Guppedantha Manasu: కాలేజీలో శైలేంద్రకు దెబ్బ మీద దెబ్బ.. జగతి, వసుధారకు అనుమానం!
ధరణి చాప తీసుకుని వెళ్లడం చూసి అడగటానికి వెళ్లబోతుంటే జగతి ఆపుతుంది. ఇది కరెక్ట్ టైమ్ కాదు అని జగతి అంటే.. అదేంటీ మేడమ్ అలా అంటారు. తను గదిలో పడుకోకుండా అలా వెళ్తుంటే అని వసుధార అంటుంది. మనం ఇలా గమనిస్తున్నామని ధరణికి తెలిస్తే బాధపడుతుంది అని జగతి అంటుంది. బాధపడుతుంది కదా ఆగితే సమస్య పరిష్కారం కాదు కదా మేడమ్ అని వసుధార అంటుంది. భార్య భర్తలో విషయంలో బయట వాళ్లు జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని జగతి అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మే 1 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 751లో ఇంకా ఏం జరిగిందంటే?
ఇంకొన్ని రోజులు చూద్దాం:ధరణి అసలే అమాయకురాలు. కొన్ని గుట్టుగా ఉండాల్సినవి గుట్టుగానే ఉండాలి. వాళ్ల మధ్య ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఏవేవో ఊహించుకుని నోరు జారితే ప్రమాదం. మనం ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే తనను ఇబ్బంది పెట్టిన వాళ్లవుతాం. మనం ఏదైన మాట్లాడితే వాళ్ల మధ్య ఇంకా సమస్యలు తెచ్చి పెట్టినవాళ్లం అవుతాం. ఇంకొన్ని రోజులు చూద్దాం. ఇప్పుడెళ్లి పడుకో అని జగతి చెబుతుంది. దీంతో వసుధార వెళ్లిపోతుంది. మరుసటి రోజు రిషి తన గదిలో నాలుగు కోట్స్ ముందు పెట్టుకుని ఏ డ్రెస్ వేసుకుంటే సెట్ అవుతుందా అని చూస్తూ ఉంటాడు. ఇంతలో వసు లోపలికి రావొచ్చా అని అడుగుతుంది.

ముగింపు ఉండదు:ఏ కోట్ వేసుకోవాలో తెలియట్లేదు అని రిషి అడిగితే.. పింక్ కోట్ అని చెబుతుంది వసుధార. సార్ ఈ కోట్ నాకు చాలా ఇష్టం. మీ కోపం ప్రేమ అన్ని ఇందులో కనిపిస్తాయి అని వసుధార పొంగిపోతుంది. దీంతో వసుధార బుగ్గలను ప్రేమగా పట్టుకుని కళ్లలోకి చూస్తూ.. మనం మళ్లీ ఇలా ప్రేమగా ఉంటామని నేను అనుకోలేదు. గతంలో మన మధ్య ఎన్నో అగాథాలు ఏర్పడ్డాయి. కానీ స్వచ్ఛమైన ప్రేమకు ముగింపు ఉండదు అని రిషి అంటాడు. ఇంతలో రిషి అంటూ శైలేద్రం వస్తాడు. వాళ్లద్దరిని చూసి సారీ రిషి కింద ఉంటానని చెప్పి హాల్లో వెయిట్ చేస్తుంటాడు శైలేంద్ర. మెట్లు దిగుతూ వస్తుంటే రిషి కోట్ కు ఏదో అంటితే వసు చున్నీతో తుడుస్తుంది.

విడగొట్టడం ఇష్టం లేదు:అది చూసి శైలేంద్ర రిగిలోపోతుంటాడు. అప్పుడే అతని దగ్గరికి వచ్చిన దేవయాని వాళ్ల అన్యూన్యంగా ఉండటం నాకు అస్సలు నచ్చడం లేదు అని అంటుంది. కూల్ మమ్మీ.. మనకు కావాల్సింది జరగాలంటే అన్నీ చూస్తూ ప్రేమగా నటించాలి అంటాడు శైలేంద్ర. తర్వాత వసు, రిషి, శైలేంద్ర ముగ్గురు కారులో కాలేజీకి బయలు దేరతారు. రిషి కారు డోర్ తీసి అన్నయ్యా నువ్వు ముందు కూర్చో, వసుధార వెనుక కూర్చుంటుంది అని అంటే.. మిమ్మల్ని విడగొట్టడం నాకు ఇష్టం లేదు అని శైలేంద్ర అంటాడు. అలా ఏం లేదు సార్. మేం ఎక్కడున్నా సార్ నా పక్కనే ఉన్నట్లు ఉంటుంది అని వసుధార అంటుంది. అయినా అలా చేయడం నాకు ఇష్టం లేదన్న శైలేంద్ర వెనుక వెళ్లి కూర్చుంటాడు.

అన్నయ్యా పెద్దమ్మాలానే:అది ధరణి, దేవయాని బాల్కనీలో నుంచి చూస్తారు. వాళ్లు అలా కలిసి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది అని ధరణిం అంటుంది. నువ్వు కూడా వెళ్తే బాగుండేది కదా అని దేవయాని అంటుంది. ఆరోజు వస్తే.. అని ధరణి అనేలోపు.. రాదు. ఆరోజు ఎప్పటికీ రాదు. కలలు కనొద్దు. వెళ్లి కిచెన్ లో పని చూసుకో అని దేవయాని అంటుంది. కారులో మా అన్నయ్య కూడా మా పెద్దమ్మా లానే మందు నాకు నచ్చిందే చేయమంటారు అని వసుధారతో రిషి అంటాడు. శైలేంద్ర మీ అన్నయ్య కాదు సార్. తను దేవయాని కొడుకు. ఇద్దరి మనసుల్లో చెడు ఆలోచనలే ఉంటాయి. ఎవరి మీద ప్రేమ ఉండదు. ఉన్నట్లు నటిస్తారు. అది మీకు అర్థం కావట్లేదు సార్ అని మనసులో అనుకుంటుంది వసుధార.

అక్కయ్యాలానే స్వార్థం:రిషి కారు దిగేసరికి స్టూడెంట్స్ బొకెలు పట్టుకుని ఎంట్రీ ఇస్తారు. సర్ప్రైజ్ ఉందని రిషిని లోపలికి తీసుకెళ్తారు స్టూడెంట్స్. రిషి, శైలేంద్రను కిటికి లోనుంచి చూసి మురిసిపోతారు మహేంద్ర, ఫణీంద్ర. చిన్నప్పుడు మనం కూడా అలానే ఉండేవాళ్లం కదా. మన మధ్య ఎంతోమంది చిచ్చులు పెట్టాలని చూసిన నాన్న గారు చెప్పిన ప్రేమాభిమానాలతో ఇలా కలిసి ఉండగలిగాం అని మహేంద్ర అంటాడు. నిజమే అంటూ ఫణీంద్ర సంతోషిస్తాడు. అదంతా విన్న జగతీ.. బావగారు శైలేంద్ర మనసు అక్కయ్యలానే స్వార్థంతో నిండిపోయింది. ఇది మీరు ఎప్పుడు తెలుసుకుంటారో. తెలుసుకున్న రోజు మా అందరికంటే మీరు ఎక్కువ బాధపడతారు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో రిషి, శైలేంద్ర, వసు వస్తారు. రాగానే ఆఫీస్ బాయ్స్ వచ్చి సార్ అనగానే శైలేంద్ర పలుకుతాడు. మిమ్మల్ని కాదు రిషి సార్ ని అనడంతో శైలేంద్రకు మండిపోతుంది.

రగిలిపోయిన శైలేంద్ర..:మెడికల్ కాలేజీ లోగో తయారు చేశాం. దాన్ని మీరే ఆవిష్కరించాలి అని స్టూడెంట్స్ చెబితే రిషి సంతోషిస్తాడు. సార్ ఇది చేయమని జగతి, వసుధార మేడమ్ చెప్పి హెల్ప్ చేశారని వాళ్లు చెబితే ప్రేమగా చూస్తాడు రిషి. తర్వాత ఫణీంద్ర సార్ వాళ్ల అబ్బాయి, మా అన్నయ్య అని శైలేంద్రను పరిచయం చేస్తాడు రిషి. ఎవరైనా మీ తర్వాతే సార్ అని స్టూడెంట్స్ అంటే శైలేంద్రకు మరో షాక్ తగిలి రగిలిపోతాడు. కాదు కాలేజీనే ఫస్ట్ ప్రయారిటీ అని రిషి చెబుతాడు. లోగో ఆవిష్కరణ చేయాల్సింది నేను కాదు అని రిషి అనగానే తనతోనే చేయిస్తాడని శైలేంద్ర సంబరపడిపోతాడు. జగతీ మేడమ్, వసుధార మేడమ్ చేస్తారు అని రిషి చెప్పడంతో శైలేంద్ర కోపం కట్టలు తెంచుకుంటుంది.


Click it and Unblock the Notifications











