Guppedantha Manasu: రిషికి విషం ఇచ్చిన దేవయాని.. జగతిని ఆటాడుకుంటున్న తల్లీకొడుకులు!

రిషి, వసుధార ఉంగరాలు మార్చుకోవడంతో నిశ్చితార్థం జరుగుతుంది. తర్వాత ఇదరు దండలు మార్చుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోమ్మని పంతులు చెబితే దేవయాని, ఫణీంద్ర దగ్గరకు వెళ్తాడు రిషి. ఆగు రిషి. ముందు తల్లిదండ్రులు ఆ తర్వాతే పెద్దమ్మా, పెదనాన్న అని శైలేంద్ర అంటాడు. దీంతో మహేంద్ర, జగతి ఆశీర్వాదం తీసుకుంటారు వసు, జగతి. రిషి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తుంటారు. ఎలాంటి దుష్ట శక్తి మీ మీద పడకుండా ఇలాగే సంతోషంగా ఉండాలని జగతి మనసులో కోరుకుంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 16 మంగళవారం నాటి ఎపిసోడ్‌ 764లో ఇంకా ఏం జరిగిందంటే?

జ్యూస్ పట్టుకుని: రిషి ఈ పోగ్రామ్ ఇంకా అయిపోలేదని చెప్పిన శైలేంద్ర.. అమ్మా వెళ్లి జ్యూస్ తీసుకురా అని అంటాడు. దీంతో దేవయాని వెళ్తుంది. ధరణి అని జగతి అనడంతో దేవయాని వెనుకే ధరణి వెళ్తుంది. జ్యూస్ తీసిన దేవయాని అందులో ఏదో కలుపుతుంది. దాన్ని ధరణి చూసి షాక్ అవుతుంది. ఏంటీ అత్తయ్యా ఏం చేస్తున్నారు అడిగితే.. ఏయ్.. ఎవరికైనా చెప్పావో ప్రాణం తీస్తాను అని బెదిరిస్తుంది దేవయాని. అక్కడి నుంచి వచ్చేసిన ధరణి వెళ్లి జగతికి చెబుతుంది. జగతితో ధరణి చెప్పడం శైలేంద్ర చూస్తాడు. ఇంతలో దేవయాని జ్యూస్ పట్టుకుని రిషి వాళ్ల దగ్గరకు వస్తుంది. ఆ జ్యూస్ తీసుకున్న శైలేంద్ర వసుధార నువ్వు రిషికి తాగించు, తర్వాత రిషి నీకు తాగిస్తాడు అని చెబుతాడు ఎందుకు ఇదంతా అని రిషి అంటాడు.

Guppedantha Manasu

అరిచేసిన జగతి: రిషి.. ఇది మీకు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది అని శైలేంద్ర అంటాడు. దీంతో రిషికి వసుధార జ్యూస్ తాగిస్తుంది. అది తాగిన కొద్దిసేపటికే రిషి తూలుతూ కిందపడిపోతాడు. అందరు కంగారుగా రిషి అంటూ లేపేందుకు ప్రయత్నిస్తారు. కానీ రిషి లేవడు. శైలేంద్ర, దేవయాని మాత్రం సంతోషిస్తారు. ఇంతలో రిషి అని గట్టిగా అరుస్తుంది జగతి. అంటే అదంతా జగతి అప్పటివరకు భ్రమ పడిందని తెలుస్తుంది. జగతి అలా అరవడంతో అంతా ఉలిక్కిపడతారు. ఏం జరిగింది అని అంతా అడుగుతారు. కానీ జగతి మౌనంగా ఉండిపోతుంది. తర్వాత దేవయాని దగ్గరి నుంచి జ్యూస్ తీసుకుని వసుధారకు ఇస్తాడు శైలేంద్ర. రిషికి వసుధార ఆ జ్యూస్ తాగిస్తుంటే వద్దని చెబుతుంది జగతి.

Guppedantha Manasu:

నేనెందుకు చంపుకుంటాను: వసు, జగతి దగ్గరికి వెళ్లి ఆ జ్యూస్ తీసుకుని తాగొద్దని చెబుతుంది జగతి. ఎందుకు అని అందరూ అడిగితే... ఇందులో విషం ఉంది అని జగతి అంటుంది. దీంతో అంతా బిత్తరపోతారు. అందులో విషం కలవడం ఏంటీ జగతి. నేనే కదా తీసుకొచ్చింది. అంటే నేనే విషం కలిపానని అంటున్నావా. లేదా నా కొడుకు శైలేంద్ర కావాలని ప్లాన్ చేసి మరి కలిపించాడని అంటున్నావా. నువ్వు వెళ్లిపోతే రిషిని నేను పెంచాను. పెంచిన చేతులతో రిషిని నేనెందుకు చంపుకుంటాను. పాలిచ్చిన చేత్తో విషం పెడతానా అని దేవయాని డ్రామా చేస్తుంది. చెప్పు పిన్ని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని శైలేంద్ర అడిగితే.. జగతి కోపం వచ్చిన మౌనంగా ఉండిపోతుంది.

Guppedantha Manasu:

మా వ్యవహారం మాట్లాడుకోవాలి: పిన్నీ మీ అనుమానం నా మీదే కదా. నేనే ఈ జ్యూస్ తాగుతాను అని శైలేంద్ర అంటాడు. శైలేంద్ర వద్దు.. జగతికి అనుమానం వచ్చింది అంటే ఏదో జరిగే ఉంటుంది అని ఫణీంద్ర అంటాడు. అయినా వినకుండా శైలేంద్ర ఆ జ్యూస్ ను గటగటా తాగేస్తాడు. గొంతుపట్టుకుని ఏదో అవుతున్నట్లు కావాలని యాక్ట్ చేస్తాడు. తర్వాత ఏం కాలేదు. ఊరికే నటించాను. ఆ జ్యూస్ లో విషం లేదు. క్లారిటీ వచ్చింది కదా పిన్నీ అంటాడు శైలేంద్ర. తర్వాత మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. అందరూ భోజనాలు చేసి వెళ్లండి. కొంచెం మేము మా కుటుంబ వ్యవహారం మాట్లాడుకోవాలి అని శైలేంద్ర అనడంతో అంతా వెళ్లిపోతారు. ఇప్పుడు చెప్పు పిన్నీ అసలు మీ సమస్య ఏంటీ. మాట్లాడండి పిన్నీ. ఈ సందర్భంలో మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. నేను కూడా ప్రశ్నిస్తాను అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu

ఎందుకు అనుమానిస్తున్నారు: మేడమ్ ఏదో పొరబాటు పడి ఉంటారు అని వసు అంటే ఏం పొరబాటు అని శైలేంద్ర అంటాడు. ఏదీ లేకుండా తను అలా మాట్లాడరు కదా అని వసు అంటే.. అదే ఏ ఆధారంతో మాట్లాడారు. నేను చెప్పనా. ఆధారాలతో కాదు. అనుమానంతో మాట్లాడింది. నా మీద మా మమ్మీ మీద అనుమానంతో మాట్లాడింది. జ్యూస్ తీసుకుని రమ్మంది నేను. తీసుకొచ్చింది మమ్మీ. అంటే జ్యూస్ లో విషం కలిపి రిషిని చంపాలని ప్లాన్ చేశామా. రిషిని నా సొంత తమ్ముడిగా చూసుకున్నాను అని శైలేంద్ర అంటాడు. ఎందుకు మేడమ్ అన్నయ్యను అనుమానిస్తున్నారు. నిజంగా పెద్దమ్మా విషం పెడితే నేను సంతోషంగా స్వీకరిస్తాను. పెద్దమ్మే నా ప్రాణాలు కోరుకుంటే నేను మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాను. ఈరోజు ఆవిడను అనుమానించారంటే నన్ను అనుమానించినట్లే అని రిషి అంటాడు.

వసుధార క్షమాపణలు: ఇదంతా ఎందుకులే రిషి.. నేను వెళ్లిపోతాను. మీరు సంతోషంగా ఉండండి అని శైలేంద్ర అంటాడు. ఎవరో ఏదో అన్నదానికి నువ్వు వెళ్లిపోడం ఏంటీ అన్నయ్యా అని రిషి అంటాడు. సార్ ఏదో జరిగిపోయింది. మేడమ్ అలా అనుమానించడం తప్పే. అందుకు మీ అన్నయ్య గారికి, పెద్దమ్మ గారికి నేను క్షమాపణలు చెబుతాను వదిలేయండి అని సారీ చెబుతుంది వసుధార. మొత్తానికి రిషి ముందు జగతిని దోషిగా నిలబెట్టడమే శైలేంద్ర ప్లాన్ అని నేటి కథనంతో అర్థమైపోయింది. ఇలా రిషికి ఉన్న జగతి అనే బలాన్ని దూరం చేసేందుకు పావులు కదుపుతున్నాడు శైలేంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X