Guppedantha Manasu: తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన రిషి.. పెద్దమ్మా అంటూ! అంతుచిక్కని శైలేంద్ర స్కెచ్
నిశ్చితార్థం రోజు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని శైలేంద్ర అన్నమాటలను తలుచుకుంటూ బాధపడుతుంటుంది జగతి. ఇంతలో అక్కడికి వచ్చిన మహేంద్ర.. ఏంటీ జగతి ఇంకా రెడీ కాలేదా. ఎందుకు అంత డల్ గా ఉన్నావ్. ఏమైనా సమస్య అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు. ఏం లేదు మహేంద్ర అని జగతి సమాధానం ఇస్తుంది. ఏ సమస్య లేనప్పుడు అలా ఎందుకు ఉన్నావ్ అని మళ్లీ అడుగుతాడు మహేంద్ర. ప్లాబ్లమ్ ఉంది మహేంద్ర. నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటుంది జగతి. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మే 15 సోమవారం నాటి ఎపిసోడ్ 763లో ఇంకా ఏం జరిగిందంటే?
నేను ప్రపోజల్ తెచ్చానని: మహేంద్ర.. రిషి అని జగతి చెప్పబోతుంటే.. ఇంతలో అక్కడికి దేవయాని, శైలేంద్ర వస్తారు. ఏంటీ ఇంకా రెడీ అవ్వలేదు. అలా డల్ గా ఎందుకున్నావ్ జగతి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్. నీకు ఈ ఎంగేజ్ మెంట్ ఇష్టం లేదా అని దేవయాని అడుగుతుంది. అదేం లేదు. దేని గురించో బాధ పడుతుంది అని మహేంద్ర చెబుతాడు. ఏమైంది పిన్ని. ఈ ఎంగేజ్ మెంట్ ప్రపోజల్ నేను తీసుకొచ్చాను అని ఇష్టం లేదా అని శైలేంద్ర అని అంటాడు. ఎందుకు జగతి ఇలా చేస్తున్నావ్. శైలేంద్ర వచ్చినప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావ్. అనుమానిస్తున్నావ్. ఏదైనా పగ ఉంటే నన్ను అను అంతే కానీ నా కొడుకు ఏం చేశాడు అని దేవయాని అంటుంది.

చీరలో అందంగా: అయ్యే అదేం లేదు వదినా. మీరు ఏదేదో ఊహించుకుని అనవసరంగా కంగారు పడుతున్నారు అని మహేంద్ర అంటాడు. తాను చెప్పదు కానీ చేసేటివి చేస్తుంది. అసలు వసుధారను కూడా తానే రెచ్చగొట్టి ఉంటుంది అని మళ్లీ దేవయాని అంటుంది. దీంతో అలా ఏం లేదు. నేను మాట్లాడి తీసుకొస్తాను వెళ్లండి అని శైలేంద్ర, దేవయానిని పంపిస్తాడు మహేంద్ర. ఏంటీ జగతి ఇదంతా.. నువ్వు సైలెంట్ గా ఉండేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈ చీరలో నువ్వు చాలా బాగుంటావ్. రెడీ అయి రా అని మహేంద్ర చెబుతాడు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సరే అని జగతి అంటుంది. మరోవైపు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి.

ఇబ్బంది ఏం లేదా: పైనుంచి వసుధార, రిషి ఇద్దరూ ముచ్చటగా రెడీ అయి నడుచుకుంటూ వస్తారు. వాళ్లను చూసేందుకు జగతికి రెండు కళ్లు సరిపోవు. కిందకు వాళ్లు వచ్చాకా.. రిషి.. ఈ సూట్ నీకు అదిరిపోయింది. ఇద్దరు చాలా బాగున్నారు అమ్మా అని మహేంద్ర అంటాడు. ఈలోపు వసుధార తల్లిదండ్రులు చక్రపాణి, సుమిత్ర వస్తారు. వాళ్లు రాగానే సంతోషంగా వెళ్లి మాట్లాడుతుంది వసుధార. అందరి క్షేమ సమాచారాలు అడుగుతాడు చక్రపాణి. అంకుల్ మీకు రావడానికి ఏం ఇబ్బంది లేదు కదా అని రిషి అంటే.. మాకేం ఇబ్బంది బాబు. నా కూతురు నిశ్చితార్థం చూడాలని మాకు ఉండదా అని చక్రపాణి అంటాడు. ఇంటి దగ్గర మీకు ఏవో సమస్యలు ఉన్నాయని వసుధార చెప్పింది అని రిషి అడిగితే.. అలాంటిది ఏం లేదని చక్రపాణి బదులిస్తాడు.

మెడికల్ కాలేజీ పనులు: మీకు అయితే ఇష్టమే కదా అని రిషి అడిగితే.. అలా అంటారేంటీ బాబు నాకు ఇష్టమే అని చక్రపాణి అంటాడు. మరి వసుధార అలా ఎందుకు చెప్పింది. ఎందుకు ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్పిందని రిషి అంటాడు. చక్రపాణి మౌనంగా ఉండటంతో.. వెళ్లి ఫ్రెష్ అయి రమ్మని చెబుతాడు రిషి. వసుధార వాళ్లను లోపలికి తీసుకెళ్తుంది. ఏదైనా సమయ్ ఉందా. ఈ క్షణం కోసం ఎదురుచూసిన దానివి ఎందుకు అలా చెప్పావ్. ఏమైనా సమస్య ఉంటే చెప్పమ్మా పరిష్కారం ఆలోచిద్దాం అని చక్రపాణి, సుమిత్ర ఇద్దరు అడుగుతారు. అలాంటిది ఏం లేదు. మెడికల్ కాలేజీ పనుల వల్ల అలా అన్నానని కవర్ చేస్తుంది వసుధార. నిజంగా అదే కదా అమ్మా.. ఒకసారి తప్పు చేసి ఇప్పటికీ కుమిలిపోతున్నా మరోసారి అలా జరిగితే భరించలేను అని చక్రపాణి అంటే అలాంటిది ఏం లేదు. రిషి సార్ మాట్లాడాక నిశ్చితార్థానికి ఒప్పుకున్నానని వసు చెబుతుంది.

భయపడుతున్నారా పిన్నీ: వసు, రిషి పీటల మీద కూర్చుంటారు. వాళ్లను చూసి మహేంద్ర, ఫణీంద్ర చాలా సంతోషంగా ఉంటారు. జగతి మాత్రం భయపడుతుంది. ఇద్దరూ ప్రాణానానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమను గెలిపించుకున్నారు అని ఫణీంద్ర మాట్లాడతాడు. మరోవైపు శైలేంద్ర అది ఉందా, ఇది ఉందా అని హడావిడి చేస్తాడు. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగానే ఇదంతా చేస్తున్నావా, లోపల ఏమైనా కుట్ర దాగి ఉందా అని జగతి ఆలోచిస్తుంది. అది చూసి అయ్యో జగతి.. వాళ్లు కలవాలని బలంగా కోరుకుంది నువ్వే మరి అలాంటిది వాళ్లు సంతోషంగా ఉంటే నువ్వు డల్ గా ఉన్నావ్ ఏంటని జగతిని అడుగుతాడు. అప్పుడు శైలేంద్ర వచ్చి ఏంటీ పిన్ని డల్ గా ఉన్నారు. మనసులో దేని గురించో బాధపడుతూ.. భయపడుతున్నారా అని అడుగుతాడు.
పంతాలు శాసించకూడదు: ఇంతలో అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులను రమ్మని పంతులు పిలుస్తాడు. జగతి వస్తుంటే పెద్దమ్మా మీరు రండి అని రిషి పిలుస్తాడు. దీంతో జగతి, మహేంద్ర షాక్ అయి అక్కడే ఆగిపోతారు. దేవయాని, ఫణీంద్ర వెళ్లబోతుంటే.. శైలేంద్ర అడ్డుకుంటాడు. నిజంగా నా మీద గౌరవం ఉంటే నా మాట విను. పంతాలకు పోయి సాంప్రదాయబద్ధంగా జరగాల్సింది చేయనివ్వవా. పంతాలు సాంప్రదాయాలను శాసించకూడదు. పిన్నిని అమ్మగా ఒప్పుకోకుంటే.. బాబాయ్ ను డాడ్ గా ఒప్పుకోనట్టే. కొడుకు నిశ్చితార్థం వాళ్ల చేతులమీదుగా జరగాలని ఆశ ఉంటుంది కదా. ఎందుకు వాళ్లను బాధపెట్టడమని శైలేంద్ర అంటాడు.
జూస్ ఎవరు ఇస్తారు: రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. బాబాయ్, పిన్ని వెళ్లండి అని శైలేంద్ర అంటాడు. చివరిసారిగా వాడికి అమ్మగా ఉండే అవకాశం ఇస్తున్నాని జగతితో శైలేంద్ర మెల్లిగా అంటాడు. ఇద్దరూ తాంబులాలు మార్చుకుంటారు. వసు, రిషి ఉంగరాలు మార్చుకుని మురిసిపోతారు. ఏంటీ శైలేంద్ర ఇలా చేశావ్ అని దేవయాని అంటే.. నువ్వు అక్కడ ఉంటే జూస్ ఎవరు ఇస్తారు అని శైలేంద్ర అంటాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో నిశ్చితార్థం జరిగింది. మరి శైలేంద్ర వేసిన స్కెచ్ ఏంటో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











