంగ్రాచ్యులేషన్ చెబుతాడు. నిన్న ప్రెస్ మీట్ చూశాను. ముందు షాక్ అయ్యాను. తర్వాత ఆనందపడ్డాను అని మినిస్టర్ అంటే. ఏదో అలా జరిగిపోయిందని రిషి అంటాడు. ఏదైనా మంచే జరిగింది అని మినిస్టర్ అంటాడు.


Click it and Unblock the Notifications











