Guppedantha Manasu: వసుధారకు రిషి సర్ ప్రైజ్.. కంగారుగా మహేంద్ర.. రగిలిపోతున్న దేవయాని!
రిషికి మినిస్టర్ కాల్ చేసి పెళ్లి గురించి అడుగుతాడు. ఏం జరిగిన మంచే జరిగింది. మీడియాలో చూసి ముందు షాక్ అయ్యాను. తర్వాత చాలా సంతోషించాను. మీరిద్దరూ మంచి జోడీ. సరే కానీ మీరిద్దరూ తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి సరేనా. వసుకి చెబితే నీతో చెబుతానందట అని మినిస్టర్ అంటాడు.
సరే సార్ తప్పకుండా వస్తాం అనేసి ఫోన్ పెట్టేసిని రిషి.. ఈ వసుధార ఏం అనుకుంటుంది. మినిస్టర్ గారు నుంచి ఫోన్ వచ్చినట్లు నాకు చెప్పాలి కదా అని అనుకుంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 7 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్ 704లో ఇంకా ఏం జరిగిందంటే?

డాడ్ ఏం చేస్తున్నారు..
వసుధార గురించి అనుకుంటూ.. తను ఎందుకు కాలేజీకి రాలేదు. వచ్చే ఉద్దేశం లేదా అని మనసులోనే అనుకుంటాడు రిషి. మహేద్ర, జగతీలు స్టూడెంట్స్ ఇచ్చిన ప్లకార్డ్స్ వసుధార రూమ్ లో గోడకు అతికిస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే రిషి రావడంతో.. మహేంద్ర సగం అతికించి.. ఏం తెలియనట్లుగా దానికి అడ్డంగా నిలబడతాడు. డాడ్ ఏం చేస్తున్నారంటే అబ్బే ఏం లేదు అని అంటాడు మహేంద్ర.
డాడ్ తప్పుకోండి ఏంటిది అని సగం అతికించిన పోస్టర్ చూస్తాడు రిషి. దానిపై తనది, వసుధార ఫొటోలు చూసి సంతోషంగా ఫీల్ అవుతాడు. రిషి తీసేస్తాం అని మహేంద్ర అంటే.. డాడ్ ఇది స్టూడెంట్స్ ఇచ్చారు కదా. వాళ్ల అభిమానాన్ని తక్కువ చేయకూడదు. ఉండనివ్వండి అని వాలిపోయిన పోస్టర్ ని పూర్తిగా అతికిస్తాడు రిషి.

మెసేజ్ అయినా పెట్టాలి కదా..
మేడమ్ వసుధార కాలేజీ ఇంకా ఎందుకు రాలేదు. మీకు ఏమైనా చెప్పిందా అని రిషి అడుగుతాడు. లేదు అని జగతి అంటే వసుధారకు కాల్ చేయండి. ఎందుకు రాలేదో తెలిసుకోండి. పైగా సమాచారం కూడా ఇవ్వలేదు అని రిషి అంటాడు. వసుధారకు జగతి కాల్ చేసి స్పీకర్ లో పెట్టి వసు.. ఈరోజు ఎందుకు రాలేదు. కనీసం మెసెజ్ అయినా పెట్టాలి క దా.
ఎండీ గారు అడుగుతున్నారు. ఇక్కడే ఉన్నారు. ఫోన్ స్పీకర్ లో ఉంది అని జగతి అంటుంది. రావాలనిపించక రాలేదని చెప్పండి మేడమ్ అని వసు అంటుంది. ఇలా జగతిని అడ్డుపెట్టుకుని రిషి, వసుధార మాట్లాడుతుంటారు. ఆవిడగారు మెసెజ్ చేస్తారు. అదేంటో చూసే లోపల డిలీట్ చేస్తారు. అదేం అయ్యుంటుందా అని మేము టైమ్ వేస్ట్ చేసుకోవాలి అని కోపంగా వెళ్లిపోతాడు రిషి.

వసుధార నలిగిపోతుంది..
అప్పుడు అదేం పని వసు. మెసేజ్ చేసి డిలీట్ చేయడం ఏంటీ.. ఈ ఆటలు ఏంటీ అని తిడుతుంది జగతి. అయ్యే మేడమ్ మీ అబ్బాయి కోపాన్ని, ప్రేమనీ అన్నింటినీ నేనే భరించాలి. నేను ఈరోజు కాలేజీకి రావట్లేదు మేడమ్ అని కాల్ కట్ చేస్తుంది వసుధార. ఈ విషయం గురించి జగతి, మహేంద్రలు ఆలోచిస్తూ ఉంటారు. అసలు రిషి ఏంటీ అర్థం కాడు. అప్పుడే ప్రేమ చూపిస్తాడు.
అప్పుడే కోపం. అప్పుడే మంచిగా. అప్పుడే ఇలా. పాపం మధ్యలో వసుధార నలిగిపోతుంది కదా అని మహేంద్ర అంటే.. నువ్వు ఏం టెన్షన్ పడొద్దు. రిషి కోపంగా ఉన్నప్పుడు వసు సర్దుకుంటుంది. వసు అలిగినప్పుడు రిషి సైలెంట్ గా ఉంటాడు. అనవసరంగా ఆలోచనలు పెట్టుకోకు అని జగతి చెబుతుంది.

రిషిపై పడబోయిన వసు..
వాళ్లను ఎప్పుడూ సంతోషంగా చూడాలన్నదే నా కోరిక అని మహేంద్ర అంటే.. త్వరలోనే చూస్తావులే అని జగతి అంటుంది. దీంతో మహేంద్ర మనసు కాస్తా కుదుటపడుతుంది. మరోవైపు రిషి కార్ నడుపుతూ వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనకు భయం లేకుండా పోతుంది అనుకుంటుండగా రిషికి కాల్ వస్తే కారు పక్కకు ఆపుతాడు.
కాల్ మాట్లాడిన తర్వాత మొత్తానికి మా పోగ్రాం ఫిక్స్ చేశాను. వసుధారకు ఇవేం చెప్పను అని మనసులో అనుకుంటాడు రిషి. మరోవైపు వసుధార దిగులుగు కూర్చుంటే చక్రపాణి ఏంటమ్మా ఇలానే ఉంటావా ఆలోచిస్తూ అని అంటాడు.
ఇంతలో రిషి కార్ హారన్ వినిపిస్తుంది. అది విని పరుగెడుతుంది వసుధార. రిషి కారు దిగి కోపంగా చూస్తుంటే వసుధార సంతోషంతో పరుగులు తీస్తూ రిషి దగ్గరికి వెళ్తుంది. ఇంతలో కాలు స్లిప్ అయి రిషి మీదకు పడిపోతుంది. అప్పుడు వసుధారను రిషి పట్టుకుంటాడు.
నా దిష్టే తగిలేలా..
రిషి, వసుధార ఇద్దరు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటారు. మంచి రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది. అప్పుడే తేరుకున్న రిషి రమ్మన్నాను అంటే.. గాల్లో పరుగులు పెట్టమనలేదు. నెమ్మదిగా రావొచ్చుగా అని పదా ఒక చోటుకి వెళ్లాలి అని రిషి అంటాడు. ఎక్కడికి సార్.. నా అవతారం చూశారా రెండు నిమిషాలు టైమ్ ఇవ్వండి. రెడీ అయి వస్తాను అని వసు అంటుంది. సరే అని రిషి అంటాడు.
అప్పుడు ఇద్దరు పక్కపక్కనే నడుచుకుంటూ రావడం చూసి చక్రపాణి సంతోషిస్తాడు. జంట బాగుంది, నా దిష్టే తగిలేలా ఉంది. దేవుడు వీళ్లను చల్లగా చూడాలి అని ఆశీర్వదిస్తూ పొంగిపోతాడు. మరోవైపు ఫణీంద్ర పోన్ చూసుకుంటూ ఉంటే దేవయాని రగిలిపోతుంది.

రగిలిపోతున్న దేవయాని..
దేవయాని అప్పటి నుంచి చూస్తున్నాను ఏంటీ నీ సమస్య అని ఫణీంద్ర అడుగుతాడు. వెంటనే కోపంగా సమస్య నాది కాదండి. రిషిది అని దేవయాని అంటుంది. రిషి సమస్య అయితే రిషి చూసుకుంటాడులే నీకెందుకు మధ్యలో అని ఫణీంద్ర అంటాడు. మీతో ఇదే సమస్య అండీ. అరే రిషి గురించి మీకు ఎవరికీ బాధ్యత, బాధ లేదా.. అని దేవయాని అంటుంది. బాగుంది దేవయాని.. చాలా బాగుంది.. బాధ, బాధ్యత ఆలోచించి మనం ఏం చేస్తాం చెప్పు అని ఫణీంద్ర అంటాడు.


Click it and Unblock the Notifications











