Guppedantha Manasu: భార్యవి కాదన్న రిషి.. ఆవేదనతో వసుధార.. శుభకార్యం అంటూ మంత్రి!

మినిస్టర్ ఇంట్లో ఆయనతోపాటు వసుధార, రిషి ముగ్గురు కలిసి భోజనం చేస్తుంటారు. నాకు ఒక డౌట్ రిషి.. అసలు మీ ప్రేమ ఎలా మొదలైంది అని మినిస్టర్ అడుగుతాడు. దీంతో రిషి దగ్గుతాడు. అయ్యో సార్ మిమ్మల్ని ఎవరో తలుస్తున్నారు అని వసుధార అంటే.. ఇంకెవరు తలుస్తారు. జగతి మేడమో.. మహెంద్ర గారో అయి ఉంటారని మినిస్టర్ అంటాడు. అవును గతంలో వసుధార పెళ్లి చేసుకుంది అంటే ఎవరినో అనుకున్నాను. నువ్వే అని ఆరోజు చెప్పొచ్చు కదా అని మినిస్టర్ అంటే.. అంటే ఆ రోజు అది.. అది.. అంటూ రిషి నసుగుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మార్చి 9 గురువారం నాటి తాజా ఎపిసోడ్‌ 706లో ఇంకా ఏం జరిగిందంటే?

షాపింగ్ చేసి వెళ్దాం..

షాపింగ్ చేసి వెళ్దాం..

రిషి అలా నసుగుతూ ఉంటే.. రిషి సారే చెప్పొద్దు అన్నారు సార్ అని వసుధార అంటుంది. అవునా.. ఎందుకు రిషి. వసుధారను అంత కంట్రోల్ లో పెడుతున్నావ్ అని మినిస్టర్ అంటే.. సార్ ఇప్పుడు కూడా మీ దగ్గరికి చెప్పకుండా తీసుకొచ్చారు తెలుసా అని వసుధార అంటుంది. నిజమా.. అని మినిస్టర్ అంటే.. నేనేదో షాపింగ్ కి తీసుకుని వెళ్తున్నారేమో అనుకున్నాను. కానీ అనుకోకుండా మీరు ఇచ్చిన చీరలోనే వచ్చాను సార్ అని వసుధధార అంటుంది. చాలా విచిత్రంగా ఉందే అని మినిస్టర్ అంటాడు. దీంతో వెంటనే రిషి సార్.. వెళ్లేటప్పుడు షాపింగ్ చేసి ఇంటికి వెళ్దామా అని అంటుంది వసుధార. తీసుకుని వెళ్లు రిషి.. షాపింగ్ కి తీసుకుని వెళ్లడం బాధ్యత అని మినిస్టర్ అంటాడు.

నిన్ను మించిన భార్య..

నిన్ను మించిన భార్య..

ఓకే సర్ అని రిషి అంటాడు. అమ్మా వసుధా నువ్వు చదువులో మంచి స్టూడెంట్ వి. అలాగే జీవితంలో కూడా నువ్వు ఒక మంచి భార్యవి అవుతావ్ అని మినిస్టర్ అంటాడు. అప్పుడు రిషి అన్న మాటలు గుర్తు చేసుకున్న వసుధార.. మంచి భార్య కావడం అంత ఈజీ కాదేమో సార్ అని మనసులో బాధగా అనుకుంటుంది వసుధార. నీకెంటి వసుధార. నిన్ను మించిన బార్య రిషికి ఎక్కడ దొరుకుతుంది చెప్పు అని మినిస్టర్ అంటాడు. అప్పుడు రిషి, వసుధార ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు ప్రేమగా చూసుకుంటారు. ఏంటీ మీరిద్దరు మాట్లాడుకోవడం లేదు. ఏం తినడం లేదు. తినండి అని మినిస్టర్ అంటాడు. భోజనం తర్వాత వసుధార అదోలా ఉంటుంది.

 దూరంగానే కనిపిస్తున్నావ్..

దూరంగానే కనిపిస్తున్నావ్..


ఏంటీ అలా ఉన్నావ్ అని రిషి అడిగితే.. మీ భార్య కానీ భార్యని కదా సార్ ఇంకెలా ఉంటాను అని వసుధార అంటుంది. వీటికేం తక్కువ లేదు అని కోపంగా అనుకుంటాడు రిషి. ఇంతలో మినిస్టర్ వచ్చి కొత్త జంటకు నా బహుమానాలు అని ఇస్తాడు. రిసెప్షన్ కు ఎటు పిలవలేదు.. తదుపరి శుభకార్యం.. బారసాలకైనా పిలవండని అన్న మినిస్టర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తాడు. తర్వాత వసు, రిషి ఇద్దరు కారులో వెళ్తుంటారు. నా పక్కనే ఉన్నా దూరంగానే కనిపిస్తున్నావ్.. నా భార్యగా నటించమని నిన్ను అడిగే పరిస్థితి ఎందుకొచ్చింది వసుధార అని ఆలోచించుకుంటాడు రిషి. ఇప్పుడు మినిస్టర్ దగ్గరికి వెళ్లడానికి జరిగింది చూపిస్తారు.

 లేని బంధాన్ని ఉన్నట్లుగా..

లేని బంధాన్ని ఉన్నట్లుగా..

నువ్వు చేసిన పనికి ఇప్పుడు నటించడం తప్పా మరో దారి లేదు కదా. నిజంగా భార్యాభర్తలుగా మినిస్టర్ గారి ఇంటికి వచ్చే అవకాశం నువ్వు లేకుండా చేశావ్ కదా. నువ్వు ఒక పని చేశావ్. ఆ పనిని సమర్థించడానికి మేడమ్ ఒక అబద్ధం చెప్పారు. ఆ అబద్ధాన్ని నేను నిజం అన్నాను. ఇదంతా ఆలోచిస్తే ఇవన్నీ ఎంత అత్మ వంచన పనులో కదా వసుధారా. ఇవన్నీ మనకు అవసరమా.. లేని బంధాన్ని ఉన్నట్లుగా నవ్వుతూ నటించాలి. మనల్న మనం మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్లను మోసం చేస్తున్నాం. ఇక్కడి నుంచి మొదలుపెడదామా మన నటనా అంటూ చేయి అందిస్తాడు రిషి. అప్పుడే రిషి చేయి పట్టుకుని మినిస్టర్ ఇంట్లోకి నడుస్తుంది వసుధార. ఇది జరిగింది. రియాల్టీలోకి వస్తే.. వసుధా కూడా జరిగింది గుర్తు చేసుకుని రిషి వైపు ఆవేదనగా చూస్తుంది.

చాలా తేడా ఉంది కదా..

చాలా తేడా ఉంది కదా..

మీరు చెప్పినట్లుగా నేను నటించలేదు సార్. నేను మీ భార్యగానే మీ వెంట వచ్చాను అనుకుంటుంది వసుధార. ఓ చోట రిషి కారు ఆపి ఎదురుగా ఉన్న బల్లపై కూర్చుంటాడు. ఈరోజు మన ప్రయాణంలో తేడా ఏమైనా కనిపిస్తుందా. ఇప్పటిదాకా చాలా ప్రయాణాలు చేశాం. వాటికి ఈరోజుకు తేడా ఏమైనా ఉందా అంటున్నాను అని రిషి అడుగుతాడు. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా సార్ ఇన్నాళ్లు మీ అసిస్టెంట్ గా వచ్చేదాన్ని. ఇప్పుడు మీ భార్యగా వచ్చాను కదా అంటుంది వసు. నీకు అలా అనిపించిందా.. ప్రపంచం అంతా అనుకోవడం వేరు. నిజం వేరు కదా. నన్ను నువ్వు నీ భర్తగా అనుకుంటున్నావ్. నేను నిన్ను భార్యగా అనుకోవాలి కదా. ప్రపంచానికే మనం భార్యాభర్తలం. నిజమేంటో మనకు తెలుసు. మినిస్టర్ గారి దగ్గర నటించాం అని రిషి అంటాడు.

గుండెకు అయిన గాయం..

గుండెకు అయిన గాయం..

పాపం ఆయనకు నిజం తెలియదు. నాకు తాళి కట్టే అవకాశాన్ని లేకుండా చేశావ్ కదా. నీ విషయంలో నేను చాలా క్షమించాను. చాలా ఓర్చుకున్నాను అని రిషి అంటాడు. అవును సార్.. ఈ ఒక్క విషయంలో ఇంతలా ఎందుకు బాధ పెడుతున్నారు అని వసు అంటుంది. నీ పరిస్థితులు ఆరాటం అన్నీ నేను అర్థం చేసుకుంటాను. ఒక్కసారి నా పరిస్థితి కూడా నువ్వు ఆలోచించి ఉండాల్సింది. ఈ గుండెకు అయిన గాయం ఎప్పుడు మానుతుందో కదా అని రిషి అంటాడు. ఇంతలో పూలు అమ్మే ఆమె అటుగా వస్తుంది. ఆమె వైపు చూసిన వసుధార ఇప్పుడు సార్ నా కోసం పూలు కొంటారా. అయినా ఈ పరిస్థితిలో అలా ఆలోచించడమే నా పొరపాటు అవుతుంది అని వసు అనుకుంటుంది.

ఇవి మన గిఫ్ట్స్ కాదు..

ఇవి మన గిఫ్ట్స్ కాదు..

ఇంతలో పూలు కొనిస్తాడు రిషి. వాళ్లిద్దరి వైపు చూసి మీ ఇద్దరికీ పెళ్లి అయిందా అని అనడంతో.. ఆయన మా వారే కానీ ఆయన భార్యని కాదు అని వసు అంటుంది. అప్పుడు పూలమ్మే ఆమె భర్తంటే ఎలా ఉండాలో గొప్పగా చెబుతుంది. మీ ఇద్దరిని చూస్తుంటే ఒకరికోసం ఒకరు పుట్టినట్లు ఉన్నారు. ఈ మేడమ్ ని చాలాబాగా చూసుకోండని ఆమె అంటే.. మరి నన్ను చూసుకోమని మీ మేడమ్ కి చెప్పవా రిషి అంటాడు. అయ్యే సారు.. భూమి మీద ఉన్న ప్రతి ఒక ఆడది భర్త దేవుడిలా భావిస్తుంది అని ఆమె అంటుంది. వసుధారకు పూలు కొనిస్తాడు రిషి. కిందపడుతుండగా.. పూలు తీసి మళ్లీ ఇస్తాడు. తర్వాత ఇద్దరు ఇంటికి వెళతారు. పక్కపక్కనే ఉన్నా మనిద్దరి మధ్య ఏతో మంచు తెర అడ్డుగా ఉన్నట్లు ఉంది అని రిషి అనుకుంటాడు. వసుధార కారు దిగి వెళ్తుంటే. మినిస్టర్ ఇచ్చిన గిఫ్ట్స్ వసుధారకు ఇస్తాడు రిషి. ఇవి మనిద్దరికీ కదా సార్ అని వసు అంటే.. నా ఉద్దేశంలో ఇవి మన గిఫ్ట్స్ కాదు. నువ్వు చేసిన పని వల్ల వచ్చిన బహుమతులు అని రిషి అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X