Guppedantha Manasu: జగతిని బుక్ చేసిన శైలేంద్ర.. తల్లిని అపార్థం చేసుకున్న రిషి.. కొత్త ప్లాన్!

జగతిని శైలేంద్ర బెదిరించడం వసుధార వింటుంది. శైలేంద్ర నిజ స్వరూపం తెలుసుకున్న వసుధార రిషితో ఎంగేజ్ మెంట్ వద్దని చెబుతుంది. దీంతో రిషి పెద్ద గొడవ చేస్తాడు. ఎందుకు వద్దంటున్నావ్ అని రిషి అడిగితే.. తన అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాలేదు. ఈ పరిస్థితిలో వద్దని చెబుతుంది. వసుధార. ఇంట్లో అందరి ముందే వసుధార తండ్రి చక్రపాణికి కాల్ చేసి అడుగుతాడు రిషి. నిశ్చితార్థం గురించి రిషి చెప్పడంతో చక్రపాణి సంతోషిస్తాడు. దీంతో వసుధారను నిలదీస్తాడు రిషి. ఎంగేజ్ మెంట్ కు ఒప్పుకోకుంటే ఇక మళ్లీ కనపడకు అనేసి వెళ్లిపోతాడు రిషి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 13 శనివారం నాటి ఎపిసోడ్‌ 762లో ఇంకా ఏం జరిగిందంటే?

కన్నీళ్లతో వసుధార : జగతి దగ్గరికి వెళ్లి వసుధార మాట్లాడుతుంది. తాను విన్నదంతా చెబుతుంది. జీవితంలో ఒక్కసారి జరిగే ఎంగేజ్ మెంట్ ను భయంభయంగా చేసుకోవడం ఇష్టం లేదని వసుధార అంటుంది. రిషి గురించి ఆలోచించు. మళ్లీ గొడవలు వస్తే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. నిశ్చితార్థానికి ఒప్పుకుంటున్నట్లు చెప్పు అని జగతి అంటుంది. అక్కడి నుంచి వెళ్లిన వసుధార రిషి దగ్గరికి వెళ్తుంది. సార్ అని పిలిచినా రిషి పలకకపోవడంతో వెళ్లి హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. ఎందుకు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయమన్నావ్ అని రిషి అడిగితే.. మీకోసమే అని వసుధార అంటుంది. దీంతో వసుధారవైపు తిరిగి నిజం చెప్పు వసుధార. ఏం జరిగింది. ఏదైనా సమస్యా. ఏం లేకపోతే నీ కన్నీళ్లలో ఏదో భయం, ఆందోళన ఎందుకు కనిపిస్తున్నాయి అని రిషి అడుగుతాడు.

Guppedantha Manasu

దేవయానికి మహేంద్ర థ్యాంక్స్ : మెడికల్ కాలేజీ పూర్తయిన తర్వాతే ఎంగేజ్ మెంట్ జరిగితే బాగుంటుందని, మన బంధం మీ లక్ష్యానికి అడ్డు కాకూడదనే ఎంగేజ్ మెంట్ వద్దన్నాను అని వసుధార చెబుతుంది. నాకు కాలేజీ ఎంత ముఖ్యమో. నువ్వు అంతే ముఖ్యం. మన ప్రేమ అంతే ముఖ్యం. ఏవేవో కారణాలతో మన మధ్య దూరం మళ్లీ పెరగడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే ప్రేమను నిలబెట్టుకోవడానికి, గెలిపించుకోవడానికి.. చాలా కష్టపడ్డాం, చాలా పోరాటం చేశాం, ఎంతో విరహవేదన అనుభవించాం. చివరి దశలో మళ్లీ మనం దూరం కావొద్దు అని రిషి చెబుతాడు. మరోవైపు మహేంద్ర, ఫణీంద్రతో ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిపించాలని చెబుతుంది. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఫణీంద్ర అంటాడు. హ్యాట్సాప్ చెబుతూ థ్యాంక్స్ వదినా అంటాడు మహేంద్ర.

Guppedantha Manasu

పరధ్యానంలో వసుధార : తర్వాత ధరణి దగ్గరికి వెళ్లిన దేవయాని మళ్లీ తిట్ల దండకం మొదలు పెడుతుంది. ఎంగేజ్ మెంట్ కు కావాల్సిన పనులు చూసుకోమని అరుస్తుంది. ధరణి, జగతి పూలు గుచ్చుతూ ఉంటారు. మరోవైపు తన గదిలోకి వసుధారను తీసుకొచ్చిన రిషి చీరను ఇస్తాడు. వసుధార ఆందోళనగానే చీర తీసుకుంటుంది. సంతోషంగా కనిపించదు. ఏంటీ వసుధార ఏదో పరధ్యానంలో ఉన్నావ్. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానని రిషి అనడంతో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూస్తుంది. మరోవైపు చిన్నత్తయ్యా ఈ సమయంలో మీరే ఎక్కువ సంతోషంగా ఉండాలి కదా అని ధరణి అంటే.. అదేం లేదు అని జగతి కవర్ చేస్తుంది. ఇంతలో వసుధరా వస్తే ఇంకా పడుకోలేదా అని జగతి అడుగుతుంది. రిషి సార్ చీర ఇచ్చారని వాళ్లకు చూపిస్తుంది. వాళ్లు చాలా బాగుంది అంటారు.

Guppedantha Manasu

కొత్త ప్లాన్ అమలు : నేను కూడా పూలు గుచ్చుతానని వసుధార అంటుంది. మొదట్లో జగతి, ధరణి ఒప్పుకోరు. వసుధార మళ్లీ అడగడంతో సరే అంటారు. వసుధార గతంలో పూలు గుచ్చినప్పుడు రిషితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. సార్ మనిద్దరం పూల మాల గుచ్చాలన్నది నా కోరిక అని రిషికి మెసేజ్ చేస్తుంది. మరోవైపు నువ్వు ఏం చేసినా నా సంతోషం కోసమే. నా కొడుకుగా పుట్టడం అదృష్టం అంటూ శైలేంద్రను పొగుడుతుంది దేవయాని. వాళ్లను భయపెట్టడం.. ఈ శుభకార్యం జరిపించడం వెనుక రీజన్ ఉందని, అది మనల్ని అందలం ఎక్కిస్తుంది. వాళ్ల పతనానికి నాంది పలుకుతుంది అని శైలేంద్ర అంటాడు. మన టార్గెట్ కోసం కొత్త ప్లాన్ అమలు చేస్తున్నానంటూ దేవయానికి సీక్రెట్ గా విషయం చెబుతాడు శైలేంద్ర. అదంతా విన్న దేవయాని తెగ సంబరపడిపోతుంది.

Guppedantha Manasu

రిషితో సంతకాలు : ఈ ప్లాన్ లో మనకు ఎవరైనా అడ్డొస్తే వాళ్లను అడ్డు తప్పించి అయినా అమలు చేయాలంటాడు శైలేంద్ర. మరోవైపు వసుధార దగ్గరికి రిషి వస్తాడు. దీంతో అక్కడి నుంచి ధరణి, జగతి వెళ్లిపోతారు. వసుధారతో కలిసి పూలు గుచ్చుతాడు రిషి. నీ కోరిక ఏది అయినా నేను తీరుస్తాను అని రిషి అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని.. అన్నయ్య పిలుస్తున్నాడు అని రిషితో చెబుతుంది. దీంతో రిషి వెళ్లిపోతాడు. ఇక వసుధార కూడా వెళ్లిపోతుంటే.. చాలా ఆనందంగా ఉన్నట్లున్నావ్. కానీ, ఆ ఆనందం ఆవిరైపోతుంది అని దేవయాని అనేసి వెళ్లిపోతుంది. మరోవైపు రిషిని ఒక ఫైల్ మీద సంతకాలు చేయమని అడుగుతాడు శైలేంద్ర. రిషి సంతకం చేయబోతుంటే జగతి వచ్చి అడ్డుకుంటుంది. అందులో ఏముందో చదివి సైన్ చేయమంటుంది. నాకు అన్నయ్య మీద నమ్మకం ఉంది, మీపైన ఉన్నట్లే అని రిషి అంటాడు. ఒకసారి చెక్ చేస్తే బెటర్ కదా అని జగతి అంటుంది.

Guppedantha Manasu

ఇలా చేయడం బాలేదు : నీకు నాపై నమ్మకం ఉంది రిషి. కానీ పిన్నికి నాపై నమ్మకం ఉండాలని లేదు కదా. పర్లేదు చెక్ చేసి సంతకం పెట్టమని శైలేంద్ర అంటాడు. దీంతో ఫైల్ చూసిన రిషి అంతా కరెక్ట్ గానే ఉందంటాడు. దానికి జగతి షాక్ అవుతుంది. మీరు విషయానికి కంగారుపడుతున్నారు. మనవాళ్లపై కూడా డౌట్ పడుతున్నారు. మీరిలా ప్రవర్తించడం బాలేదు మేడమ్ అని సంతకం పెట్టి వెళ్లిపోతాడు రిషి. జగతి కూడా వెళ్లిపోతుంటే పిన్నీ.. కంగారు పడ్డావా. భయపడ్డావా. పేపర్లపై దొంగతనంగా సంతకాలు పెట్టే చీప్ ట్రిక్స్ ప్లే చేయను అని శైలైంద్ర అంటే.. అన్ని రోజులు నీవే అనుకోవద్దు. ఏదో ఒక రోజు ముగింపు వస్తుంది అని జగతి అంటుంది. నీ కొడుకుతో ఎండీ సీట్ కి ముగింపు పలికేలా చేయాలి. రేపు జరగబోయే నిశ్చితార్థంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో నేను చెప్పలేను అని శైలేంద్ర అంటాడు. దీంతో రిషిని ఎలా కాపాడుకోవాలో అని జగతి ఆలోచిస్తూ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X